
సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చి, సమాజంలో మత కలహాలను రేకెత్తించే ఉద్దేశంతోనే ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రజ్యోతి కథనాల వెనుక దురుద్దేశాలున్నాయని చెప్పారు. టీటీడీపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఈ కథనంపై నెలరోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేస్తామని డీజీపీ కౌంటర్ దాఖలు చేశారని, అప్పటివరకు హైకోర్టే పర్యవేక్షించాలని కోరారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. టీటీడీలో అన్యమత ప్రచారమంటూ ఆంధ్రజ్యోతి అసత్య కథనం ప్రచురించిందంటూ టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment