ramaswamy
-
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
వివేక్‌తో విందుకు ఫీజు 50 వేల డాలర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి మాట్లాడుకుంటూ విందారగించాలనుకుంటున్నారా? అలాగైతే సుమారు రూ.42 లక్షలు చెల్లిస్తే చాలు..! సిలికాన్ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు కొన్ని వివేక్కి ఎన్నికల ప్రచార నిధులను సేకరించి పెట్టేందుకు ఈ నెల 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి. ఇందులో వివేక్‌తోపాటు పాల్గొనాలనుకునే వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని రూ.41.47 లక్షలు (50 వేల డాలర్లు)గా ఖరారు చేశారు. విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఇన్వెస్టర్, సోషల్ కేపిటల్ సంస్థ సీఈవో చమత్ నివాసంలో ఈ విందు జరగనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో అగ్రస్థానంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి నిలిచిన విషయం తెలిసిందే. -
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్‌తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
US Presidential Elections: మూడొంతుల మందిని సాగనంపుతా!
వాషింగ్టన్: తాను అధ్యక్షుడినైతే అమెరికా ప్రభుత్వంలోని ముప్పావు వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యరి్థత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. భారతీయ మూలాలున్న వివేక్.. అమెరికన్ వార్తా వెబ్సైట్ యాక్సియస్కు ఇచి్చన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ రిపబ్లికన్ పార్టీ అభ్యరి్ధత్వం సాధించి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటే వెంటనే నా పని మొదలుపెడతా. దేశవ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా. ఇన్ని లక్షల మంది సిబ్బంది అమెరికా సర్కార్‌కు పెనుభారం. ఇక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వంటి ప్రధాన దర్యాప్తు సంస్థలను మూసేస్తా. విద్య, ఆల్కాహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, అణు నియంత్రణ కమిషన్, అంతర్గత ఆదాయ సేవలు, వాణిజ్య శాఖల ప్రక్షాళనకు కృషిచేస్తా. అధ్యక్షుడిగా తొలి ఏడాది పూర్తయ్యేలోపు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతా. మిగతా సగం మందిలో 30 శాతం మందితో వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయిస్తా. ఇందులో అనుమానమేమీ లేదు. పిచి్చపని అస్సలుకాదు’ అని 38 ఏళ్ల వివేక్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 22.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతం మందిని అంటే దాదాపు 16 లక్షల మందిని వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగాల నుంచి తీసేస్తానని వివేక్ లెక్కచెప్పారు. ఇన్ని లక్షల మందిని తీసేస్తే ప్రభుత్వంపై వేతన భారం భారీగా తగ్గుతుందని ఆయన అభిప్రాయం. -
వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యక్షునిగా రామస్వామి బలమైన అభ్యర్థి కాగలడని, మంచి మనిషి అని పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి ఆమోదం తెలుపనున్నారనే సందిగ్ధంలో ఆయన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వివేక్ మంచి మనిషి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతని వద్ద మంచి మేధాశక్తి ఉంది. ఏదో మంచి మార్పును తీసుకురాగలడు. నా కంటే గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఎవరైనా నన్ను బెస్ట్ అధ్యక్షునిగా గుర్తిస్తే.. నేను అతనిలా ఉంటాను' అని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్‌ను 21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్‌గా రామస్వామి అభివర్ణించారు. ఈ మాటలు రామస్వామికి ఎంతో ఆధరణను ఇచ్చాయని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు వివేక్ రామస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామస్వామికి ట్రంప్ ఆమోదం తెలపడం వచ్చే ఎన్నికల్లో మంచి ఊపునిచ్చే అంశమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’.. తీవ్ర పదజాలంతో ట్రంప్ దూషణ -
‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా ఎలాన్ మస్క్ (Elon Musk)ను కోరుకుంటానని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. లోవాలోని టౌన్ హాల్లో రామస్వామి మాట్లాడుతూ తన సంభావ్య అధ్యక్ష పదవికి సలహాదారులుగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)ని స్వాధీనం చేసుకున్న తర్వాత గత సంవత్సరం ఆ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలగింపు చర్యను వివేక్ రామస్వామి మెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ‘ఎలాన్ మస్క్ ఇటీవల చాలా మెరుగవడం సంతోషంగా ఉంది. నాకు అతన్ని కీలక సలహాదారుగా కోరుకుంటున్నా. ఎందుకంటే అతను ట్విటర్లో 75 శాతం మందిని తొలగించాడు’ అని రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ న్యూస్ కథనం వివరించింది. గతంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్ ఇటీవల వికేక్ రామస్వామిని ఆశాజనక అభ్యర్థిగా భివిస్తున్నట్లు చెప్పాడు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పిన్న వయస్కుడైన రామస్వామి.. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్. ప్రభుత్వంలో విద్యా శాఖ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోసివ్స్ను మూసివేయాలని తాను కోరుకుంటున్నట్లు రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ నివేదిక వివరించింది. 38 ఏళ్ల వివేక్ రామస్వామి 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న అమెరికన్లలో ఒకరు. యేల్ నుంచి న్యాయ పట్టా పొందే ముందు హార్వర్డ్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసించారు. ఫోర్బ్స్ ప్రకారం, కొంతకాలం బిలియనీర్‌గా ఉన్న ఆయన సంపద స్టాక్ మార్కెట్ తిరోగమనంతో 950 మిలియన్ డాలర్లకు పడిపోయింది. -
భారత్‌తో బంధాలు బలపడితే చైనాపై ఆధారపడనక్కర్లేదు
లోవా: భారత్‌తో అమెరికా బంధాలు మరింత బలపడితే చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాల్ని భారత్‌తో పటిష్టం చేసుకుంటే చైనా నుంచి దూరం కావచ్చునని వ్యాఖ్యానించారు. 38 ఏళ్ల వయసున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో నిలిచిన వారిలో పిన్న వయసు్కడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ బరిలో ముందున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన లోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న వివేక్ రామస్వామి పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘చైనాపై అమెరికా ఆర్థికంగా ఆధారపడి ఉంది. భారత్‌తో సంబంధాలు బలపడితే చైనాతో బంధాల నుంచి బయటపడవచ్చు’ అని రామస్వామి వివరించారు. ‘అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాలు సహా భారత్‌తో అమెరికాకు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావాలి. పశి్చమాసియా దేశాల నుంచి చైనాకు చమురు సరఫరా అవుతున్న మలక్కా జలసంధిని భారత్ అడ్డుకోగలదన్న విషయం మనకు తెలిసుండాలి. ఇరు దేశాల బంధాల బలోపేతానికి ఇవే కీలకం. అదే జరిగితే అమెరికాకు మంచే జరుగుతుంది. ఆ దిశగా నేను ముందుకు వెళతాను’ అని రామస్వామి చెప్పారు. మొదటిసారిగా భారతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ భారత ప్రధాని మోదీ మంచి నాయకుడని ప్రశంసించారు. మోదీతో కలిసి ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేసే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. -
US Presidential ElectionIns 2024: ట్రంప్‌తో కలిసి పోటీ పడడానికి సిద్ధమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. బ్రిటన్‌కు చెందిన జిబి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్‌కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్‌హౌస్‌లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
US Presidential Elections 2024: నువ్వా X నేనా?
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్‌ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు. ► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది. అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు. ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్‌ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా భద్రతే ముఖ్యం.. ► ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్‌కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్‌రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది. ఎవరీ వివేక్ రామస్వామి ? కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్‌గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి.. ‘అమెరికా ఈ పరిస్థితికి చరమగీతం పాడదాం’
వాషింగ్టన్: భారతీయ మూలాలున్న అమె రికన్ యువ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్ కావడం విశేషం. 37 ఏళ్ల వివేక్ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడం తెల్సిందే. ‘అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్‌న్యూస్ ప్రైమ్‌టైమ్ షో సందర్భంగా వివేక్ వ్యాఖ్యానించారు. వివేక్ 2014లో రోవంట్ సైన్సెస్‌ను స్థాపించారు. హెల్త్‌కేర్, టెక్నాలజీ సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థనూ నెలకొల్పారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగాలంటే ముందుగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరో ఒకరు రిపబ్లిక్ పార్టీలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గాలి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్ ఐదో తేదీన జరుగుతాయి. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలాహ్యారిస్, ఈసారి నిక్కీ హేలీ తర్వాత అధ్యక్ష ఎన్నికలకు దిగిన నాలుగో ఇండో–అమెరికన్ వివేక్ రామస్వామికావడం విశేషం. -
కరోనా కిల్లర్ @103
హఫీజ్‌పేట్(హైదరాబాద్): భయపడకుండా, తగిన జాగ్రత్తలతో ఎదుర్కొంటే కోవిడ్‌ను సులభంగా జయించవచ్చని నిరూపించాడు మరో శతాధిక వృద్ధుడు. నగరంలోని కొండాపూర్‌లో ఉన్న సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో పరుచూరి రామస్వామి (103) ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట ఆయన కోవిడ్ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం ఆయన్ని నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందించిన చికిత్సతో రామస్వామి కోలుకొని తిరిగి వృద్ధాశ్రమానికి క్షేమంగా చేరుకున్నారు. సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రామస్వామిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కోవిడ్ చికిత్సకు ప్రభుత్వాసుపత్రులే అ త్యుత్తమం. ఫౌండేషన్‌లో 26 మందికి కోవిడ్ సోకింది. వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు’ అని చెప్పారు. -
గాంధీ పటానికి మాలలు వేసి పూజలు చేశారు
మహాఘటనలకు సాక్షీభూతాలుగా నిలిచివారి నుంచి ఆ జ్ఞాపకాన్ని వినడం కూడా ఉత్తేజభరితమే. 1947... ఆగస్టు 14 అర్ధరాత్రి. ఆ దేశం ఒక మహా ఘటనను వీక్షించింది. స్వేచ్ఛావాయువులు వీచబోయే ప్రభాతకిరణాలకు చేతులు సాచింది. నాటి జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకున్నవారు అన్నవరపు రామస్వామి (95). శివరాజు సుబ్బలక్ష్మి (95). మళ్లీ ఆ ఉద్విగ్న క్షణాలను మన ముందుకు తెస్తున్నారు. 1947, ఆగస్టు 15.. భారతజాతి దాస్య శృంఖలాలు తెంచుకున్న రోజు. అందరికీ పెద్దపండుగ. ఈ పండుగకు ప్రధాన కారకులు గాంధీగారేనని అందరికీ తెలిసిందే. అప్పుడుS నా వయసు 22 సంవత్సరాలు. ఆ పండుగలో నేనూ భాగమయ్యాను. ఒక పేటలో ఉన్నవారంతా ఒకచోట చేరి సంబరంగా వేడుకలు చేసుకున్నారు. బుడబుక్కలవాళ్లు ఎంతో ఉత్సాహంగా ఇల్లిల్లూ తిరుగుతూ స్వాతంత్య్రం గురించి అందంగా మాటలు చెప్పారు. పిల్లలంతా ఒకచోట చేరి పద్యాలు, పాటలు పాడారు. పనిపాటలు చేసేవారంతా ఒక మాస్టారుని నియోగించుకుని ముందురోజు రాత్రి సాధన చేసి, స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటన తెలిసిన వెంటనే డప్పులు వాయించారు, నాటకాలు వేశారు. ఎవరికి వారే ‘హమ్మయ్య స్వతంత్రం వచ్చింది’ అంటూ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటింటా గాంధీగారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. కవులంతా కవిత్వం రాసి, గేయంలా పాడారు. ఆ రోజు గుంటూరులో మహావిద్వాంసులైన మహాద్రి వెంకటప్పయ్య శాస్త్రి (మా ముందు తరం) గారి కచేరీ ఏర్పాటు చేశారు. మేమంతా ఆ కచేరీకి హాజరయ్యాం. ఆ రోజు అక్కడకు వచ్చిన వారిలో ఎవరి ముఖాలలో చూసినా ఆనందమే వెల్లివిరిసింది. అప్పట్లో విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఇంకా రాలేదు. మద్రాసు నుంచి ఆంధ్రపత్రిక మాత్రమే వచ్చేది. ఆ పత్రిక వచ్చిన తరవాతే సమాచారం తెలిసేది. అవి అతి విలువైన రోజులు. ప్రతి విషయానికీ విలువ ఇచ్చేవారు. అప్పటి మాటల్లో ఒక జీవం, పవిత్రత ఉండేవి. ప్రతివారి మాటలకు విలువ ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉండేది. వారే మన దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారు. నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి అంటే 1948 డిసెంబరు 1వ తేదీ నుంచి పదవీ విరమణ వరకు పనిచేశాను. ఆనాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఎంతో సంతోషాన్నిస్తుంటాయి. – అన్నవరపు రామస్వామి (95), ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, విజయవాడ -
ఆ వాయులీనం.. శ్రోతలకు పరవశం!
సాక్షి, తెనాలి(గుంటూరు) : ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిగాన రసం ఫణిః’ సంగీతం విశిష్టతకు ఇంతకుమించి మరో మాట అవసరం లేదు. సంగీతం వేదస్వరూపిణి, పాపనాశని, దైవదర్శిని, ఆనందవర్ధని, మోక్షప్రదాయిని అని సంగీతకారులు ప్రణమిల్లుతారు. ఇంతటి ఉత్కృష్టమైన సంగీత కళాకారులకు నిలయం కృష్ణాతీరం. వారిలో విజయవాడకు చెందిన ‘నాద సుధార్ణవ’ అన్నవరపు రామస్వామి ప్రసిద్ధులు. 94 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ సంగీత సాధన చేయటమే కాదు.. వాయులీన విద్యతో రసజ్ఞులను మైమరపింపజేస్తున్నారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో సంగీతాభిమానులకు ఆ వాద్యగాన విందు లభించనుంది. ‘గాన విదూషి’ గద్దె వేంకట రామకుమారి చతుర్ధ వర్ధంతి సంగీత ఉత్సవంలో అన్నవరపు రామస్వామి శాస్త్రీయ వాయులీన వాద్య సంగీత కచేరీ జరగనుంది. వయొలిన్‌పై బీవీ దుర్గాభవాని, హేమాద్రి చంద్రకాంత్, మృదంగంపై పీఎస్ ఫల్గుణ్, ఘటంపై కేవీ రామకృష్ణ సహకారం అందిస్తారు. సంగీత సాధనకు ఎన్నో కష్టాలు వయొలిన్ లేని సంగీతం లేదంటే అతిశయోక్తి కాదు. వాయులీన విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొంది అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను స్వీకరించిన అన్నవరపు రామస్వామిది సంగీత కుటుంబం. యుక్తవయసులో సంగీత సాధనకు ఎన్నో కష్టాలు అనుభవించారు. వారాలు చేసుకుంటూ గురుకుల పద్ధతిలో గురువు శుశ్రూష చేసుకుంటూ సంగీతాన్ని నేర్చారు. ఒకోసారి భోజనం కోసం ఆరోజు వంతు ఇంటికి వెళితే, తాళం వేసి వుండేదట! చేసేదిలేక నిట్టూర్చుకుంటూ నీరసంతో తిరిగొస్తూ దారిలోని చేతిపంపు నీరు కడుపునిండా తాగి, గురువు ఇంటికి చేరుకునేవారు. సంగీత విద్వాంసుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి సంగీత శిక్షణ పొందారు. సప్తస్వరాలను పలికించటంలో.. బాలమురళీకృష్ణ గాత్రంలో కీర్తిప్రతిష్టలను పొందితే వాయులీనంలో సప్తస్వరాలను పలికించటంలో రామస్వామి గుర్తింపును పొందారు. కొత్త రాగాలను, కీర్తనలను రూపొందించి, తన నైపుణ్యంతో వాటికి ప్రాచుర్యాన్ని కల్పించారు. ‘వందన’ రాగంలో ‘కనకాంబరి’ అనే కీర్తన, ‘శ్రీదుర్గ’ అనే రాగంలో కనకదుర్గ అనే కీర్తలను కూడా ప్రదర్శించి వాయులీన కళలో ప్రత్యేకతను నిలుపుకున్నారు. సంగీత, సాహిత్యరంగంలో అప్పటికి తలపండినవారి అభినందనలు అందుకున్నారు. ఉన్నతశ్రేణి కళాకారుడిగా ఆకాశవాణి, దూరదర్శన్‌లో సంగీత కార్యక్రమాల రూపకల్పన చేశారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు డాక్టర్ బాలమురళీకృష్ణతో కలిసి యూకే, కెనడా, ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, బెహ్రాన్, దుబాయ్, దోహా, మస్కట్ తదితర దేశాల్లో పర్యటించి, భారతీయ శాస్త్రీయ సంగీతకళ ఔన్నత్యాన్ని చాటారు. సంగీతసేవకు జీవితాన్ని, ఆస్తిని అర్పించిన తెనాలి న్యాయవాది, శ్రీసీతారామ గానసభ వ్యవస్థాపకుడు నారుమంచి సుబ్బారావు జీవించివున్నపుడు, దాదాపు ఆరు దశాబ్దాల క్రితం రామస్వామి తెనాలిలో తన వాయులీన విద్యను ప్రదర్శించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత హేమాద్రి మ్యూజిక్ అకాడమి, తెనాలిలో ఆ కళాప్రముఖుడి కచేరిని ఏర్పాటు చేయటం విశేషం. -
పరిశోధనలతోనే ప్రగతి
కాజీపేట అర్బన్: నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతోనే అభివృద్ధి సాధ్యమని డీఎస్టీ మాజీ సెక్రటరీ డాక్టర్ టి.రామస్వామి తెలిపారు. కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్లోని ఆడిటోరియంలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, నిట్ వరంగల్ సంయుక్తంగా ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు టీఎస్ఎస్సీ–18 సదస్సును నిర్వహిస్తున్నారు. తొలిరోజు సదస్సుకు ముఖ్య అతిథిగా రామస్వామి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్–18 తోడ్పడుతోందని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో సమాజ మనుగడ సాధ్యమని.. విద్యార్థులకు సైన్స్‌పై మక్కువను పెంచేందుకు టీఏఎస్ కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు శాస్త్రవేత్తల పరిశోధనలపై అవగాహన కల్పిస్తూ.. ఆవిష్కరణలకు నాంది పలికే విధంగా వారికి స్ఫూర్తినందించాలని సూచించారు. నూతన పరిశోధనలకు నాంది: నిట్ డైరెక్టర్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ నిట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న టీఎస్ఎస్సీ–18లో నూతన పరిశోధనలకు నాంది పలికే విధంగా వివిధ దేశాల శాస్త్రవేత్తలతో పరిశోధనలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మీట్ ది సైంటిస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు, టీఎల్సీ ప్రొఫెసర్ అప్పారావు, ఇండో యూఎస్ అసుపత్రి వైద్యుడు ప్రసాదరావు హాజరై శాస్త్రవేత్తల పరిశోధనలపై స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. కాగా, టీఎస్ఎస్సీ–18 సావ నీర్, రిటైర్డ్ ప్రొఫెసర్ చాగంటి కృష్ణకుమారి రచించిన వీరి వీరి గుమ్మడి పండు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సులో టీఏఎస్ అధ్యక్షుడు కె.నరసింహారెడ్డి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్, డీన్లు కేవీ జయకుమార్, ఎల్‌ఆర్‌జీ రెడ్డి, ప్రొఫెసర్లు లక్ష్మారెడ్డి, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
అది మా అదృష్టం
‘‘మూడు పువ్వులు ఆరు కాయలు’ సినిమా మూడు సార్లు ఆగిపోయింది. ఆరు మంది నిర్మాతలు మారారు. చివరకు మా ఫ్రెండ్ వబ్బిన వెంకట్రావు నిర్మాతగా ఈ సినిమా పూర్తి చేశాం’’ అని డైరెక్టర్ రామస్వామి అన్నారు. ‘‘అర్ధనారి’ ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో వెంకట్రావు నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో రామస్వామి మాట్లాడుతూ– ‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురువారం విడుదలైంది. మా సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రానికి మేం పోటీ కాదు. మాకు ఎన్టీఆర్ గారంటే గౌరవం, త్రివిక్రమ్‌గారంటే ఇష్టం. వాళ్ల సినిమా మధ్య మా చిత్రం విడుదల చేయడం మా అదృష్టం. ఆ సినిమాకు వచ్చిన ఓవర్ ఫ్లోతో మా హాల్ నిండినా చాలనుకున్నాం’’ అన్నారు. డా.మల్లె శ్రీనివాసరావు, భరత్ బండారు, వబ్బిన వెంకట్రావు, సంగీత దర్శకుడు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. -
రెండో పెళ్లి చేసుకున్న మహిళా ఎంపీ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప(41) దేశరాజధానిలో సోమవారం న్యాయవాది రామస్వామిని వివాహమాడారు. భర్త లింగేశ్వరతో విభేదాలు తలెత్తడంతో ఆమెకు గతంలో విడాకులు మంజూరయ్యాయి. రామస్వామిని వివాహం చేసుకునేందుకు పుష్ప ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఆయన భార్య సత్యప్రియ తెర మీదకు వచ్చారు. రామస్వామితో తనకు గతంలోనే పెళ్లయిందనీ, తామిద్దరికీ రిజుస్న అనే కుమార్తె ఉన్నట్లు వారంరోజుల క్రితం హైకోర్టు మదురై ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సత్యప్రియ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణ ముగిసేవరకూ రామస్వామి ఎవర్నీ వివాహం చేసుకునేందుకు వీలులేదని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామస్వామి, శశికళ పుష్ప సోమవారం వివాహం చేసుకున్నారు. -
మూడు పువ్వులు ఆరు కాయలు
అర్జున్ యజత్, భరత్ బండారు, రామస్వామి హీరోలుగా, సౌమ్య వేణుగోపాల్, పావని, సీమా చౌదరీలు హీరోయిన్లుగా డా. మల్లె శ్రీనివాసరావు సమర్పణ లో పెబ్బిన వెంకటరావు నిర్మాతగా రామస్వామి దర్శకత్వం వహించిన సినిమా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. ప్రేమ గొప్పదే.. కానీ జీవిత లక్ష్యం ఇంకా గొప్పది. ప్రేమ కోసం చావటం, చంపటం కాదు. మన కన్నవాళ్ల కలల్ని, మనం అనుకున్న లక్ష్యాన్ని నిజం చేస్తేనే జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. సినిమాలో హాస్య రసంతో పాటు కరుణరసం కూడా ఉంటుంది. 40 సినిమాలకు రచయితగా చేసిన రామస్వామిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘మంచి కాన్సెప్ట్‌తో సకుటుంబాన్ని ఆదరించేలా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు. తనికెళ్ల భరణి, అజయ్‌ఘోష్, కృష్ణభగవాన్ తదితరులు నటించారు. -
ఒక్కటైన ప్రేమ జంట
♦ పర్సు మరిచిపోయిన యువతితో ప్రేమలో పడిన ఆటోడ్రైవర్ ♦ ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వివాహం ఖిల్లా ఘనపురం: పల్లెటూరుకు చెందిన ఓ యువకుడు బతుకుదెరువుకోసం హైదరాబాద్ వెళ్లి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ ఆటోలో ఎక్కిన యువతి తన పర్సు మరిచిపోయి దిగింది. ఆ పర్సులో రూ.6వేల నగదుతో పాటు ఏటీఎం కార్డులు, ఫోన్ బుక్కు ఉండడంతో ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆమె సామగ్రి అందజేసిన డ్రైవర్.. ఆ తర్వాత ఆమెతోనే ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమను తొలుత నిరాకరించగా గుడిలో వివాహం చేసుకున్నప్పటికీ ఇరువురి కుటుంబాలు ఆ తర్వాత ఓకే చెప్పడంతో మళ్లీ వినాయకుడి సాక్షిగా ఆదివారం పెళ్లి చేసుకున్నారు. సినిమా కథను తలపించే ఈ స్టోరీ వివరాలు... వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామానికి చెందిన వడ్డె కొండన్న, రామచంద్రమ్మ దంపతుల కుమారుడు రామస్వామి హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నారు. అక్కడే సూపర్మార్కెట్లో పనిచేసే శిరీష ఆటోలో వెళ్లి దిగిపోయే క్రమంలో పర్సు మరిచిపోయింది. అందులో నగదు, ఏటీఎం కార్డులు, ఫోన్‌బుక్ ఉండడంతో రామస్వామి ఆమెకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత గచ్చిబౌలి దగ్గర సూపర్మార్కెట్లో ఉన్న శిరీష వద్దకు వెళ్లి పర్సు అప్పగించగా పరిచయం ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడంతో ప్రేమ చిగురించింది. ఇరువురి కులాలు వేరు కావడంతో ఈనెల 25న బాల్నగర్ సమీపంలోని అయ్యప్పస్వామి దేవాలయంవివాహం చేసుకున్నారు. విషయం తెలిసి ఇరుకుటుంబాల వారు పెద్ద మనుషులతో కలిసి సోమవారం ఖిల్లాఘనపురంలో పంచాయతీ నిర్వహించగా.. అందరూ అంగీకరించారు. దీంతో ఖిల్లాఘనపురంలోని వడ్డెగేరి సమీపాన ప్రతిష్ఠించిన వినాయకుడి దగ్గర ఇరుకుటుంబాల సమక్షంలో రామస్వామి, శిరీష మళ్లీ పెళ్లి చేసుకున్నారు. -
తెలుగు తమ్ముళ్ల కీచక పర్వం
-
తెలుగు తమ్ముళ్ల కీచక పర్వం
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పాపవాండ్లపల్లిలో తెలుగు తమ్ముళ్ల కీచక పర్వం బయట పడింది. వివాహితపై టీడీపీనేత రామస్వామి అత్యాచారానికి యత్నించాడు. ఘటన బయటికి పొక్కకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. రూ20 వేలు తీసుకుని రాజీ చేసుకోవాలంటూ బాధితురాలిని టీడీపీ నేతలు బెదిరించారు. మరో వైపు పోలీసులు సైతం కేసు నమోదు చేసుకోడానికి నిరాకరించారు. 20 రోజులుగా ఫిర్యాదు తీసుకోకుండా.. వేధించారు. చివరకు హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవడంతో.. పోలీసులు విచారణ ప్రారంభించారు. తన లాగే.. ఎంతో మంది మహిళలపై టీడీపీ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. నేతల బెదిరింపుల వల్ల ఘటనలు బయటికి పొక్కడం లేదని తెలిపింది. -
ఇప్పుడు 'ట్రాఫిక్' వంతు
సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా దాఖలు చేసింది. సోమవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ ఈ దావా వేశారు. చెన్నై: సీఎం జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా, కథనాలు రాసినా పరువు నష్టం దావా మోత మోగుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాజకీయ నాయకులు, మీడియాల మీద ఈ దావాలు పెద్ద సంఖ్యలో కోర్టులలో దాఖలు అయ్యాయి. తాజాగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై కన్నెర్ర చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల్ని ఆదుకోవడంలో సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు బయలు దేరిన సమయంలో ట్రాఫిక్ రామస్వామి వినూత్నంగా ఘాటుగానే స్పందించారు. వాట్సాప్ ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా తీవ్రంగా, స్వచ్ఛంద సంస్థలపై అన్నాడీఎంకే వర్గాలు సాగించిన దాడులను ఖండిస్తూ ధూషణలకు దిగారు. చేతిలో ఏదో ఓ వస్తువును పట్టుకుని పదే పదే హెచ్చరించే విధంగా ఘాటుగానే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ వాట్సాప్ వీడియో ప్రతి మొబైల్లోనూ హల్ చల్ చేసిందని చెప్పవచ్చు. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించిన రాష్ర్ట ప్రభుత్వం ట్రాఫిక్ రామస్వామిపై కేసు నమోదుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎంఎల్ జగన్ సెషన్స్ కోర్టులో దావా వేశారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యల్ని సందించడమే కాకుండా, ఆమె పరువుకు భంగం కల్గించే విధంగా ట్రాఫిక్ రామస్వామి వ్యవహరించారని ఆ దావాలో వివరించారు. సెక్షన్ 500, 501 ప్రకారం ట్రాఫిక్ రామస్వామి వ్యవహరించిన తీరు క్రిమినల్ చర్యలతో సమానంగా పేర్కొన్నారు. ఈ దావాపై విచారణ త్వరలో సాగనున్నది. -
ఆధిపత్య పోరు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తండ్రీ, తనయుల మధ్య రూ.16వేల కోట్ల ఆస్తులు ఆధిపత్య పోరుకు దారితీశాయి. ఈ వ్యవహారంలో లంచానికి పాల్పడిన అత్యంత ఉన్నత స్థాయి అధికారి జైలు పాలయ్యూరు. ఇందుకు సంబంధించి పోలీసులు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెట్టినాడు గ్రూపు సంస్థల కింద అనేక ఆఫీసులు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటికి ఎంఏఎమ్ రామస్వామి అధిపతిగా ఉన్నారు. ఇతనికి పిల్లలు లేకపోవడంతో అయ్యప్పన్ అనే బాలుడిని దత్తపుత్రుడిగా స్వీకరించారు. అయ్యప్పన్‌ను పెంచి, పెళ్లి కూడా చేశారు. రామస్వామి తన ఆస్తుల్లో కొంత భాగాన్ని ఒకసారి, మిగిలిన భాగాన్ని మరోసారి అయ్యప్పన్ పేరున రాశారు. పూర్తిగా ఆస్తులు తనపేరున మారగానే అయ్యప్పన్ చెన్నైలోని కేంద్ర కార్యాలయాన్ని ముంబైకి మార్చారు. అలాగే తన నివాసాన్ని సింగపూర్‌లో పెట్టారు. రామస్వామి మాత్రం చెన్నై అభిరామపురంలో ఒంటరిగా ఉంటున్నారు. ఈ దశలో గ్రూపు సంస్థలపై పెత్తనం ఎవరిదనే వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదంపై తండ్రీ కొడుకులిద్దరూ కేంద్ర రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ, చెన్నై) కార్యాలయంలో పిటిషన్ దాఖలు చేశారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా రిజిస్ట్రార్ మనునీది చోళన్‌ను కేంద్రం కార్యాలయం మధ్యవర్తిగా నియమించింది. కంపెనీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం ద్వారా అధిపతి ఎవరో తేల్చుకోవాలని కంపెనీలోని వాటాదారులు అభిప్రాయపడ్డారు. ఈనెల 27వ తేదీన సర్వసభ్య సమావేశం జరపాలని నిర్ణయించారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రిజిస్ట్రార్ మనునీది చోళన్ సర్వసభ్య సమావేశంలో తనకు అనుకూలంగా వ్యవహరించేలా రామస్వామి ప్రయత్నాలు చేస్తున్నట్లు, రూ.10 లక్షలు లంచం ఇచ్చేందుకు సిద్దమైనట్లు అయ్యప్పన్కు ఎవరో సమాచారం అందించారు. ఈ విషయాన్ని అయ్యప్పన్ సీబీఐ అధికారలకు చేరవేశారు. రూ.10 లక్షలు పుచ్చుకునేందుకు అంగీకరించిన రిజిస్ట్రార్ మనునీది చోళన్ అభిరామపురంలోని రామస్వామి ఇంటికి వెళ్లి కారులో వెళుతుండగా సీబీఐ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. కారులోని రూ.10 లక్షలు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. నార్త్ఉస్మాన్రోడ్డులోని ఆయన ఇంటిని సోదాచేసి రూ.20 లక్షల నగదు, కంప్యూటర్ డిస్క్‌లు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అంతా సంఘంలో పేరు, పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో సీబీఐ జాయింట్ డెరైక్టర్ అరుణాచలం, ఎస్పీ రూపా తదితరులు అత్యంత గోప్యాన్ని పాటించారు. కనీసం స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులకు సైతం వివరాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. విషయం పొక్కకుండా ఉండేందుకు మనునీది చోళన్‌ను అనేక చోట్లకు మారుస్తూ విచారణ జరిపారు. నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో బుధవారం తెల్లవారుజాము 5.30 గంటల వరకు విచారించారు. ప్రాథమిక విచారణ పూర్తికావడంతో మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో చోళన్‌ను మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి కృష్ణమూర్తి ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని వారం రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించాల్సిందిగా సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే చోళన్ సైతం బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి గురువారానికి వాయిదావేశారు. కోర్టు రిమాండ్‌తో పుళల్ జైలు ఖైదీగా మారిన రిజిస్ట్రార్ మనునీది చోళన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. లంచం ఇచ్చిన నేరానికి రామస్వామిపై కూడా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియడంతో రామస్వామి గుండెపోటుకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పదేళ్లలో 79 వేల లంచం కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. లంచం కేసులో ఉన్నతాధికారుల అరెస్ట్ విషయానికి వస్తే మండల పాస్‌పోర్టు అధికారి సుమతీ రవిచంద్రన్, కస్టమ్స్ అధికారి రాజన్ తర్వాత చోళన్ మూడోస్థానం పొందారు. -
దొంగ స్వామీజీపై కేసు నమోదు
బెంగళూరు, న్యూస్‌లైన్ : రాసలీలలు సాగించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జ్యోతిస్కుడు దేవిశ్రీ రామస్వామి గురూజీ అలియాస్ రామస్వామి(రాము)పై స్థానిక హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాము కారు డ్రైవర్ వసంత్, మేనేజర్ ఉదయ్ తమకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. తమను చంపేస్తానంటూ రాము బెదిరిస్తున్నాడని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పలు కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. -
హైదరాబాద్ కాంగ్రెస్ ఖాళీ
కాంగ్రెస్ కంచుకోటకు నగరంలో క్రమక్రమంగా బీటలు వారుతున్న నేపథ్యమది.. గత సార్వత్రిక ఎన్నికల నాటికే కాంగ్రెస్ జోరుకు బ్రేకులు పడగా ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు కొత్త పార్టీని పెట్టి రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ మొత్తంగా ఖాళీ అయిపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర రాజధానిలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. మొత్తం 13 స్థానాలుండగా టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా ఏడు చోట్ల జయకేతనం ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థి ఒక చోట గెలుపొందగా మరో ఐదు స్థానాల్లో ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోవడం గమనార్హం. అత్యధికంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 81.3 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా హిమాయత్‌నగర్ నియోజకవర్గంలో 48.13 శాతం ఓట్లు పోలయ్యాయి. - సాక్షి, సిటీబ్యూరో నెల రోజుల మంత్రి రామస్వామి 1983 ఎన్నికల్లో మహరాజ్‌గంజ్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామస్వామి... నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా నెల రోజుల పాటు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో రామస్వామి ఎన్టీఆర్‌ను వదిలి భాస్కరరావు వర్గంలో చేరారు. అయితే భాస్కరరావు ప్రభుత్వం కేవలం నెల రోజుల మాత్రమే ఉండటంతో నగరంలో అనేక మంది రామస్వామిని ‘నెల రోజుల మంత్రి’గా పిలవడం మొదలుపెట్టారు. విజయానందంతో.. హఠాణ్మరణం 1983 ఎన్నికల్లో హిమాయత్‌నగర్ శాసనసభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నారాయణరావు గౌడ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించిన కొన్ని గంటలకే మరణించారు. ఊహించని తన విజయాన్ని అభిమానులు, కార్యకర్తలతో రోజంతా పంచుకున్న నారాయణరావు గౌడ్ అదే రోజు రాత్రి హఠాణ్మరణం పాలైయ్యారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పి.ఉపేంద్ర, బీజేపీ తరఫున ఎ.నరేంద్ర పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర విజయం సాధించారు. ముషీరాబాద్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఎస్.రాజేశ్వర్ 19,609 ఓట్లు సాధించి గెలుపొందారు. జనతాపార్టీ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి 19,302 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.యాదగిరి 15,292 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 53.64. హిమాయత్‌నగర్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి జి.నారాయణరావు గౌడ్ 17,861 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బి.దామోదర్ 15,975 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టి.లక్ష్మీకాంతమ్మ 11,922 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి అఫ్జల్‌ఖాన్‌కు 8,099 ఓట్లు దక్కాయి. నమోదైన పోలింగ్ శాతం 48.13. సనత్‌నగర్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కాట్రగడ్డ ప్రసూన 32,638 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.రాందాస్ 19,470 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి శంకరయ్య యాదవ్ 8,095 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి ఎన్.వి.భాస్కర్‌రావు 4,037 ఓట్లతో నాలుగోస్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 56.98. సికింద్రాబాద్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి మాచినేని కృష్ణారావు 33,069 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.కేశవరావు 15,128 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఎం.సత్యనారాయణ 7,256 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. పోలైన ఓట్ల శాతం 52.19. ఖైరతాబాద్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఎం.రాంచందర్‌రావు 36,188 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్దన్‌రెడ్డి 23,476 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సీ.హెచ్.హనుమంతరావు 16,367 ఓట్లతో తృతీయ స్థానానికి పరిమితమయ్యారు. నమోదైన పోలింగ్ శాతం 57.05. చార్మినార్ స్వతంత్ర అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 50,724 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సి.అశోక్‌కుమార్ 18,218 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బాల పోచయ్య 6,704 ఓట్లతో తృతీయస్థానానికే పరిమితమయ్యారు. నమోదయిన పోలింగ్ శాతం 65.22. చాంద్రాయణగుట్ట ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అమానుల్లాఖాన్ 43,822 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఆలె నరేంద్ర 40,241 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి జి.నిరంజన్ 4,176 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 81.3. కంటోన్మెంట్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఎన్.ఏ.కృష్ణ 25,847 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బి.మచ్చేందర్‌రావు 16,808 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్ 14,457 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 50.91. మలక్‌పేట్ ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎన్.ఇంద్రసేనారెడ్డి 21,397 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ప్రభాకర్‌రెడ్డి 19,340 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి మీర్జా మహబూబ్ అలీ బేగ్‌కు 14,726 ఓట్లు లభించాయి. 59.70 శాతం పోలింగ్ జరిగింది. ఆసిఫ్‌నగర్ ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అఫ్జల్ షరీఫ్ 28,948 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బి.కృష్ణన్ 14,521 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి సి.గంగాభవాని 12,547 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి తులసీరాం 5,761 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. నమోదైన పోలింగ్ శాతం 55.22. మహరాజ్‌గంజ్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి పి.రామస్వామి 17,835 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శివప్రసాద్ 14,303 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గంగా శంకర్ వ్యాస్ 12,531 ఓట్లతో తృతీయస్థానానికే పరిమితమయ్యారు. పోలింగ్ శాతం 54.08. కార్వాన్ ఈ నియోజకవర్గంలో ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిబాకర్ ఆగా 32,380 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నందకిషోర్ 22,767 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి కె.గోపాల్ 8,574 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖలీలుల్లా 6,914 ఓట్లు దక్కించుకున్నారు. నమోదైన పోలింగ్ శాతం 64.8. యాకుత్‌పురా ఈ నియోజకవర్గంలో ఎంఐఎం బలపరిచిన అభ్యర్థి ఖాజా అబు సయిద్ 46,127 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి సయిద్ సర్ఫరాజ్ అలీ 6,491 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. నమోదయిన పోలింగ్ శాతం 58.42. ప్రతి సారీ ఓటేస్తున్నా హీరో తరుణ్ ఏ దేశానికెళ్లినా.. మీది ఏ దేశం అని అడుగుతారు. కానీ ఏ రాష్టం అని అడగరు. నా వరకూ నేను భారతీయుడ్ని మాత్రమే. హక్కులు అనేవి ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. మనం ఓటు వేసే వ్యక్తి మనకు జవాబుదారిగా ఉండాలి. ప్రతి ఒక్క పార్టీకీ ఓ ఎజెండా ఉంటుంది. నచ్చిన ఎజెండాను ఎంచుకుని ఆ పార్టీకి ఓటు వేయడం శ్రేయస్కరం. నేను మాత్రం ప్రతిసారీ ఓటు హక్కును వినియోగించుకుంటాను. నా మిత్రులందరికీ కచ్చితంగా ఓటు వేయమని చెబుతా. మన ఓటు వల్ల మంచి నాయకత్వం వస్తుంది. నిత్యవార్త సత్య వాక్కు హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే... పవన్ ఓటు వేయమని చెప్పింది నాకే... - చంద్రబాబు కొత్తకోడి కూసిందంటే బాబు కోసమే... పాత పకోడి వేగిందంటే బాబు పుణ్యమే... సెల్లుఫోన్ మోత నుంచి సెల్యులాయిడ్ కూత దాకా... ‘హైటెక్కి’న సిటీ నుంచి హీటెక్కిన ఇరానీ‘టీ’ దాకా... కాదేదీ వాడుకునేందుకనర్హం... కాకమ్మకథలే బాబుకున్న అస్త్రం..! ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తే ప్రజలకు మేలనుకున్నా - పవన్‌కళ్యాణ్ తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది.. తమ్ముడొకటి ఆశిస్తే అన్నకొకటి అందింది.. ప్రజోపయోగం అనుకుంటే.. పదవీయోగం పట్టింది.. గుండె దిటవు చేసుకోరాదా.. గుండెల్లోని అన్నను ‘గుట్టు’గా చూసుకోరాదా..! - ఎస్. సత్యబాబు -
విడదీయకండి
బెంగళూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా బెంగళూరులోని టౌన్ హాల్ ఎదుట కర్ణాటక తెలుగు ప్రజా సమితి గురువారం ధర్నా నిర్వహించింది. సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి పలు సంఘ సంస్థలతో పాటు జేడీఎస్ నేత నారాయణ్, అభిల కర్ణాటక మదర్ థెరిస్సా అభిమానుల సంఘం అధ్యక్షుడు మురళీ కళ్యాణ్ తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బొందు రామస్వామి మాట్లాడుతూ... సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదని అన్నారు. మరో ఐదు నెలల్లో పూర్తి అయ్యే పదవులపై మమకారంతో రాష్ట్ర విభజనకు తెగబడ్డారని మండిపడ్డారు. కుట్రదారులకు ఓటుతో సమాధానం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ వారు ఎంత పెట్టుబడులు పెట్టారో.. సీమాంధ్ర వాసులు ఎంత పెట్టుబడులు పెట్టారో.. తేల్చుకోడానికి బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. కార్యక్రమంలో అఖిల కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర నాయకుడు కోటె సతీష్, కేటీపీఎస్ నాయకులు బాబు రాజేంద్ర కుమార్, గురవయ్య, ముఖర్జీ, దేవదానం, శ్రీనివాసులు, కోటేశ్వరి, విజయసాయి, పాల్, నాగేష్, శివరామ్, కుమార్, నరసింహులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సృజనం: శిక్ష
ఆఖరికి రెండు కవరింగ్ చెయిన్‌లా కీర్తిలాంటి యువకుడి ప్రాణానికి మూల్యం? నీలకంఠన్‌కు ఆవేశం పొంగుకొచ్చింది. అలాగే రామస్వామి బట్టతల మీద దుడ్డుకర్రతో ఒక్కటేస్తే ఏమవుతుంది? అలా ఈ కేసు ముగిసిపోతుందని నీలకంఠన్ ఊహించలేదు. ఒకటి ఓడాలి. లేదంటే గెలవాలి. ఈ రెండూ కాకుండా ఇదేం తికమక?! ఇరవై రెండేళ్ల సర్వీసులో ఈ అనుభవం కొత్తది. నీలకంఠాన్ని ‘వేంపాక్కం’ స్టేషన్‌కు మార్చటమే అతనికి నచ్చలేదు. ‘కొత్త రిక్రూట్గాళ్లనంతా పేద్ద పేద్ద స్టేషన్లలో పోస్టింగ్ చేస్తుంటే, మంచినీళ్లు కూడా దొరకని ప్రాంతంలో పడేశారే బావగారూ...’’ అంటూ బామ్మర్ది ఎగతాళి చేశాడు. ‘‘పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే సరా. రుక్మిణి వాళ్లాయనను చూడండి’’ అంటూ సణిగింది భార్యామణి. ఇప్పటికే ప్రమోషన్ ఆలస్యమైంది. ఇంట్లో గొంతిస్తే బదులివ్వటమూ ఆలస్యమవుతోంది. అన్నిటికీ కలిపి ‘అయ్యప్పస్వామి’కి మొక్కుకుని మాల ధరించాడు నీలకంఠన్. గడ్డం పెంచటానికి పర్మిషన్, బూట్లు వేసుకోకుండా స్టేషన్‌కు రావటానికి పర్మిషన్, ఇరుముడి కట్టే రోజున పూజకు అనుమతి, తర్వాత శబరిమలకు వెళ్లటానికి సెలవు... అంటూ ఎన్నోసార్లు డీఎస్పీ వద్ద అక్షింతలు వేయించుకున్నాడు. అయినా ఒక నమ్మకం. అన్నీ సర్దుకుంటాయి. ఎక్కడి నుంచైనా ఒక సన్నటి రేఖలా వెలుగు కనిపించి ప్రవాహంలా అది వృద్ధి కావచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన కేసు పూర్తిచేస్తే అందరూ కలిసి, ‘శెబాష్ నాయకా...’ అని భుజం తడతారు. ముఖ్యమైన కేసు. నీలకంఠన్ శబరిమల నుండి రావటానికి నాలుగురోజుల ముందే రిపోర్టు అయింది. నగల కోసం హత్య! ఏం జరిగినా ఇన్చార్జి ఇన్స్పెక్టర్, అత్త చావుకు ముక్కు చీదే కోడలులాగే పనిచేస్తాడు. అదేం విచిత్రమో, ఈ కేసు అలా ముగియలేదు. ఆరు కాలాల శీర్షికతో వార్తను ప్రచురించి సంచలనం సృష్టించారు ప్రెస్‌వాళ్లు. సంబంధం లేనివాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకునే సంఘటన. అపర వివేకానందుడిలా ఉన్న ఇరవై మూడేళ్ల యువకుడు కీర్తి! ఊళ్లోని పిల్లలందరికీ వ్యాయామం, కరాటే, బడి పాఠాలూ చెప్పినవాడు, అందగాడు, రక్తపు మడుగులో శవమై కనిపించాడు. కన్నతల్లి కామాక్షి అమ్మాళ్, ఉలుకూ పలుకూ లేకుండా గవర్నమెంట్ ఆస్పత్రిలో పడుంది. మంచం నలువైపుల నుండీ రకరకాల ట్యూబులు బయటికి వెళుతున్నాయి. ఆమెకూ తలమీద బలమైన దెబ్బ. పెద్ద బ్యాండేజ్ కట్టారు. ‘‘సార్! ఇలా రండి’’ సన్నని కంఠంతో పిలుస్తూ నీలకంఠాన్ని కామాక్షి అమ్మాళ్ పడక దగ్గర నుండి వరండాలోకి తీసుకెళ్లింది ఒక స్త్రీ. ‘‘సార్, అక్కయ్యకు కీర్తి విషయం ఇంకా తెలియదు. మీరూ చెప్పకండి. ఆ రోజు రాత్రి, గంట మూడయ్యుంటుంది. తోటలోకి ఎనిమిదిమంది దొంగలు వచ్చారు. ఒక్కొక్కడి చేతిలోనూ లావుపాటి దుడ్డుకర్రలున్నాయి. బండరాయితో తలుపు గడియను పగలగొట్టారు. లోపలికి జొరబడగానే హాల్లో పడుకుని ఉన్న మా అక్కయ్య మెడలోని మంగళసూత్రాన్ని పట్టుకుని లాగినట్టున్నారు. ఆమె అరిచినట్టుంది. చెవుల్లోని దుద్దులు పట్టుకొని ఒకడు లాగినట్టున్నాడు. అందరి ముఖాలకూ అడ్డుగా గుడ్డ కట్టుకున్నట్టున్నారు. లోపలి గదిలో నుండి కీర్తి వచ్చినట్టున్నాడు. అక్కయ్య తలమీద దుడ్డుకర్రతో కొట్టడాన్ని చూసి అతను అడ్డుపడి వాళ్లతో కలియబడ్డాడు. ఆత్రం పొంగుకొచ్చింది వాళ్లకు. ఒక్కటే దెబ్బ తలమీద వేశారు. పిల్లాడు అలాగే చాపమీద విరుచుకుపడిపోయాడు. ముందురోజు రాత్రి పదిన్నర వరకూ మాట్లాడి వెళ్లాడు సార్. నాలుగంటే నాలుగే గంటల వ్యవధిలో ఇలా జరగాలా? పిట్టకు కూడా హాని చెయ్యం సార్ మేము. ఒక్కడే కొడుకు సార్’’ కంఠం రుద్దమైపోయింది ఆమెకు. మంచం మీద చిన్న కదలిక. ఆమె, నీలకంఠన్ మంచం దగ్గరకు పరుగులు తీశారు. ‘‘ఇన్స్పెక్టర్ వచ్చారు.’’ కష్టమ్మీద కామాక్షి నోరు తెరిచింది: ‘‘కీర్తి ఎలా ఉన్నాడు?’’ నీలకంఠన్ బదులివ్వకుండా నిలబడ్డాడు. బదులివ్వటానికి వీలుకాలేదు. గొంతు పూడుకుపోయింది. ‘‘వీళ్లంతా ఎందుకు ముఖ క్షవరం చేసుకోలేదు?’’ మాసిన బట్టలతో నిలబడ్డ భర్తను చూపిస్తూ అనుమానంగా అడిగింది కామాక్షి. నీలకంఠన్ మనసులో ఎగసిపడుతున్న దుఃఖాన్ని అణుచుకున్నాడు. మీసాన్ని మెలి తిప్పుకున్నాడు. ఇదీ కేసు! దీన్ని ఛేదించి తీరాలి. కీర్తి విరుచుకుపడిపోయిన చాప, కీర్తి పూజ చేసుకునే గది, గోడమీద చూసిన కీర్తి ఫొటోలు అంటూ వాటిని చూసేకొద్దీ నీలకంఠన్ మనసు వైరాగ్యాన్ని నింపుకుంది. ఇది ప్రమోషన్ కోసం కాదు. ఇది ఇంక్రిమెంట్ కోసం కాదు. ఇది అధికారుల మెప్పు కోసం కాదు. ఇది పొగడ్తల కోసం కాదు. కానీ వాళ్లను కనిపెట్టాలి, పట్టుకు తీరాలి. కీర్తిని గుర్తుచేసుకున్నాడు. కీర్తిలో సుందరేశన్ ఛాయలున్నాయి. సుందరేశన్ నీలకంఠన్‌కు సోదరుడు. పసివాడిలా ఎదిగి ఉన్నట్టుండి చెయ్యిదాటిపోయాడు. ఒక్క ఆధారమూ వదిలిపెట్టకుండా క్షుణ్నంగా పరిశీలించటం జరిగింది. పోలీసు కుక్కా, ఫింగర్ ప్రింట్స్ అన్నీ జరిగిపోయాయి. అటుపక్క కేరళ, ఇటువైపు ఆంధ్ర, మధ్యలో కర్నాటక తప్పనిచ్చి తమిళనాడులో జరిగిన హత్యలూ, దోపిడీలతో సంబంధమున్న ప్రతి గ్యాంగునూ వలవేసి వెతకడం జరిగింది. ఫలితం శూన్యం. చివరకు ఎంతో యాదృచ్ఛికంగానే ఆ గ్యాంగ్ అతడికి ఎదురుపడింది. (ఆ రైల్వే ప్లాట్ఫారంలో) చిరిగిన లుంగీ, రంగు వెలిసిపోయిన బనియనూ ధరించి, విరిగిపోయిన సిమెంటు బెంచీమీద కూర్చుని వచ్చీపోయే జనాలను గమనిస్తూ ఉన్నాడు నీలకంఠన్. అందుకోసమే ఆ రైలు నిలయాన్ని ఎంచుకోవటం అతడి ప్రత్యేకత. ఎండుగడ్డిలో సూది కోసం వెతకడం అతడికి అనుభవమిచ్చిన శిక్షణ. తెలివైన పోలీసు అధికారి బుద్ధి కుశలత వేసే ఒక రకమైన లెక్క. గురి తప్పలేదు. అనుమానంతో పట్టుకున్న ఇద్దరు వ్యక్తుల్ని విచారణ చెయ్యగా మిగిలిన పదిమందీ తలదాచుకున్న అద్దె ఇంటి సంగతి తెలిసింది. అందరూ మొరటుగాళ్లు. దిగువ ప్రాంతాలకు చెందినవాళ్లు. తెలుగును ఒక యాసతో సాగదీస్తూ మాట్లాడారు. చిలక జోస్యం చెప్పటం కులవృత్తి అని చెప్పారు. ఈ మధ్య జనాలు జోస్యం చెప్పించుకోవటం లేదట. ఆకలీ పేదరికమూ కృంగదీశాయి. అమ్మోరి హుండీలు, అయ్యప్ప హుండీలు అంటూ డబ్బు దొంగిలిస్తూ కొన్నాళ్లు పొట్టపోసుకున్నట్టున్నారు. బెంగాల్లో కమ్ముకున్న తుఫాను హుండీల్లో మట్టికొట్టింది. ఒకటే వర్షం. ఒకటే ఆకలి. రామస్వామి చెప్పాడంటూ దొంగతనానికి బయలుదేరారు. రామస్వామి ఎవరు? మొదట్లో దొరికినవాడి మేనమామ. దొంగిలించిన నగల్ని అమ్మటంలో కాస్త తిరకాసు చేశాడు. బాగా తాగటం కూడా నేర్చుకున్నాడు. ‘‘బంగారు కుప్పంలో పనిమీద ఎళ్లినప్పుడు కొన్ని నగలు దొరికినాయి సారూ. ఆటిని ఇక్కడ అమ్మితే దొరికిపోతామనుకుని దేశమ్మ దగ్గరిచ్చి ఊళ్లో అమ్ముకుని రమ్మని సెప్పి పంపించినాం. ఎళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. బిడ్డల తల్లి అని ఆపేసినారు. మళ్లీ మా పనిమీద పడ్డాం. ఒఠి సిల్లర మాత్రం దొరికింది. ఏదైనా ఇంట్లోకి చొరబడి దోసుకోవాలనుకున్నాం. ఇల్లు కొత్తగా, పద్ధతిగా ఉంది. బాగా ఉన్నోళ్లే అయ్యుంటారని దూర్నాం. కుర్రాడు బలశాలిలా ఉన్నాడు. వొదిల్తే మమ్మల్ని పట్టి బంధించేలా కలబడ్డాడు. ఉత్తినే రెండు దెబ్బలేసి భయపెట్టాలనే ఏశాం. ఇట్లా అయిపోయింది. సంపాలనుకోలేదు. మత్తులో బలం తెలియకుండా దెబ్బ పడిపోయింది. కడాకు సూస్తే అన్ని నగలూ కవరింగే...’’ నల్ల తుమ్మమొద్దులాంటి శరీరమూ, బాన కడుపూ, నుదుటున విబూది రేఖలూ, దాని మధ్య పెట్టిన చందనపు బొట్టు మధ్యన తళుకులీనుతున్న కుంకుమ బొట్టుతో ఉన్న రామస్వామి చెప్పాడు.వృత్తి అంటే దోపిడీ చేయటమే. కామాక్షి మెడలో తెంపిన నక్లెసును చూపించాడు. అసలు బంగారం లాగానే అనిపించింది. తాళిబొట్టు పక్కన కీర్తివాళ్ల నాన్న ఫొటో ఉన్న లాకెట్! కీర్తి ఇంటికి ఆ దోపిడీ ముఠా వెళ్లిన మార్గమూ, బయటపడ్డ దారీ, అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆఖరికి రెండు కవరింగ్ చెయిన్‌లా కీర్తిలాంటి యువకుడి ప్రాణానికి మూల్యం? నీలకంఠన్‌కు ఆవేశం పొంగుకొచ్చింది. అలాగే రామస్వామి బట్టతల మీద దుడ్డుకర్రతో ఒక్కటేస్తే ఏమవుతుంది? వెయ్యకూడదు! చట్టాన్ని వ్యక్తులు చేతుల్లోకి తీసుకోకూడదు. ఒక పోలీసు అధికారి అన్న హోదాలో అతడు ఒక యోగిలా, జ్ఞానిలా కేసును విచారిస్తున్నప్పుడు తామరాకుపై నీటిబొట్టులా ఉండాలి. నేరస్థులను గుర్తించటమూ, పట్టుకోవటమూ అతని పని. కేసును విచారించి, నిర్ణయం తెలపటం న్యాయమూర్తి పని. చట్టం ముందు వీళ్లే నేరస్తులు అన్న విషయాన్ని మాత్రం ఏ అనుమానాలకూ తావీయకుండా నిరూపించి చూపటం అతడి బాధ్యత. నీలకంఠన్ చేయవలసిన పనుల జాబితా రూపొందించాడు. ‘గుర్తించటం’ అందులో ముఖ్యమైన ఘట్టం. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమైన సాక్ష్యం, ఒకే ఒక సాక్ష్యం - కామాక్షి అమ్మాళ్. ఆమె వీళ్లను గుర్తించాలి. దానికంటూ కొన్ని పద్ధతులున్నాయి. ఈపాటికి కామాక్షి అమ్మాళ్ ఆరోగ్యం కుదుటపడి ఉంటుంది. వీళ్లను గుర్తించి చూపుతుంది. ఆమె నోటి వాంగ్మూలం వీళ్లకు ఉరిశిక్షను ఖరారు చేయిస్తుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఆ ముఠాతో కలిపి మరికొందరిని నిలబెట్టి కామాక్షి అమ్మాళ్‌ను వెంటబెట్టుకొచ్చాడు నీలకంఠన్. ఏ అయోమయమూ లేకుండా స్పష్టంగా వాళ్లను గుర్తించాలని దేవుళ్లకు మొక్కుకున్నాడు. కామాక్షి అమ్మాళ్ ఒక్క క్షణం ఎదురుగా కనిపించిన గుంపును చూసింది. కాదంటుందా? కాదంటుందా ఒక తల్లి? మరిచిపోగలుగుతుందా ఆ క్షణాన్ని? ఒకే ఒక్క కొడుకును బలి తీసుకున్న ఆ పాపాత్ముడి ముఖాన్ని మరిచిపోగలుగుతుందా? ఆమె చూపులు క్షణకాలం పాటు అతడి మీద నిలిచాయి. అతడూ యువకుడే! అతడికీ కీర్తి వయస్సే ఉంటుంది. ఆమె కనులు నీటితో నిండిపోయాయి. ‘‘కాదు, వీళ్లు కాదు...’’ అంది. ఎందుకిలా చెప్పింది? మరో తల్లి తన కన్నకొడుకును పోగొట్టుకోకూడదని భావించిందా? చీకటీ, భయమూ ఆ జ్ఞాపకాన్ని నిజంగానే మనసులో నుండి చెరిపేసి ఉంటాయా? మరింకేైమైనా సమస్యలొస్తాయని భయపడిందా? ఇక మీదట ఇబ్బందులేమీ ఉండకూడదని ఆలోచించిందా? నీలకంఠన్ అయోమయంలో నుండి తేరుకోలేకపోయాడు. ఇలా కేసు ముగిసిపోతుందని అతడు ఊహించలేదు. దీన్ని గెలుపు అనాలా? ఓటమి అనాలా? - తమిళ మూలం: తిలకవతి అనువాదం: జిల్లేళ్ల బాలాజీ -
మల్టి డిసిప్లినరీ పరిశోధనలతో.. మరిన్ని ప్రయోజనాలు
పరిశోధనలు పెరగాలి.. మరిన్ని ఆవిష్కరణలు జరగాలి.. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాటలు. సమాజ అభివృద్ధికి పరిశోధనలే కీలకమని విద్యావేత్తల అభిప్రాయం. మల్టి డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలతో మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు ప్రఖ్యాత పరిశోధన సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్), హైదరాబాద్ సెంటర్ డెరైక్టర్ ప్రొఫెసర్ శ్రీరామ్ రామస్వామి. ప్రస్తుత దేశ సామాజిక అవసరాల దృష్ట్యా సైన్స్ విభాగాలే కాకుండా.. ఆర్ట్స్, సోషల్ సెన్సైస్‌లోనూ పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఎంతో ఉందంటున్న రామస్వామితో ఇంటర్వ్యూ.. అవసరం ఎంతో.. కానీ! ప్రపంచీకరణ, పెరిగిన పోటీతత్వం, మరోవైపు సామాజిక శ్రేయస్సు దృష్ట్యా ప్రస్తుతం దేశంలో పరిశోధనల అవసరం ఎంతగానో ఉంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆర్ అండ్ డీ విషయంలో దేశం కొంత ముందంజలోనే ఉంది. అయితే, వందకోట్లకుపైగా జనాభా కలిగిన దేశంలో పూర్తిస్థాయి అవసరాలు తీర్చేలా పరిశోధనల లక్ష్యాన్ని చేరుకోవడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. కేవలం ఉన్నత స్థాయిలోనే కాకుండా పాఠశాల స్థాయి నుంచే పరిశోధనల దిశగా పునాదులు పడాలి. అన్ని రంగాల్లోనూ: ప్రస్తుత దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఇంజనీరింగ్, ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సంబంధిత అంశాలు, ఎకనామిక్స్, హిస్టరీ, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ బేసిక్ రీసెర్చ్‌కు ఊతమివ్వడంతోపాటు వాటి మనుగడ, విస్తరణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు జాతీయ ప్రాథమ్యాల కోణంలో.. నీరు, శక్తి, వ్యవసాయం, పర్యావరణం, వాతావరణం, ఆరోగ్యం తదితర రంగాల్లో పరిశోధనలు మరింత పెరగాలి. ఆ పరిశోధనలు కూడా వాస్తవ సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ఉండాలి. మల్టి డిసిప్లినరీ.. ఇంటర్ డిసిప్లినరీ:పరిశోధనలు కూడా బహుళ రంగాల సమ్మిళితంగా(మల్టి డిసిప్లినరీ), అంతర్గత సంబంధమున్న అంశాల సమ్మేళనంగా(ఇంటర్ డిసిప్లినరీ) ఉంటే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు మెకనోబయాలజీ విభాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. యాంత్రిక శక్తిలోని అంతర్గత అంశాలతోపాటు జీవశాస్త్రంలోని కణాలు, పొరలు, జీవులకు సంబంధించి బయోకెమిస్ట్రీలోని కీలక ప్రక్రియల గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మెటీరియల్ సైన్స్.. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అంశాల సమ్మేళనంతో సాగుతుంది. ఫలితంగా ఒకే సమయంలో పలు అంశాల్లోని సమస్యలకు పరిష్కారం కనుగొనే వీలు, పరిశోధనలకు నిజమైన సార్థకత లభిస్తాయి. టీఐఎఫ్ఆర్లో ఇదే తరహాలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచే:పరిశోధనల పరంగా ప్రస్తుత పరిస్థితికి కారణం.. ప్రైమరీ, సెకండరీ విద్యా విధానాలే. ఈ రెండు స్థాయిల్లో ఏకీకృత విధానం అమలు కావట్లేదు. పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న కొద్దిమంది విద్యార్థుల్లో మాత్రమే తదుపరి దశకు అవసరమైన నైపుణ్యాలు ఉంటున్నాయి. అదే విధంగా ఫస్ట్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారిలో అతికొద్దిమంది విద్యార్థులు మాత్రమే భవిష్యత్తులో పరిశోధనలకు అవసరమైన లక్షణాలు సొంతం చేసుకుంటున్నారు. చివరకు ఇది మన యూనివర్సిటీల్లో పరిశోధన నైపుణ్యంగల యువత కొరతకు, పరిశోధనలు తగ్గడానికి దారితీస్తోంది. ఈ సమస్య కేవలం సైన్స్ రంగానికే పరిమితం కాలేదు. ఎకనామిక్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్.. ఇలా అన్నిటా విస్తరించింది. దీనికి పరిష్కారంగా విద్యార్థులను పరిశోధనల దిశగా నడిపేందుకు పాఠశాల స్థాయి నుంచే ఉపక్రమించాలి. ప్రస్తుతమున్న ఇన్స్పైర్ తరహా సైన్స్ ఎగ్జిబిషన్స్, ఇతర సైన్స్ క్యాంప్‌లను గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి. వాటిని విస్తృతంగా నిర్వహించాలి. మరోవైపు గ్రాడ్యుయేట్ స్థాయిలో సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ద్వారా పరిశోధనశాలల్లో పాల్పంచుకునేలా చేయాలి. ఇప్పటికే దేశంలోని మూడు సైన్స్ అకాడమీలు(ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్) రెండు నెలల వ్యవధి గల సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను అందిస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. బోధన, మూల్యాంకనం ‘ప్రాక్టికల్’గా మారితేనే:పరిశోధనల దిశగా ముందడుగుపడాలంటే.. ప్రస్తుత బోధన, అదే విధంగా మూల్యాంకన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠ్యపుస్తకంలోని అంశాలనే విద్యార్థులకు యథాతథంగా బోధించడానికి బదులు.. సదరు అంశంపై వాస్తవ పరిశీలన, ప్రాక్టికాలిటీ బేస్డ్ టీచింగ్‌ను అమలు చేయాలి. తద్వారా కింది స్థాయి నుంచే పరిశోధనల పట్ల ఆసక్తి కలుగుతుంది. అప్పుడే ఔత్సాహికులను తీర్చిదిద్దడం సాధ్యపడుతుంది. ఇటీవల కాలంలో ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఈ తరహా దృక్పథం కనిపించడం ఆహ్వానించదగిన పరిణామం. కానీ మెమరీ బేస్డ్ విధానంలో జరుగుతున్న ప్రస్తుత పోటీ పరీక్షల నేపథ్యంలో.. విద్యార్థులు ఇలాంటి ప్రాక్టికాలిటీని అలవర్చుకోవడం కొంత కష్టమైన విషయమే. కాబట్టి.. నా అభిప్రాయంలో ముందుగా సిలబస్‌లో మార్పులు చేయాలి. వాస్తవ అవసరాలకు అనుగుణమైన అంశాలతోనే రూపొందించాలి. ఫలితంగా విద్యార్థి ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదివి అనుభవపూర్వక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటాడు. రాష్ట్రస్థాయి వర్సిటీల్లో రీసెర్చ్ పెరగాలంటే పరిశోధన అనేది విభిన్న కోణాల్లో విస్తృత పరిధి గల అంశం. ఈ వాతావరణాన్ని కల్పించాలంటే.. సరిపడ మౌలిక సదుపాయాలు, అత్యున్నత నైపుణ్యం గల మానవ వనరులు ఉండాలి. దాంతోపాటు క్లాస్ రూం టీచింగ్‌కు అదనంగా రీసెర్చ్ కోసం తగినంత సమయం కేటాయించగల వెసులుబాటు ఉండాలి. స్థూలంగా చెప్పాలంటే.. అత్యున్నత ప్రమాణాలు, అకడమిక్‌గా, పరిపాలన పరంగా ఎలాంటి రాజకీయ జోక్యంలేని పరిస్థితి అవసరం. యూనివర్సిటీల్లో ఈ తరహా చర్యలు చేపడితే పరిశోధనలు మెరుగవుతాయి. ‘ఆలస్యం’.. అపోహే: పీహెచ్‌డీలో చేరడమంటే సుదీర్ఘ కాల ప్రక్రియ అనేది విద్యార్థుల్లో నెలకొన్న అపోహ మాత్రమే. ఎందుకంటే.. నిజమైన ఆసక్తితో పీహెచ్‌డీలో అడుగుపెడితే నిర్ణీత సమయంలోనే పూర్తి చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్న కాలేజీలో చేరి శిక్షణ పొందడం పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో సులభ ప్రవేశానికి స్వల్ప వ్యవధిలో పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. ప్రస్తుతం అందిస్తున్న పీహెచ్డీ స్టైఫండ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటోంది. ఆ స్టైఫండ్ ఒక విద్యార్థి తన పరిశోధన అవసరాలు తీర్చుకోవడంతోపాటు కొంత ఇంటికి పంపే స్థాయిలో ఉన్నాయంటే పీహెచ్‌డీకి ఇస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. సరైన సమయమిదే పరిశోధన ఔత్సాహికులు ఈ దిశగా అడుగులు వేయడానికి సరైన సమయమిదే. పరిశోధన నిధులు పుష్కలంగా ఉన్నాయి. ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ అండ్ డీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల కారణంగా.. దేశవ్యాప్తంగా పరిశోధనల సంస్కృతి క్రమేణా విస్తరిస్తోంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆ నాలుగు లక్షణాలు.. ముఖ్య సాధనాలు పీహెచ్డీ ఔత్సాహికులకు ప్రధానంగా నాలుగు లక్షణాలు ఉండాలి. అవి.. జ్ఞానం, స్వీయ ఆలోచన నైపుణ్యం, ఉత్సుకత, కష్టపడి పనిచేసే తత్వం. మరో విషయం నిరుత్సాహం అనే పదాన్ని దరి చేరనీయకూడదు. కొన్ని నెలల ప్రయోగాల తర్వాత సత్ఫలితాలు వచ్చినా, రాకపోయినా తట్టుకునే దృక్పథం కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. ఇతరులు మిగిల్చిన సమస్యను తీసుకోకుండా.. సొంతంగా ఆవిష్కరించాలనే కోరిక బలంగా ఉంటే భవిష్యత్తులో ఇక తిరుగుండదు. అలాంటి అభ్యర్థులే పరిశోధన రంగంలో అడుగుపెట్టడం అభిలషణీయం. టీఐఎఫ్ఆర్,హైదరాబాద్‌లో ప్రవేశం పొందాలంటే ముంబై ప్రధాన కేంద్రంగా డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా పొందిన టీఐఎఫ్ఆర్ బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లలో రీసెర్చ్ సెంటర్లు ప్రారంభించి గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్ పేరుతో పలు కోర్సులను అందిస్తోంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్ అప్లికేషన్స్, సైన్స్ ఎడ్యుకేషన్ రంగాల్లో పీహెచ్డీ(అయిదేళ్లు), ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ(ఆరేళ్లు), ఎమ్మెస్సీ(మూడేళ్లు) కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సెంటర్లో పలు కోర్సులను అందిస్తోంది. అవి.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, కెమిస్ట్రీలో పీహెచ్డీ, బయాలజీలో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఎమ్మెస్సీ. అర్హత ఆయా కోర్సులకు అకడమిక్ అర్హత ప్రమాణాలను ఆయా సెంటర్లకు వేర్వేరుగా నిర్దేశించింది. ఏ సెంటర్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులైనా టీఐఎఫ్ఆర్ ప్రతి ఏటా ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ స్కూల్ నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. మిడ్ టర్మ్ ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు గ్రాడ్యుయేట్ స్కూల్ నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణతతోపాటు 90కిపైగా పర్సంటైల్‌తో గేట్, జెస్ట్ స్కోర్లు ఉండాలి. దీంతోపాటు యూజీసీ నెట్ ఫెలోషిప్‌నకు అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తులు, సీట్ల లభ్యత ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు. రెగ్యులర్ గ్రాడ్యుయేట్ స్కూల్ తరగతులు మే/జూన్‌లో, మిడ్ టర్మ్ ప్రవేశాల తరగతులు జనవరిలో మొదలవుతాయి. సెప్టెంబర్/అక్టోబర్‌లో నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్ స్కూల్ నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు ప్రతిఏటా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రకటన వెలువడుతుంది. పరీక్ష డిసెంబర్లో నిర్వహిస్తారు. ఫలితాలు జనవరిలో ప్రకటిస్తారు. ఇంటర్వ్యూ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. మిడ్ టర్మ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఏడాది చివర్లో వెలువడుతుంది. వెబ్సైట్: www.tifrh.res.in/tcis/student.html, www.tifrh.res.in