ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడటంతో.. తమిళనాడులో దీపావళి అంతా చేసుకుంటున్నారని అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రౌడీయిజం, కుటుంబ పాలన ముగిసిపోయాయని అన్నారు. తమిళనాడు రాష్ట్రం ఇన్నాళ్లకు ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. తన మీద కూడా నాలుగైదు తప్పుడు కేసులు పెట్టించారని, వాటి నుంచి బయట పడేందుకు తాను క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశానని ఆమె తెలిపారు. శశికళా నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత తనను ఏనాడూ పక్కన పెట్టలేదని, ఆమెను అందరూ అభిమానిస్తారని తెలిపారు.