
పుష్ప 2 సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ పాత్రతో పాటు మరో రెండు క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి.

వాటిలో ఒకటి రష్మికది కాగా.. రెండోది 'పుష్ప' సవతి అన్నయ్య కూతురుగా చేసిన నటిది.

'పుష్ప2' మూవీ.. ఓ రకంగా చెప్పాలంటే బన్నీ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.

ఇలాంటి చిత్రంలోనూ రష్మిక.. తనదైన మార్క్ యాక్టింగ్‌తో ఇచ్చిపడేసింది.

పుష్పరాజ్‌కి కూతురు వరసయ్యే పాత్ర చేసిన పావని అనే నటి కూడా తన మార్క్ చూపించింది.

సినిమాలో కీలకమైన జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ఈమె పాత్రే మెయిన్.

ఈ నటి బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ విషయానికొస్తే.. ఈమె అసలు పేరు పావని కరణం.

ఈమె పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలోనే కానీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమాలు బాగానే చేసింది.

2018లో 'పిజ్జా', 'లివింగ్ టూగెదర్' అనే షార్ట్ ఫిల్మ్స్‌తో నటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది.

2021లో రిలీజైన 'పుష్ప'లోనూ ఒకటి రెండు సీన్లలో ఈమె కనిపించింది.

దీని తర్వాత 'మోడ్రన్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

సమోసా తింటావా శిరీషా అనే డైలాగ్ ఉంటే 'పరేషాన్' సినిమాలో హీరోయిన్ ఈమెనే.

రీసెంట్‌గా 'పైలం పిలగా' సినిమాలోనూ హీరోయిన్‌గా చేసి ఆకట్టుకుంది.

హీరోయిన్‌గా చేస్తున్నా పెద్దగా పేరు రాలేదు కానీ 'పుష్ప 2' వల్ల ఈమె చాలా ఫేమస్ కాబోతుంది!

సినిమాలో లంగా ఓణీ, చీరల్లో సంప్రదాయంగా కనిపించింది. ఇన్ స్టా చూస్తే ఈమెలోని గ్లామర్ యాంగిల్ చూడొచ్చు.




