ప్రేమికుల అడ్డా | Lovers Club movie will be released on 25th of this month | Sakshi
Sakshi News home page

ప్రేమికుల అడ్డా

Published Sat, Aug 5 2017 12:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

ప్రేమికుల అడ్డా

ప్రేమికుల అడ్డా

‘‘ఓ యువకుడు ప్రేమికులకు అండగా నిలబడుతుంటాడు. అటువంటి ఆ యువకుడి జీవితంలో అనుకోని సమస్యలు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ‘లవర్స్‌ క్లబ్‌’ చిత్రంలో ఆసక్తికరం’’ అన్నారు దర్శకుడు ధృవ శేఖర్‌. అనీష్‌ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన పాత్రల్లో ప్రవీణ్‌ గాలిపల్లి సమర్పణలో భరత్‌ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ధృవ శేఖర్‌ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం. 

ఇంతవరకు ఎవరూ తీయని విధంగా ఫస్ట్‌ టైమ్‌ ఐ ఫోన్‌ టెక్నాలజీ ఉపయోగించి షూటింగ్‌ చేశాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కథే బలమని ఇటీవల ప్రేక్షకులు నిరూపించారు. కథ బాగుంటే ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా తీశాం’’ అని భరత్‌ అవ్వారి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి నిడమర్తి, నేపథ్య సంగీతం: కమల్‌.డి, కెమెరా: డి.వి.ఎస్‌.ఎస్‌. ప్రకాష్‌ రావు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: మదన్‌ గంజికుంట, అవ్వారి ధను, అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌ నవీన్‌ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement