Kathalo Rajakumari
-
రిజల్ట్ గురించి టెన్షన్ లేదు!
‘‘సినిమా రిజల్ట్ గురించి టెన్షన్ లేదు. కొత్త కథతో తీశాను. అవుట్‌పుట్ బాగా వచ్చింది. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు మహేశ్ సూరపనేని. ఆయన్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, రాజేశ్ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు నిర్మించిన చిత్రం ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. మహేశ్ సూరప నేని మాట్లాడుతూ – ‘‘ఇందులో నారా రోహిత్‌ది నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. రాజకుమారిలాంటి అమ్మాయి లైఫ్‌లో ఈ అబ్బాయి ఎలా హీరోగా మారతాడు? అన్నది కథ. నాగశౌర్య, నందితలవి గెస్ట్ రోల్స్. అవసరాల శ్రీనివాసరావుది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఒక బిట్ పాటతో కలిపి ఈ సినిమాలో 7 పాటలుంటాయి. వీటిలో హీరోయిన్ ఇంట్రో, టీజింగ్ సాంగ్‌కు ఇళయరాజాగారు స్వరాలందించారు. మిగిలినవి విశాల్ చంద్రశేఖర్ చేశారు’’ అన్నారు. ‘‘యూఎస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశాను. ఇండియా వచ్చాక ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. పరుచూరి వెంకటేశ్వరరావుగారు, కోనాగారి దగ్గరా వర్క్ చేశాను. అశ్వనీదత్‌గారు నన్ను సపోర్ట్ చేశారు. రెండేళ్లుగా వైజయంతి మూవీస్ తో అటాచై యున్నాను. కొన్ని యాడ్స్ ఫిల్మ్స్ కూడా చేశాను’’ అన్నారు మహేశ్. -
సెప్టెంబర్ 15న 'కథలో రాజకుమారి'
నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ప్రధాన పాత్రలలో మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. రాజేష్ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరులు ఈసినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రమిది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. -
ఆగష్టు 25న 'కథలో రాజకుమారి'
నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం 'కధలో రాజకుమారి'. రాజేష్ వర్మ సిరువూరి సమర్పణలో నిర్మించబడిన ఈ చిత్రానికి సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ నిర్మాతలు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ అందుకొంది. సెన్సార్ సభ్యుల నుండి విశేష స్పందనను పొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన 'కథలో రాజకుమారి'ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి' అన్నారు. -
'కథలో రాజకుమారి' మూవీ స్టిల్స్
-
కుర్రాడు రఫ్
ఓ వైపు క్లాస్.. మరో వైపు మాస్ పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు నారా రోహిత్. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ జోరుగా దూసుకెళుతున్న రోహిత్ నటించిన తాజా చిత్రం ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య తారలుగా మహేశ్ సూరపనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘తెలుగు తెరపై ఇప్పటి వరకూ చూడని విభిన్నమైన పాత్రలో నారా రోహిత్ కనిపిస్తారు. ఆయనది రఫ్ క్యారెక్టర్. రోహిత్, నాగ శౌర్య మధ్య సన్నివేశాలు హైలైట్. ఇళయరాజాగారు ఈ చిత్రానికి రెండు పాటలకు ట్యూన్స్ అందించడం విశేషం. విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలను స్వరపరిచారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నరేష్ కె. రాణా, సమర్పణ: రాజేష్ వర్మ సిరివూరి, నిర్మాణం: ఆరోహి సినిమా, అరన్ మీడియా వర్క్స్, శ్రీహాస్ ఎంటర్టైన్మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్. -
జూన్ 30న 'కథలో రాజకుమారి'
డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా కథలో రాజకుమారి. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అరకు ప్రాంతంలో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. మేస్ట్రొ ఇళయరాజా రెండు పాటలకు సంగీతమందించగా.. 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఫేం విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలకు మ్యూజిక్ చేశాడు. త్వరలో ఈ సినిమా ఆడియోను అరన్ మ్యూజిక్ ద్వారా మర్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో నారా రోహిత్ నటిస్తుండగా మరో యంగ్ హీరో నాగశౌర్య ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. వీరి ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్రయూనిట్. నమిత ప్రమోద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 30న సినిమాలను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోహి సినిమా, అరన్ మీడియ వర్క్స్, శ్రీహాస్ ఎంటెర్టైన్మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. -
జ్యో అచ్యుతానంద కాంబినేషన్లో మరో సినిమా
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. చెప్పుకోదగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న హీరో నారా రోహిత్. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్ కోరిక తీర్చిన సినిమా జ్యో అచ్యుతానంద. కమెడియన్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. నారా రోహిత్‌తో పాటు నాగశౌర్య మరో హీరోగా నటించిన జ్యో అచ్యుతనంద సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్, 'కథలో రాజకుమారి' సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ భామ నమితా ప్రమోద్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరోసారి నారా రోహిత్, నాగశౌర్యలు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగశౌర్య చేస్తుంది అతిథి పాత్రేనట. ప్రస్తుతం రోహిత్, నాగశౌర్యల కాంబినేషన్లో రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నారు. -
'కథలో రాజకుమారి' షామిలి కాదు!
చెన్నై: షాలిని చెల్లెలు, అజిత్ మరదలు నటి షామిలి తెలుగు చిత్రం 'కథలో రాజకుమారి'లో నటించడం లేదని ఆమె సన్నిహితులు చెప్పారు. షామిలి ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో నటించేందుకు అంగీకరించారని, మరో మలయాళ సినిమాలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగులో ఏ సినిమాకూ షామిలి సంతకం చేయలేదని ఆమె సన్నిహతులు చెప్పారు. కథలో రాజకుమారి చిత్రంలో నారా రోహిత్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించాలని షామిలిని సంప్రదించగా, ఆమె నిరాకరించినట్టు సమాచారం. తమిళ చిత్రం వీర శివాజీలో నటిస్తున్న షామిలి.. ధనుష్‌తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.