
నమితా ప్రమోద్
‘చుట్టాలబ్బాయ్, కథలో రాజకుమారి’ సినిమాల్లో అలరించిన మలయాళీ బ్యూటి నమితా ప్రమోద్ గుర్తుండే ఉంటారు. తెలుగులో సరైన సక్సెస్ లేకపోయినప్పటికి మలయాళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు అచీవ్ చేసింది ఏంటి? అనే ప్రశ్నను తన ముందుంచితే ‘‘చిన్నప్పటి నుంచి ఆడీ కార్ కొనుక్కోవాలని చాలా ఆశపడ్డాను. ఇండస్త్రీలోకి వచ్చాక నా అచీవ్‌మెంట్ అంటే సొంతంగా ఆడీ కార్ కొనుక్కోవడమే. పద్దెనిమిదేళ్ల వయసులో ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను అనుకోగానే వెంటనే ఆడీ కార్ కొనుకున్నాను. ఇప్పటివరకైతే నా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అంటే ఇదే’’ అని పేర్కొన్నారు నమితా.