Purni
-
ఆ విషయం నాకు ముందే చెప్పారు
‘గంగ, అంపశయ్య, ఎర్రబస్సు, ఎలుకా మజాకా, లావణ్య విత్ లవ్‌బాయ్స్’ తదితర సినిమాల్లో అలరించిన పావని నటించిన తాజా చిత్రం ‘లవర్స్ క్లబ్’. అనిష్ చంద్ర, ఆర్యన్, పూర్ణి ప్రధానపాత్రల్లో ధృవశేఖర్ దర్శకత్వంలో ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. పావని మాట్లాడుతూ – ‘‘మా తాతగారికి స్టేజ్ అనుభవం ఉంది. నేను కూడా చాలా నాటకాల్లో నటించాను. సినిమా ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు మా నాన్నగారు, సోదరులు సపోర్ట్ చేశారు. ‘లవర్స్ క్లబ్’లో డాక్టర్‌గా చేశా. అనుకోని కారణాలు, సమస్యల వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చేస్తా. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాని ఐ ఫోన్లో షూట్ చేస్తామని నాకు ముందే చెప్పారు. నేను వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. లీడ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వస్తున్నాయి. లీడ్ అనే కాకుండా, నటనకు ఆస్కారం ఉండే పెద్ద చిత్రాల్లోనూ చేయాలని ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ నెల 13న ఓ సినిమా మొదలవుతుంది’’ అన్నారు. -
ప్రేమికుల అడ్డా
‘‘ఓ యువకుడు ప్రేమికులకు అండగా నిలబడుతుంటాడు. అటువంటి ఆ యువకుడి జీవితంలో అనుకోని సమస్యలు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ‘లవర్స్ క్లబ్’ చిత్రంలో ఆసక్తికరం’’ అన్నారు దర్శకుడు ధృవ శేఖర్. అనీష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ధృవ శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం. ఇంతవరకు ఎవరూ తీయని విధంగా ఫస్ట్ టైమ్ ఐ ఫోన్ టెక్నాలజీ ఉపయోగించి షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కథే బలమని ఇటీవల ప్రేక్షకులు నిరూపించారు. కథ బాగుంటే ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా తీశాం’’ అని భరత్ అవ్వారి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి నిడమర్తి, నేపథ్య సంగీతం: కమల్.డి, కెమెరా: డి.వి.ఎస్.ఎస్. ప్రకాష్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మదన్ గంజికుంట, అవ్వారి ధను, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి.