అర్జున్ యజత్, భరత్ బండారు, రామస్వామి హీరోలుగా, సౌమ్య వేణుగోపాల్, పావని, సీమా చౌదరీలు హీరోయిన్లుగా డా. మల్లె శ్రీనివాసరావు సమర్పణ లో పెబ్బిన వెంకటరావు నిర్మాతగా రామస్వామి దర్శకత్వం వహించిన సినిమా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. ప్రేమ గొప్పదే.. కానీ జీవిత లక్ష్యం ఇంకా గొప్పది. ప్రేమ కోసం చావటం, చంపటం కాదు.
మన కన్నవాళ్ల కలల్ని, మనం అనుకున్న లక్ష్యాన్ని నిజం చేస్తేనే జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. సినిమాలో హాస్య రసంతో పాటు కరుణరసం కూడా ఉంటుంది. 40 సినిమాలకు రచయితగా చేసిన రామస్వామిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘మంచి కాన్సెప్ట్‌తో సకుటుంబాన్ని ఆదరించేలా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు. తనికెళ్ల భరణి, అజయ్‌ఘోష్, కృష్ణభగవాన్ తదితరులు నటించారు.
మూడు పువ్వులు ఆరు కాయలు
Published Fri, Jan 5 2018 12:41 AM | Last Updated on Fri, Jan 5 2018 12:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment