ఆగిపోతుందనుకున్న ప్రతిసారి నిర్మాత ముందడుగు వేశాడు: దర్శకుడు | Gally Gang Stars Movie Release Date Out | Sakshi
Sakshi News home page

గల్లీ గ్యాంగ్‌ స్టార్స్‌ మూవీ.. అనాథల బాధ్యత సమాజం తీసుకోకపోతే!

Published Thu, Jul 25 2024 7:36 PM | Last Updated on Thu, Jul 25 2024 8:05 PM

Gally Gang Stars Movie Release Date Out

సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గల్లీ గ్యాంగ్ స్టార్స్'. 'ఏ బి డి ప్రొడక్షన్స్' బ్యానర్‌పై డా. ఆరవేటి యశోవర్ధన్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ "గల్లీ గ్యాంగ్ స్టార్స్ అనేది ఒక సినిమా కాదు నిజ జీవితంలో ఎందరో అనాథలు ఎదురుకునే రోజువారి సంఘటనలు. అనాథల బాధ్యత సమాజం తీసుకోకపోతే ఆ సమాజం ఎన్ని దారుణాలు ఎదురుకోవాల్సివస్తుందో వాస్తవికంగా తెరక్కించాం. నెల్లూరులో 76 రోజుల పాటు సినిమా అంతా షూట్‌ చేశాం.

అనుకున్న బడ్జెట్ దాటిపోయి షూటింగ్ ఆగిపోతుందనుకున్న ప్రతిసారి నిర్మాత యశోవర్ధన్ ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఎనలేని మక్కువ కలిగిన యశోవర్ధన్ 'ఏ బి డి ప్రొడక్షన్స్' అనే బ్యానర్ నిర్మించి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశం ఇస్తూ వరసగా మూడు సినిమాలు నిర్మించారు. దానిలో మొదటిది ప్రయోగాత్మకమైన చిత్రం "May 16". ఇది ఒక మోనో డ్రామా. 

ఆ తర్వాత చిత్రం నెల్లూరు గల్లీలో జరిగే మాస్ డ్రామా  "గల్లీ గ్యాంగ్ స్టార్స్" . ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇదే బ్యానర్ లో వస్తున్న మరో సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఒక పక్క డాక్టర్‌గా తన బాధ్యతలను ఇంకో పక్క తనకి ఎంతో ఇష్టమైన సినిమాలను రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ABD ప్రొడక్షన్స్‌తో, మరెన్నో గొప్ప చిత్రాలకు తన సహకారం అందించాలని, సినీ చరిత్రలో తనకంటూ గుర్తింపు సంపాదించాలని ఆశిస్తున్నాను" అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement