Sasikala Pushpa
-
వీధిన పడ్డ మాజీ ఎంపీ శశికళ పుష్ప!
సాక్షి, చెన్నై: మాజీ ఎంపీ శశికళ పుష్పకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను ఢిల్లీ రోడ్లపై అధికారులు పడేశారు. ఆమె ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఖాళీ చేయకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. 2011–14లో తూత్తుకుడి కార్పొరేషన్ మేయర్ పదవితో శశికళ పుష్ప రాజకీయ తెర మీదకు వచ్చారు. ఆమెకు దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పెద్ద పీట వేశారు. ఆ తదుపరి రాజ్యసభ సీటు కూడా అప్పగించారు. ఈ సమయంలో ఢిల్లీలో ఆమె సాగించిన కొన్ని వ్యవహారాలను జయలలితకు ఆగ్రహాన్ని తెప్పించాయి. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో కలిసి ఆమె ఫొటోలు వైరల్ కావడంతో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. అయినా, ఆ పదవిలో ఐదేళ్లు కొనసాగారు. ఇటీవల ఆమె పదవీ కాలం ముగిసింది. బీజేపీలో చేరిన ఆమెకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కూడా దక్కింది. ఈ పరిస్థితుల్లో పదవీ కాలం ముగిసి రెండేళ్లు అవుతున్నా, ప్రభుత్వ గృహాన్ని ఖాళీ చేయక పోవడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కన్నెర్ర చేశాయి. ఢిల్లీ నార్త్ అవెన్యూలోని శశికళ పుష్ప గృహాన్ని అధికారులు శుక్రవారం బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఆమె గృహంలో ఉన్న అన్ని వస్తువులను రోడ్డు పక్కన పడేశారు. ఆ సమయంలో శశికళ పుష్ప ఢిల్లీలో లేరు. -
రెండో పెళ్లి చేసుకున్న మహిళా ఎంపీ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప(41) దేశరాజధానిలో సోమవారం న్యాయవాది రామస్వామిని వివాహమాడారు. భర్త లింగేశ్వరతో విభేదాలు తలెత్తడంతో ఆమెకు గతంలో విడాకులు మంజూరయ్యాయి. రామస్వామిని వివాహం చేసుకునేందుకు పుష్ప ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఆయన భార్య సత్యప్రియ తెర మీదకు వచ్చారు. రామస్వామితో తనకు గతంలోనే పెళ్లయిందనీ, తామిద్దరికీ రిజుస్న అనే కుమార్తె ఉన్నట్లు వారంరోజుల క్రితం హైకోర్టు మదురై ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సత్యప్రియ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణ ముగిసేవరకూ రామస్వామి ఎవర్నీ వివాహం చేసుకునేందుకు వీలులేదని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామస్వామి, శశికళ పుష్ప సోమవారం వివాహం చేసుకున్నారు. -
శశికళ పుష్ప పెళ్లి జరిగేనా?
టీ.నగర్: అన్నాడీఎంకే నుంచి తొలగించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప (41) తన భర్త లింగేశ్వర తిలకన్‌తో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా ఆయనతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం శశికళ పుష్ప ఢిల్లీలోగల ప్రభుత్వ బంగ్లాలో నివశిస్తున్నారు. ఇలావుండగా శశికళ పుష్పకు, ఆమె వద్ద న్యాయ సలహాదారుగా ఉన్న రామస్వామికి ఈనెల 26న వివాహం జరగనున్నట్లు వార్తలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలాఉండగా ఎంపీ శశికళ పుష్ప వివాహం చేసుకోనున్న రామస్వామి తనను మోసగించినట్లు యువతి సత్యప్రియ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తర్వాత కన్నీటితో విలేకరులకు వివరాలు తెలిపింది. ఢిల్లీలో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న రామస్వామికి తనకు 2014లో వివాహం జరిగిందని, వరకట్నంగా 90 సవర్ల బంగారు నగలు, సారె ఇచ్చినట్లు తెలిపారు. ఢిల్లీకి తీసుకువెళ్లి కుటుంబం నడిపిన రామస్వామి అదనపు కట్నం కోరుతూ వేధించాడని, తనను కోట్నం తేవాలని పుట్టింటికి పంపివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం తనను మోసగించి రెండో వివాహానికి సిద్ధపడినట్లు తెలిపింది. ఈ వివాహాన్ని అడ్డుకుని తనను భర్తతో కలపాలని కోరింది. దీనిపై సత్యప్రియ ఇచ్చిన ఫిర్యాదును మదురై కలెక్టర్ వీరరాఘవరావు పోలీసు కమిషనర్‌కు పంపారు. ఆయన ఉత్తర్వుల మేరుకు పోలీసులు ఢిల్లీలో ఉన్న రామస్వామి వద్ద విచారణ జరిపేందుకు నిర్ణయించారు. దీంతో వచ్చే 26న శశికళ పుష్ప పెళ్లి జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రామసామిపై కేసు:ఎంపీ శశికళ పుష్ప వ్యవహారంలో రామస్వామిపై కేసు నమోదు చేసేందుకు కోర్టు ఉత్తర్వులిచ్చింది. భర్త మోసం గురించి మదురై లీగల్ సెల్లో సత్యప్రియ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన లీగల్ సెల్ రామస్వామిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసులు దీనిపై కాలయాపన చేస్తున్నట్లు అభిప్రాయపడింది. -
ఎంపీ శశికళ పుష్పకు భారీ ఊరట
చెన్నై: లైంగిక వేధింపులు, హత్యకేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పకు భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు శశికళ కుటుంబంపై నమోదు అయిన కేసును బాధితులు ఎట్టకేలకు విత్ డ్రా చేసుకున్నారు. శశికళ భర్త లింగేశ్వర్ తిలకన్, ఆమె కుమారుడు ప్రదీప్ రాజా తనతో పాటు తన సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వారింట్లో పని చేసిన భానుమతి, ఝాన్సీరాణి అనే మహిళలు గతంలో తిరునల్వేలి జిల్లా తుత్తికుడి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తమను ఇంట్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టారని బాధితులు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శశికళ పుష్ప ... దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా గళం విప్పిన అనంతరం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పాటు, పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పనిమనుషులు భానుమతితో పాటు ఝాన్సీరాణి కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా లేఖ రాశారు. మరోవైపు రాజకీయంగా తనను, తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికే వేధింపుల పేరుతో కుట్ర పన్నారని శశికళ పుష్ప ఆరోపించారు. కాగా ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీని చెంపదెబ్బ కొట్టడంతో శశికళ పుష్ప పార్టీ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. -
'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు'
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడటంతో.. తమిళనాడులో అంతా దీపావళి చేసుకుంటున్నారని అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రౌడీయిజం, కుటుంబ పాలన ముగిసిపోయాయని అన్నారు. తమిళనాడు రాష్ట్రం ఇన్నాళ్లకు ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. తన మీద కూడా నాలుగైదు తప్పుడు కేసులు పెట్టించారని, వాటి నుంచి బయట పడేందుకు తాను క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశానని ఆమె తెలిపారు. శశికళా నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత తనను ఏనాడూ పక్కన పెట్టలేదని, ఆమెను అందరూ అభిమానిస్తారని తెలిపారు. ఆమె పేదల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం చాలా చేశారని, అందువల్ల ఆమె పట్ల ప్రతి ఒక్కరికీ అభిమానం ఉందని శశికళా పుష్ప అన్నారు. శశికళకు శిక్ష పడటం మీద ఏ ఒక్కరూ బాధపడటం లేదని, ఆమె చాలా పెద్ద క్రిమినల్ అని వ్యాఖ్యానించారు. తనలాగ ప్రతి ఒక్కరూ అమ్మకు విశ్వాస పాత్రులుగా ఉండటం ఆమెకు ఇష్టం లేదన్నారు. పన్నీర్ సెల్వం, మైత్రేయన్, పాండియన్ లాంటి చాలామంది పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డామని, తామందరినీ పక్కనపెట్టి శశికళా నటరాజన్ కుటుంబ రాజకీయాలు చేసిందని, ఆమె మీద గట్టిగా పోరాటం చేసిన మొట్టమొదటి నాయకురాలిని తానేనని, అందుకే తనను బహిష్కరించారని అన్నారు. ఇప్పుడు ఆమెకు శిక్షపడి, రాజకీయాలకు దూరం కావడం పట్ల తనలాంటి వాళ్లందరికీ చాలా సంతోషంగా ఉందని ఎంపీ శశికళా పుష్ప చెప్పారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు'
-
క్రిమినల్‌ను సీఎంగా ఎలా చేస్తారు?
నేర చరిత్ర ఉన్న శశికళా నటరాజన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారంటూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈనెల ఐదో తేదీన రాసిన లేఖలో శశికళకు ఉన్న క్రిమినల్ నేపథ్యం మొత్తాన్ని ఆమె ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, అన్నాడీఎంకే నాయకులంతా ఏకగ్రీవంగా శశికళా నటరాజన్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం తెలిసిందే. దాంతో చిన్నమ్మ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం మొత్తం సుగమమైంది. దాంతో ఆమె తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఈనెల 9వ తేదీని ముహూర్తంగా కూడా పెట్టుకున్నారు. జయలలిత అక్రమాస్తులకు సంబంధించిన కేసు సహా పలు కేసులలో శశికళ పేరు ఉంది. ఆ కేసులో జయలలిత నిర్దోషి అని కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. కానీ, మిగిలిన కేసులు మాత్రం చిన్నమ్మ మీద బాగానే ఉన్నాయని శశికళా పుష్ప అంటున్నారు. ఆమెను ముఖ్యమంత్రి చేస్తే.. రాజకీయ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని లేఖలో పేర్కొన్నారు. శశికళ అసలు పార్టీకి ఎలాంటి పని చేయలేదని, జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా శశికళను ఆమె ముఖ్యమంత్రి పదవికి సూచించకుండా.. పన్నీర్ సెల్వానికి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. శశికళ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఎక్కువవుతాయని, రాజకీయాల్లో నేరచరిత్ర పెచ్చుమీరుతుందని అన్నారు. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందని కూడా చెప్పారు. అందువల్ల శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆహ్వానించవద్దని ప్రధానమంత్రితో పాటు తమిళనాడు గవర్నర్‌ను కూడా తాను గట్టిగా కోరతున్నట్లు ఆమె చెప్పారు. -
జయలలిత మృతి కేసులో మళ్లీ కదలిక?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉందంటూ రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళా పుష్ప రాసిన లేఖపై కదలిక వచ్చింది. జయలలిత అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ శశికళా పుష్ప కేంద్ర హోం మంత్రికి ఓ లేఖ రాశారు. దాంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. సీబీఐకి సంబంధించిన వ్యవహారాలు చూసే సిబ్బంది వ్యవహారాల శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ పెర్సనెల్ అండ్ ట్రైనింగ్)కు ఈ విషయాన్ని అప్పగించింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ మణిరాం ఒక మెమొరాండం విడుదల చేశారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో శశికళా పుష్పకు తెలియజేయాల్సిందిగా కూడా అందులో పేర్కొన్నారు. -
పుష్పకు షాక్.. శశికళకు క్లియర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏఐఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పకు చుక్కెదురైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయని, ఆమె మృతిపై సీబీఐతో విచారించేలా ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఇలాంటివాటితో మరోసారి పిటిషనర్లు బలవంతపెడితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేసింది. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి దిశగా అడుగులేస్తున్న ఏఐఏడీంకే వర్కింగ్ ప్రెసిడెంట్ జయ నెచ్చెలి శశికళకు ఇక ఎలాంటి చిక్కులు లేనట్లయింది. జయలలిత చుట్టూ జరిగే అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని, అన్నీ ఓ పథకం ప్రకారం జరిగాయని, ఆమె మృతిపై పలువురికి అనుమానాలున్నాయని ఆరోపిస్తూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణ లేదా.. జ్యూడీషియల్ విచారణ జరగాలని ఆమె పిటిషన్లో కోరారు చేశారు. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయేవరకు జరిగిన వైద్యం గురించి వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆమెను చేర్పించిన ఆస్పత్రి నిరాకరించాయని కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. -
శశికళకు ఆ హక్కు లేదు
చెన్నై: అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప వేసిన పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ ప్రిసైడింగ్ చైర్మన్ మధుసూధనన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శశికళ పుష్ప అన్నాడీఎంకే పార్టీ సభ్యురాలు కాదని, పార్టీ వ్యవహారాలకు సంబంధించి కోర్టులో పిటిషన్ వేసే హక్కు ఆమెకు లేదని మధుసూదనన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. డీఎంకే ఎంపీతో గొడవ పడిన శశికళ పుష్పను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. కాగా జయలలిత మరణించిన తర్వాత ప్రస్తుత అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌పై శశికళ పుష్ప తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ అర్హురాలు కాదంటూ విమర్శించిన పుష్ప తాను ఆ పదవికి పోటీచేయనున్నట్లు ప్రకటించారు. పుష్ప తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమె భర్త లింగేశ్వర తిలగన్‌ను అన్నా డీఎంకే కార్యకర్తలు చితకబాదారు. ఈ సంఘటన తర్వాత తన భర్త ఆచూకీ తెలియట్లేదని పుష్ప హైకోర్టులో పిటిషన్ వేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ నియామకాన్ని అడ్డుకోవాలని కోరుతూ అంతకుముందు శశికళ పుష్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా, జయలలిత మృతి వెనుక రహస్యాలు బయటపెట్టాలంటూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. -
నా భర్త ఆచూకి తెలియడం లేదు: శశికళ పుష్ప
చెన్నై: తన భర్త కోసం ఉదయం నుంచి వెతుకుతున్నానని, ఇప్పటి వరకు ఆయన జాడ కనిపించలేదని బహిష్కత ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్ప అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తనకు తెలియడం లేదని, ఆయనపై చాలా దారుణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత మృతి వెనుక శశికళ హస్తం ఉందని ఆమె మరోసారి ఆరోపించారు. బుధవారం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మీటింగ్ వద్దకు శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగన్ నలుగురు న్యాయవాదులు వెళ్లారు. అయితే, అసలు ఎవరు శశికళ పుష్ప, మీరెవరూ అంటూ ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తలు అతడిపై వారిపై దాడి చేసి రక్తం కళ్ల చూశారు. ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులు గుప్పించారు. అనంతరం పోలీసులు వచ్చి వారిని విడిపించి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిన విషయం తెలిసినప్పటి నుంచి తన భర్త కోసం వెతుకుతున్నానని, ఆయన జాడ కనిపించలేదని అన్నారు. తాను ఇంకా అన్నాడీఎంకేలోనే ఉన్నానని, రేపటి సమావేశానికి హాజరవుతానని శశికళ చెప్పారు. మరోపక్క, జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆశా రంజన్‌కు బెదిరింపులు వచ్చాయి. ఆమె పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే ఆమెను చంపివేస్తామంటూ కొంతమంది బెదిరిస్తున్నారని ఆమె తరుపు న్యాయవాది కిస్లే పాండే చెప్పారు. -
నేనూ పోటీలో ఉంటా: శశికళ
న్యూఢిల్లీ: అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీలోని ప్రతి ప్రాథమిక సభ్యుడికి ఈ హక్కు ఉందని, పార్టీ నుంచి తనను బహిష్కరించలేదని, అన్నా డీఎంకే తరఫున ఎంపీగా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌కు వ్యతిరేకంగా శశికళ పుష్ప తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జయలలితను చంపేందుకు శశికళ నటరాజన్ ప్రయత్నించిందని, దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ బాధ్యతలు చేపడుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను పోటీలో ఉన్నట్టు శశికళ పుష్ప ప్రకటించారు. కాగా శుక్రవారం వచ్చే హైకోర్టు తీర్పును బట్టి తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పార్టీ పగ్గాలు శశికళ నటరాజన్‌కు అప్పగించడానికి పార్టీ కేడర్‌లో దాదాపు 75 శాతం మంది సంతోషంగా లేరని చెప్పారు. అంతేగాక ఆమె పార్టీలో సభ్యురాలు కాదని అన్నారు. -
జయలలిత.. ఇద్దరు శశికళలు
చెన్నై: జయలలిత ఆశీస్సులతో ఇద్దరు మహిళల జీవితాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒకరికి ఏకంగా తన ఇంట్లో స్థానం కల్పించగా, మరొకరిని రాజ్యసభకు పంపారు. ఆ ఇద్దరు మహిళలే శశికళ నటరాజన్, శశికళ పుష్ప. కాగా కారణాలేంటో కానీ ఈ ఇద్దరు శశికళలకు అసలు పడటం లేదు. శశికళ నటరాజన్‌తో జయలలిత స్నేహం గురించి అందరికి తెలిసిన విషయమే. అన్నా డీఎంకేలో జయ తర్వాత శశికళే అన్నట్టుగా ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక తమిళనాడులోని తుత్తుకుడి మేయర్‌గా ఎన్నికైన శశికళ పుష్ప.. అమ్మ అనుగ్రహంతో 2014లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. జయలలితకు శశికళ పుష్ప వీరవిధేయురాలు. గతంలో పోయెస్ గార్డెన్లో ఈమెకు ప్రవేశం ఉండేది. అయితే గత ఆగస్టులో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డీఎంకే ఎంపీ తిరుచి శివను శశికళ పుష్ప చెంపదెబ్బ కొట్టడం, ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో జయలలిత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో రాజ్యసభలో కంటతడి పెట్టిన శశికళ పుష్ప.. జయలలిత పేరును ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశారు. తనకు తమిళనాడులో ప్రాణభయం ఉందని, రక్షిణ కల్పించాల్సిందిగా కోరారు. కొన్ని రోజుల తర్వాత జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాక ఈ విషయం మరుగనపడింది. శశికళ వర్సెస్ శశికళ: ఇద్దరు శశికళలకు వైరం నడుస్తోంది. అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాక శశికళ పుష్ప.. శశికళ నటరాజన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జయలలిత పేరు చెప్పి నటరాజన్ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారని, అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ శశికళ నటరాజన్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. జయలలితను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని, అమ్మ ఆరోగ్య పరిస్థితిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం జయలలితకు హాని తలపెట్టేందుకు శశికళ నటరాజన్ కుట్రపన్నారని మరో బాంబు పేల్చారు. కాగా శశికళ పుష్ప తీవ్రమైన ఆరోపణలు చేసినా శశికళ నటరాజన్ స్పందించలేదు. ఇద్దరు శశికళలకు మంచి జీవితాన్ని ప్రసాదించిన జయలలిత ఇప్పుడు లేరు కానీ వారి మధ్య శత్రుత్వం మాత్రం ఉంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేలో శశికళ కుటుంబ సభ్యులు, ఇతర నాయకుల మధ్య నాయకత్వ పోరు జరగనుందని, పార్టీలో చీలిక తప్పదని కొందరు చెబుతున్నారు. -
’అమ్మ బతికుందో లేదో చెప్పాలి’: శశికళ పుష్ప
-
బాంబు పేల్చిన శశికళ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప పెద్ద బాంబు పేల్చారు. ''ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్న కొంతమంది వ్యక్తులు'' అంటూ జయలలిత సన్నిహితురాలు శశికళను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. సుమారు గత 18 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసి, అన్నాడీఎంకే పార్టీకి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీని నియమించాలనుకుంటున్నారని ఆమె తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు కూడా వాళ్లు కుట్ర పన్నుతున్నారన్నారు. అందువల్ల జయలలిత నుంచి అధికారికంగా ఏదైనా లేఖ వస్తే మాత్రం అందులో ఆమె సంతకాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేయాలని గవర్నర్‌ను ఆమె కోరారు. ఈ విషయంలో గానీ, మరేదైనా విషయంలో గానీ జయలలిత నుంచి ఎలాంటి లేఖలు వచ్చినా సంతకాలు జాగ్రత్తగా చూడాలని విజ్ఞప్తి చేశారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఏ ఒక్కరినీ ఆమెను చూసేందుకు అనుమతించలేదు. కేవలం వైద్యులతో మాత్రమే మాట్లాడనిచ్చారు. చివరకు జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్, మేనకోడలు దీప కూడా జయలలిత వద్దకు వెళ్లలేకపోయారు. కానీ, జయ సన్నిహితురాలు శశికళ మాత్రం.. ఇన్నాళ్లుగా ఐసీయూలోనే ఆమె పక్కనే ఉంటున్నారు. దీనిపైనే రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
భద్రత కరువు
సాక్షి, చెన్నై: రాజకీయాల్లోకి మహిళలు రావడం అంతంత మాత్రమేనని, వచ్చినా భద్రత కరువు అవుతోందనడానికి తానే నిదర్శనమని అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో రూపంలో బెదిరింపులు ఇస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తగ్గేది లేదని, తాను పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి , సీఎం జయలలిత ఆదేశాలను ధిక్కరించి రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్న శశికళ పుష్పకు దడ పుట్టించే రీతిలో రాష్ట్రంలో ప్రయత్నాలు సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు పోలీసు స్టేషన్లలో హోరెత్తుతున్నాయి. అదే సమయంలో తూత్తుకుడిలోని ఆమె ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు పిల్లలు ఇచ్చిన లైంగిక దాడి ఫిర్యాదు శశికళ పుష్పా గుండెల్లో గుబులు రేపింది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు శశికళ పుష్పా, ఆమె భర్త లింగేశ్వర తిలకం, తనయుడు ప్రదీప్ రాజా, తల్లి గౌరీ ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో పడ్డారు. మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయడం, ఇందుకు ప్రభుత్వం తరఫున ఆక్షేపణ వ్యక్తం కావడం వెరసి కోర్టుకు రావాలని న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. కోర్టుకు హాజరైన పక్షంలో అరెస్టు చేస్తారన్న భయంతో చివరకు సుప్రీంకోర్టు ద్వారా ప్రత్యేకంగా స్టే తెప్పించుకుని మరీ మధురై ధర్మాసనంలో హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రత కరువు: అరెస్టుల భయంతో సింగపూర్ చెక్కేసిన శశికళ పుష్పాకు సుప్రీంకోర్టు అండగా నిలవడంతో మధురైలో అడుగు పెట్టేందుకు నిర్ణయించారు. ఆగమేఘాలపై ఆదివారం రాత్రి చెన్నైకు చేరుకుని సోమవారం ఉదయాన్నే మధురైలో ప్రత్యక్షమయ్యారు. కోర్టు విచారణకు హాజరై తన వాదన వినిపించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను వేధించడమే లక్ష్యంగా పనిగట్టుకుని మరీ ఫిర్యాదులు, కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి మహిళలు రావడం అంతంత మాత్రంగానే ఉందని, వచ్చినా భద్రత లేదనేందుకు తానే నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఏ విధంగా హింసిస్తున్నారో, బెదిరిస్తున్నారో, హెచ్చరిస్తున్నారో తనకు మాత్రమే తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎంపీకే భద్రత కరువైనప్పుడు, ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఏ పాటిదో అర్థం అవుతుందన్నారు. పోలీసులే స్వయంగా బెదిరిస్తున్నారని, కేసులు పెడుతామని, ఇంటి చుట్టు తిరుగుతున్నారని మండి పడ్డారు. తన కుటుంబాన్ని వేధించినా, తన మీద ఎన్నికేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాజ్యసభ పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు ఇక్కడ ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ రాజ్య సభ దృష్టికి తీసుకెళ్తాననన్నారు. -
ఎంపీ పదవికి రాజీనామా చేయనే చేయను!
అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప మరోసారి ధిక్కార స్వరాన్ని వినిపించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె రాజ్యసభ సభ్యత్వం నుంచి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం సింగపూర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ శశికళ పుష్పపై, ఆమె కుటుంబసభ్యులపై ఇద్దరు పనిమనుష్యులు లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. అయితే, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను బాహాటంగా ధిక్కరించడంతోనే తనపై కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ ఆమె మద్రాస్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇప్పటికే రాజీనామా చేయాలని జయలలిత అల్టిమేటం ఇచ్చినప్పటికీ, తాను రాజ్యసభ పదవి నుంచి దిగిపోనని ఆమె స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ పదవికి రాజీనామా చేయబోనని తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ విషయమై సోమవారం ఆమె మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఎదుట హాజరై తన వాదనలు వినిపించారు. -
అరెస్టు నుంచి మరో 6 వారాలు మినహాయింపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టు నుంచి మరో ఆరు వారాలు మినహాయింపునిస్తూ ఆదేశాలిచ్చింది. పుష్ప ఇంట్లో పనిచేసే ఇద్దరు.. తమపై ఆమె లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు దాఖలుచేశారు. ఈ కేసులో ఎంపీతో పాటు ఆమె భర్త, కొడుకును ఆగస్టు 22 వరకు అరెస్టు చేయొద్దని ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ హైకోర్టు గతంలో సూచించింది. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీని చెంపదెబ్బ కొట్టినందుకు శశికళను అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 'అమ్మ' జయలలిత ఆగ్రహానికి గురైన ఆమె సొంత రాష్ట్రం తమిళనాడుకు వెళ్లకుండా ఢిల్లీలోనే ఉంటున్నారు. -
జయలలిత పార్టీపై విరుచుకుపడ్డ శశికళ
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే నుంచి బహిష్కణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే పార్టీని బానిసల గుంపు(స్లేవ్ గ్యాంగ్)గా వర్ణించారు. బానిసల గుంపులో భాగం కావాలనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తనను వేధిస్తే నాడార్ సామాజిక వర్గం ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు. 'నేను నాడార్ కులానికి చెందిన దాన్ని. భయపడేది లేదు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. నాకు అండగా నా కులం నిలుస్తుంది. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లోని బలమైన కమ్యునిటీల్లో నాడార్ కులం ఒకట'ని పుష్ప అన్నారు. మరోవైపు అమ్మ ఆజ్ఞను ధిక్కరించిన శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తున్నది. ఆమెను ఉక్కిరి బిక్కిరిచేస్తూ ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. గతంలో శశికళ పుష్ప ఇంట్లో పనిచేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులు హోరెత్తుతుండడంతో ఆత్మరక్షణలో పడ్డ శశికళ పుష్ప, ఇక తమిళనాట న్యాయం జరగదని భావించి ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
శశికళపై కేసు
తూత్తుకుడి: అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ వారి ఇంట్లో పనిచేసే 22 ఏళ్ల యువతి కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శశికళ భర్త టి. లింగేశ్వర్ తిలకన్, ఆమె కుమారుడు ఎల్. ప్రదీప్ రాజా.. తనతో పాటు తన సోదరిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని తెలిపింది. తిరునల్వేలి జిల్లాలోని అనైకుడి ప్రాంతానికి చెందిన బాధితురాళ్లు చెన్నైలోని శశికళ నివాసం నుంచి 2015లో పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తమపై కోపం పెంచుకుని తమను వేధించేవారని ఫిర్యాదులో బాధితురాళ్లు పేర్కొన్నారు. శశికళ, ఆమె భర్త, ఆమె తల్లి తమను పలుమార్లు కొట్టారని వెల్లడించారు. తెల్లకాగితాలపై తమతో సంతకాలు పెట్టించుకున్నారని, దీని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీని చెంపదెబ్బ కొట్టినందుకు శశికళను అన్నాడీఎంకే పార్టీ పదవుల నుంచి అధినేత్రి జయలలిత సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
శశికళపై జయలలిత వేటు
-
రాజ్యసభలో మహిళా ఎంపీ కన్నీరుమున్నీరు
-
శశికళపై జయలలిత వేటు
అన్నాడీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్పపై పార్టీ అధినేత్రి జయలలిత వేటు వేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడమే కాక, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే.. రాజీనామా చేయడానికి తిరస్కరించిన శశికళ.. నేరుగా ఢిల్లీ వెళ్లి రాజ్యసభ సమావేశాల్లో పాల్గొనడమే కాక, అక్కడ కన్నీరు కూడా పెట్టారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను.. అన్నాడీఎంకే ఎంపీ శశికళ చెంపమీద కొట్టిన విషయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులే. పార్టీ పరువుకు భంగం కలిగించేలా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వ్యవహరించారంటూ శశికళపై జయలలిత మండిపడ్డారు. ఆదివారం నాడు పోయస్ గార్డెన్స్‌కు వెళ్లి వివరణ ఇచ్చినా ఆమె శాంతించలేదు. పార్టీ నుంచి వచ్చింది కాబట్టి రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేయాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. -
రాజ్యసభలో మహిళా ఎంపీ కన్నీరుమున్నీరు
అన్నాడీఎంకే పార్టీకి చెందిన మహిళా ఎంపీ రాజ్యసభలో కన్నీరుమున్నీరయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను చెంప మీద ఎడాపెడా కొట్టిన ఆమె.. తన ప్రాణాలకు ముప్పుందని, తమిళనాడులో తనకు రక్షణ లేదని, అందువల్ల రక్షణ కల్పించాలని కోరుతూ రాజ్యసభలో కన్నీరుపెట్టారు. శనివారం నాడు ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు ఎంపీలు గొడవపడి, కొట్టుకున్న తర్వాత.. పార్టీ అధినేత్రి జయలలిత వద్దకు వెళ్లి ఆమె జరిగిన విషయం గురించి చెప్పారు. అయితే.. పార్టీ పరువును బజారుకు ఈడ్చారంటూ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాక, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలని జయలలిత ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. (చదవండి: డీఎంకే ఎంపీకి చెంపదెబ్బలు) అదే విషయాన్ని ఆమె పరోక్షంగా రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. తన ప్రాణాలకు ముప్పుందని, తనకు ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి నుంచి రాజీనామా చేయాల్సిందిగా బలవంతం చేస్తున్నారని.. అయితే తాను మాత్రం రాజీనామా చేసేది లేదని ఆమె సభలో చెప్పారు. విమానాశ్రయంలో జరిగిన చిన్న గొడవను డీఎంకే ఎంపీ అనవసరంగా పెద్దది చేశారని, సోషల్ మీడియాలో కూడా తన పరువు తీసేలా వ్యవహరించారని అన్నారు. మహిళా ఎంపీ అయిన తనను ఇలా వేధిస్తుంటే ఇక తమకు రక్షణ ఎక్కడ ఉంటుందని అడిగారు. తమిళనాడులో తనకు రక్షణ లేనందున తగినంత భద్రత కల్పించాలని కోరారు. ఒక నేత తనను చెంపమీద కొట్టారని చెప్పిన ఆమె.. ఎవరు కొట్టారో మాత్రం చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచే తన ప్రాణాలకు ముప్పుందని అన్నారు. సభ్యులందరికీ చైర్మన్ రక్షణ కల్పిస్తారని, అలాగే మీకు కూడా రక్షణ ఇస్తారని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అన్నారు. అయితే సభకు వచ్చి సమాధానం చెప్పుకునే అవకాశం లేనివాళ్ల పేర్లు మాత్రం ప్రస్తావించొద్దని తెలిపారు. కావాలనుకుంటే చైర్మన్‌కు ఒక లేఖ రాసి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరవచ్చన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు సహా ప్రతిపక్ష ఎంపీలు ఒక్కసారిగా లేచి.. తోటి సభ్యురాలి ఆవేదన ఏంటో వినాలని నినాదాలు చేశారు. -
డీఎంకే ఎంపీకి చెంపదెబ్బలు
తిరుచ్చి శివను నాలుగు దెబ్బలు కొట్టానన్న అన్నాడీఎంకే ఎంపీ శశికళ * కాదు ఒక్కటేనన్న శివ * ఢిల్లీ విమానాశ్రయంలో ఘటన సాక్షి, చెన్నై: ఢిల్లీ విమానాశ్రయం వేదికగా చెంపలు పగులగొట్టేలా గొడవకు దిగిన డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీల వ్యవహారం తమిళనాడులో దుమారం రేపింది. డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, అన్నాడీఎంకేకు చెందిన శశికళ పుష్ప రాజ్యసభ సభ్యులు. ఇటీవల శివ, శశికళ సన్నిహితంగా ఉండే ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై రాష్ట్రంలో చర్చ జరిగింది. ఇది సద్దుమణగకముందే వీరిద్దరు గొడవ పడ్డారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చేందుకు శివ, శశికళ వేర్వేరుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఢిల్లీ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే గొడవ చోటు చేసుకుంది. తమ అమ్మ (జయలలిత)ను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమానాశ్రయ సెక్యూరిటీ వద్ద శివ అవహేళనగా వ్యాఖ్యలు చేయడంతో తాను నాలుగుసార్లు ఆయన చెంప పగలగొట్టినట్టు శశికళ చెప్పారు. దీంతో ఆగ్రహించిన శివ అనుచరులు తన ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో ఇద్దరు ఎంపీలు తమ పార్టీ అధిష్టానాలకు వివరణ ఇచ్చుకున్నారు. పనిగట్టుకుని గొడవ పడ్డారు.. శివ: విమానాశ్రయ సిబ్బంది తనకు మర్యాద ఇచ్చి, ఆమెకు ఇవ్వలేదన్న అసూయతోనే శశికళ పనిగట్టుకుని తనతో గొడవ పడ్డారని శివ చెప్పారు. చెన్నైకి వచ్చేందుకు బోర్డింగ్ పాస్ తీసుకుని, అత్యవసర పనిపడటంతో దాన్ని రద్దు చేసుకుని బయటకు తిరిగి వస్తున్నప్పుడు తన చొక్కా లాగి మరీ ఓ చెంప దెబ్బ కొట్టారని తెలిపారు. మహిళా ఎంపీ కావడంతో తాను కనీసం వాగ్యుద్ధానికీ దిగలేదని, భద్రతా సిబ్బంది సూచనతో బయటకు వచ్చేశానని చెప్పారు. తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఉద్దేశించి విమర్శలు, ఆరోపణలు చేసి ఉంటే, ఇలా బహిరంగంగా కొట్టే సంస్కృతి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంకే చీఫ్ కరుణానిధికి శిశ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఇక, శశికళ పోయెస్ గార్డెన్‌కు చేరుకుని సీఎం, తమ పార్టీ అధినేత్రి జయలలితకు వివరణ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా చుట్టుముట్టగా ఆమె మౌనంగా వెళ్లిపోయారు.