దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు వి.ఎన్.సుధాకరన్, జె.ఇళవరసిలు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సుప్రీంకోర్టు మంగళవారం నిర్ధారించింది. వారికి నాలుగేళ్లపాటు జైలుశిక్ష, జరిమానాలు విధిస్తూ కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని స్పష్టం చేసింది.