Telugu film
-
తెలుగమ్మాయి హీరోయిన్గా తారకేశ్వరి ట్రైలర్ చూశారా?
శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ మూవీ 'తారకేశ్వరి'. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్లో డైరెక్టర్ వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంతో పాటు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. మూవీ పోస్టర్‌ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా, ట్రైలర్‌ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు.ట్రైలర్ బాగుందిఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. 'తారకేశ్వరి' మూవీ ట్రైలర్ చాలా బాగా ఉంది. ఇది మంచికి, చెడుకు జరిగే పోరాటాన్ని చక్కగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి. ఇందులో తెలుగు హీరోయిన్లు ఉన్నారు. తెలుగు వారికే డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం అభినందనీయం" అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో..హీరో శ్రీకర్ మాట్లాడుతూ.. "తెలుగు ఇండస్ట్రీ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సంపాదిస్తుండటం మనందరికి గర్వకారణం. డైరెక్టర్ వెంకట్ రెడ్డిగారు ఎంతో శ్రమించి అందరికి నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించారు. మా సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని తెలిపారు. హీరోయిన్ అనుష మాట్లాడుతూ.. "నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కు కృతజ్ఞతలు. దూరపు కొండలు నునుపు.. దగ్గరికి వెళితే గరుకు.. తెలుగమ్మాయిలకు అవకాశం ఇస్తున్న ఇలాంటి సినిమాలను ఆదరించండి" అని అన్నారు. ట్రైలర్లో కనిపిస్తోందినటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "హీరో శ్రీకర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారి టాలెంట్ ఈ ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది" అన్నారు. డైరెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. "మా టీమ్ సభ్యులందరి కృషి వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ దీన్ని ఆదరించాలి. ప్రేక్షకుల నమ్మకాన్ని మేం నిలబెట్టే విధంగా సినిమా తెరకెక్కించాము. త్వరలోనే ఆడియో, ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించబోతున్నాం" అని తెలిపారు. -
లక్నో ఫిలిం ఫెస్టివల్లో అవార్డు అందుకున్న మూవీ.. యూట్యూబ్‌లో రిలీజ్
రాయాల కపిల్, చాణిక్యా, విశ్వ తేజ్, శోభన్ బోగరాజు, విక్కీ, శ్రీనివాస్ కసినికోట, హనుమాద్రి శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అచీవర్. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్, రాయల సతీష్, సారా కళ్యాణ్ గౌడ్ ఈ ఇండిపెండెట్ ఫిలింను కలిసి నిర్మించారు. తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిల్డ్రన్స్ ఇండిపెండెట్ సినిమాకు లక్నో ఫిల్మ్ ఫెస్టివల్లో కన్సొలేషన్ స్థానం లభించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ వెల్లడించారు.వెంకటేష్ ఉప్పల, సుమంత్ బొర్ర అందించిన సంగీతం, పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయన్నారు. నటనలో ఎలాంటి అనుభవం లేని పిల్లలు చాలా బాగా యాక్ట్ చేశారన్నారు. దేశభక్తి , దేశం మీద గౌరవం అనేది చిన్ననాటి నుంచే పిల్లలకు తెలియాలని, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం, ఎంతో మంది కృషి వల్లే ఈ దేశం మనకు వచ్చింది అని మేకర్స్ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ టైమ్స్ యుట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు.. -
తీయ ఉత్తమ తెలుగు చిత్రం.. సంచలనం సృష్టించిన కార్తికేయ 2
-
ఆగిపోతుందనుకున్న ప్రతిసారి నిర్మాత ముందడుగు వేశాడు: దర్శకుడు
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గల్లీ గ్యాంగ్ స్టార్స్'. 'ఏ బి డి ప్రొడక్షన్స్' బ్యానర్‌పై డా. ఆరవేటి యశోవర్ధన్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ "గల్లీ గ్యాంగ్ స్టార్స్ అనేది ఒక సినిమా కాదు నిజ జీవితంలో ఎందరో అనాథలు ఎదురుకునే రోజువారి సంఘటనలు. అనాథల బాధ్యత సమాజం తీసుకోకపోతే ఆ సమాజం ఎన్ని దారుణాలు ఎదురుకోవాల్సివస్తుందో వాస్తవికంగా తెరక్కించాం. నెల్లూరులో 76 రోజుల పాటు సినిమా అంతా షూట్ చేశాం.అనుకున్న బడ్జెట్ దాటిపోయి షూటింగ్ ఆగిపోతుందనుకున్న ప్రతిసారి నిర్మాత యశోవర్ధన్ ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఎనలేని మక్కువ కలిగిన యశోవర్ధన్ 'ఏ బి డి ప్రొడక్షన్స్' అనే బ్యానర్ నిర్మించి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశం ఇస్తూ వరసగా మూడు సినిమాలు నిర్మించారు. దానిలో మొదటిది ప్రయోగాత్మకమైన చిత్రం "May 16". ఇది ఒక మోనో డ్రామా. ఆ తర్వాత చిత్రం నెల్లూరు గల్లీలో జరిగే మాస్ డ్రామా "గల్లీ గ్యాంగ్ స్టార్స్" . ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇదే బ్యానర్ లో వస్తున్న మరో సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఒక పక్క డాక్టర్‌గా తన బాధ్యతలను ఇంకో పక్క తనకి ఎంతో ఇష్టమైన సినిమాలను రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ABD ప్రొడక్షన్స్‌తో, మరెన్నో గొప్ప చిత్రాలకు తన సహకారం అందించాలని, సినీ చరిత్రలో తనకంటూ గుర్తింపు సంపాదించాలని ఆశిస్తున్నాను" అన్నారు. -
బిగ్‌బాస్ నోయల్ '14' సినిమా.. ఫస్ట్‌లుక్ పోస్టర్
బిగ్‌బాస్ నోయల్ హీరోగా, విషాక ధీమాన్ హీరోయిన్గా నటిచంఇన చిత్రం 14. లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెట్ల రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "14" చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుందన్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో రతన్, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు. కళ్యాణ్ నాయక్ పాటలు అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు. -
బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్‌హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్‌పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్‌పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్‌స్కా్వడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీఆర్ ఫార్మ్‌హౌస్‌లో పార్టీ హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాన్కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్ ఫార్మ్‌హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 లక్షల వరకు వ్యయం నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్‌ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్ కమోడ్లలో వేసి ఫ్లష్ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్‌హౌస్‌ను క్షుణ్ణంగా గాలించారు.ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్‌హౌస్ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్వర్డ్ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్‌లో తీసింది కాదని, ఆ ఫార్మ్‌హౌస్ లోపలే హేమ వీడియో బైట్ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం. అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్ పార్టీ లకు, పబ్స్‌కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నేను హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నా..: సినీ నటి హేమ బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. ఓ ఫామ్‌హౌస్‌లో చిల్ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. -
టీఎఫ్‌డీఏ నూతన అధ్యక్షుడిగా వీరశంకర్
తెలుగు సినీ దర్శకుల సంఘం (టీఎఫ్‌డీఏ) సంఘం నూతన అధ్యక్షుడిగా దర్శకుడు బి. వీరశంకర శ్రీనివాస్ (వీరశంకర్) గెలుపొందారు. 2024–2026 సంవత్సరాలకు గాను ఆదివారం హైదరాబాద్‌లో టీఎఫ్‌డీఏ ఎన్నికలు జరిగాయి. దర్శకుల సంఘంలో దాదాపు 2000 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి బి. వీరశంకర శ్రీనివాస్, వి. సముద్రరావు, జి. రామ్‌ప్రసాద్, ఏఎస్ రవికుమార్ చౌదరి, పానుగంటి రాజారెడ్డి పోటీ చేశారు. ఈ పోటీలో 536 ఓట్లతో వీరశంకర్ విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా నీలం సాయిరాజేశ్, ఎమ్వీఎన్ రెడ్డి (వశిష్ఠ), జనరల్ సెక్రటరీగా సీహెచ్ సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా వద్దానం రమేశ్, కస్తూరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీఎస్ ప్రియదర్శి, డి. వంశీకృష్ణ జయకేతనం ఎగురవేశారు. ట్రెజరర్‌గా పీవీ రామారావు గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ. కృష్ణమోహన్, అల్లా భక్స్, రాజా వన్నెంరెడ్డి, శైలేష్ కొలను, శ్రీరామ్ ఆదిత్య తుర్లపాటి, కూరపాటి రామారావు, లక్ష్మణరావు చాపర్ల, ప్రవీణ మడిపల్లి, రమణ మొగిలి, కొండా విజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు దర్శకుల సంఘం స్థాయిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లేందుకు అందరం కలిసి కృషి చేస్తాం. ఇప్పుడు ఉన్న టీఎఫ్డీఏను ‘టీఎఫ్‌డీఏ 2.ఓ’ అన్నట్లుగా వర్క్ చేస్తాం. హైదరాబాద్‌కు ఎవరైనా పర్యాటకులు వస్తే టీఎఫ్‌డీఏ బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలన్నట్లుగా చేస్తాం. మంచి ఆలోచనలుంటే ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది’’ అన్నారు. -
ఈగల్ కి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాం..!
-
అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు
-
మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్
‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘సార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘అక్టోబరులో షూటింగ్‌ను ఆరంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను అలరించే మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అయోమయంలో అరవింద చిత్రం ప్రారంభం
తెలుగులో మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతోంది. రణధీర్, సుభ శ్రీ హీరోహీరోయిన్లుగా వూర శ్రీను దర్శకత్వంలో ధార్వి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్లో లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మాణంలో 'అయోమయంలో అరవింద' చిత్రం తెరకెక్కుతోంది. డాక్టర్ ప్రసాద్ మూరెళ్ల సహకార సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్ ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిదానంలో ప్రారంభోత్సవ వేడుక జరిగింది. హీరోహీరోయిన్లపై ముహూర్తం షాట్‌కు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. వి.శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలిషాట్‌కు మేడిది వెంకటేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభ వేడుకలో నిర్మాత లెక్కల మహేంద్రా రెడ్డి మాట్లాడుతూ.. 'అయోమయంలో అరవింద' ఇప్పటి వరకు వచ్చిన కథలకు భిన్నంగా ఉంటూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది అన్నారు. హీరో రణధీర్ మాట్లాడుతూ.. 'నాకిది రెండో సినిమా. ఇది ఎవరూ ఊహించని క్రైమ్ థ్రిల్లర్. కథ విన్నప్పుడు నేను కూడా అయోమయంలో పడిపోయాను. సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నాడు. హీరోయిన్ సుభ శ్రీ మాట్లాడుతూ... 'ఇది నాకు నాలుగవ ప్రాజెక్ట్. ఈ సినిమా యూనిట్ అంతా సపోర్టుగా ఉన్నారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చింది. హీరో తండ్రి బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రల్లో ఇది కొత్త ప్రయోగం, హీరోయిన్ చేసే మర్డర్స్, హీరో చేధించే తీరు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడం ఖాయం. భిన్నమైన కథ. అందరి ఆశీర్వాదంతో మూడు నెలల్లో సినిమా పూర్తి అయి మీ ముందుకు వస్తుంది. చదవండి: హీరోయిన్‌కు అభిమాని పూజలు, వీడియో వైరల్ వందల కోట్ల స్టార్ హీరోకు దారుణ పరిస్థితి -
కందికొండకు క్యాన్సర్.. ‘మనందరం అండగా నిలబడదాం’
సినిమా ప్రపంచంలో పాటకున్న ప్రత్యేకత అసాధారణమైనది. ఒక్కో సందర్భంలో పాటల ద్వారానే సినిమాలు హిట్ అవుతుంటాయి. ఇలాంటి పాటలను రాయడంలో కందికొండ చెయ్యి తిరిగినవాడు. వందలాది పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపను తాకిన వైనం ఈయనది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నాగుర్లపల్లెలో సామాన్య కుమ్మరి కుటుంబం నుండి వచ్చినవారు కందికొండ. మట్టిమనుషుల యాస–గోసను పట్టిన కలం ఈయన సొంతం. ప్రొఫెసర్ అవ్వాలనే కోరికతో డబుల్ యంఏ చదివి 2004లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు మళ్ళీకూయవే గువ్వా అనే పాట ద్వారా సినిమా ప్రపంచంలోకి అడిగిడునాడు. అనతికాలంలోనే తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అసంఖ్యాక పాటలను అందించాడు. తెలుగు సినిమాలో రజనికాంత్, చిరంజీవితో సహా దాదాపుగా అందరు హీరోలకు కలిపి 1,300 పైగా పాటలను అందించారు కందికొండ. ఈయన పాటలు కేవలం సినిమాకే పరిమితం అవ్వలేదు తెలంగాణ పోరులో సైరన్ అయ్యింది. తెలంగాణ అస్తిత్వంలో పాటై కోట్ల గొంతుకలను ఒక్కటిగా చేసింది. బతుకమ్మ పండుగకు కంది కొండ పాటలేనిదే ఊపులేదనే చెప్పాలి. సందర్భం ఏధైనా సరే భక్తి, రక్తి, ప్రేమ, విరహం, ఊపు, అన్నికోణాల్లో పాటలను అందించగల్గిన ఒకేఒక్కడు కందికొండ. తెలంగాణ సినీగేయాలపై ఉస్మానియాలో పీహెచ్డీ చేసి ఇటీవలే డాక్టరేట్ కూడ అందుకున్నారు. తెలుగు సమాజంలో పాట మాత్రమే బ్రతికివుంటుంది, పాడినోడికి, పాట రాసినోడికి రాని గుర్తింపు కేవలం పాటలకే వస్తుంటాయి, పాటలను గన్నవాళ్ళకు జీవనమే దుర్భరమైన సందర్భాలు మనం చూశాము. కళాకారులు ప్రజల ఆస్తిగా బావించాల్సింది ప్రభుత్వాలే. అందుకే వీళ్ళకు సముచితమైన గౌరవాన్ని అందించడంలో మీనమేషాలు చూడకూడదు. ఇప్పుడు గత కొద్దిరోజులుగా కంది కొండ గొంతు క్యాన్సర్‌తో చావుతో పోరాడుతున్నారు, సరైన వైద్య సదుపాయం కావాలంటే లక్షల రూపాయల్లో ఖర్చు. ఇలాంటి సందర్భంలో అరుదైన కళాకారులను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అస్థిత్వ ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం మరింత అండగా ముందుకు రావాల్సి ఉన్నది. తెలుగు సినిమా ఒకటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ కందికొండను బతికించుకోవడంలో భాగస్వామ్యం వహించవల్సి ఉన్నది. ప్రభుత్వాలే కాకుండా మనం సైతం ఇప్పుడు కందికొండకు అండగ నిలబడాలని ఉంది. దాతలు గూగుల్ పే ద్వారా 8179310687కి సహాయం అదించగలరు. అలాగే కందికొండ రమాదేవి ఆంధ్రాబ్యాంక్ 135510100174728 (అకౌంట్ నంబర్). IFSC ANDB0001355కి కూడా తమ సహాయాన్ని అందించవచ్చును. - వరకుమార్ గుండెపంగు ప్రముఖ కథా రచయిత మొబైల్: 99485 41711 -
త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతా : హీరోయిన్
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మృణాళినీ రవి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారట. ప్రస్తుతం తమిళ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారామె. విక్రమ్ సరసన ‘కోబ్రా’, విశాల్‌తో ‘ఎనిమి’ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో నటించనున్నారని టాక్. ఈ సందర్భంగా మృణాళిని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల అభిమానం ఒక రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఆ అభిమానాన్ని రుచి చూసిన వాళ్లెవరైనా అంత తేలిగ్గా మర్చిపోలేరు. నటనతో పాటు గ్లామర్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ కరోనా లాక్డౌన్లో కొందరు తెలుగు దర్శకులు చెప్పిన కథలను ఆన్లైన్లో విన్నాను. త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతాను’’ అన్నారు. -
సినీ కార్మికులను బతికించుకుంటాం: అనిల్
తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 18 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి కొమర వెంకటేష్‌పై విజయం సాధించారు అనిల్ కుమార్. ప్రధాన కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారి ఆశయాలతో కార్మిక వర్గాన్ని సంక్షేమబాటలో తీసుకుని వెళతాం. సినీ కార్మికుల ఐక్యత కోసమే మేం పోరాడి గెలిచాం. కరోనా వల్ల ఇబ్బందులపాలైన కార్మికులను ఆదుకోవడంపై మొదట దృష్టి పెడతాం. చిరంజీవిగారు, భరద్వాజగారు, సి. కల్యాణ్ వంటి సినీ ప్రముఖులు, ఛాంబర్, నిర్మాతల మండలిల సహకారంతో సినీ కార్మికులను బతికించుకుంటాం’’ అన్నారు. -
దగ్గుబాటి రానా బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
సింగర్ మంగ్లీ గ్లామర్ ఫోటోలు
-
అక్కినేని నాగార్జున స్పెషల్ ఫోటోలు
-
అపూర్వ శ్రీనివాసన్ గ్లామర్ ఫోటోలు
-
వైభవంగా నిర్మాత వల్లూరుపల్లి రమేష్ కుమారుడు వివాహం
-
హీరోయిన్ అదితీ రావ్ హైదరీ క్యూట్ ఫోటోలు
-
అందాల ముద్దుగుమ్మ ప్రణవి గ్లామర్ ఫోటోలు
-
యాంకర్ హరితేజ ఫోటోలు
-
హీరోయిన్ నందిని రాయ్ అదిరే స్టిల్స్
-
బుల్లితెర యాంకర్ భానుశ్రీ అదిరే స్టిల్స్
-
హీరోయిన్ అషిమా నర్వాల్ గ్లామర్ ఫోటోలు