
'కథలో రాజకుమారి' షామిలి కాదు!
చెన్నై: షాలిని చెల్లెలు, అజిత్ మరదలు నటి షామిలి తెలుగు చిత్రం 'కథలో రాజకుమారి'లో నటించడం లేదని ఆమె సన్నిహితులు చెప్పారు. షామిలి ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో నటించేందుకు అంగీకరించారని, మరో మలయాళ సినిమాలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
తెలుగులో ఏ సినిమాకూ షామిలి సంతకం చేయలేదని ఆమె సన్నిహతులు చెప్పారు. కథలో రాజకుమారి చిత్రంలో నారా రోహిత్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించాలని షామిలిని సంప్రదించగా, ఆమె నిరాకరించినట్టు సమాచారం. తమిళ చిత్రం వీర శివాజీలో నటిస్తున్న షామిలి.. ధనుష్తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.