subramanya swamy
-
చంద్రబాబు ఆరోపణల వెనుక కుట్ర కోణం
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటించడం వెనుక కుట్ర కోణం ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఆరోపించడం ప్రపంచాన్ని కలవర పెట్టిందని అన్నారు. ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే ఇలాంటి అంశాలను బహిరంగంగా ప్రకటించే ముందు దర్యాప్తు చేయాలన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రైస్తవ ముద్ర వేసేందుకు చేసిన సందర్భాలను సైతం ఆయన ఇక్కడ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌తో వాస్తవాలు తేలవని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. నెయ్యి శాంపిల్స్ పరీక్షలు చేసి, టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వెనక్కు పంపించామని టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా ఉన్నప్పటికీ, కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు పదే పదే బహిరంగంగా ప్రకటించడం దేనికి నిదర్శనం? ఇలా ఆరోపణలు చేశాక దర్యాప్తుకు ఆదేశిస్తారా? నిజానిజాలు నిర్ధారించుకోకుండా భక్తుల్లో అలజడి సృష్టించడానికి యతి్నంచడం కుట్ర కోణంగా భావించక తప్పదు. – ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యస్వామి జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇదే వైఖరి⇒ తిరుమల బాలాజీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా ముఖ్యమంత్రే గత నెల 18న బహిరంగంగా ఆరోపించారు. ఆ తర్వాత ప్రసాదం కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను నియమిస్తున్నట్టు సెపె్టంబర్ 26న ప్రకటించారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణ చేసేటప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వారు వాస్తవమా.. కాదా అని తొలుత దర్యాప్తు చేసి నిర్ధారించుకోవాలి. ⇒ కానీ ఇక్కడ అలా జరగలేదు. ముందు ఆరోపణ చేసి తర్వాత సిట్ దర్యాప్తు అన్నారు. పైగా కల్తీపై దర్యాప్తు కోసం అదే ప్రభుత్వం సిట్‌ను నియమించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవడం లేదు. జూలైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంత కాలం తర్వాత ఇప్పుడు ఎందుకు సిట్‌ని నియమించారు? పైగా గత ప్రభుత్వంపై, నాటి సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రులపై చాలా పెద్ద ఆరోపణలు చేశారు. ⇒ జగన్ సీఎం అయినప్పటి నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఓ ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి సీఎం వైఎస్ జగన్‌పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఒక క్రైస్తవుడిని టీటీడీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ వాస్తవమేంటంటే సుబ్బారెడ్డి గురించి తెలిసిన వారిని ఎవరిని అడిగినా ఆయన హిందువనే చెబుతారు. ఆయన 32 సార్లు మాల వేసుకుని శబరిమలకు వెళ్లివచ్చారు. ఇంట్లో గోశాల నిర్వహిస్తూ గోవులకు పూజ చేస్తున్నారు. ఇప్పుడు లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు పత్రికల్లో పతాక స్థాయిలో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టును సైతం కలవరపెట్టే అంశాలు చాలా ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ప్రస్తుతం ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రత్యేక సిట్‌ను నియమించింది. తప్పుడు వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి⇒ జూలైలో నెయ్యి శాంపిల్ తీసుకుని టెస్ట్ చేశారని టీటీడీ రిపోర్టులో ఉంది. ఆ రిపోర్టులో కల్తీ జరిగిందని గానీ, ఫిష్ ఆయిల్, కొవ్వు కలిసిందని గానీ ఎక్కడా లేదు. నెయ్యి నాణ్యత టీటీడీ ప్రమాణాలకు తగ్గట్టుగా లేనందున తిప్పి పంపించామని ఉందే తప్ప ప్రసాదం తయారీకి పంపించామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఒక అబద్ధాన్ని సృష్టించి.. విస్తృతంగా ప్రచారం చేశారన్నది వాస్తవం. ఇలాంటప్పుడు కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? ప్రసాదంపై చేసిన ఆరోపణ కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసేది. ఆరోపణలు చేయడం సులువే, కానీ వాటిని నిరూపించాలిగా!⇒ వార్తాపత్రికలు కూడా జవాబుదారీగా ఉండాలి. రాజకీయ నాయకులు లడ్డూ ప్రసాదం, ఆలయ అంశాలను సమస్యగా మార్చి తమ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగానే చెప్పింది. ఈ హెచ్చరికను ప్రజలు ప్రశంసించారు. ఒకరి గుర్తింపును, ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసే ఏజెన్సీలు సైతం ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
సీఎం జగన్ పై బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి ప్రశంసలు
-
‘థాయ్‌పుసం’ తెలంగాణ స్టైల్లో!
థాయ్‌పుసం.. తమిళులకు ఇదో ప్రధాన ఉత్సవం. ఒంటికి శూలాలు గుచ్చుకుని అత్యంత భక్తిప్రపత్తులతో సుబ్రమణ్యస్వామికి మొక్కులు చెల్లించే వేడుక. తమిళనాడుతోపాటు మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో స్థిరపడిన తమిళ ప్రజలు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే, తెలంగాణలోనూ థాయ్‌పుసంను జరుపుతారు. అదెక్కడ? ఎలా జరుపుతారు? థాయ్‌పుసంకు మనకు ఉన్న సంబంధమేంటి?అన్న వివరాలు తెలుసుకోవాలంటే.. వందలఏళ్లతరువాత మాతృదేశానికి.. 1962లో బర్మాలో సైనిక తిరుగుబాటు జరిగిన అనంతరం అక్కడి భారతీయులను కట్టుబట్టలతో దేశం ఖాళీ చేయించారు. భారతీయ మహిళల మెడలోని బంగారు పుస్తెలతాళ్లను సైతం లాక్కుని వెనక్కి పంపారు. దీంతో బతుకుజీవుడా అంటూ పలువురు భారతీయులు మాతృదేశానికి వచ్చారు. వీరి కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో శరణార్థుల శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాం శిబిరం ఒకటి. 1975లో ఇక్కడ శ్రీలంక, తమిళనాడు, ఆంధ్ర నుంచి బర్మాకు వలస వెళ్లిన భారత సంతతివారికి పునరావాసం కల్పించారు. ఈ క్రమంలో అక్కడ జమ్మిచెట్టు కింద స్వయంభూ వెలసిన అమ్మవారిని అప్పటి నుంచి వీరంతా నూకాంబిక–పోచమ్మ అమ్మవారిగా కొలుస్తున్నారు. థాయ్‌పుసం తరహాలో ఇక్కడ కూడా నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంటినిండా శూలాలు గుచ్చుకుని.. అంతర్గాంలో స్థానిక శరణార్థులు ఏటా ఉగాదికి ముందు అమ్మవారికి నవరాత్రులు నిర్వహించి చివరికి అమావాస్య రోజున ఒంటికి పదునైన శూలాలను గుచ్చుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తమను ఆపదలో ఆదుకుంటుందనే నమ్మకంతో అమ్మవారికి ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శూలాలు గుచ్చుకున్నా.. భక్తుల శరీరాలపై రక్తం కారదు. సిద్ధహస్తులు, అనుభవజ్ఞులైనవారు రక్తనాళాలు తక్కువగా ఉన్న చోటే శూలాలు, కొక్కాలను గుచ్చుతారట. కొందరు వీపుపై కొక్కెలు గుచ్చుకుని చిన్న రథాలు కూడా లాగి తమ భక్తి చాటుకుంటారు. ఈ క్రమంలో భక్తుల నెత్తిన మిగతా భక్తులు పాలు పోస్తుంటారు. తరువాత కావడి ఆట్టంపేరిట అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ లయబద్ధంగా నర్తిస్తారు. రాత్రిపూట మరికొందరు భక్తులు చింత నిప్పులగుండంలో నడుస్తారు. శరణార్థులంతా అమ్మవారికి మాలధారణ ఆచరిస్తారు. పసుపు వ్రస్తాలు ధరించిన పురుషులు 21 రోజులు, మహిళలు వారం లేదా 11 రోజులపాటు మాలధారణలో ఉంటారు. ఈ ఉత్సవానికి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా స్థిరపడ్డ వీరి సంతతివారే కాకుండా, లండన్, న్యూజిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అంతర్గాంలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఘనంగానిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తున్నాం:రామారావు,ఉత్సవ నిర్వాహకుడు మా ముత్తాతలను బ్రిటిష్ వారు తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా బర్మా (మయాన్మార్)లోని రంగూన్ (ఇప్పుడుయాంగాన్)కు తీసుకెళ్లారు. వారు తమతోపాటు భారతీయ ఆచార వ్యవహారాలను సైతం తీసుకెళ్లారు. తిరిగి ఇండియాకు వచ్చాక మేం మా పూర్వీ కుల ఆచారాలను కొనసాగిస్తున్నాం. గ్రామంలో వెలిసిన అత్యంత శక్తిమంతురాలైన నూకాంబిక–పోచమ్మ అమ్మవారికి ఏటా ఉత్సవాలు నిర్వహించి మా భక్తిని చాటుకుంటున్నాం. అత్యంత భక్తి, నిష్టలతో శూలాలతోఒంటికి గుచ్చుకుని, బొనమెత్తుకొని చింతనిప్పులపై నడిచి మొక్కులు చెల్లిస్తుంటాం. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
600 మెట్లపై హారతి కర్పూరం వెలిగించిన సామ్ ..ఫోటోలు వైరల్
-
పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ
తిరుపతి లీగల్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాఖలు చేసిన పరువు నష్టం దావాలో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పరువుకు భంగం కలిగేలా, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కథనాలు ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతిపై టీటీడీ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ వ్యాజ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి టీటీడీ తరపున వాదించడానికి గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలంటూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఇతర ప్రతివాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరుపతి 10వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస శివరామ్ కొట్టివేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక 2019 డిసెంబర్ 1న టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా రెండు కథనాలను ప్రచురించింది. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ, మరో నలుగురిపై టీటీడీ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో గత ఏడాది మార్చిలో పరువు నష్టం దావా దాఖలు చేసింది. ఈ కేసులో టీటీడీ తరపున ఎంపీ సుబ్రమణ్యస్వామి, మరో ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించడానికి టీటీడీ కోర్టు అనుమతి కోరింది. ఇందుకు అనుమతి ఇస్తూ కోర్టు గత ఏడాది మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఇతర ప్రతివాదులు పిటిషన్‌ను వేశారు. టీటీడీకి న్యాయవాదిని నియమించుకునే శక్తి ఉందని ఆంధ్రజ్యోతి తరపు న్యాయవాది ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి అడ్వొకేట్ యాక్ట్ సెక్షన్ 32 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వ్యక్తిగత ఆసక్తితో కేసును వాదిస్తున్నారని అన్నారు. కేసు వాదించడానికి కోర్టు ఇచ్చిన అనుమతిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఆయన న్యాయవాది కాదని, కోర్టులో ఎలా వ్యవహరించాలో తెలియదని అన్నారు. దీనిపై సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ తనకు చట్టాలపై అవగాహన ఉందని, ఉచితంగా కేసు వాదిస్తున్నానంటూ వాదనలు వినిపించారు. ఆంధ్రజ్యోతి కథనాలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నందునే ఈ కేసు వాదిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. న్యాయవాది కానివారు కూడా కోర్టులో వాదించడానికి అర్హత ఉందన్నారు. సుబ్రమణ్యస్వామి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆంధ్రజ్యోతి పిటిషన్‌ను కొట్టివేసింది. -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు ‘అత్యవసరం’
తిరుపతి లీగల్: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కథనంపై టీటీడీ దాఖలు చేసిన పరువునష్టం కేసు అత్యవసర కేసుగా విచారణ చేపట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, ఇతరులు కలసి రూ.100 కోట్ల పరువునష్టం చెల్లించేటట్టు ఆదేశించాలని తిరుపతి 10వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో టీటీడీ గత ఏడాది దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఎంపీ సుబ్రమణ్యస్వామి పిటిషన్ దాఖలు చేయడానికి గురువారం తిరుపతి కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం కోర్టుల్లో వర్చువల్ విచారణ జరుగుతోంది. దీంతో ఆయన పిటిషన్‌ను కోర్టు రిసీవ్లో దాఖలు చేశారు. పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు మిగతా నలుగురు న్యాయకార్యపద్ధతి పాటించకుండా గత ఏడాది డిసెంబర్ 29న రిటర్న్ స్టేట్మెంట్ కోర్టులో దాఖలు చేశారు. ఆ స్టేట్మెంట్ను కోర్టు పరిగణనలోకి తీసుకోరాదంటూ పిటిషన్లో కోరినట్టు తెలిసింది. ఆ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన స్థానిక కోర్టు ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. తనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది సత్య సబర్వాల్ కేసు విచారణలో పాల్గొంటారన్నారు. కేసు శుక్రవారం విచారణకు రానున్నట్టు తెలిపారు. చట్టంలోని నియమాల విధానం ప్రకారం కేసు విచారణ చేపట్టాలని కోరనున్నట్టు పేర్కొన్నారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి వెంట న్యాయవాదులు సత్య సబర్వాల్, ఎల్.మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతిపై కేసులో చార్జిషీట్ దాఖలు చేశాం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చి, సమాజంలో మతకలహాలను రేకెత్తించే ఉద్దేశంతోనే ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించినందుకు నమోదైన కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. పోలీసుల చార్జిషీట్ సంతృప్తికరంగా ఉందని ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. పోలీసులు సరైన కోణంలోనే దర్యాప్తు చేశారని, ఈ కేసులో వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసేలా కింది కోర్టును ఆదేశించాలని కోరారు. సుబ్రహ్మణ్యస్వామి అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కేసులో విచారణ పూర్తిచేయాలని కింది కోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)లో తదుపరి విచారణ అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. టీటీడీలో అన్యమత ప్రచారమంటూ ‘ఆంధ్రజ్యోతి’ అసత్య కథనం ప్రచురించిందని టీటీడీ విజిలెన్స్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం ప్రచురించిన నేపథ్యంలో ఇలాంటి కథనాలు ప్రచురించకుండా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని, ప్రచురణల విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించకుండా కట్టడి చేయాలని కోరారు. -
మత కలహాలను రేకెత్తించడమే ఆంధ్రజ్యోతి ఉద్దేశం
సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చి, సమాజంలో మత కలహాలను రేకెత్తించే ఉద్దేశంతోనే ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రజ్యోతి కథనాల వెనుక దురుద్దేశాలున్నాయని చెప్పారు. టీటీడీపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఈ కథనంపై నెలరోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేస్తామని డీజీపీ కౌంటర్ దాఖలు చేశారని, అప్పటివరకు హైకోర్టే పర్యవేక్షించాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. టీటీడీలో అన్యమత ప్రచారమంటూ ఆంధ్రజ్యోతి అసత్య కథనం ప్రచురించిందంటూ టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొన్న దేవిరెడ్డి
-
రాజకీయ దురుద్దేశంతోనే టీటీడీపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల వ్యవహారాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీలో యథేచ్ఛగా అవినీతి చోటుచేసుకుందని, ఆ ఐదేళ్లలో టీటీడీ నుంచి ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై ఆడిటింగ్ జరపాలని, సిట్ వేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో సుబ్రమణ్యస్వామి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. టీటీడీలో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సక్రమంగా అమలు చేస్తున్నారని అభినందించారు. ప్రస్తుతం బలమైన హిందూ అనుకూల పాలకమండలి ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఆయన ప్రశంసించారు. వైవీ సుబ్బారెడ్డిపై అవాస్తవాలు ప్రచారం చేశారు ‘టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించినప్పుడు ఆయన క్రిస్టియన్ అని అసత్య కథనాలను విపరీతంగా ప్రచారంలోకి తెచ్చారు. వాటిపై విచారించి వాస్తవాలు తెలుసుకున్నాను. వైవీ సుబ్బారెడ్డి పక్కా హిందువని తెలిసింది. వెంటనే నేను అదే విషయాన్ని ట్వీట్ చేశాను. తిరుమలలో ఓ కొండపై చర్చి కడుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. ఫొటోషాప్ చేసిన ఫొటోను చూపిస్తూ అదే చర్చని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అదీ పూర్తిగా అవాస్తవమని నిర్ధారణైంది’ అని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. అవాస్తవాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే కొందరు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో ఏపీలో ఓడిపోయిన పార్టీనే ఈ కుట్రలు చేస్తోందని సుబ్రహ్మణ్య స్వామి తప్పుపట్టారు. మత కలహాలు సృష్టించడానికే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇలా దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపై పరువు నష్టం దావా వేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు. టీటీడీ ఉద్యోగుల్లో క్రిస్టియన్లు ఎక్కువ మంది ఉన్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని, ఈ విషయంపై అన్ని వివరాలు తెలుసుకున్నానని స్వామి చెప్పారు. ‘15 వేల మంది టీటీడీ ఉద్యోగుల్లో కేవలం 44 మంది క్రిస్టియన్లు.. అది కూడా రవాణా విభాగంలో పనిచేస్తున్నారు. వారు ప్రభుత్వ ఇతర శాఖల నుంచి కారుణ్య నియమాకాల కింద నియమితులయ్యారు. వారిని వేరే శాఖలకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఈఓ చెప్పారు’ అని స్వామి అన్నారు. బాబు హయాంలో టీటీడీ నిధుల దుర్వినియోగం తెలుగుదేశం హయంలో తిరుమల ఆలయ వ్యవహారాల్లో యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారని సుబ్రహ్మణ్య స్వామి దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో టీటీడీ నిధుల వ్యయంపై స్వతంత్ర ఆడిటర్‌తో ఆడిటింగ్ చేయించలేదని ఆయన విమర్శించారు. ‘తిరుమల ఆలయ నిధులను భారీగా దుర్వినియోగం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో జరిగిన తప్పులను సరి చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ వ్యవహారాల్లో అవినీతిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరుతున్నాను’ అని స్వామి పేర్కొన్నారు. రమణ దీక్షితుల నియమాకం మంచి పరిణామం తిరుమల ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను శ్రీవారి ఆలయంలో పునర్నియమించడం పట్ల సుబ్రహ్మణ్య స్వామి సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి పనితీరు బాగుందని కితాబునిచ్చారు. తిరుమల ఆలయాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలన్న వాదనను ఆయన పునరుద్ఘాటించారు. దేశంలోని మదర్సాలు, వక్ఫ్ బోర్డులు, చర్చిలపై ప్రభుత్వ నియంత్రణ లేనప్పుడు హిందూ ఆలయాలపై మాత్రం ఎందుకుండాలని ప్రశ్నించారు. దేవాలయాల పరిరక్షణపై సదస్సు యూనివర్సిటీక్యాంపస్(చిత్తూరు జిల్లా): ఆదివారం సాయంత్రం తిరుపతి శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో హిందూ దేవాలయాల పరిరక్షణ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ తిరుపతి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ.. దేశమంతా భారతీయ తత్వాన్ని విస్తరింపజేయాలని కోరారు. గ్లోబల్ హిందు హెరిటేజ్ ఫౌండేషన్‌కు చెందిన వెలగపూడి ప్రకాష్‌రావు మాట్లాడుతూ.. హిందూ ఆలయాలను కాపాడాలని కోరారు. ►తిరుమలలో ఓ కొండపై చర్చి కడుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది పూర్తిగా అవాస్తవమని నిర్ధారణైంది. మతకలహాలు సృష్టించేందుకు గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీనే ఈ విధంగా కుట్రలు పన్నుతోంది. – బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి -
రాయని డైరీ: సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)
వ్యక్తుల్ని సెలవుపై పంపించగలం. వాళ్ల నిజాయితీని సెలవుపై పంపించగలమా? అలోక్ వర్మని సెలవుపై పంపించినప్పుడు.. మోదీజీ అసలు దేశంలోనే ఉంటున్నారా అనే సందేహం కలిగింది నాకు. దేశాధినేతలతో కలిసి ప్రీతికరమైన ఆహారాన్ని ఆరగించడానికే నాలుగున్నరేళ్లుగా ఆయన సమయం సరిపోతోంది! అలోక్ ఎంత ఆనెస్టో నాకు తెలుసు. ఎవరి ఇంటికైనా వెళితే కనీసం మంచినీళ్లు కూడా తాగరాయన. మంచినీళ్లు తాగినందుకు ప్రతిఫలంగా.. ‘మంచిది కాని సహాయం’ ఏదైనా ఆ ఇంటì వాళ్లకు చెయ్యవలసి వస్తుందేమోనని ఆయన భయం! సీబీఐకి ఇలాంటి వాళ్లే కదా డైరెక్టర్లుగా ఉండాల్సింది? కానీ ఏం జరిగింది? నీళ్లయినా ముట్టని సీబీఐ ఆఫీసర్‌కి తన ఆఫీస్‌లోనే నీళ్ల గ్లాసు లేకుండా చేశారు. నీళ్లుంచి గ్లాసు తీసేయడమూ, పదవి ఉంచి సెలవుపై పంపించడమూ.. రెండూ ఒకటే. అవినీతిపరుడైన అస్థానాతో పాటు, నిజాయితీపరుడైన అలోక్నీ సెలవుపై పంపించగానే.. మోదీజీకి వివరంగా ఒక బహిరంగ లేఖ రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది నాకు. అలా కాకుండా ‘టు’ అడ్రస్ పెట్టి నేరుగా మోదీజీకే లేఖ పంపిస్తే ఒక ప్రమాదం ఉంది. అరుణ్ జైట్లీ ఆ లేఖను మధ్యలోనే అందుకుని ముక్కలుముక్కలుగా చింపేసి, ఆ ముక్కల్ని నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తాడు. అలాక్కూడా కాకుండా నేనే స్వయంగా పీఎంవో ఆఫీస్‌కి వెళ్లి మోదీజీతో మాట్లాడాలనుకున్నా.. అప్పుడు కూడా జైట్లీనే అడ్డు పడతాడు. ఆర్థికశాఖ నాకు రాకుండా అడ్డుకున్న మనిషికి, ఏ శాఖా లేని వట్టి రాజ్యసభ సభ్యుడిని అడ్డుకోవడం ఏమంత కష్టం! బహిరంగలేఖను ఎలా మొదలుపెట్టాలో తేల్చుకోలేక రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొనే ఉన్నాను. ‘డియర్ మోదీజీ’ అనాలా? ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అనాలా? ‘రెస్పెక్టెడ్ మోదీజీ’ అనాలా? చివరికి ఒకటనిపించింది. దేశాధినేతలు మోదీజీకి పంపే ఆహ్వాన పత్రాలపై ఉన్నట్లు.. ‘ఆనరబుల్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్’ అని ప్రారంభిస్తే!! అప్పుడైతే ఆయన ఆసక్తిగా చూసే అవకాశాలుంటాయి. కరప్షన్‌పై పని చేస్తున్న మోదీజీ, కరప్షన్ పైనే పనిచేస్తున్న ఒక సీబీఐ ఆఫీసర్ని కరప్షన్‌పై కంప్లయింట్ చేసినందుకు సెలవిచ్చి పంపడం కూడా కరప్షనేనని బహిరంగ లేఖలో రాయాలి. ఈ స్టెయిల్ ఆఫ్ రైటింగ్ మోదీజీకి నచ్చుతుంది. లెటర్ మొత్తమంతా ఇలాగే రాయగలిగితే ఆయన లెటర్ మొత్తమంతా ఇంట్రెస్టుగా చదవగలుగుతారు. ఇంకో పేరాలో.. ‘‘మోదీజీ, మీరిలాగే మంచిమంచి సీబీఐ ఆఫీసర్లని సెలవుపై పంపించేస్తుంటే.. నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీ, విజయ్ మాల్యాలు.. దసరా సెలవులకో, దీపావళి సెలవులకో, కోర్టు సెలవులకో వెళ్లినట్లుగా వెళ్లి, విదేశాల్లోనే ఉండిపోతారు. అప్పుడిక కరప్షన్ చేసినవాళ్లు దేశంలో ఉండరు. కరప్షన్ జరక్కుండా చూసేవాళ్లు దేశంలోని సీబీఐ ఆఫీసులలో ఉండరు’’.. అని రాయాలి. అలోక్ని చేసినట్లే, రాజేశ్వర్ సింగ్నీ టార్గెట్ చేయబోతున్నారని నాకు అనిపిస్తోంది. సీబీఐలో అలోక్ ఎలాగో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో రాజేశ్వర్ అలాగ. కుర్రాడు. స్మైలింగ్ ఫేస్. చిదంబరం కరప్షన్ కేసుల్ని డీల్ చేస్తున్నది అతడే. అతడిని తప్పించి, చిదంబరాన్ని కేసుల నుంచి తప్పించాలని బీజేపీలోనే కొందరు ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే సోనియా మీద, రాహుల్ మీద, చిదంబరం మీద, శశి థరూర్ మీద.. ఇంకా కాంగ్రెస్ వాళ్ల మీద నేను పెట్టిన కేసులన్నీ వాపస్ తీసుకుంటానని మోదీజీకి రాసే బహిరంగ లేఖలోని చివరి పేరాలో చిన్న పంచ్ ఇవ్వాలి. మాధవ్ శింగరాజు -
రావణుడు నోయిడాలో పుట్టాడు: సుబ్రమణ్యస్వామి
పణజి: రావణుడు ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జన్మించాడనీ, తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి చెప్పినట్లు ఆయన ద్రవిడ రాజు కాదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలిపారు. నోయిడా ప్రాంతంలోని బిస్రఖ్‌లో రావణుడు పుట్టాడనీ, ప్రస్తుతం ఈ ఊరు జాతీయ రాజధాని ప్రాంతం ఉందని వెల్లడించారు. దక్షిణ గోవాలో ఓ సమావేశంలో మాట్లాడుతూ..‘రావణుడికి సంబంధించిన చిత్ర పటాలు, ఆలయాలు బిస్రఖ్‌లో ఇంకా ఉన్నాయి. మానససరోవర్‌లో తపస్సు చేసిన రావణుడు శివుడిని మెప్పించి వరాలు పొందాడు. శ్రీలంకను పాలిస్తున్న సోదరుడు కుబేరుడిని ఓడించి లంకాధిపతిగా మారాడు’ అని వివరించారు. -
ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యమేనా?!
సాక్షి నేషనల్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఫలితాలు వచ్చిన రోజే బీఎస్పీ చీఫ్ మాయావతి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం రావత్ ఈవీఎంలపై (ట్యాంపరింగ్ జరిగిందంటూ) తీవ్ర ఆరోపణలు చేయగా.. వీటిపై విచారణ జరపాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. పంజాబ్‌లో తమ ఓటమికి కూడా ట్యాంపరింగే కారణమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ట్యాంపరింగ్‌పై కోర్టుకు వెళ్లనున్నట్లు మాయావతి, కేజ్రీవాల్ తెలిపారు. 1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్‌లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి. తాజా వివాదం నేపథ్యంలో ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈవీఎం ఎలా పనిచేస్తుంది? బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈవీఎంలో రెండు భాగాలుంటాయి. ఒకటి కంట్రోలింగ్ (నియంత్రణ) యూనిట్, రెండోది బ్యాలెటింగ్ (ఓట్ల ప్రక్రియ) యూనిట్. ఎన్నికల కేంద్రంలోని ప్రిసైడింగ్ అధికారి ఈ కంట్రోలింగ్ యూనిట్‌కు ఇంచార్జీగా వ్యవహరిస్తారు. ఓటర్ తన ఓటు వినియోగించుకునేందుకు సిద్ధమవగానే.. బ్యాలెటింగ్ యూనిట్‌ను ఆయన యాక్టివేట్ చేస్తారు. తర్వాత ఓటర్ తనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న మీటను నొక్కి ఓటేస్తాడు. ఓటు పడగానే ప్రిసైడింగ్ అధికారి.. పోలింగ్ బూత్‌లో ఉన్న వివిధ పార్టీల ఏజెంట్లకు ఓటు నమోదైనట్లు ధ్రువీకరిస్తారు. కౌంటింగ్ సమయంలో నమోదైన ఓట్ల సంఖ్యలో తేడా రాకుండా ఏజెంట్ల లెక్కలతో ప్రిసైండింగ్ అధికారి లెక్కలు సరిపోయేందుకు ఇలా చేస్తారు. ఓటింగ్ సమయంలో ఈవీఎం బాహ్యనెట్వర్క్తో అనుసంధానం ఉండదు. ఒక ఈవీఎం ద్వారా 3,840 ఓట్లను రికార్డు చేయొచ్చు. కౌంటింగ్ సమయలో ఈవీఎంపై ఉన్న ‘రిజల్ట్’ మీటను నొక్కటం ద్వారా ఎవరికెన్ని ఓట్లో తెలుసుకోవచ్చు. ఓటింగ్ సమయలో ఈ బటన్ సీల్ చేస్తారు. ప్రతి ఈవీఎంకు ఓ ఐడీ నెంబరుంటుంది. అది ఎన్నికల సంఘం డేటాబేస్‌లో రికార్డవుతుంది. పోలింగ్ బూత్‌కు తీసుకెళ్తున్నపుడు, ఓటింగ్ పూర్తైన తర్వాత ఈ ఐడీని మరోసారి చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత వీటిని ఓ భద్రమైన ప్రదేశానికి తరలించి.. కౌంటింగ్ రోజు వరకు కేంద్ర బలగాల పహారాలో భద్రంగా ఉంచుతారు. ఈవీఎంలపై వచ్చిన ఫిర్యాదులు 2000లో ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ వార్తలు మొదటిసారిగా తెరపైకి వచ్చాయి. ఓ డచ్ టీవీ ఈవీఎం మెషీన్లను ఎలా హ్యాక్ చేయవచ్చో చూపుతూ డాక్యుమెంటరీని ప్రసారంచేసింది. దీంతో నెదర్లాండ్ ఈవీఎంలను రద్దుచేసి సంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్లతో పోలింగ్ నిర్వహించింది. జర్మనీ, ఐర్లాండ్‌లు కూడా ఈవీఎంలను పక్కన పెట్టేశాయి. భారత్‌లో కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చంటూ పలువురు బ్లాగర్లు పోస్టులు పెట్టారు. 2010లో మిచిగాన్ వర్సిటీ ప్రొఫెసర్ జె అలెక్స్, భారత సైంటిస్టు హరిప్రసాద్‌లు కలిసి ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు ముందే ఎలా ట్యాంపరింగ్ చేసే అవకాశాలున్నాయో ఓ నివేదికలో వెల్లడించారు. మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంలను ఎలా మార్చవచ్చో చూపించారు. అయితే దీన్ని భారత ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. తమ దగ్గరున్న ఈవీఎంలు అత్యున్నత ప్రమాణాలతో కూడినవని ట్యాంపరింగ్‌కు వీల్లేనివని స్పష్టం చేసింది. ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలు ► 2004 ఎన్నికల్లో యూపీఏకు అనుకూలంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు దీన్ని తోసిపుచ్చింది. 2005లో మరోకేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు.. ఎన్నికలప్రక్రియలో ఈవీఎంల పాత్ర గొప్పదని, వీటిని ట్యాంపరింగ్ చేయలేమని స్పష్టం చేసింది. ► 2009 ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఆ తర్వాత ఎల్కే అడ్వాణీ కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. ► 2009లో ఒడిశా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జేబీ పట్నాయక్ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ బీజేడీ విజయం సాధించిందని ఆరోపించారు. ► 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాపింగ్‌కు పాల్పడిందని అప్పటి అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ విమర్శించారు. దీనిపై సామాజిక వేత్త మేథాపాట్కర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఓటు ధ్రువీకరణ పత్రం సంగతేంటి? బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా 2013 అక్టోబర్ 8న సుప్రీంకోర్టు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ–ఓటు ధ్రువీకరణ పత్రం)ను 2019లోపు దశల వారీగా ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ఈవీఎంకు అనుసంధానించిన ప్రింటరు నుంచి తను ఓటేసిన గుర్తు, సీరియల్ నంబర్‌తో కూడిన ప్రింట్ డ్రాప్ బాక్స్‌లోకి వస్తుంది. అయితే డ్రాప్‌బాక్స్‌లో పడే ముందు కొద్ది క్షణాలపాటు ఓటరు దీన్ని చూసేందుకు (తను అనుకున్న పార్టీకే ఓటు పడిందా లేదా అని తెలుసుకునేందుకు) వీలుంటుంది. ఒకవేళ ఈవీఎం ఓట్లలో ఏమైనా తేడా ఉందనిపిస్తే.. డ్రాప్బాక్సును తెరిచి కౌంటింగ్ చేసుకోవచ్చు. దీన్ని 2013లో నాగాలాండ్ ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. -
తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన
-
తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన
ఢిల్లీ: దివంగత జయలలిత నిచ్చెలి శశికళ నటరాజన్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. 20 ఏళ్ల తరువాత న్యాయం గెలిచింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తమిళనాడు సంక్షోభానికి గవర్నర్ వెంటనే ముగింపు పలకాలని స్వామి కోరారు. శశికళను కోర్టు దోషిగా తేలుస్తుందని తాను ఊహించానని వ్యాఖ్యానించారు. 1996లో ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలై డీఎంకే అధికారంలోకి వచ్చిన సమయంలో.. సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మేరకు జయలలిత, శశికళపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శశికళకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ 10 కోట్ల జరిమానా విధించింది. ఆమె వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? శశికళ కేసు పూర్వాపరాలివి.. -
ఘనంగా ఉట్ల జాతర
రొద్దం (పెనుకొండ) : మండలంలోని పెద్దమంతూరు గ్రామ సమీపాన పెన్నానది ఒడ్డున వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉట్ల జాతర శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం ఉట్ల జాతర నిర్వహించారు. ఉట్లమాను ఎక్కడానికి యువకులు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఎల్.తిమ్మాపురానికి చెందిన కురుబ సోమశేఖర్ ఉట్లమాను ఎక్కి విజయం సాధించాడు. ఉట్లజాతరను చూసేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. -
నోట్ల రద్దు ముందుగానే లీకైంది
కరెన్సీ కష్టాలకు జైట్లీనే కారణం: సుబ్రహ్మణ్యస్వామి సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందుగానే లీకైందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిందని, నోట్లు రద్దు చేయాలనే ఆలోచనే ఉంటే ముందస్తు ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించేందుకు ముందుగా బహిరంగ ప్రదేశాల్లో ఏటీఎంలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, పన్నులు తగ్గించాలని సైతం తాను సూచించినట్లు తెలిపారు. తన సూచనలను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పట్టించుకోలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న కరెన్సీ కష్టాలకు అరుణ్‌జైట్లీనే బాధ్యత వహించాలన్నారు. పెద్ద నోట్లు చెల్లవని కేంద్రం ప్రకటించక ముందే ఈ నిర్ణయం లీకైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తాను కేసులేవీ దాఖలు చేయడం లేదని, కేంద్రమే కేసు వేయాలన్నారు. అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడే కేంద్రాన్ని దుయ్యబట్టడం చర్చనీయాంశమైంది. -
'తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి'
-
'తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి'
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌కు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజనాథ్కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో విధులు నిర్వహించలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని... అవి ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైన సీఎం జయలలిత గత 15 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత అనారోగ్యంపై అపోలో ఆసుపత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం విదితమే. మరికొంత కాలం పాటు జయ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాజనాథ్కు రాసిన లేఖలో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. సీఎం జయ అనారోగ్యంపై పుకార్లు షికార్లు చేశాయి. దాంతో జయ ఆరోగ్యంపై వెంటనే ప్రకటన చేయాలని గవర్నర్‌ను ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేసింది. దాంతో జయను రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పరామర్శించారు. అనంతరం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తమిళనాడు రాజ్‌భవన్ లేఖను విడుదల చేసింది. ఆ తర్వాత జయ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వెంటనే ప్రకటన చేయాలని పలువురు మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో గురువారం అపోలో ఆసుపత్రి ఆమె హెల్ బులెటిన్ విడుదల చేసింది. -
కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షలు
అందరినీ ఇబ్బందులు పెట్టడంలో ఆరితేరిన కాంగ్రెస్ అధినేతలకు ఈమధ్య కష్టా లొచ్చిపడ్డాయి. రెండు కీలకమైన కేసులు వారిని వెంటాడుతున్నాయి. అందులో ఒకటి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తీసుకొచ్చిన నేషనల్ హెరాల్డ్ కేసు, రెండోది- తమ సంస్థపై రాహుల్‌గాంధీ అపనింద వేశారంటూ మహారాష్ట్రకు చెందిన ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు దాఖలు చేసిన కేసు. నేషనల్ హెరాల్డ్ కేసు అవినీతి ఆరోపణలకు సంబంధించింది. ఆ పత్రిక ప్రచురణ కోసం ఎన్నడో 1937లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్)కు ఇప్పుడున్న వేల కోట్ల విలువైన స్థిరాస్తులను చేజిక్కించుకునేందుకు యంగ్ ఇండియన్ అనే సంస్థను 2010లో స్థాపించారన్నది ఆ ఆరోపణల సారాంశం. న్యాయస్థానం విచారణలో ఉన్న ఆ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందన్నది వేచి చూడాల్సిన అంశం. డబ్బు రూపేణా కాకపోయినా దాన్ని మించిన కేసు ఆరెస్సెస్ సంస్థపై వేసిన నిందకు సంబంధించింది. మహాత్మాగాంధీ హత్య వెనక ఆరెస్సెస్ హస్తముందని 2014లో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణపై ఆ సంస్థ కార్యకర్త ఒకరు కింది కోర్టులో పెట్టిన కేసు అది. ఆ కేసును కొట్టేయాలన్న రాహుల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘మీ ఆరోపణలు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 499కిందికి వస్తాయో, రావో తేల్చాల్సి ఉన్నద’ని స్పష్టం చేసింది. ‘పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారా లేక విచారణను ఎదుర్కొనడానికి సిద్ధ పడతారా’ అని కూడా ప్రశ్నించింది. ఈ సూటి ప్రశ్న చాలా జటిలమైనది. ఈ కేసులో ముందుకుపోయినా, వెనక్కొచ్చినా అంతిమంగా సంకటస్థితిలో పడేది కాంగ్రెసే. ముందుకెళ్లి విచారణను ఎదుర్కొనదల్చుకుంటే చేసిన ఆరోపణలకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలను ఆయన చూపవలసి ఉంటుంది. దీన్నుంచి వెనక్కి రావడం ఉత్తమం అనుకుంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఆ పని చేస్తే కాంగ్రెస్ తగిలించుకున్న సెక్యులర్ భుజకీర్తులకు భంగం కలుగుతుంది. రాజీవ్ హయాంలో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం, షాబానో కేసు తదితర అంశాల్లో వ్యవహరించిన తీరుతో మొదలుపెడితే అనేక సందర్భాల్లో ఆ పార్టీ వేసిన అడుగుల వల్ల దాని సెక్యులర్ ప్రభ అసలే అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడు ఆరెస్సెస్ కేసులో రాహుల్ ‘పశ్చాత్తాప’పడితే అది మరింత కొడిగట్టడం ఖాయం. బింకంగా ముందు కెళ్తే ఏమవుతుందో చెప్పలేం. ఆయన సమర్పించే సాక్ష్యాధారాలపైనా, వాటిని న్యాయస్థానం అంగీ కరించడంపైనా అది ఆధారపడి ఉంటుంది. కేసు సర్వోన్నత న్యాయస్థానానికి చేరే సరికి చాన్నాళ్లు పడుతుంది. మొత్తానికి ఆయన రెండో తోవ ఎంచుకున్నారు. రాహుల్ ‘చారిత్రక వాస్తవాలపై’ అవగాహన ఉన్నవారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఘంటాపథంగా చెబుతున్నారు. రాహుల్ అందజేసే ఆ ‘వాస్తవాల’ను న్యాయస్థానం అంగీకరిస్తే వేరుగానీ... తిరస్కరిస్తే పార్టీ పరువు పోవడంతోపాటు దాని సెక్యులర్ స్థానం మరింత కుంచించుకుపోతుంది. పైగా ఆ తీర్పు ఆరెస్సెస్‌కు అదనపు సర్టిఫికెట్ అవుతుంది. నిజానికి ఆరెస్సెస్‌పై ఇలాంటి ఆరోపణ చేసిన నేతల్లో రాహుల్‌గాంధీ మొదటివారేమీ కాదు. ఇంతక్రితం చాలామంది చేశారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమూ, అప్పటి జమ్మూ-కశ్మీర్‌లోని షేక్ అబ్దుల్లా ప్రభుత్వమూ కుట్రపన్నిన పర్యవసానంగానే జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1952లో కస్టడీలో మరణించారని బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు అనేకులు పలు సందర్భాల్లో ఆరోపించారు. అలాగే 1984లో ఇందిర హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన నరమేథంపైనా, 2001లో గోథ్రా మారణకాండ తర్వాత గుజరాత్లో చోటుచేసుకున్న ఊచకోతపైనా కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఆరోపణలొ చ్చాయి. అందుకు సంబంధించిన కేసుల్లో ఆ రెండు పార్టీల నేతలపైనా న్యాయ స్థానాల్లో విచారణలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నికలొచ్చాయంటే ఆ రెండు పార్టీల ఆరోపణల జాబితాల్లోనూ ఈ అంశాలు ప్రధానంగా ఉంటాయి. మరో ఆరునెలల్లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవి హోరెత్తుతాయి. ఈ బాణీకి భిన్నంగా రాహుల్ ఏమైనా మాట్లాడారా? ఆరెస్సెస్‌కు అదనంగా ఆగ్రహం తెప్పించారా? గతంలో ఆరెస్సెస్ ఇలాంటి ఆరోపణల్ని ఎదుర్కొన్నా వా టికి అంతే దీటుగా బదులివ్వడం తప్ప ఎన్నడూ న్యాయస్థానం తలుపు తట్టలేదు. చట్టసభల్లోనూ, బహిరంగసభల్లోనూ, ఇతర వేదికలపైనా ప్రత్యర్థి పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వర్తమానకాలంలో వింతేమీ కాదు. ఈమధ్య స్పీకర్ల పుణ్యమా అని చట్టసభల్లో కొందరు ఏం మాట్లాడినా చెల్లుబాట వుతోంది. కొందరు ఎలా మాట్లాడినా అపరాధమై రికార్డుల్లోంచి మాయమవు తోంది. ఆ సంగతలా ఉంచి బహిరంగసభలు, మీడియా సమావేశాల్లో నాయకులు చేసుకునే ఆరోపణలు మీడియాకు మేతగా తప్ప న్యాయస్థానాల వరకూ వెళ్లడం లేదు. అలా వెళ్తే సహజంగానే అది వేరే రూపం తీసుకుంటుంది. ప్రతి మాటా బలిగోరుతుంది. అడుగడుగునా ప్రశ్నల కొడవళ్లు అడ్డు తగులుతాయి. ఇక నీళ్లు నమలడం కుదరదు. ప్రతిదానికీ నిర్దిష్టంగా జవాబివ్వాలి. తగిన ఆధారాలివ్వాలి. రాహుల్‌కు ఇప్పుడు ఈ సమస్యే ఎదురైంది. మహాత్మాగాంధీ హత్య వెనక ఆరెస్సెస్ హస్తమున్నదని ఎలా చెప్పారని అడిగితే ఆయన తరఫు న్యాయవాది... పంజాబ్- హరియాణా హైకోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గాంధీజీని హత మార్చిన గాడ్సే ఆరెస్సెస్ కార్యకర్త అని మాత్రమే అందులో ఉన్నది తప్ప ఆ సంస్థే చంపిందని ఎక్కడ నిర్ధారించిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో న్యాయ స్థానం ముందుంచబోయే ‘చారిత్రక వాస్తవాలు’ ఏమిటో రాగలకాలంలో తేలు తుంది. అయితే, దీని సంగతలా ఉంచి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... గాలి కబుర్లు కాక బాధ్యతాయుతంగా మాట్లాడాలని, జవాబుదారీ తనంతో మెలగాలని నేతలు గ్రహిస్తే మంచిదే. -
వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది
ప్రచార యావతో ఒరిగేదేం లేదు: ప్రధాని మోదీ - ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నిజమైన దేశభక్తుడు - సుబ్రమణ్య స్వామిపై పరోక్ష విమర్శలు - ఎన్ఎస్జీలో సభ్యత్వం సాధిస్తాం.. టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఎన్ఎస్జీ (అణు సరఫరాదారుల కూటమి)లో భారత్‌కు సభ్యత్వం దక్కుతుందని, సానుకూల వాతావరణంలో చర్చలు మొదలయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పాక్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, రుణ ఎగవేతదారుల్ని చట్టముందు నిలబెడతామని చెప్పారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యల్ని పరోక్షంగా తప్పుపట్టిన ప్రధాని.. దేశభక్తిలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఎవరికీ తక్కువ కాదన్నారు. వ్యక్తికన్నా వ్యవస్థ గొప్పదని, ప్రచారంపై మోజుతో దేశానికి మేలు జరగదని అన్నారు. సోమవారం ‘టైమ్స్ నౌ’ చానల్ ఇంటర్వ్యూలో మోదీ ఏమన్నారో ఆయన మాటల్లోనే .. ఎన్ఎస్జీ సభ్యత్వంపై... ఐరాస భద్రతామండలి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ), క్షిపణి సాంకేతికత నియంత్రణ బృందం(ఎంటీసీఆర్), ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం వరుసగా ప్రభుత్వాలు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రయత్నాల్ని కొనసాగించాయి. మా ప్రభుత్వం మాత్రమే ప్రయత్నాలు చేయడం లేదు. మా హయాంలో ఎస్సీఓలో సభ్యత్వం సాధించాం. ఎంటీసీఆర్‌లో స్థానం పొందడంలో విజయవంతమయ్యాం. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. ఈ ప్రక్రియ సానుకూల వాతావరణంలో మొదలైంది. ప్రతిదీ దాని నిబంధనల మేరకు జరుగుతుంది. చైనా వ్యతిరేకతపై... విదేశాంగ విధానం ప్రకారం చర్చల్లో ఏకాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. చైనాతో విభేదాల్ని చర్చలతో పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చర్చలు జరుగుతున్నాయి.. అలాగే కొనసాగాలి. చైనాతో మనకు ఒక్క సమస్యే కాకుండా అనేక అపరిష్కృత వివాదాలున్నాయి. ఒకదాని వెంట ఒకటి పరిష్కారమయ్యేలా నెమ్మదిగా, నిదానంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చైనా కూడా సమస్య పరిష్కారం దిశగా సహకరిస్తుంది. కొన్ని అంశాల్లో చైనాతో విభేదిస్తున్నాం.. వాళ్లు కూడా మనతో విభేదిస్తున్నారు. ముఖ్యమైన విషయమేంటంటే ఇప్పుడు చైనాతో ముఖాముఖి చర్చిస్తున్నాం. భారత్ ప్రయోజనాలే ప్రాతిపదికగా చర్చల్లో అంశాల్ని లేవనెత్తుతున్నాం. మూడ్రోజుల క్రితం చైనా అధ్యక్షుడితో భారత్ ప్రయోజనాలే లక్ష్యంగా చర్చించా. లక్ష్మణరేఖపై ఎవరితో చర్చించాలి పాకిస్తాన్‌తో చర్చల విషయంలో లక్ష్మణరేఖ గురించి ఎవరితో చర్చించాలి. పాకిస్తాన్‌లోని ఎన్నికైన ప్రభుత్వంతోనా... లేదా ప్రభుత్వేతర శక్తులతోనా... అందుకే పాకిస్తాన్ విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా, జాగరూకతతో ఉండాల్సి వస్తోంది. అందులో ఎలాంటి నిర్లక్ష్యం, చూసీ చూడనట్లు ఉండకూడదు. లాహోర్ పర్యటన, పాక్ ప్రధానిని ఆహ్వానించడం వంటి నిరంతర యత్నాలతో ఉగ్రవాదంపై భారత్ అభిప్రాయమేంటో ప్రపంచానికి చెప్పాం.పాక్ ఈ విషయంలో సమాధానం చెప్పడం కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉగ్రవాదంపై భారత్ చెపుతున్న దాన్ని అంగీకరిస్తుంది. ఉగ్రవాదం వల్ల భారత్‌కు జరిగిన నష్టాన్ని, మానవత్వానికి జరిగిన నష్టాన్ని ప్రపంచంఅంగీకరిస్తుంది. ఈ అంశంలో భారత్ తన వాదనను ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నా. సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు సరికాదు అది మా పార్టీలోని వ్యక్తా? కాదా? అన్నది కాదు... ఇలాంటివి సరైనవి కావు. ప్రచారంపై ఉన్న మోజు దేశానికి ఎప్పుడూ ఎలాంటి మంచి చేయదు. ప్రజలు ఎంతో బాధ్యతతో ప్రవర్తించాలి. ఎవరైనా తాము వ్యవస్థ కంటే ఎక్కువని భావిస్తే అది తప్పు. విదేశాంగ విధానంలో సమష్టి కృషి కేంద్రంలో ప్రభుత్వానికి పూర్తి బలం ఉండడంతోనే విదేశాంగ విధానం బలోపేతమైంది. పూర్తి మెజార్టీ కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఇది ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపింది. విదేశాంగ విధానంలో మా ప్రభుత్వం సమష్టిగా పనిచేస్తుంది. నాకు విదేశాంగ విధానం కొత్తే. విదేశాంగ శాఖ, ప్రధాని కార్యాలయం, వాణిజ్య, రక్షణ శాఖలు కలసి పనిచేస్తున్నాయి. పేదవాడే కేంద్ర బిందువు పాలనపైనే నా దృష్టంతా. కేవలం ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేయడం వల్ల దేశం ఎంతో నష్టపోయింది. ప్రజల డిమాండ్లను, అంచనాల్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నించాలి. మా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలో పేదవాడే కేంద్ర బిందువు. దేశంలోని ఓటర్లు చాలా పరిణితి చెందినవాళ్లు.. లోక్‌సభ ఎన్నికల్లో ఒకలాగా, రాష్ట్రాల ఎన్నికల్లో మరోలా తీర్పునిచ్చారు. వారి పరిణితిని మనం నమ్మి తీరాలి. పార్లమెంట్ సమావేశాలపై.. ఎన్నో ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న వాళ్లు పార్లమెంట్ సమావేశాల్ని అడ్డుకోవడం సరికాదు. కీలకమైన బిల్లులు ఆమోదం పొందనందుకు నేను బాధ పడలేదు. చర్చ బదులు గందరగో ళం చోటు చేసుకోవడంతో నేను నిరాశ చెందా. రఘురాం రాజన్ దేశభక్తిపై... రఘురాం రాజన్‌ను అభినందిస్తున్నా... ఆయన దేశభక్తిలో ఎవరికీ తక్కువ కాదు. రాజన్ దేశాన్ని ప్రేమించే వ్యక్తి. ఎక్కడ ఉన్నా భారతదేశం కోసం పనిచేస్తారు. యూపీఏ హయాంలోనే రాజన్‌ను నియమించినా పదవీకాలం ముగిసేవరకూ ఆయన కొనసాగుతారు. రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన మూడు నెలల అనంతరం 2014లో పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. యూపీఏ ప్రభుత్వం నియమించిన రాజన్‌ను కొనసాగనిస్తారా? అంటూ రాశారు. నేను ఆయనను కొనసాగనివ్వనని చెప్పారు. అది తప్పని రుజువైంది. అప్పులు ఎగ్గొట్టే వారికి చట్టం రుచి చూపిస్తా ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టేవారికి చట్టం రుచేంటో చూపిస్తాను. వారిని దేశానికి రప్పించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ పని చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీనే అని గట్టి ప్రజలు నమ్మకంతో ఉన్నారు. నేను ఈ పని తప్పకుండా చేస్తాను. జనంలో తగ్గుతున్న హాస్యం నాకు హాస్యమంటే ఇష్టం. కానీ నేడు ప్రజా జీవితంలో హాస్యం అనేది తగ్గిపోతుంది. 24 గంటల వార్తా చానళ్ల యుగంలో ఎవరైనా సరే చిన్నమాటను పెద్ద సమస్యగా మార్చేయవచ్చు. ప్రజల్లో హాస్యం తగ్గిపోవడానికి కారణం భయం. ఈ భయం వల్లే ప్రజా జీవితంలో హాస్యాన్ని కోల్పోతున్నాం. అవినీతి కళలో ఘనులు అగస్టా సహా ఇతర రక్షణ రంగ కుంభకోణాల్లో సంబంధమున్నవారు ఇలాంటి విషయాల్లో చాలా అనుభవజ్ఞులు. వారు తప్పులు చేసే కళలో ఆరితేరినవారు. పై స్థాయిలో కాపాడే వ్యవస్థ లేకుండా ఇలాంటి కుంభకోణాలు చేయడం సాధ్యం కాదు. అగస్టా స్కామ్‌కు సంబంధించి మా ప్రభుత్వం ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కుంభకోణం వెనుక ఎవరున్నారు? ఎంత నష్టం జరిగింది? అనే అంశాలను దర్యాప్తు సంస్థలు నిగ్గుతేలుస్తాయి. -
వివాదాలకు కేరాఫ్.. స్వామి!
♦ నాడు సంఘ్ వ్యతిరేకి.. నేడు బీజేపీ ఎంపీ ♦ 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కూలడానికి సూత్రధారి సాక్షి, సెంట్రల్ డెస్క్: సుబ్రమణ్య స్వామి.. హార్వర్డ్ వర్సిటీలో పీహెచ్డీ చేసిన ఆర్థిక వేత్తగా కన్నా.. వివాదాస్పదుడైన రాజకీయ నేతగానే సుప్రసిద్ధుడు. సంచలన ఆరోపణలతో, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో నిత్యం వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయిని తాగుబోతు అన్నా, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్‌ను అవినీతిపరుడన్నా, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఇటలీ మూలాలను పదేపదే ప్రస్తావిస్తూ ఆమెను స్మగ్లర్ అంటూ ఆరోపణలు గుప్పించినా, ముస్లింలకు ఓటుహక్కు రద్దుచేయాలంటూ అవాకులు పేలినా.. ఆయనకే చెల్లింది. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా సభలో అడుగుపెట్టిన తరువాత తొలి మూడు రోజులూ ఆయనే వార్తల్లో వ్యక్తి. అగస్టా కుంభకోణాన్ని సభలో ప్రస్తావించి, కాంగ్రెస్‌ను రెచ్చగొట్టి, మూడు రోజుల పాటు హంగామా సృష్టించారు. అగస్టా స్కామ్‌లో లోక్‌సభ సభ్యురాలు సోనియాగాంధీ పేరును రాజ్యసభలో ప్రస్తావించి డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ సభలో వేరే సభ సభ్యుల ప్రస్తావన తేవొద్దని, మరోసారి అలా చేస్తే తీవ్ర చర్యలుంటాయని కురియన్ హెచ్చరించే పరిస్థితి తెచ్చుకున్నారు. అలా అని స్వామికి సభా నిబంధనలు తెలియవని కాదు.. 1974- 1999 మధ్య ఐదు పర్యాయాలు ఆయన ఎంపీగా పనిచేశారు. మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. అయినా, సభలో తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం తప్పంటూ ట్వీటర్లో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా స్వామి ఆరోపణలు సంచలనాత్మకంగా ఉంటాయి కానీ వాటికి కచ్చితమైన ఆధారాలు మాత్రం ఉండవని రాజకీయ వర్గాలు భావిస్తుంటాయి. మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, ప్రస్తుత మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తరహాలో పూర్తి ఆధారాలు, సమాచారంతో ఆయన మాట్లాడరని చెబుతుంటాయి. స్వామి మొదటినుంచి బీజేపీకి మిత్రుడేం కాదు. అలాగే కాంగ్రెస్‌కు ఆజన్మ విరోధీ కాదు. గతంలో ఆయన సోనియాకూ ఆత్మీయుడే.. బీజేపీకీ బద్ధ విరోధే. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను, సోనియాను ఒక్కటి చేసిన ఘనత స్వామిదే. లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణమైన స్పెక్ట్రం కుంభకోణాన్ని బయటపెట్టింది కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అయినా, ఆ స్కాంకు ఆ స్థాయి ప్రాచుర్యం కల్పించింది, సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలా చేసింది మాత్రంస్వామినే. ప్రస్తుతం.. రాజ్యసభలో కాంగ్రెస్ వ్యతిరేక బ్రిగేడ్‌కు అనధికారికంగా నేతృత్వం వహిస్తున్న స్వామి.. రాజ్యసభ సభ్యత్వంతో ఆగిపోతారా? మోదీ నుంచి ఇంకేదైనా పెద్ద ‘బాధ్యత’ను ఆశిస్తున్నారా? అన్న చర్చ ఇప్పుడు పార్లమెంటు వర్గాల్లో నడుస్తోంది. మరోవైపు, బీజేపీతో స్వామి అనుబంధం ఎక్కువ రోజులు సాగకపోవచ్చన్నది మరికొందరి వాదన. -
సుబ్రమణ్య స్వామి కాన్వాయ్‌పై గుడ్లు, టొమాటోలు
కాన్పూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల దాడి కాన్పూర్(యూపీ): కాన్పూర్‌లో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం కోడిగుడ్లు, టొమాటోలు, చెత్త విసిరి సిరా చల్లారు. అయితే నిరసనకారులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ప్రపంచ ఉగ్రవాదంపై ఓ కాలేజీలో జరిగే సదస్సుకు స్వామి హాజరవుతుండగా ఈ దాడి జరిగింది. అనంతరం సదస్సులో స్వామి కశ్మీర్ అంశం నేపథ్యంలో మాట్లాడుతూ ఢిల్లీలోని జేఎన్‌యూ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట మార్చాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. జేఎన్‌యూ విద్యార్థులను కాంగ్రెస్, వామపక్ష అనుబంధ విద్యార్థులు వారిని చదువుకోనివ్వట్లేదని స్వామి ఆరోపించారు. జేఎన్‌యూను నాలుగు నెలలు మూసేసి తనిఖీలు చేపట్టాలని స్వామి డిమాండ్ చేశారు. -
ప్రతి గ్రామంలో రామాలయం
దేశవ్యాప్తంగా నిర్మిస్తామన్న వీహెచ్‌పీ లక్నో/మీరట్: దేశంలోని ప్రతి గ్రామంలో రామాలయాన్ని నిర్మిస్తామని వీహెచ్‌పీ ప్రకటించింది. అయోధ్యలో రామాలయ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా అయోధ్యలో నిర్మాణం మొదలవుతుందని.. అయితే అది అందరి ఏకాభిప్రాయం, కోర్టు అనుమతితోనే జరుగుతుందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇటీవలే వ్యాఖ్యానించారు కూడా. తాజాగా సోమవారం ఈ అంశంపై వీహెచ్‌పీ ప్రతినిధి శరద్ శర్మ లక్నోలో, మరో నేత సాధ్వీ ప్రాచి మీరట్‌లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 25వేల గ్రామాల్లో రామాలయాలు నిర్మించాలని వీహెచ్‌పీ నిర్ణయించినట్లు శర్మ చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీన శ్రీరామనవమి నుంచి వారం రోజులపాటు రామ మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కొన్నేళ్లుగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 75 వేల గ్రామాలకు దీనిని తమ సంస్థ చేరవేసిందని చెప్పారు. ఈసారి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వీటిని నిర్వహిస్తామని తెలిపారు. -
మూడు ఆలయాలివ్వండి చాలు!
39,997 మసీదులు మీరే ఉంచేసుకోండి ♦ ముస్లింలకు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఆఫర్ న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ఆదివారం ట్విటర్లో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ‘హిందువులమైన మేం ముస్లింలకు ఒక లార్డ్ కృష్ణ ప్యాకేజ్ ఆఫర్ ఇస్తున్నాం. మాకు మూడు(అమోధ్య, మధుర, కాశీ) ఆలయాలివ్వండి. మిగతా 39,997 మసీదులను మీరే ఉంచేసుకోండి. ముస్లిం నేతలు దుర్యోధనులు కాబోరని ఆశిస్తున్నా’అని ట్వీట్ చేశారు. కురుక్షేత్ర యుద్ధాన్ని నివారించేందుకు, పాండవులు, కౌరవుల మధ్య సయోధ్యకు.. పాండవులకు ఐదు గ్రామాలను ఇస్తే చాలన్న కృష్ణుడి రాయబారాన్ని గుర్తుకు తెచ్చే లాఆ ట్వీట్ చేశారు. సూదిమొన మోపేంత స్థలం కూడా ఇవ్వబోమంటూ కృష్ణుడి రాయబారాన్ని దుర్యోధనాదులు తోసిపుచ్చడం తెలిసిందే. కాగా, అయోధ్యలో మందిర నిర్మాణం ఈ ఏడాది చివరలోగా ప్రారంభమవుతుందని స్వామి చెప్పారు. సుప్రీంకోర్టు తుది తీరు్పు మందిర నిర్మాణానికి అనుకూలంగా వస్తుంద ని ఆశాభావం వ్యక్తంచేశారు. అయోధ్యలో, కావాలంటే ముస్లింలు సరయూ నదీతీరంలో మరో మసీదును కట్టుకోవచ్చని, కానీ, ఆ మసీదుకు బాబర్ పేరు పెట్టకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వర్సిటీలో అరుంధతి వశిష్ట అనుసంధాన్ పీఠ్ ఆధ్వర్యంలో జరిగిన ‘రామ జన్మభూమి ఆలయం.. ప్రస్తుత పరిస్థితులు’ అంశంపై సదస్సులో ఆదివారం స్వామి ప్రసంగించారు. రామమందిరం కేసు గెలిచాక మధురలో కృష్ణాలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాల కేసులనూ సునాయాసంగా గెలుస్తామన్నారు. అయోధ్య కేసే క్లిష్టమైనదని, మిగతా కేసుల్లో స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయన్నారు. కాగా, రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయంటూ అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ మెహతాఅన్నారు. సదస్సు నిర్వహణకు ఢిల్లీ వర్సిటీలోని ఏఐఎస్ఏ, డీఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘ఏకాభిప్రాయం కుదిరాకే రామమందిరం’ అన్ని మతాల వారినీ సంప్రదించి అభిప్రాయాలు తీసుకున్నాకే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’ పేర్కొంది.