lovers club
-
కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి..
సాక్షి, సిటీబ్యూరో:నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు ప్రేమికులకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతున్నాయి. మాదాపూర్‌లోని దుర్గం చెరువు సహా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ థియేటర్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, ఇందిరాపార్కుల్లో ఎక్కడ చూసినా ప్రేమ పక్షులే కన్పిస్తాయి. చెట్టుకొక.. పుట్టకొక జంట దర్శనమిస్తూ ఉంటుంది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ఆయా ప్రాంతాల్లో అమ్మాయిలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి.. తర్వాత తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి లవ్ స్పాట్స్‌కు చేరుకుంటున్నారు. ముద్దూముచ్చట్లలో మునిగితేలుతున్నారు. నేడు వలంటైన్స్ డేసందర్భంగా ఆయా ప్రాంతాలుప్రేమికులతో కిక్కిరిసిపోనున్నాయి. -
ఆ విషయం నాకు ముందే చెప్పారు
‘గంగ, అంపశయ్య, ఎర్రబస్సు, ఎలుకా మజాకా, లావణ్య విత్ లవ్‌బాయ్స్’ తదితర సినిమాల్లో అలరించిన పావని నటించిన తాజా చిత్రం ‘లవర్స్ క్లబ్’. అనిష్ చంద్ర, ఆర్యన్, పూర్ణి ప్రధానపాత్రల్లో ధృవశేఖర్ దర్శకత్వంలో ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. పావని మాట్లాడుతూ – ‘‘మా తాతగారికి స్టేజ్ అనుభవం ఉంది. నేను కూడా చాలా నాటకాల్లో నటించాను. సినిమా ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు మా నాన్నగారు, సోదరులు సపోర్ట్ చేశారు. ‘లవర్స్ క్లబ్’లో డాక్టర్‌గా చేశా. అనుకోని కారణాలు, సమస్యల వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చేస్తా. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాని ఐ ఫోన్లో షూట్ చేస్తామని నాకు ముందే చెప్పారు. నేను వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. లీడ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వస్తున్నాయి. లీడ్ అనే కాకుండా, నటనకు ఆస్కారం ఉండే పెద్ద చిత్రాల్లోనూ చేయాలని ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ నెల 13న ఓ సినిమా మొదలవుతుంది’’ అన్నారు. -
ప్రేమికుల అడ్డా
‘‘ఓ యువకుడు ప్రేమికులకు అండగా నిలబడుతుంటాడు. అటువంటి ఆ యువకుడి జీవితంలో అనుకోని సమస్యలు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ‘లవర్స్ క్లబ్’ చిత్రంలో ఆసక్తికరం’’ అన్నారు దర్శకుడు ధృవ శేఖర్. అనీష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ధృవ శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం. ఇంతవరకు ఎవరూ తీయని విధంగా ఫస్ట్ టైమ్ ఐ ఫోన్ టెక్నాలజీ ఉపయోగించి షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కథే బలమని ఇటీవల ప్రేక్షకులు నిరూపించారు. కథ బాగుంటే ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా తీశాం’’ అని భరత్ అవ్వారి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి నిడమర్తి, నేపథ్య సంగీతం: కమల్.డి, కెమెరా: డి.వి.ఎస్.ఎస్. ప్రకాష్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మదన్ గంజికుంట, అవ్వారి ధను, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి. -
ఐఫోన్ 6ఎస్ తో సినిమా..
హైదరాబాద్: సెల్‌ఫోన్ ప్రపంచంలో యాపిల్ ఐఫోన్‌ది ఓ చరిత్ర. అత్యధిక మంది ఐఫోన్ వాడాలనుకుంటారు. దీనికి మార్కెట్లో ఉండే క్రేజే వేరు. అలాంటి ఐఫోన్‌తో ఏకంగా ఓ సినిమా తీశారు. అది కూడా తెలుగు సినిమా. ఐఫోన్‌తో సినిమాని చిత్రీకరించారు. ఆ సినిమా పేరు "లవర్స్ క్లబ్". వివరాల్లోకి వెళ్తే "ప్లాన్ బీ ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రేయా ఆర్ట్ క్రియేషన్స్" బ్యానర్లో చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రానికి భరత్ అవ్వారి దర్శకత్వం వహిస్తున్నారు. దృవ శేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు, సన్నివేశాలు, ఇలా అన్నీ ఐఫోన్ 6ఎస్ తో చిత్రీకరించారు. ఇండియాలోనే ఐఫోన్‌తో తీసిన తొలిచిత్రం కావడం విశేషం. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చిత్ర ప్రచారంలో భాగంగా 34 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.