తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్కు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజనాథ్కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో విధులు నిర్వహించలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని... అవి ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
Published Fri, Oct 7 2016 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement