Namitha Pramod
-
Namitha Pramod: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న మలయాళ బ్యూటీ (ఫోటోలు)
-
పండగ వేళ మేలిముసుగులో కవ్విస్తున్న ఈ భామ ఎవరు?
-
మీడియాపై నమిత ఫైర్
సాక్షి, తమిళసినిమా: ఏమిటీ.. నమిత అనగానే ఆసక్తి పెరిగిపోయిందా! అయితే.. మీడియా ఫైర్ అయింది.. ‘మచ్చాస్’ అంటూ అభిమానులను ప్రేమగా పలకరించే నమిత కాదులెండి. అదే పేరుతో మలయాళ చిత్రసీమలో ఓ బ్యూటీ ఉంది. ఆమె పూర్తి పేరు నమితాప్రమోద్. తెలుగులో ఆది సరసన ‘చుట్టాలబ్బాయ్’, కోలీవుడ్‌లోనూ ‘ఎన్ కాదల్ పుదిదు’ , ‘నిమిర్’ లాంటి చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది. ఈ భామ గురించి ఇటీవల కొన్ని గాసిప్స్ ప్రచారం అయ్యాయి. దీంతో మీడియా ఫోకస్ ఆమెపై పడింది. ఇంతకీ ఈ భామకు ఆవేశానికి కారణం ఏమిటంటే.. ‘చిత్ర పరిశ్రమలో ఏ సమస్య తలెత్తినా.. దానితో నాకు సంబంధం లేకపోయినా అందులో నా పేరు చేర్చేస్తున్నారు. ఏ విషయాన్నైనా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేది మీడియానే. అయితే అందులో నిజాలు ఉండేలా చూసుకోవాలి. దేని గురించి అయినా రాసేటప్పుడు దాని గురించి సంబంధిత వ్యక్తులతో సంప్రదించి.. నిజానిజాలను తెలుసుకొని రాయాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదోదే రాసేయకూడదు. కొన్ని సంఘటనల్లో నా పేరు చేర్చి వివాదాల్లోకి లాగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది’ అని నమితా ప్రమోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ గాసిప్స్ వల్ల ఇబ్బందిపడుతున్న నాకు కుటుంబం అండగా నిలుస్తోంది. ఇకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి నాకలాంటి ఆలోచన లేదు. వివాహం తరువాత ఏ అమ్మాయి అయినా తన భర్తపై దృష్టి పెట్టాల్సిఉంటుంది. కాబట్టి మరో మూడేళ్ల వరకు నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు’ అని నమితాప్రమోద్ వివరణ ఇచ్చారు. ఇంతకీ ఈ అమ్మడి ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. ఆ మధ్య మలయాళ చిత్రసీమను కుదిపేసిన ఒక ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ఈమె కూడా రావడమే. ఈ కేసులో తన పేరు ఎందుకు లాగుతున్నారంటూ మీడియా మీద నమితాప్రమోద్ తెగ ఫైర్ అవుతున్నారు. -
అదే నా అచీవ్మెంట్
‘చుట్టాలబ్బాయ్, కథలో రాజకుమారి’ సినిమాల్లో అలరించిన మలయాళీ బ్యూటి నమితా ప్రమోద్ గుర్తుండే ఉంటారు. తెలుగులో సరైన సక్సెస్ లేకపోయినప్పటికి మలయాళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు అచీవ్ చేసింది ఏంటి? అనే ప్రశ్నను తన ముందుంచితే ‘‘చిన్నప్పటి నుంచి ఆడీ కార్ కొనుక్కోవాలని చాలా ఆశపడ్డాను. ఇండస్త్రీలోకి వచ్చాక నా అచీవ్మెంట్ అంటే సొంతంగా ఆడీ కార్ కొనుక్కోవడమే. పద్దెనిమిదేళ్ల వయసులో ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను అనుకోగానే వెంటనే ఆడీ కార్ కొనుకున్నాను. ఇప్పటివరకైతే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఇదే’’ అని పేర్కొన్నారు నమితా. -
ఆయన్ను మరో అవకాశం అడిగా..
సాక్షి, చెన్నై: ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించడానికి మరో అవకాశం అడిగానని నటుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం నిమిర్. ఈ చిత్రంలో నమితా ప్రమోద్, పార్వతీనాయర్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో ప్రకాష్‌రాజ్, సముద్రఖని, ఎంఎస్.భాస్కర్. కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషించారు. మూన్‌షాట్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై సంతోష్కురువిల్లా నిర్మించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడు. చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. గురువారం సాయంత్రం ఆడియో ఆవిష్కరణ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఉదయనిధిస్టాలిన్ మాట్లాడుతూ.. నిమిర్ చిత్రంలో దర్శకుడు ప్రియదర్శన్ చెప్పినట్లు నటించానన్నారు. ఇందులో సముద్రఖనితో మూడు రోజుల పాటు ఫైట్ సన్నివేశాల్లో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. నిమిర్ చిత్ర తొలి కాపీ చూసిన తరువాత మరో చిత్రంలో ఒక పాత్ర ఉన్నా పిలవండి వచ్చి నటిస్తానని దర్శకుడు ప్రియదర్శన్‌ను అడిగానని ఉదయనిధిస్టాలిన్ అన్నారు. నిర్మాత సంతోష్ కురువిల్లా మాట్లాడుతూ.. ప్రియదర్శన్ దర్శకత్వంలో చిత్రం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. తాను చెన్నైలో కార్యాలయం లేకుండానే నిమిర్ చిత్రాన్ని పూర్తి చేశానని తెలిపారు. అంతగా రెడ్‌జెయింట్, ఫోర్ఫ్రేమ్స్ సంస్థలు సహకరించాయని చెప్పారు. ఇకపై ఇక్కడ కార్యాలయాన్ని నెలకొల్సి పలు చిత్రాలు నిర్మిస్తానని అన్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో రెండు నిమిషాల పాత్ర ఉన్నా నటించడానికి తాను సిద్ధం అని నటి పార్వతీనాయర్ అన్నారు. -
వెరీ స్పెషల్
ఐదు నెలల తర్వాత ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు మలయాళ నటుడు దిలీప్. అంత గ్యాప్ ఎందుకొచ్చింది? అంటే.. నటి భావన కేసులో నిందితుడిగా ఆల్మోస్ట్ 80 రోజులు జైల్లో ఉన్నారాయన. గతేడాది జూలై 10న దిలీప్ ‘రామలీల’ సినిమాలోని ఓ లుక్‌ను పోస్ట్ చేశారు. అదే రోజున భావన కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు. దిలీప్ రిలీజైన తర్వాత విడుదలైన ‘రామలీలా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అయితే.. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసింది తన అప్‌కమింగ్ సినిమా ‘కమ్మార సంభవం’ గురించి. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న లుక్‌ను ఫేస్బుక్లో పోస్ట్ చేశారాయన. దిలీప్, సిద్ధార్థ్, నమితా ప్రమోద్, బాబీ సింహా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. రతిస్ అంబత్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి 2016లో ఈ సినిమా స్టారై్టంది. దిలీప్ అరెస్ట్ ఇష్యూతో షూటింగ్ లేట్ అయ్యింది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతం వేగంగా జరుపుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. మలయాళంలో సిద్ధార్థ్‌కు ఈ సినిమా ఫస్ట్ మూవీ. ‘మలయాళంలో నా తొలి చిత్రం ‘కమ్మార సంభవం’ ఫస్ట్ లుక్ ఇది. దిలీప్ లుక్ బాగుంది కదూ. వెరీ స్పెషల్ లుక్. నాకు వెరీ వెరీ స్పెషల్ పిక్చర్’ అని సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. -
రిజల్ట్ గురించి టెన్షన్ లేదు!
‘‘సినిమా రిజల్ట్ గురించి టెన్షన్ లేదు. కొత్త కథతో తీశాను. అవుట్‌పుట్ బాగా వచ్చింది. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు మహేశ్ సూరపనేని. ఆయన్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, రాజేశ్ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు నిర్మించిన చిత్రం ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. మహేశ్ సూరప నేని మాట్లాడుతూ – ‘‘ఇందులో నారా రోహిత్‌ది నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. రాజకుమారిలాంటి అమ్మాయి లైఫ్‌లో ఈ అబ్బాయి ఎలా హీరోగా మారతాడు? అన్నది కథ. నాగశౌర్య, నందితలవి గెస్ట్ రోల్స్. అవసరాల శ్రీనివాసరావుది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఒక బిట్ పాటతో కలిపి ఈ సినిమాలో 7 పాటలుంటాయి. వీటిలో హీరోయిన్ ఇంట్రో, టీజింగ్ సాంగ్‌కు ఇళయరాజాగారు స్వరాలందించారు. మిగిలినవి విశాల్ చంద్రశేఖర్ చేశారు’’ అన్నారు. ‘‘యూఎస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశాను. ఇండియా వచ్చాక ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. పరుచూరి వెంకటేశ్వరరావుగారు, కోనాగారి దగ్గరా వర్క్ చేశాను. అశ్వనీదత్‌గారు నన్ను సపోర్ట్ చేశారు. రెండేళ్లుగా వైజయంతి మూవీస్ తో అటాచై యున్నాను. కొన్ని యాడ్స్ ఫిల్మ్స్ కూడా చేశాను’’ అన్నారు మహేశ్. -
శివకార్తికేయన్ బాటలో ఉదయనిధి
తమిళసినిమా : మలయాళంలో ఘన విజయం సాధించిన ‘మగేషిండె ప్రదీగారం‘ చిత్రం ఇప్పుడు తమిళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో, ఉదయనిధి స్టాలిన్ హీరోగా రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని ‘మూన్ షూట్’ ఎంటర్టెయిన్మెంట్ అనే కొత్త చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. రెండు జాతీయ పురస్కారాలు, ఐదు రాష్ట్ర అవార్డులు, రెండు ఫిలింఫేర్లతోపాటు పలు ప్రైవేటు టీవీ సంస్థల అవార్డులను పొందిన ‘మగేషిండె ప్రదీగారం‘ చిత్రానికి తమిళంలో ఇంకా పేరు ఖరారు కాలేదు. ఇందులో ఉదయనిధి స్టాలిన్ సరసన పార్వతి నాయర్, ప్రముఖ మలయాళ నటీమణి నమితా ప్రమోద్‌లు నాయకిలుగా నటిస్తుండగా, వీరితోపాటు సముద్రఖని, ఎంఎస్.భాస్కర్, కరుణాకరన్ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని డైలాగ్‌లు రాస్తుండగా, టర్బుకా శివ సంగీతం సమకూరుస్తున్నారు. ఏకాంబరం స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం చెన్నైలో ‘ఫోర్ ఫ్రేమ్స్’ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ నెల 19వ తేదీ నుంచి కుట్రాళం, తెన్కాశి ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించనున్నారు. దర్శకుడు ప్రియదర్శన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. కాగా, ఇప్పటికే కుట్రాళంలో పొన్రామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్ర షూటింగ్ జరుగుతోంది. కొన్ని రోజులుగా శివకార్తికేయన్ అక్కడ బస చేసి నటిస్తున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే ఉదయనిధి కూడా కొత్త చిత్రం షూటింగ్ కోసం అక్కడికి చేరుకోవడం విశేషం. దీంతో ఒకేసారి ఇద్దరు యువ హీరోల చిత్రాల షూటింగ్‌లు జరుగుతండడంతో కుట్రాళంలో తారల కళ సంతరించుకుంది. షూటింగ్ చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నట్లు సమాచారం. -
‘చుట్టాలబ్బాయి’ ఆడియో రిలీజ్
-
ఆదితో కలసి నటించడం కిక్ ఇచ్చింది
- సాయికుమార్ ‘‘ఇప్పటి తరంలో ప్రతిభ చాలా ఉంది. కానీ, వారికి ప్రోత్సాహం లభించడం లేదు. కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత దర్శక-నిర్మాతలపై ఉంది. పీజే శర్మ కుటుంబం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. మంచి హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఆదిలో ఉన్నాయి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తలసాని విడుదల చేసి దర్శకుడు కొరటాల శివకు అందించారు. హీరో సుధీర్‌బాబు ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ - ‘‘తెలంగాణ ప్రభుత్వం చిన్న చిత్రాల కోసం ఐదో ఆటకు వెసులుబాటు కల్పిస్తోంది. డెరైక్టర్ కొరటాల శివ పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ‘చుట్టాలబ్బాయి’ విజయవంతమై చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. వీరభద్రమ్ మాట్లాడుతూ- ‘‘ఆది, సాయికుమార్‌గారు మొదటిసారి కలిసి నటించిన చిత్రమిది. ఈ చిత్రంతో మా నిర్మాతలకు ‘చుట్టాలబ్బాయి’ అనేది ఇంటి పేరుగా మారిపోతుంది. అంత బాగా నిర్మించారు’’ అన్నారు.‘‘మేం ఈ చిత్రం నిర్మించామంటే కారణం వీరభద్రమ్. తను పని రాక్షసుడు. ఈ సినిమా బాగా తీశాడు’’ అని నిర్మాతలు తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ- ‘‘నేను, మా అబ్బాయి ఆది కలిసి ఓ చిత్రం చేయాలనుకుంటున్న సమయంలో ఈ చిత్రం కుదిరింది. ఆదితో కలిసి నటించడం నాకు కిక్ ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూసేలా వీరభద్రమ్ ఈ చిత్రం తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆది, నమితా ప్రమోద్, ఎస్ఎస్ తమన్, హీరోలు సందీప్ కిషన్, రాజ్ తరుణ్, నిర్మాతలు కేకే రాధామోహన్, మల్కాపురం శివకుమార్, శ్రీమతి జీవితా రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.