
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప(41) దేశరాజధానిలో సోమవారం న్యాయవాది రామస్వామిని వివాహమాడారు. భర్త లింగేశ్వరతో విభేదాలు తలెత్తడంతో ఆమెకు గతంలో విడాకులు మంజూరయ్యాయి. రామస్వామిని వివాహం చేసుకునేందుకు పుష్ప ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఆయన భార్య సత్యప్రియ తెర మీదకు వచ్చారు.
రామస్వామితో తనకు గతంలోనే పెళ్లయిందనీ, తామిద్దరికీ రిజుస్న అనే కుమార్తె ఉన్నట్లు వారంరోజుల క్రితం హైకోర్టు మదురై ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సత్యప్రియ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణ ముగిసేవరకూ రామస్వామి ఎవర్నీ వివాహం చేసుకునేందుకు వీలులేదని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామస్వామి, శశికళ పుష్ప సోమవారం వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment