రిజల్ట్‌ గురించి టెన్షన్‌ లేదు! | kathalo rajakumari was released on Friday | Sakshi
Sakshi News home page

రిజల్ట్‌ గురించి టెన్షన్‌ లేదు!

Published Thu, Sep 14 2017 12:17 AM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

రిజల్ట్‌ గురించి టెన్షన్‌ లేదు! - Sakshi

రిజల్ట్‌ గురించి టెన్షన్‌ లేదు!

‘‘సినిమా రిజల్ట్‌ గురించి టెన్షన్‌ లేదు. కొత్త కథతో తీశాను. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు మహేశ్‌ సూరపనేని. ఆయన్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, రాజేశ్‌ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు నిర్మించిన చిత్రం ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం  శుక్రవారం విడుదల కానుంది. మహేశ్‌ సూరప నేని మాట్లాడుతూ – ‘‘ఇందులో నారా రోహిత్‌ది నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌.

రాజకుమారిలాంటి అమ్మాయి లైఫ్‌లో ఈ అబ్బాయి ఎలా హీరోగా మారతాడు? అన్నది కథ. నాగశౌర్య, నందితలవి గెస్ట్‌ రోల్స్‌. అవసరాల శ్రీనివాసరావుది ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌. ఒక బిట్‌ పాటతో కలిపి ఈ సినిమాలో 7 పాటలుంటాయి. వీటిలో హీరోయిన్‌ ఇంట్రో, టీజింగ్‌ సాంగ్‌కు ఇళయరాజాగారు స్వరాలందించారు. మిగిలినవి విశాల్‌ చంద్రశేఖర్‌ చేశారు’’ అన్నారు. ‘‘యూఎస్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేశాను. ఇండియా వచ్చాక ‘నీకు నాకు డాష్‌ డాష్‌’ సినిమాకి తేజ గారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. పరుచూరి వెంకటేశ్వరరావుగారు, కోనాగారి దగ్గరా వర్క్‌ చేశాను. అశ్వనీదత్‌గారు నన్ను సపోర్ట్‌ చేశారు. రెండేళ్లుగా వైజయంతి మూవీస్‌ తో అటాచై యున్నాను. కొన్ని యాడ్స్‌ ఫిల్మ్స్‌ కూడా చేశాను’’ అన్నారు మహేశ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement