సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వీటిపైన చర్చించమంటే ముందుకురాని బీజేపీ నేతలు మతకల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం ఉవిళ్లూరుతున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంలో పోటీపడాలని మత ఘర్షణలు సృష్టించడంలో కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అర్థం కాని విషయం ఏంటంటే.. ఏ దేవుడు చెప్తున్నాడు తన్నుకు చావండని ఏ మతం దేవుడైనా చెప్పిండా? అని ప్రశ్నించారు. కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా?. నా మనషులను పంపిస్తున్న భూమి మీదకు ఒకరికొకరు తన్నుకు చావండి.. ఎవరి దేవుడు గొప్ప అనే కాంపిటీషన్ పెట్టుకొని తన్నుకు చావండి అని చెప్పిండా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
చదవండి: (Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్‌టీపీ!)
Comments
Please login to add a commentAdd a comment