తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన | subramanya swamy response on supreme court verdict | Sakshi
Sakshi News home page

తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన

Published Tue, Feb 14 2017 11:33 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

తీర్పుపై  సుబ్రహ్మణ్యస్వామి స్పందన - Sakshi

తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన

ఢిల్లీ: దివంగత జయలలిత నిచ్చెలి శశికళ నటరాజన్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. 20 ఏళ్ల తరువాత న్యాయం గెలిచింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తమిళనాడు సంక్షోభానికి గవర్నర్‌ వెంటనే ముగింపు పలకాలని స్వామి కోరారు. శశికళను కోర్టు దోషిగా తేలుస్తుందని తాను ఊహించానని వ్యాఖ్యానించారు. 1996లో ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలై డీఎంకే అధికారంలోకి వచ్చిన సమయంలో.. సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మేరకు జయలలిత, శశికళపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మంగళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శశికళకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ 10 కోట్ల జరిమానా విధించింది. ఆమె వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement