టీ.నగర్: అన్నాడీఎంకే నుంచి తొలగించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప (41) తన భర్త లింగేశ్వర తిలకన్‌తో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా ఆయనతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం శశికళ పుష్ప ఢిల్లీలోగల ప్రభుత్వ బంగ్లాలో నివశిస్తున్నారు. ఇలావుండగా శశికళ పుష్పకు, ఆమె వద్ద న్యాయ సలహాదారుగా ఉన్న రామస్వామికి ఈనెల 26న వివాహం జరగనున్నట్లు వార్తలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలాఉండగా ఎంపీ శశికళ పుష్ప వివాహం చేసుకోనున్న రామస్వామి తనను మోసగించినట్లు యువతి సత్యప్రియ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తర్వాత కన్నీటితో విలేకరులకు వివరాలు తెలిపింది.
ఢిల్లీలో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న రామస్వామికి తనకు 2014లో వివాహం జరిగిందని, వరకట్నంగా 90 సవర్ల బంగారు నగలు, సారె ఇచ్చినట్లు తెలిపారు. ఢిల్లీకి తీసుకువెళ్లి కుటుంబం నడిపిన రామస్వామి అదనపు కట్నం కోరుతూ వేధించాడని, తనను కోట్నం తేవాలని పుట్టింటికి పంపివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం తనను మోసగించి రెండో వివాహానికి సిద్ధపడినట్లు తెలిపింది. ఈ వివాహాన్ని అడ్డుకుని తనను భర్తతో కలపాలని కోరింది. దీనిపై సత్యప్రియ ఇచ్చిన ఫిర్యాదును మదురై కలెక్టర్ వీరరాఘవరావు పోలీసు కమిషనర్‌కు పంపారు. ఆయన ఉత్తర్వుల మేరుకు పోలీసులు ఢిల్లీలో ఉన్న రామస్వామి వద్ద విచారణ జరిపేందుకు నిర్ణయించారు. దీంతో వచ్చే 26న శశికళ పుష్ప పెళ్లి జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
రామసామిపై కేసు:ఎంపీ శశికళ పుష్ప వ్యవహారంలో రామస్వామిపై కేసు నమోదు చేసేందుకు కోర్టు ఉత్తర్వులిచ్చింది. భర్త మోసం గురించి మదురై లీగల్ సెల్‌లో సత్యప్రియ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన లీగల్ సెల్ రామస్వామిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసులు దీనిపై కాలయాపన చేస్తున్నట్లు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment