ఐఫోన్‌ 6ఎస్‌ తో సినిమా.. | telugu film shooted with Iphone 6s | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ 6ఎస్‌ తో సినిమా..

Published Mon, May 22 2017 10:10 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

ఐఫోన్‌ 6ఎస్‌ తో సినిమా..

ఐఫోన్‌ 6ఎస్‌ తో సినిమా..

హైదరాబాద్‌: సెల్‌ఫోన్‌ ప్రపంచంలో యాపిల్‌ ఐఫోన్‌ది ఓ చరిత్ర. అత్యధిక మంది ఐఫోన్‌ వాడాలనుకుంటారు. దీనికి మార్కెట్‌లో ఉండే క్రేజే వేరు. అలాంటి ఐఫోన్‌తో ఏకంగా ఓ సినిమా తీశారు. అది కూడా తెలుగు సినిమా. ఐఫోన్‌తో సినిమాని చిత్రీకరించారు. ఆ సినిమా పేరు "లవర్స్‌ క్లబ్‌".  వివరాల్లోకి వెళ్తే "ప్లాన్‌ బీ ఎంటర్టైన్‌మెంట్‌ అండ్‌ శ్రేయా ఆర్ట్‌ క్రియేషన్స్‌" బ్యానర్‌లో చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రానికి భరత్‌ అవ్వారి దర్శకత్వం వహిస్తు‍న్నారు. దృవ శేఖర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు, సన్నివేశాలు, ఇలా అన్నీ ఐఫోన్‌ 6ఎస్‌ తో చిత్రీకరించారు. ఇండియాలోనే ఐఫోన్‌తో తీసిన తొలిచిత్రం కావడం విశేషం. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చిత్ర ప్రచారంలో భాగంగా 34 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement