Pavani
-
Prakriti Pavani: కైపెక్కించే చూపులతో మదిని దోచుకుంటున్న ప్రకృతి పావని (ఫోటోలు)
-
'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం!
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతి చెందిన ఘటన మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ్వాయిపల్లి చెందిన క్కొల్ల శేఖవ్వ, మల్లేశం రెండో కుమార్తె పావని(21) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో పేర్కొనడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురి మృతిపై విచారణ చేపట్టాలని సోమవారం పావని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బీటెక్ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు.. -
‘మణప్పురం’ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్రమ మార్గంలో సంపాదన గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్‌లోన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్‌లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్‌కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్‌లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది. దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్‌లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్‌కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు. ఆడిట్‌తో గుట్టురట్టు వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు. -
‘మణప్పురం’లో బంగారం మాయం
కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ సంస్థ బ్రాంచ్ హెడ్ మరో వ్యక్తితో కలిసి ఏకంగా రూ.6కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థ బ్రాంచి హెడ్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాంచ్‌లో 1,477 మంది ఖాతాదారులు 16 కిలోల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందారు. సోమవారం రాత్రి బ్రాంచ్ హెడ్‌గా ఉన్న పావని విధులు ముగించుకుని వెళ్లారు. ఆమె మంగళవారం విధులకు హాజరుకాలేదు. కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మంగళవారం మణప్పురం బ్రాంచ్‌కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా, బ్రాంచ్‌లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కంకిపాడు బ్రాంచిలోని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులు అర్ధరాత్రి సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో బుధవారం గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీసీఎస్, కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తం 951 మంది ఖాతాదారులకు సంబంధించిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించలేదని తేల్చారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.6కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ.3.08 కోట్ల విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మణప్పురం అధికారులు పేర్కొన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన మణప్పురం కంకిపాడు బ్రాంచ్‌లో పది కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నమ్మకంగా పని చేస్తున్న సిబ్బందే బంగారం చోరీ చేశారని తెలిసి నివ్వెరపోతున్నారు. మరోవైపు ఈ బ్రాంచ్‌లో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మణప్పురం ఆఫీసు కింద ఉన్న షాపుల సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలే పోలీసుల విచారణకు తోడ్పడ్డాయి. బ్రాంచ్ హెడ్ పావని పనే... బంగారు ఆభరణాల చోరీ వెనుక బ్రాంచి హెడ్‌గా పనిచేస్తున్న రెడ్డి వెంకట పావని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె సోమవారం రాత్రి విధులు పూర్తి^ó సుకున్న అనంతరం తనతోపాటు వచ్చిన మరో వ్యక్తితో కలిసి కార్యాలయం మూసివేసి కారులో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్గేట్ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు బంగారు ఆభరణాల చోరీలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
Bigg Boss 7 Nayani Pavani HD Photos: బిగ్ బాస్-7లోకి పక్కా తెలంగాణ అమ్మాయి నయని పావని (ఫొటోలు)
-
ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీలో నిద్రమాత్రలు కలిపి
కర్ణాటక: ప్రేమికునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యను చిక్కమగళూరు జిల్లా యగటి పోలీసులు అరెస్ట్ చేశారు. కడూరు తాలూకా హనుమనహళ్లికి చెందిన పావనికి నవీన్ (29)తో ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. ఇటీవల భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త గొడవ పడగా పెద్దలు రాజీ పంచాయతీ చేశారు. ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీల్లో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. భర్త తిని నిద్రలోకి వెళ్లగానే ప్రియునితో కలిసి హత్య చేసి మూడు కిలోమీటర్ల దూరంలో పడేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది. అయితే ఇది ఆత్మహత్య కాదని తెలిసి పావనిని విచారించగా నిజం చెప్పింది. ఇద్దరినీ అరెస్టు చేశారు. -
దివ్యాంగుడికి ‘గృహలక్ష్మి’ చేయూత
భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చుక్క నరేశ్, పావని దంపతులు గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోనే మొదటి ప్రొసీడింగ్‌ను అందుకున్నారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. నరేశ్ ఇంటికి వెళ్లి రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. శనివారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా అక్కడ మగ్గం పనిచేస్తున్న చుక్క పావని, నరేశ్ కుటుంబం దీనస్థితిని తెలుసుకొన్నారు. వారికి సొంత ఇల్లు లేదని తెలుసుకొని వెంటనే స్పందించిన మంత్రి.. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ప్రొసీడింగ్‌ను అందజేయాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలసి నరేశ్ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తమ సొంతింటి కల నెరవేరనుండటంతో ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలలక్ష్మిశ్రీనివాస్, సర్పంచ్ కోట అంజిరెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. -
పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది
నేనేంటి? నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదా? ఈ ప్రశ్నలు పావనిని వెంటాడాయి... వేధించాయి. చదువుంది... పెద్ద ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉంది. అబ్దుల్ కలామ్ చెప్పినట్లు పెద్ద కలలు కన్నదామె. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగినట్లు శ్రమించింది కూడా. జీవితం మాత్రం... ఆమె చదవని సిలబస్‌తో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షను సహనంతో ఎదుర్కొన్నది... ఉత్తీర్ణత సాధించింది. ఇక... తనను తాను నిరూపించుకోవాలనుంది. క్రియేటివిటీ ఆమెకు తోడుగా వచ్చి వెంట నిలిచింది. ఆమె ఇప్పుడు పట్టుదారంతో చక్కటి ఆభరణాలల్లుతోంది. పావని కోరెం... వరంగల్ జిల్లా, హన్మకొండలో పుట్టింది. బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా చదవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంది. ఆమె ఆలోచనలకు భర్త అండగా నిలిచారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరింది. బయో ఇన్ఫర్మాటిక్స్లో పీజీ పూర్తయింది. పోటీ పరీక్షల కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి కోచింగ్కెళ్లారు. పరీక్షలకు సిద్ధమయ్యేలోపు జీవితం మరో పరీక్ష పెట్టింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చిన్న సందేహం. ఆ సందేహాన్ని నిజం చేయడానికా అన్నట్టు పుట్టగానే బిడ్డ ఏడవలేదు. నెలరోజులు హాస్పిటల్లోనే ఉంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. స్పెషల్ కిడ్ కావచ్చనే మరో సందేహం. క్షణక్షణం బిడ్డ సంరక్షణలోనే గడిచిపోయింది. అనుక్షణం బిడ్డ ఎదుగుదల కోసం శ్రమించింది. తల్లిగా కఠోరయజ్ఞమే చేసింది. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో బాబుని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకు రాగలిగింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను ఆశ్రయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి తనను తాను తీర్చిదిద్దుకుంది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో పని చేసింది. ఇప్పుడామె తన సృజనాత్మకతతో గుర్తింపు పొందుతోంది. తన జీవితంలో దశాబ్దంపా టు సాగిన కీలక పరిణామాలను ఆమె సాక్షితో పంచుకున్నారు. ఊహించని శరాఘాతం! ‘‘మా పెళ్లి 2009లో జరిగింది. బాబు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య ఉందని తెలిసింది. బోర్లా పడడం, పా కడం, కూర్చోవడం, నడవడం వంటివన్నీ కొంత ఆలస్యంగా చేశాడు. నార్మల్ కిడ్ చేయాల్సిన సమయానికంటే ఎంత ఆలస్యమవుతోందా అని క్యాలెండర్ చెక్ చేసుకుంటూ... కంటికి రెప్పలా కాపా డుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాదాపుగా నార్మల్ కిడ్ అయ్యాడు. కానీ చిన్నప్పుడు రోజూ ఆందోళనే. బరువు తక్కువగా పుట్టడంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండేది. తరచూ జలుబు, జ్వరం వస్తుండేవి. అప్పట్లో మా వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో ఉద్యోగం. కర్నాటకలో ఓ చిన్న గ్రామంలో పోస్టింగ్. అక్కడ వైద్య సదుపా యాలు తక్కువ. ప్రతినిత్యం భయంభయంగా గడిచేది. రెండున్నరేళ్లకే బాబుకి హెర్నియా ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. స్టేట్ బ్యాంకుకు అనేక అనుబంధ బ్యాంకుల్ని అనుసంధానం చేయడం కూడా అప్పుడే జరిగింది. ఎస్బీఐకి మారి హైదరాబాద్‌కి వచ్చేశాం. మన ్రపా ంతానికి వచ్చిన తర్వాత నన్ను వెంటాడిన భయం వదిలిపోయింది. బాబుకి మంచి వైద్యం చేయించగలమనే ధైర్యం వచ్చింది. ట్రీట్మెంట్ థెరపీలు జరిగేకొద్దీ బాబులో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుండేది. డిప్రెషన్ నుంచి మెల్లగా బయటపడ్డాను. రోజులు ఆశాజనకంగా గడుస్తున్నప్పటికీ నాలో ఏదో వెలితి ఉండేది. సృజనతో సాంత్వన నన్ను నేను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. యూ ట్యూబ్ చూసి నేర్చుకున్న పేపర్ క్విల్లింగ్ మంచి సాంత్వననిచ్చింది. బాబుకి ఫిజియోథెరపీ చేయించే ట్రైనర్ నేను క్విల్లింగ్‌లో చేసిన పూలు, బొమ్మలను చూసి, చాలా బాగున్నాయని తీసుకెళ్లారు. వాటిని ఆ రోజే వాళ్ల హాస్టల్ స్టూడెంట్స్ కొనుక్కున్నారు. అప్పుడే మా ఫ్రెండ్ పట్టు దారంతో ఆభరణాలు తయారు చేయమని చెప్పింది. అలా నా లైఫ్ కొత్త మలుపు తీసుకుంది. హాబీగా మొదలు పెట్టిన యాక్టివిటీ కాస్తా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. తెలిసిన వాళ్ల నుంచి నా సృజనాత్మకత ఎల్లలు దాటింది. దుబాయ్, యూఎస్, యూకే, చైనా ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఫేస్బుక్ బిజినెస్ పేజ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జస్ట్ డయల్, మీ షోలలో నా అల్లికలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడానికి బల్క్ ఆర్డర్లు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రంతా పని చేస్తుంటాను. ముగ్గురు అమ్మాయిలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. మేము తయారు చేసిన ఉత్పత్తులను పికప్ బాయ్స్ వచ్చి తీసుకెళ్తారు. బాబును చూసుకుంటూ నా యాక్టివిటీని కొనసాగిస్తున్నాను. మొదట్లో అయితే మెటీరియల్ కోసం వెతుక్కుంటూ బాబును బండి మీద కూర్చోబెట్టుకుని బేగం పేట నుంచి బేగం బజార్‌కు వెళ్లేదాన్ని. ఇప్పుడైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ బాబుకు ఇంకా నా అవసరం ఉంది. నేను దగ్గరుండి చూసుకుంటే మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిలా కొనసాగిస్తున్నాను. నాకు నిజంగా ఆశ్యర్యమే! నా లైఫ్ జర్నీలో నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగించే విషయం ఏమిటంటే... నన్ను రోల్‌మోడల్‌గా చూస్తూ నా నుంచి స్ఫూర్తి ΄ పొందుతున్న వాళ్లు ఉన్నారనే విషయం. అంతా బాగున్న వాళ్లు చాలామంది ఏమీ చేయకుండా ఉంటున్నారు. ఏదైనా సమస్య రాగానే దిగాలు పడిపోయి జీవితాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసుకునే వాళ్లున్నారు. కానీ... ‘సమస్యకు పరిష్కారం వెతుక్కుని, తనకు ఒక గుర్తింపును తెచ్చుకుంది’ అని ప్రశంసిస్తున్నారు. మా వాళ్లు మాత్రం మొదట్లో ‘నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పిల్లాడిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండు. ఇన్ని ఒత్తిడులు పెట్టుకోవద్ద’ని కోప్పడ్డారు. కానీ ఈ పని నాకు ఒత్తిడిని తగ్గిస్తోందని తెలిసి మా వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. నేను ఎంతో సంపా దిస్తున్నానని కాదు, కానీ నేను ఎటువంటి ఉనికి లేకుండా లక్షల్లో ఒకరిలా ఉండిపోకుండా, ఈ పనివల్ల వందల్లో ఒకరిగా ఓ గుర్తింపు తెచ్చుకోగలిగాను’’ అంటున్నప్పుడు పా వని కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. – వాకా మంజులారెడ్డి , సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పరేషాన్‌తో అలాంటి అనుభూతి కలిగింది
‘‘కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం..’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘పరేషాన్’ మూవీ చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ‘పరేషాన్’ లో జరిగింది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరేషాన్. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పరేషాన్’ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిథిగా తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. ‘‘లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. గెలవాలంటే లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాలి.. రానాగారు వచ్చి మాతో సిక్స్ కొట్టించారు’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు పావని కరణం. ‘‘పరేషాన్’కి నైజాంలో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. -
నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియా స్టార్, నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో, సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాల్సిన ఆమె తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. శనివారం(డిసెంబర్ 31) ఆమె తండ్రి కన్నుమూశారు. ఇదే విషయాన్ని నటి పావని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పలు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింలో నటించిన నయని పావని ప్రముఖ డాన్స్ షో ఢీతో మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. అలాగే మరో యూట్యూబ్, సోషల్ మీడియా స్టార్ శ్వేతా నాయుడి కలిసి ఎక్కువగా నయని రీల్స్ చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలో తండ్రి మృతిపై ఆమె ఇన్స్టాగ్రామ్ వేదిక ఎమోషనల్ అయ్యింది. ఈ మేరకు ఆమె పోస్ట్ చేస్తూ.. ‘ఒక్క జన్మలోనే 100 జన్మల ప్రేమందించావు. కానీ, నాకు అది సరిపోలేదు. ఇంకా కావాలి డాడీ. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. నాకు అయిన పెద్ద గాయమిది. దీన్ని ఎవరూ నయం చేయలేరు. ఇక నిన్ను చూడలేను అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నిన్ను ఇంకా చూడలేననే ఆలోచన కూడా కష్టంగా ఉంది డాడీ. ఇకపై పండోడా అని నన్ను ఎవరు పిలుస్తారు? రోజుకి ఐదుసార్లు ఎవరు కాల్ చేస్తారు? ఓర్పుగా నాతో ఎవరు ఉంటారు? నువ్వు ఏమైనా చేయ్.. నీ లైఫ్ నీ ఇష్టం, నేను నిన్ను నమ్ముతున్నాను అని ఎవరు చెప్తారు? నా పెళ్లికి నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావు అనుకున్నా.. కానీ అంతలోనే నిన్ను ఇలా ఎత్తుకెళ్తాం అనుకోలేదు. ఇది చాలా అన్ ఫెయిర్. 2022 నాకు ఇంతటి విషాదం ఇస్తుందని అనుకొలేదు, ఇక 2023లోకి అస్సలు ఎంటర్ అవ్వాలని లేదు’ అంటూ పావని భావోద్వేగానికి లోనయ్యింది. ఇక ఆమె పోస్టర్ శ్వేతా నాయుడుతో పాటు పలువుకు సోషల్ మీడియా స్టార్ స్పందిస్తున్నారు. ‘ధైర్యంగా ఉండు.. నీకు మేము ఉన్నాం’ అంటూ ఆమెకు ఓదార్పును ఇస్తున్నారు. కాగా ఆమె సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, నీవెవరో, బబ్లూ vs సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి షార్ట్ ఫిలింస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Gurugubelli Divya sree!😎 (@divyaa__sree) View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) -
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు ఎమ్మెల్యే వంశీ ఆపన్నహస్తం
సాక్షి, హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): ‘రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. నాకు బతకాలని ఉంది.. నా ప్రాణాలు కాపాడండి..’ అంటూ ఓ మహిళ కన్నీటితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను వేడుకుంది. చలించిన ఆయన తాను న్నానంటూ ఆమె భరోసా ఇచ్చారు. అతిక్లిష్టమైన శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేయటంతో పాటు, అందుకు అయ్యే ఖర్చును భరించారు. బాపులపాడు మండలం హనుమాన్జంక్షన్కు చెందిన దుట్టా ఉదయ కిరణ్ రోజువారీ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య పావని (22), ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గతే డాది గన్నవరం మండలం కేసరపల్లి వద్ద పావని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె తల రోడ్డుకు బలంగా తగలడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఎడమవైపు పుర్రె భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో పావనిని కుటుంబ సభ్యులు ఎనికేపాడులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. ఆస్పత్రి వైద్యులు రెండు సార్లు పావని బ్రెయిన్‌కు ఆపరేషన్లు చేశారు. తలలో దెబ్బతిన్న పుర్రె భాగాన్ని శస్త్రచికిత్స చేసేందుకు కొద్దిరోజులు భద్రపరిచినా, ఆ తర్వాత పూర్తిగా దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో కృత్రిమ పుర్రె (ప్లాస్టిక్ సింకుల్) అమర్చాల్సి ఉందని, ఈ సర్జరీ తమ వల్ల కాదని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటికే రూ.10 లక్షలకు పైగా ఖర్చు కావటంతో ఉదయకిరణ్‌కు ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ తరుణంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వద్దకు వెళ్లి తన ప్రాణాలు కాపాడాలని పావని కన్నీటి పర్యంతమైంది. చిన్న వయస్సులో ఆమెకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే వంశీమోహన్ తనకు తెలిసిన కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమెను పరీక్షించాల్సిందిగా సూచించారు. పావని తలను పూర్తిస్థాయిలో పరిశీలించిన వైద్యులు ఆమె తలలో కొప్పా త్రీడీ టెక్నాలజీతో కూడిన కృత్రిమ పుర్రె భాగాన్ని పెట్టి, దానిలో మెదడును అమర్చితే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు తెలిపారు. పుర్రె తయారీకి రూ.3 లక్షల ఖర్చవుతుందని చెప్పారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే వంశీమోహన్ తక్షణమే అందించి, ప్రత్యేకంగా పుర్రె భాగాన్ని సిద్ధం చేయించారు. త్వరలోనే పావని తలకు ఆపరేషన్ పూర్తి చేసి పుర్రె అమర్చనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. -
విధితో గెలవలేక.. హిమపావని కన్నుమూత
సాక్షి, నంద్యాల(బొమ్మలసత్రం): పట్టణానికి చెందిన శ్రీనివాసులు కుమార్తె హిమపావని(10) విధితో పోరాడలేక గురువారం కన్నుమూసింది. హిమపావని ఐదు నెలల ముందు వరకు స్నేహితులతో కలిసి ఆడుతూ, పాడుతూ ఆనందంగా ఉండేది. అటువంటి సమయంలో పాఠశాలలో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పావనికి మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా చేదునిజం బయటపడింది. చిన్నారి మెదడులో రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. కొందరు దాతల సహకారంతో జూన్ నెలలో తమిళనాడులోని వేలూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నెల తర్వాత వైద్యులు తప్పని సరిగా పాపకు ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే అంత మొత్తం లేక మిన్నకుండిపోయారు. ఈనెల 17న ఆళ్లగడ్డకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినపుడు కలిసి పాప విషయాన్ని తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి పాప ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రూ.లక్ష చెక్కును అందించి శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న సిటీ న్యూరో సెంటర్లో ఈనెల 20న పావనిని చేర్పించారు. 26వ తేదీ వైద్యపరీక్షలు పూర్తి చేసి గురువారం ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆపరేషన్ పూర్తయిన గంట తర్వాత చిన్నారి హార్ట్‌బీట్ తగ్గిపోవడం గమనించిన వైద్యులు హుటాహుటీన అధునాతన పరికరాలతో వైద్యం అందించారు. అయినప్పటికీ పావని కోలుకోలేక కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పారవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పాప కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాప మృతదేహాన్ని పట్టణంలోని వారి ఇంటికి చేర్చారు. మృతదేహం వద్ద ఎమ్మెల్యే సతీమణి శిల్పా నాగినిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, చైర్పర్సన్ మాబున్నిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, వైఎస్సార్సీపీ నాయకులు వెంకటసుబ్బయ్య, అమృతరాజ్‌లు నివాళులు అర్పించారు. చిన్నారి అంత్యక్రియలకు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ఆర్థిక సహాయం అందించారు. -
దేవుడా.. ఇదేమి అన్యాయం.. గుండెకోత మిగిల్చావ్
వరంగల్ చౌరస్తా: వారిది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరూ ఆడపిల్లలే. పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే పిల్లలు కూడా కష్టపడి చదివారు. పెద్దకూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగి, కాగా, చిన్నకూతురును ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా పంపాడు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు.. మధ్యలోనే ఆరిపోయాయి. అమెరికాలో స్నేహితులతో కలిసి వ్యాన్‌లో వెళ్తున్న ఆమె.. పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఇక్కడ మరో విషాద ఏమిటంటే.. కూతురు చనిపోయిన విషయం తల్లికి తెలియజేయలేని పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేష్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్ స్కూల్ టీచర్. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు పావని (22)ని అమెరికా పంపించాలనుకున్నారు. అందుకోసం రూపాయి.. రూపాయి కూడబెట్టారు. గత ఏడాది బీటెక్ పూర్తికాగా, ఎంఎస్ కోసం రెండు నెలల క్రితం అమెరికా వెళ్లింది. స్నేహితులతో వెళ్తుండగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో కనెక్టికట్ రాష్ట్రంలో 8 మంది స్నేహితులు మినీ వ్యానులో ప్రయాణిస్తున్నారు. వీరి వాహనం పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోగా, అందులో పావని ఒకరు. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు ఉన్నారు. మరికొంతమంది గాయపడ్డారు. గుండెలవిసేలా.. కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి రమేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తల్లికి అనారోగ్యం కారణంగా విషయం చెప్పకుండా దాస్తున్నట్లు తెలిసింది. బంధువులు, ఇతరులు కూడా విషయం తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఆదివారం పావని మృతదేహం నగరానికి చేరుతుందని సమాచారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (క్లిక్ చేయండి: ఉన్నత చదువుకు అమెరికా వెళ్లి.. మృత్యుఒడికి..) దేవుడు అన్యాయం చేసిండు ‘ఇద్దరు కూతుళ్లు అని ఎప్పుడూ బాధ పడలేదు. ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం నేను, నా భార్య అహర్నిశలు కష్టపడ్డాం. మా కలలకు తగ్గట్టుగా పెద్ద పాప ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న పాపను అమెరికాను పంపాలనుకున్నాం. రెండు నెలల కిందట పంపించాం. మొన్న దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా వీడియో కాల్లో మాతో మాట్లాడింది. అంతా బాగానే ఉందని ఓదార్చింది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. చనిపోయినట్లు అమెరికా నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఇది నమ్మలేకపోతున్నాను. దేవుడా.. ఇదేమి అన్యాయం’ - దగ్గర బంధువుల వద్ద పావని తండ్రి ఆవేదన -
కాకినాడ మేయర్ పావని తొలగింపు
సాక్షి, కాకినాడ: నాలుగేళ్ల ‘మేయర్’ గిరికి బ్రేక్ పడింది. నియంతృత్వ విధానాలతో అసంతృప్తి మూటగట్టుకుని కార్పొరేటర్ల ‘విశ్వాసం’ కోల్పోయిన మేయర్ సుంకర పావని పదవిని కోల్పోయారు. ఈ మేరకు ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీవోఎంఎస్ నెంబర్ 129 ద్వారా పురపరిపాలనాశాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91/ఎ(6) ద్వారా మెజార్టీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిచ్చారు. ఆమెతోపాటు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాక్టింగ్ మేయర్‌గా చోడిపల్లి డిప్యూటీ మేయర్ చోడిపల్లి ప్రసాద్ ‘యాక్టింగ్ మేయర్’ కానున్నారు. కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మేయర్ పదవిని కోల్పోతే ఆ స్థానంలో డిప్యూటీ మేయర్‌కు అన్ని అధికారాలు దాఖలు పడతాయి. మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్–1 కూడా పదవిని కోల్పోయిన నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ మేయర్–2గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ తదుపరి మేయర్ ఎన్నిక జరిగే వరకు ‘యాక్టింగ్ మేయర్’గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదన పంపనున్నారు. అక్కడి నుంచి తేదీ ఖరారైన వెంటనే కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు. -
అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్ పావని
సాక్షి, కాకినాడ: కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్ పావని, ఉపమేయర్-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్లో 44 మంది కార్పొరేటర్లు ఉండగా, మరో ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్అఫిషియో సభ్యులు హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్ అధికారి రిజర్వ్ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: (సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు) -
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యాన నగరపాలక పాలక సంస్థ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్ హాలులో ఉదయం 11 గంటలకు మేయర్, 12 గంటలకు డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ జరిగేది ఇలా.. 44 మంది కార్పొరేటర్లతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి 47 మందికి ఓటు హక్కు ఉంది. మూడింట రెండు వంతుల మంది అంటే 31 మంది హాజరైతేనే కోరం ఉంటుంది. చేతులెత్తే పద్ధతిపై ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసం నెగ్గాలంటే 31 మంది అనుకూలంగా ఓటు వేయాలి. కార్పొరేటర్లు చేతులెత్తి అభీష్టం తెలిపితే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు నిర్ధారిస్తారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించాక మేయర్ పదవి నుంచి పావని వైదొలగాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేయర్ పావని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఫలితాన్ని 22వ తేదీ వరకూ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 33 మంది సంతకాలు చేసి, ఐక్యతతో ఉన్నందున పావని పదవీచ్యుతురాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ విప్‌పై గందరగోళం టీడీపీ విప్‌పై గందరగోళం నెలకొంది. వాస్తవానికి మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా కేవలం మేయర్ విషయంలోనే విప్ జారీ చేస్తూ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తీసుకున్న నిర్ణయం కార్పొరేటర్లలో అసహనం రేకెత్తించింది. మేయర్ విషయంలో విప్ జారీ చేసి, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్‌పై నిర్లక్ష్యం చేయడాన్ని ఆ పార్టీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. మరోవైపు పావనిపై అసమ్మతి కార్పొరేటర్లతో పాటు స్వపక్షంలోని 9 మంది అసమ్మతితో రగిలిపోతున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ వ్యతిరేక శిబిరంలో పార్టీలకు అతీతంగా 33 మంది ఉన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీల్లోని అసమ్మతి కార్పొరేటర్లున్నారు. మేయర్‌తో కలిపి టీడీపీకి అనుకూలంగా పది మంది ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఆ పార్టీ ఆదేశాల మేరకు తటస్థంగా వ్యవహరించనున్నారు. కార్పొరేటర్లపై అధిష్టానానికి ఫిర్యాదు : మేయర్ పావని కాకినాడ సిటీ: టీడీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు మేయర్ సుంకర పావని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న పరిణామాలను కలెక్టర్‌కు వివరించేందుకు ఆమె సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 22 వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టు తెలిపిందని మేయర్ వివరించారు. ఇప్పటికే కార్పొరేటర్లకు టీడీపీ విప్ జారీ చేసిందన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం తన వెంట 10 మంది కార్పొరేటర్లు ఉన్నారన్నారు. -
కాకినాడ మేయర్‌పై రేపే అవిశ్వాసం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పావని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమకు విలువ ఇవ్వలేదని, మహిళా కార్పొరేటర్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ పలువురు కార్పొరేటర్లు గత నెల 17న కలెక్టర్ హరికిరణ్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేసిన 33 మంది కార్పొరేటర్లు విశాఖలో ఏర్పాటు చేసిన రాజకీయ శిబిరానికి తరలి వెళ్లారు. వీరిలో చాలామంది కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు. వీరందరూ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి కాకినాడ చేరుకుని ఓటింగ్‌కు హాజరు కానున్నారు. ఇప్పటికే మేయర్‌కు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి కార్పొరేటర్లతో పాటు సొంత టీడీపీకి చెందిన మిగిలిన తొమ్మిది మంది కూడా ఆమెకు దూరమయ్యారు. టీడీపీ జారీ చేసిన విప్‌ను కూడా ధిక్కరించేందుకు వారు సమాయత్తమవుతున్నారని సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడును రెండు రోజుల క్రితం ఈ తొమ్మిది మంది కార్పొరేటర్లూ నేరుగా కలిసి తమ వాదన వినిపించినట్టు చెబుతున్నారు. మేయర్ పావని సొంత పార్టీలోని కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, ఆమెకు అనుకూలంగా ఓటు వేయలేమని చెప్పారని అంటున్నారు. ఓవైపు అసమ్మతి కార్పొరేటర్లు, మరోవైపు సొంత పార్టీలోని కార్పొరేటర్ల నుంచి కూడా అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో మేయర్ ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం జరగనున్న ఓటింగ్‌పై పడింది. -
సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు
సాక్షి, కాకినాడ: నియంతృత్వ ధోరణితో నగర మేయర్ సుంకర పావని టీడీపీని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆ పార్టీకి చెందిన అసమ్మతి కార్పొరేటర్లు మండిపడ్డారు. పదవి కోసం ఆమె ఆడుతున్న కపట నాటకాలను గుర్తించాలని పార్టీ అధినేతను కోరారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడులకు టీడీపీ అనుకూల, అసమ్మతి కార్పొరేటర్లు సోమవారం వేర్వేరుగా లేఖ పంపారు. నాలుగేళ్లుగా మేయర్ పావని, ఆమె భర్త తిరుమలకుమార్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల పార్టీ ఎంతో నష్టపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కొద్ది నెలల క్రితం అవిశ్వాస తీర్మానం పెడతారనే సమాచారంతో ఆమె ఎక్కని గడప, మొక్కని కాలు లేదంటూ మండిపడ్డారు. చదవండి: (బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు) అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖ నేతలను కలిసి, మిగిలిన ఏడాది కాలం తాను పదవిలో ఉండేలా చూడాలంటూ ప్రాధేయపడ్డారని తెలిపారు. ఇందుకు అధికార పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడం, అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇప్పుడు సరికొత్త నాటకాలకు తెర తీశారని పేర్కొన్నారు. తన ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టారని, గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పొలిటికల్ డ్రామాలకు తెర లేపారని చంద్రబాబుకు రాసిన లేఖలో కార్పొరేటర్లు ప్రస్తావించారు. ఇంతకాలం పార్టీని భ్రష్టు పట్టించి, చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ పెద్దలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. 45వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శైలజ కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై మేయర్ సకాలంలో స్పందించలేదని, దీనివలన ఆమె తన పదవిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, చివరకు కోర్టును ఆశ్రయించి పదవిలో కొనసాగుతున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో తప్పిదాలు చేశారంటూ మేయర్ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. వీటితో పాటు నాలుగేళ్లుగా మేయర్ కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం, అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలను కూడా ఆ లేఖల్లో ప్రస్తావించారు. ఈ వాస్తవాలను, మేయర్ పాలనా విధానాన్ని, ఆమె హయాంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పడిన ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధినేతను కోరారు. మెజార్టీ కార్పొరేటర్లు పార్టీకి ఎందుకు దూరమయ్యారో వాస్తవాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: (జనసేనలో భగ్గుమన్న విభేదాలు) నేడో రేపో బాబుతో భేటీ టీడీపీలో ఉన్న కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు తమ వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ పక్షాన ఉన్న సుమారు 9 మంది కార్పొరేటర్లు చంద్రబాబును స్వయంగా కలిసి కాకినాడలో మేయర్ దంపతులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ వర్గాల సమాచారం. టీడీపీలో తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. -
పావని మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, చిత్తూరు: వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతి పావని కేసు విషాదాంతమైంది. ఓ వ్యవసాయ బావిలో మంగళవారం ఆమె మృతదేహం లభ్యమైంది. రామకుప్పం (మ) మునింద్రంకు చెందిన పావని వారం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. కాగా, పావని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె స్నేహితుడు మునిరత్నమే పావనిని హత్య చేశాడని ఆరోపిస్తూ అతని ఇంటిపై దాడి చేశారు. అయితే, వారు దాడికి దిగిన సమయంలో పరారీలో ఉన్న నిందితుడు మునిరత్నం ముణేంద్రం సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
పరువు పోయిందని.. ప్రాణం తీసుకుంది
సూర్యాపేట : ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ, అతని విధానాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మరో యువకుడితో పెద్దలు కుదిర్చిన వివాహానికి ఒప్పుకుంది. నిశ్చితార్థం కూడా అయ్యింది. మాజీ ప్రేమికుడు.. తనతో ఆ అమ్మాయి చనువుగా ఉన్న ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, వారి కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో పెళ్లి ఆగింది. పెళ్లి ఆగడంతో పాటు కుటుంబం పరువు పోయిందని మనస్తాపానికి గురైన యువతి ప్రాణం తీసుకుంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన కునుకుంట్ల వెంకన్న పెద్ద కూతురు పావని (21) ఈ నెల 6న సూర్యాపేటలోని చింతలచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లింది. 9న బయటకు వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి సూర్యాపేట టూటౌన్‌కు బదిలీ చేశారు. పెళ్లి ఆగిపోవడంతో.. పావని.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జీఎన్ఎంగా పనిచేస్తోంది. సొంత ఊరుకు చెందిన బొడ్డుపల్లి వంశీ, పావని కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత వంశీ విధానాలు నచ్చక.. అతన్ని దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి కుది రింది. నిశ్చితార్థం కూడా అయ్యింది. విషయం తెలిసిన వంశీ గతంలో తాను పావనితో దిగిన ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, అతని బావకు పంపాడు. ఈ ఫొటోలను చూసి వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పావనిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి మందలించారు. కొద్దిరోజులు సూర్యాపేటలో ఉండమని బంధువుల ఇంటికి పంపారు. దీంతో పరువుపోయిందని మనస్తాపానికి గురైన పావని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పత్తిచేనులో శవమై.. తిమ్మాపురం శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద పత్తిచేనులో యువతి మృతదేహం ఉందని సమచారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పావనిదిగా గుర్తించి సూర్యాపేట టూటౌన్ పోలీ సులకు సమాచారమిచ్చారు. అక్కడి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాని కి పోస్టుమార్టం జరిపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పావని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. ముగ్గురిపై కేసు నమోదు.. పావని ఆత్మహత్యకు కారకుడైన బొడ్డుపల్లి వంశీతోపాటు పెళ్లి ఆగిపోవడానికి వంశీకి సహకరించిన నూకల శ్రీకాంత్, శ్యాంరెడ్డిలపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు, ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. -
హీరోయిన్ పావని గ్లామర్ ఫోటోలు
-
ఒక ఇంటివారయ్యారు
గురువారం రెండు వివాహ వేడుకలు జరిగాయి. హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయితే, సహాయ నటుడు మహేష్ పావనిని పెళ్లాడి ఇంటివాడు అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో నిఖిల్ వివాహం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహేష్ వివాహం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. ఈ రెండు వేడుకలను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే నిర్వహించారని తెలిసింది. -
మేయర్ గారి షి‘కారు’కు..
జిల్లా కేంద్రమైన కాకినాడ నగరానికి ఆమె ప్రథమ పౌరురాలు. ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పదవిలో ఉన్న ఆమె.. అదే ప్రజల సొమ్ము దుబారాగా ఖర్చు చేస్తూ.. దర్జాగా షి‘కారు’ చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను సహితం తుంగలో తొక్కి.. అధికారమే అండగా.. కౌన్సిల్లో ప్రత్యేకంగా తీర్మానం ఆమోదింపజేసుకుని మరీ.. తన కారు కోసం ప్రతి నెలా నగరపాలక సంస్థ ఖజానా నుంచి రూ.45 వేలు తీసుకుంటున్నారు. కాకినాడ మేయర్ సుంకర పావని సాగిస్తున్న ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ: నగరపాలక సంస్థల్లో మేయర్లకు, కార్పొరేటర్లకు; పురపాలక సంఘాల్లో చైర్మన్లకు, కౌన్సిలర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలపై ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది. ఆయా స్థానిక సంస్థల స్థాయి, ప్రాధాన్యాన్ని బట్టి నెలనెలా చెల్లించాల్సిన వేతనాన్ని నిర్ధారిస్తూ 2016 డిసెంబర్ 15న పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవోఎంఎస్ నంబర్ 335 జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఆయా కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో రికార్డు చేసి, అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేయర్‌కు ప్రయాణ భత్యంతో కలిపి గౌరవ వేతనాన్ని రూ.30 వేలు. వాస్తవానికి 2016లో జీవో సవరణకు ముందు ఈ మొత్తం రూ.14 వేలు మాత్రమే ఉండగా, దీనిని రెట్టింపు పైగా పెంచారు. అలాగే డిప్యూటీ మేయర్ల గౌరవ వేతనం రూ.20 వేలు, కార్పొరేటర్లకు రూ.6 వేలుగా నిర్ధారించారు. దీని ప్రకారం ఆయా స్థానిక ప్రజాప్రతినిధులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాకినాడ మేయర్ సుంకర పావనికి కూడా ఈ ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా రూ.30 వేల గౌరవ వేతనాన్ని నగరపాలక సంస్థ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. 2017 ఆగçస్టులో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికైన నాటి నుంచి ఈ మొత్తాన్ని ఆమెకు ఇస్తూనే ఉన్నారు. ఆమె తన కోసం ప్రత్యేకంగా ఓ కారు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ అధికారాన్ని, హోదాను, మెజారిటీని అడ్డం పెట్టుకుని కారు కోసం కౌన్సిల్లో తీర్మానం కూడా చేయించేశారు. అనంతరం టెండర్ పిలిచి మరీ మేయర్‌కు కారు కేటాయించారు. నిర్వహణ, డ్రైవర్ జీతంతో కలిపి మేయర్ వినియోగిస్తున్న ఆ కారు కోసం నగరపాలక సంస్థ ప్రతి నెలా రూ.45 వేల చొప్పున చెల్లిస్తోంది. ఒకవైపు మేయర్ హోదాలో రూ.30 వేల గౌరవ వేతనం ఇస్తూనే.. దీంతోపాటు కారుకు రూ.45 వేల చొప్పున ఇచ్చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ అదనపు సొమ్మును అలవెన్స్ రూపంలో నగరపాలక సంస్థే భరిస్తోంది. రెండేళ్లకు కలిపి సుమారు రూ.10.80 లక్షల వరకూ మేయర్ కారు కోసం చెల్లించినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ.. ఏదైనా అంశంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా కౌన్సిల్ తీర్మానం చేస్తే.. ఆ తీర్మానాన్ని విధిగా ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదిస్తేనే ఆ తీర్మానం అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే మేయర్‌కు కారు ఏర్పాటు చేసే విషయంలో ఈ నిబంధనలను నాటి నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. కౌన్సిల్ పరంగా ఓ తీర్మానాన్ని ఆమోదింపజేసి, మేయర్‌కు కారు ఏర్పాటు చేసి, ప్రతి నెలా రూ.45 వేల చొప్పున కాంట్రాక్టర్‌కు చెల్లించేస్తున్నారు. కౌన్సిల్‌కు ఎన్ని అధికారాలున్నా ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను అడ్డగోలుగా ఉల్లంఘించి, తీర్మానం చేయడం, అధికారులు సైతం దీనికి సై అనడం విమర్శలకు తావిస్తోంది. ఇలా మేయర్‌కు ప్రత్యేకంగా కారు అలవెన్స్ చెల్లించడం తప్పని తెలిసినా.. అప్పటి అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడీ ఈ వ్యవహారం కార్పొరేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కౌన్సిల్ తీర్మానం మేరకే.. మేయర్‌కు కారు ఏర్పాటు చేయాల్సిందిగా అప్పట్లో కౌన్సిల్ తీర్మానం చేసింది.ఆ తీర్మానానికి అనుగుణంగానే టెండర్ ద్వారా కారు తీసుకునిమేయర్కు ఇచ్చాం.– సత్యనారాయణరాజు,డీఈ, కాకినాడనగరపాలక సంస్థ -
తాత.. నాన్న.. ఓ తణుకు అమ్మాయి
తణుకు అర్బన్: మూగ జీవాలపై ఆ బాలికకు విపరీతమైన ప్రేమ.. వాటికి ఎక్కడ ఏ కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే అక్కడ వాలిపోతుంది. అక్కున చేర్చుకుని వాటిని ఆరోప్రాణంగా కాపాడుతుంది. ఆమే తణుకుకు చెందిన జనత హాస్పటల్ దంత వైద్యుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె పావని వర్మ. ఈ వారసత్వం ఆమెకు తాతయ్య డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు(జనతా రాజు), నాన్న సుందరరామరాజుల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. తణుకు లయన్స్‌క్లబ్ ప్రాంతంలోని నివాసం వద్ద అవుట్ హౌస్‌లో తాత, నాన్న, పావని ఎప్పటి నుంచో వివిధ రకాల కోళ్లు, బాతులు, కవుజు పిట్టలు, కుందేళ్లను సంరక్షిస్తున్నారు. పావని మరో అడుగు ముందుకేసి జంతు సంరక్షణ చేస్తూ యానిమల్ రెస్క్యూ టీంని సృష్టించేందుకు ప్రయతిస్తోంది. అకారణంగా ఏ జంతువును ఇబ్బంది పెట్టినా వారిపై సంబంధిత అ«ధికారులకు ఫిర్యాదుతో పాటు సదరు జంతువును రక్షించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తిగా వాలంటీర్లను నియమించేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. మూగజీవాల సంరక్షణకు ఇప్పటికే తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును స్థలం ఇప్పించాల్సిందిగా కోరిగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పావని చెప్పింది. తనకు మూగజీవాలంటే ఇష్టమని, అయితే చదువు పరంగా తాను ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం వీరి వద్ద చైనా కోళ్లు, పోలీస్ క్యాప్ కోళ్లు, కజానా బాతులు, గిరిరాజు కోళ్లు ఉన్నాయి. వీటి సంరక్షణకు సీసీ కెమెరాలతో పాటు సెయింట్ బెర్నాడ్ జాతికి చెందిన సింహాల్లాంటి మూడు శునకాలు కూడా గస్తీ నిర్వహించడం విశేషం. జంతువులంటే పిచ్చిప్రేమ కుక్కలు, గోవులతో పాటు ఇతర జంతువులంటే మా అమ్మాయికి ఎంతో ఇష్టం. వాటిని బాధించకూడదని తాపత్రయపడుతుంది. ఐదేళ్లుగా మా ఇంటి ఆవరణలో నాన్న సహకారంతో వివిధ రకాల కోళ్లు, బాతులు, కుందేళ్లు, కౌజు పిట్టలను సంరక్షిస్తున్నాను. వాటిని చూసిన మా అమ్మాయి చలించిపోయి యానిమల్స్ రెస్క్యూ టీంను ఏర్పాటుకు నాంది పలికింది. – డాక్టర్ దాట్ల సుందరరామరాజు, జనతా హాస్పటల్ వైద్యుడు -
రాయలసీమ ప్రేమకథ
‘‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ట్రైలర్లో ‘ఇడియట్’ సినిమా యాటిట్యూడ్ కనపడుతోంది. కర్నూల్లో షూట్ చేసిన ఏ సినిమా అయినా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది కర్నూల్ నేపథ్యంలో వస్తున్న ‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ఇంకెంత హిట్ అవుతుందో ఊహించుకోవచ్చు. రామ్‌లో మంచి ప్రతిభ, పవర్ కనపడుతున్నాయి. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ మంచి భవిష్యత్ ఉండాలి’’ అని డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రల్లో రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రాయల్ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, ఆడియో బిగ్ సీడీలను జి.నాగేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘మొదటి నుంచి మమ్మల్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన నాగేశ్వర్ రెడ్డిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక్క లైన్ చెప్పగానే నన్ను నమ్మి పది రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేయించారు నిర్మాతలు. వారు నాకు జీవితం ఇచ్చారు. కథకు తగ్గ కరెక్ట్ టైటిల్ ‘రాయలసీమ లవ్‌స్టోరీ’’ అన్నారు. ‘‘రాయలసీమ అనగానే అందరికీ బాంబులు, ఫ్యాక్షన్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికే ఈ చిత్రం నిర్మించాం’’ అన్నారు రాయల్ చిన్నా. ‘‘అను కున్న సమయానికి సినిమా పూర్తయింది. ఔట్పుట్ కూడా బాగా వచ్చింది. ఈ నెల 27న సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు నాగరాజు. ‘‘నిర్మాతల సహకారం వల్లే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు సాయి ఎలేంద్ర. వెంకట్, హృశాలి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ మహేందర్.