దివంగత జయలలిత నిచ్చెలి శశికళ నటరాజన్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. 20 ఏళ్ల తరువాత న్యాయం గెలిచింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తమిళనాడు సంక్షోభానికి గవర్నర్ వెంటనే ముగింపు పలకాలని స్వామి కోరారు. శశికళను కోర్టు దోషిగా తేలుస్తుందని తాను ఊహించానని వ్యాఖ్యానించారు.