సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించిన తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తొలిసారిగా మాట్లాడారు. కువత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి మంగళవారం రాత్రి పోయెస్‌గార్డెన్(చెన్నై)కు బయలుదేరిన ఆమె.. పార్టీ ఎమ్మెల్యేలు, మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా తనను అన్నాడీఎంకే నుంచి వేరుచేయలేదని, ఎక్కడ ఉన్నా నిరంతరం పార్టీ ఉన్నతికే పాటుపడతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. 'ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా' అన్నారు.