ఆ విషయం నాకు ముందే చెప్పారు | Lovers Club movie will ber release november 13 | Sakshi
Sakshi News home page

ఆ విషయం నాకు ముందే చెప్పారు

Published Sat, Nov 11 2017 12:29 AM | Last Updated on Sat, Nov 11 2017 12:29 AM

Lovers Club movie will ber release november 13 - Sakshi

‘గంగ, అంపశయ్య, ఎర్రబస్సు, ఎలుకా మజాకా, లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌’ తదితర సినిమాల్లో అలరించిన పావని నటించిన తాజా చిత్రం ‘లవర్స్‌ క్లబ్‌’. అనిష్‌ చంద్ర, ఆర్యన్, పూర్ణి ప్రధానపాత్రల్లో ధృవశేఖర్‌ దర్శకత్వంలో ప్రవీణ్‌ గాలిపల్లి సమర్పణలో భరత్‌ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది. పావని మాట్లాడుతూ – ‘‘మా తాతగారికి స్టేజ్‌ అనుభవం ఉంది. నేను కూడా చాలా నాటకాల్లో నటించాను. సినిమా ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు మా నాన్నగారు, సోదరులు సపోర్ట్‌ చేశారు.

‘లవర్స్‌ క్లబ్‌’లో డాక్టర్‌గా చేశా. అనుకోని కారణాలు, సమస్యల వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చేస్తా. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాని ఐ ఫోన్‌లో షూట్‌ చేస్తామని నాకు ముందే చెప్పారు. నేను వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. లీడ్‌ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వస్తున్నాయి. లీడ్‌ అనే కాకుండా, నటనకు ఆస్కారం ఉండే పెద్ద చిత్రాల్లోనూ చేయాలని ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ నెల 13న ఓ సినిమా మొదలవుతుంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement