నవాద: బిహార్‌లో మరోసారి మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. నవాద జిల్లాలోని ఓ గ్రామంలో విగ్రహాన్ని అపవిత్రం చేశారంటూ ఆందోళనకారులు శుక్రవారం అనేక వాహనాలను ధ్వంసం చేశారు. ఓ హోటల్‌కు నిప్పు అంటించారు. గోదాపూర్ గ్రామంలో ఓ విగ్రహం కూలిపోయి ఉండటంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో గొడవ ప్రారంభమైందని నవాద జిల్లా కలెక్టర్ కౌశల్ చెప్పారు.
ఆ తర్వాత ఆందోళనకారులు జాతీయ రహాదారి–31పైకి వెళ్లి వాహనాలపై రాళ్లు విసిరి వాటిని ధ్వంసం చేశారనీ, వార్తల సేకరణకు వచ్చిన స్థానిక విలేకరులను కొట్టడంతోపాటు ఓ హోటల్‌కు నిప్పు పెట్టారని చెప్పారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. కేంద్రంమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కొడుకు అరిజిత్ ఆధ్వర్యంలో ఈ నెల 17న భాగల్‌పూర్‌లో దేవుడి ఊరేగింపు వేడుక సందర్భంగా మత ఘర్షణలు చెలరేగాయి.
Comments
Please login to add a commentAdd a comment