Audi car
-
పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే కుమారుడు సంకేత్ బవాన్కులే మద్య మత్తులో బీభత్సం సృష్టించారు. పూటుగా మద్యం సేవించి ఇతర వాహనాల్ని ఢీకొట్టారు. ఘటన అనంతరం సంకేత్ బవాన్‌కులేతో పాటు అతని స్నేహితులు పరారయ్యారు. సంకేత్ కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..సోమవారం అర్ధరాత్రి 1 గంటకు మద్యం మత్తులో ఉన్న సంకేత్ బవాన్కులే ఆడి కారుతో మాన్కాపూర్ ప్రాంతం వైపు వెళుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్న వాహనాల్ని ఢీకొట్టాడు. నానా హంగామా చేశాడు. అయితే సంకేత్ తీరుతో కోపోద్రికులైన ఇతర వాహనదారులు.. అతని కారును వెంబడించారు. దీంతో మార్గం మద్యలోనే కారును వదిలేశాడు. అందులో ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్ట్.. ఆపై బెయిల్ప్రమాదంలో తన కారుకు డ్యామేజీ జరిగిందంటూ జితేంద్ర సోన్కాంబ్లే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంకేత్ బవాన్కులే కారు డ్రైవర్ అర్జున్ హవ్రే, రోనిత్ చిట్టమ్‌వార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది సేపటికే బెయిల్‌పై విడుదలయ్యారు. చట్టం ముందు అందరూ సమానులేఈ సందర్భంగా కారు ప్రమాదంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే స్పందించారు. ఆ ఆడి కారు తన కుమారుడు సంకేత్ పేరిట రిజిస్టర్ అయినట్లు అంగీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా క్షుణ్ణంగా,నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి.దోషులకు కఠిన శిక్ష విధించాలి.చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. -
ఆడి కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్న రైతు
-
ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో
సాధారణంగా ధనవంతులు విలాసవంతమైన జీవితం గడుపుతారని దాదాపు అందరికి తెలుసు. అయితే కొంతమంది దీనికి భిన్నంగా పొలంగా వ్యవసాయం చేస్తారు, రోడ్డుపై కూరగాయలు అమ్ముతారు. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెరైటీ ఫార్మర్ (variety_farmer) అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పేజీలో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన ఆడి కారులో వచ్చి.. రోడ్డు పక్కన ఆకుకూర అమ్మడం చూడవచ్చు. ఈ వీడియో చూడగానే కొందమందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది నిజమే. ఆధునిక కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు వీడియోలో కనిపించే వ్యక్తి. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి ఆడి కారులో వచ్చి ఒక దుకాణం ముందు ఆగాడు. ఆ తరువాత అక్కడే పక్కన ఉన్న ఆటో రిక్షా వద్దకు వెళ్లి ఆకు కూరని రోడ్డుపక్కన ప్లాస్టిక్ షీట్ మీద వేస్తాడు. మొత్తం అమ్మేసిన తరువాత ప్లాస్టిక్ షీట్ మడిచి ఆటోలో పెట్టుకుని మళ్ళీ తన కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ఈ యువ రైతు పేరు సుజిత్. కేరళకు చెందిన ఈయన గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఆవార్డులను కూడా అందుకున్నాడు. యితడు అందరు రైతుల మాదిరిగానే వ్యవసాయం ప్రారంభించి కరంగా పురోగతి సాధించాడు. వచ్చిన లాభాలతోనే ఆడి కారు కొన్నట్లు తెలిపాడు. ఈ కారు ధర రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. View this post on Instagram A post shared by variety farmer (sujith) (@variety_farmer) -
నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి 'నిహారిక కొణిదెల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లి తెరమీద, వెండి తెర మీద తనదైన రీతిలో ప్రేక్షలకులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత వెబ్ సిరీస్ వంటివి చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇంతకీ నిహారిక ఆస్తులు విలువ ఎంత? ఆమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1993 డిసెంబర్ 18 న జన్మించిన నిహారిక హైదరాబాద్ సెయింట్ మెరీన్ కాలేజీలో చదువుకుంది. చదువు పూర్తయిన తరువాత టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి ఢీ జూనియర్ వంటి వాటికి హోస్ట్‌గా వ్యవహరించి ఒక మనసు సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. ఈమె తమిళ వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ 2020 నాటికి 4 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ. ఈమె ఒక్కో సినిమాకి సుమారు రూ. 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది కూడా చెబుతున్నారు. నిహారిక హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో నివసించేది, ఆమెకు సొంతంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి కారు కూడా ఉంది. అయితే ఈమె వివాహం 2020లో చైతన్య జొన్నల గడ్డతో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఇతడు 2018లో 'ది హరికేన్స్' అనే సొంత కంపెనీని ప్రారంభించాడు. చైతన్య జొన్నల గడ్డ ప్రస్తుతం మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూనే నెస్లే, ఐబిఎమ్, ఎయిర్టెల్ అంటి అనేక ఇతర ప్రసిద్ధ భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం. వీటి కుటుంబ ఆస్తుల విలువ కూడా కోట్లలో ఉంది. కాగా ఇటీవల నిహారిక పింక్ ఎలిఫేంట్ అనే ప్రొడక్షన్ కోసం కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది, ఈ ఆఫీస్ ప్రారంభానికి చైతన్య రాకపోవడం గమనార్హం. మొత్తం మీద బుల్లితెర నుంచి కోట్లు సంపాదించేవరకు ఎదిగింది కొణిదెల నిహారిక. -
ODI WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?
Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య 1996 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్‌కప్ మ్యాన్ ఆఫ్ సిరీస్ కార్‌తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్ ఇచ్చాడు. సనత్ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కంగారూ జట్టును చిత్తుచేసి ప్రపంచకప్- 1996 ఫైనల్లో లాహోర్ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లంక ఆసీస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది. ఇదిలా ఉంటే.. సనత్ జయసూర్య తన కెరీర్లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్‌లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్ ఆల్‌రౌండర్ తన కెరీర్ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Sanath Jayasuriya (Official) (@sanath_jayasuriya) -
అందాల చిన్నది లగ్జరీ కారు: ఫోటోలు వైరల్, నెటిజన్ల కామెంట్స్ చూడాలి!
సాక్షి, ముంబై: బాలనటి, టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్. రివా అరోరా (13)రూ. 44 లక్షల విలువైన ఆడి కారును సొంతం చేసుకుంది. ఈమేరకు బ్లాక్ ఆడి కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ('డ్రైవింగ్ లైసెన్స్ బనా హై?') అంటూ మరి కొంతమంది ప్రశ్నించారు. రివా అరోరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తల్లి నిషా ఆమెకు విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చింది. 44 లక్షలకు పైగా విలువైన బ్లాక్ ఆడి క్యూ3 కారుతో ఫోజులిస్తూ రివా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలను తమ ప్యాన్స్‌తో పంచుకుంది. కొంచెం ఆలస్యమైనాగానీ, మొత్తానికి సెలబ్రేట్ చేసుకుంటున్నా..ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. 10.6 మిలియన్ ఇన్‌స్టా ఫ్యామిలీ ఎంతో అపురూపమైన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో లైసెన్స్ ఉందా ముందు లైసెన్స్ తీసుకో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. రివా అరోరా ఎవరంటే? రివా అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్. అంతేకాదు మామ్, మణికర్ణిక, మర్ద్ కో దర్ద్ నహీ హోతా, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, ది సర్జికల్ స్ట్రైక్ , గుంజన్ సక్సేనాలో నటించింది. ఆమె చివరిగా రకుల్ ప్రీత్ నటించిన ఛత్రివాలిలో కనిపించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలతో ఆకట్టుకుంది. కాగా మికా సింగ్, కరణ్ కుంద్రాలతో రొమాంటిక్ రీల్ చేయడంపై చిన్నపిల్లతో డ్యాన్సులా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. 2010లో పుట్టిందని భావిస్తున్న రివా వయసుపై వివాదం ఉంది. అయితే తన వయసు 12 కాదంటూ రివా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలాగే రివా వయసు 12 కాదు 16 ఏళ్ల అని నిషా తల్లి ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Riva Arora (@rivarora_) View this post on Instagram A post shared by Riva Arora (@rivarora_) -
మార్కెట్లోకి ఆడి కొత్త కారు..! అదిరిపోయే లుక్.. వావ్ అనేలా ప్రత్యేకతలు..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ కార్ల హవా కొనసాగుతోంది. టాప్ బ్రాండ్ల ప్రీమియం కార్లకు లగ్జరీతో పాటు అదిరిపోయే ఫీచర్లు ఉంటే చాలు, ఆ కార్ల డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సీరిస్ నుంచి మరో కొత్త కారును ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. సెడాన్ ఫ్లాగ్షిప్ ఆడి ఏ8 ఎల్ (Audi A8 L)ను తాజాగా విడుదల చేసింది. కారు లాంచింగ్ సందర్బంగా ఆ సంస్థ ఇండియన్ హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ఆడి ఏ8 ఎల్ మోడల్ కస్టమర్లని మరింత ఆకట్టుకునేలా, బెస్ట్ టెక్నాలజీతో పాటు కస్టమర్ల సౌకర్యంలో ఏ మాత్రం రాజీపడకుండా ఉండే ఫీచర్లతో తయారుచేసినట్లు తెలిపారు. ఇండియాలో ఆడి A8L కారు.. ఆడి A8 L సెలబ్రేషన్ ఎడిషన్, (ధర రూ.1.29 కోట్లు), ఆడి A8 L టెక్నాలజీ (ధర రూ. 1.57 కోట్లు) రెండు వేరియంట్లో డిజైన్ చేసినట్లు చెప్పారు. ఆడి A8 L సెలబ్రేషన్ ఎడిషన్ 5- సీటర్‌గా అందుబాటులో ఉండగా, ఆడి A8 L టెక్నాలజీ వేరియంట్ మాత్రం 4, 5-సీట్ల కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ప్రత్యేకతలను ఓ లుక్కేద్దాం. కలర్ ఆప్షన్స్ ఈ సెడాన్ ఎనిమిది స్టాండర్ట్ ఎక్స్టీరియర్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ కొత్త ఆడి కారును టెర్రా గ్రే, ఫిర్మామెంట్ బ్లూ, డిస్ట్రిక్ట్ గ్రీన్, ఫ్లోరెట్ సిల్వర్, గ్లేసియర్ వైట్, మాన్‌హట్టన్ గ్రే, వెసువియస్ గ్రే, మైథోస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇంటీరియర్ విషయానికొస్తే.. మదర్ ఆఫ్ పెర్ల్ బీజ్, కాగ్నాక్ బ్రౌన్, సార్డ్ బ్రౌన్, బ్లాక్ వంటి నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇంజిన్ కెపాసిటీ డైనమిక్ 3.0L టర్బో చార్జ్ TFSI (పెట్రోల్), 48V మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఫీచర్స్ ఉన్న ఈ కారు.. 340 hp పవర్‌ను, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా కేవలం 5.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. కారులోని సస్పేన్షన్ ఫీచర్ ఏర్పాటు చేయడంతో ఇది కస్టమర్లకు సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని కలిగిస్తుంది. సేఫ్టీ సూట్.. కారులో మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్(ఫ్రంట్ అండ్ రియర్ సీట్లుతో పాటు సైడ్ బ్యాగ్స్‌తో కలిపి) ఉన్నాయి. కారుకు ఏదైనా ప్రమాదం జరిగిన కేవలం మిల్లీసెకన్ల సమయంలోనే ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చేలా అమర్చారు. చదవండి: Bajaj Pulsar Price Hike.. ఆ బైక్ మోడళ్ల ధరలు పెంచిన బజాజ్.. ఎంతంటే? -
రవిశాస్త్రి, మియాందాద్ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.?!
టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అందరికి సుపరిచితమే. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కామెంటేటర్‌గా, టీమిండియా హెడ్‌కోచ్‌గానూ సేవలందించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ లిస్టులోనూ తనది ప్రత్యేక స్థానం. ఇక గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 1983 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నాడు. విషయంలోకి వెళితే.. 1985లో ఆస్ట్రేలియా వేదికగా బెన్సన్ అండ్ హెడ్జెజ్ వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. చిరకాల ప్రత్యర్థి పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన రవిశాస్త్రి 182 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన రవిశాస్త్రి ఆడి కారును సొంతం చేసుకున్నాడు. విజయం అనంతరం ఆడి కారును రవిశాస్త్రి ఎంతో ఇష్టంగా డ్రైవ్ చేయగా.. తోటి టీమిండియా ఆటగాళ్లు కారు మీద కూర్చోని సెలబ్రేషన్స్ చేసుకోవడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో అదే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ తనను అవమానించిన ఒక సంఘటనను.. ఆడి కారు గెలుచుకోవడం వెనుక ఉన్న కథను తాజాగా రివీల్ చేశాడు. ''1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడానికి మాకు మరో 15-20 రన్స్ అవసరం ఉంది. ఆ సమయంలో జావెద్ మియాందాద్ సెట్ చేసిన ఫీల్డ్ ను తెలుసుకోవడానికి స్క్వేర్ లెగ్ వైపు చూస్తున్నాను. అప్పుడు మిడ్ వికెట్ లో ఉన్న మియాందాద్ నా దగ్గరికి వచ్చి.. నువ్వు మళ్లీ మళ్లీ అక్కడేం చూస్తున్నావ్ అని తనదైన స్టైల్లో అన్నాడు. కారును ఎందుకు చూస్తున్నావ్.. అది నీకు దక్కదు అంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి కౌంటర్‌గా అవును జావెద్.. నేను అటు వైపు చూడడం లేదు.. ఆ కారే నా వైపు చూస్తుంది.. నా ఇంటికి వస్తుంది అని పేర్కొన్నా'' అంటూ తెలిపాడు. ఇక 1983 వరల్డ్ కప్ గెలిచిన రెండేళ్లకే వరల్డ్ సిరీస్ గెలవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. తన జీవితంలో తాను చేసిన ఎన్నో పనుల కంటే ఆడి కారు టాప్ స్థానంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఆరు సిక్స్‌లు కూడా ఎప్పటికీ గుర్తొచ్చేదే అయినా.. తన కెరీర్లో మాత్రం 1985లో సాధించిన ఆడి కారుకే ఎక్కువ విలువుంటుందని తెలిపాడు. అప్పుడప్పుడే వన్డే క్రికెట్ లోకి రంగులు రావడం, డే నైట్ మ్యాచ్ లు, రంగుల దుస్తులు తొలిసారి ఇండియాకు రావడం లాంటివి ప్రత్యేకమైనవి. ఇక ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడం అంటే అది పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి కొన్ని అద్భుత విజయాల్లో భాగంగా నిలిచాడు. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా టీమిండియా 43 టెస్టుల్లో 25 విజయాలు సాధించింది. ఇందులో రెండుసార్లు ఆసీస్ గడ్డపై సాధించిన టెస్టు సిరీస్ విజయాలు ఉండడం విశేషం. ఇక రవిశాస్త్రి 76 వన్డేల్లో 51 వన్డేలు, 65 టి20ల్లో 43 మ్యాచ్‌లు గెలిచింది. చదవండి: Arjun Tendulkar: తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా! Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక -
లగ్జరీ కారు కొన్న గజల్, భర్తతో కారు ముందు పోజులు!
'షార్క్ ట్యాంక్ ఇండియా షో' ఫేమ్ గజల్ అలగ్ కొత్త కారు కొనుగోలు చేసింది. రూ.1.19 కోట్ల ఖరీదైన ఆడి ఈ త్రోన్ అనే లగ్జరీ కారును తన గ్యారేజీలోకి తచ్చుకుంది. భర్త వరుణ్‌తో కలిసి కారు ముందు దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా రెండు నెలల క్రితమే ఆమె ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గజల్, వరుణ్ 2016లో మామాఎర్త్ ఫౌండేషన్‌ను స్థాపించారు. తమ కొడుకు అగస్త్యకు మార్కెట్లో సహజ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఎంతో కష్టపడ్డామని, ఆ క్రమంలోనే మామాఎర్త్ను స్థాపించాలన్న ఆలోచన పుట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పలు స్టార్టప్స్‌కు, మంచి ఐడియాతో వచ్చే ఎంట్రప్రెన్యూర్స్‌కు షార్క్ ట్యాంక్ ఇండియా ఫండింగ్‌ను అందిస్తోంది. ఇది ఒక బిజినెస్ రియాలిటీ షో. భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, boAt సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమన్ గుప్తా, Shaadi.com, పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీఈవో అనుపమ్ మిట్టల్ సహా నమితా థాపర్, వినీతా సింగ్, పీయుష్ బన్సల్ వంటి బడా పారిశ్రామికవేత్తలు ఈ షోలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Ghazal Alagh (@ghazalalagh) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు! -
ఈవీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ ఎలక్ట్రిక్ వెహికల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా ఆయన ఆడి సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు ఈ ట్రోన్‌ను కొనుగోలు చేశారు. గతేడాది ఈ ట్రోన్ కారుని ఆడి సంస్థ లాంఛ్ చేసింది. ఆ తర్వాత మహేశ్ బాబు ఈ కారుని బుక్ చేసుకున్నారు. కాగా 2022 ఏప్రిల్ 16న మహేశ్‌బాబుకి కారుని హ్యాండోవర్ చేశారు ఆడి ఇండియా ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్. ఆడి ఈ ట్రోన్ కారు ఎక్స్‌షోరూం ధర రూ 1.01 కోట్ల నుంచి 1.19 కోట్ల వరకు ఉంది,. ఈ ట్రాన్ కారు బ్యాటరీ సామర్థ్యం 71 కిలోవాట్స్, 308 హార్స్ పవర్స్‌తో 540 ఎన్ఎం టార్క్‌ని అందిస్తుంది. కేవలం 6.8 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్ల స్పీడు అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. చదవండి: వారెవ్వా ఆడి..గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది! -
వారెవ్వా ఆడి..గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఆడి ‘క్యూ7 ఎస్యూవీ’ కొత్త వెర్షన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర క్యూ7 ప్రీమియం ప్లస్ రూ.79.99 లక్షలు, క్యూ7 టెక్నాలజీ రూ.88.33 లక్షలు ఉంది. 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 8 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది. రూ.5లక్షలు చెల్లించి కార్ బుక్ చేసుకోవచ్చు లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్ ప్రీమియం ఎస్యూవీ ‘క్యూ7’కు బుకింగ్‌లు తీసుకుంటున్నట్టు గతంలో ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో 2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్‌లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని ఆడి ప్రతినిధులు వెల్లడించారు. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాట్టో ఆల్‌వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. -
అమ్మ బాబోయ్.. సల్మాన్ ఖాన్‌కి అన్ని కోట్ల బహుమతులా!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న తన 56వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. పాన్వేల్‌లోని తన ఫాంహౌస్‌లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకకి కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా సల్మాన్ ఖాన్‌కి ఖరీదైన బహుహతులు ఇచ్చారు. సల్మాన్ మాజీ ప్రేయసీ కత్రినా కైఫ్ సుమారు రూ.3 లక్షలు పెట్టి బంగారపు బ్రాస్లెట్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. సంజయ్ దత్ సూమారు రూ.8 లక్షలు విలువ చేసే డైమాండ్ బ్రాస్లెట్ను బహుమతిగా అందించారు. అనిల్‌కపూర్.. లెదర్ జాకెట్ (దాదాపు రూ.29లక్షలు), జాక్వెలిన్ రూ.12 లక్షలు విలువ చేసే స్పెషల్ వాచ్‌ని గిఫ్ట్‌గా అందించిదట. (చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్..) అలాగే సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చారు. అతని సోదరి అర్పిత రూ. 15-17 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చింది. అతని సోదరులు, సోహైల్ ఖాన్ , అర్బాజ్ ఖాన్ అతనికి బీఎండబ్ల్యూ కారు (రూ.25 లక్షలు), ఆడీ కారు( రూ.3కోట్లు) ఇచ్చారట. అర్పితా ఖాన్ భర్త మరియు సల్మాన్ బావ మరియు యాంటిమ్ సహనటుడు ఆయుష్ అతనికి రూ. 75,000 విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు. వీటితో పాటు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ జుహులో రూ.12 కోట్లు విలువ చేసే అపార్ట్‌మెంట్‌ని బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బర్త్‌డేకి ఇన్ని కోట్ల బహుమతులు రావడం పట్ల సల్లూ భాయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, నెటిజన్స్ మాత్రం ‘అమ్మ బాబోయ్.. సల్మాన్ ఖాన్ బర్త్‌డేకి అన్ని కోట్ల బహుమతులా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
లగ్జరీ కారు కొన్న కియారా అద్వానీ.. ధర ఎంతంటే?
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటి కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్ ధోనీ, కబీర్ సింగ్, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇటీవలే ఈ బ్యూటీ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా నటించే చాన్స్ కొట్టేసింది. కియారా, చెర్రీ జంటగా వస్తున్న రెండో చిత్రం ఇది. ఇలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న కియారా.. వ్యక్తిగత జీవితాన్ని కూడా రిచ్‌గానే ఎంజాయ్ చేస్తుంది. ఈ అమ్మడుకి కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె దగ్గర బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెజ్ బెంజ్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ 530డీ వంటి విలావంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా వీటి జాబితాలో ఆడి ఏ8 ఎల్ కూడా చేరింది. ఆడి ఈ మోడల్‌ను గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.1.56 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. Progress and creativity go hand in hand. We’re happy to welcome @advani_kiara to the Audi experience.#FutureIsAnAttitude #AudiA8L pic.twitter.com/CuGimQDJok — Audi India (@AudiIN) December 15, 2021 -
మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ
తిరువనంతపురం: మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26)ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కావాలనే కొందరు వ్యక్తులు వీరిని ఆడి కారులో వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. కారులో వీరిని వెంబడించిన సైజు థంకచన్కు డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలున్నట్లు విచారణలో తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2021, నవంబర్ 1న మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనాలు ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో అన్సీ కబీర్, అంజనాలు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే చనిపోవాడానికి ముందు వీరు ఫోర్ట్ కొచ్చి ప్రాంతంలో ఉన్న హైఎండ్ హోటల్ నంబర్.18లో ఓ పార్టీ హాజరయినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం) పార్టీ ముగిసిన తర్వాత మోడల్స్ ఇంటికి వెళ్తుండగా.. పార్టీకి వచ్చిన కొందరు అతిథులు మోడల్స్ ఇంటికి వెళ్తుండగా ఆడి కారులో వారిని వెంబడించారు. సీసీటీవీ కెమరా ఫుటేజ్‌లో ఆడి కారు మోడల్స్‌ని ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆడి కారు డ్రైవ్ చేసిన వ్యక్తి సైజు థంక్‌చన్ అని.. అతడికి కొచ్చిలోని డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి కొచ్చికి మాదక ద్రవ్యాలు తెచ్చే గ్రూప్ కోసం సైజు పని చేసేవాడని పోలీసులు తెలిపారు. పార్టీ ముగిసిన తర్వాత తనతో రావాల్సిందిగా సైజు మోడల్స్‌ని ఆహ్వానించాడు. కానీ వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో సైజు వారిని ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి అంజనా, అన్సీ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పార్టీ జరిగిన హోటల్ హోటల్ యజమాని రాయ్ వాయలత్‌తో పాటు కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం) మే 2021లో సైజు ఫోటో జత చేసిన ఇంటెలిజెన్స్ నివేదిక ఒకటి నంబర్ 18 హోటల్లో జరిగిన పార్టీలలో డ్రగ్స్ వాడినట్లు తెలుపుతోంది. అయితే, హోటల్ యజమాని రాయ్ వాయలత్కు పోలీసులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈ కేసు తదుపరి విచారణ ముందుకు సాగలేదు. చదవండి: ఆడి కారు యాక్సిడెంట్: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది? -
ఆడి కారు యాక్సిడెంట్: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది?
బనశంకరి(కర్ణాటక): ఐటీ సిటీలో ఆడి కారు దుర్ఘటనలో ఎమ్మెల్యే తనయుడు, మరో ఆరుగురు యువతీ యువకుల మరణం సంచలనాత్మకమైంది. హై ఎండ్ కారుతో యువత సరదాలు కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఈ కేసులో కొత్త కొత్త అంశాలు నెమ్మదిగా వెలుగుచూస్తున్నాయి. కరుణాసాగర్, అతని స్నేహితులు మిడ్ నైట్ పార్టీ చేసుకుని జాలీ రైడ్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 150 కిలోమీటర్ల వేగం బెంగళూరు రోడ్ల మీద 90–100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కష్టం. ప్రమాద సమయంలో 150 కిలోమీటర్లు కంటే ఎక్కువ వేగంతో కారు డ్రైవింగ్ చేశారంటే మత్తులో ఉండి ఉండాలని పోలీసులకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగల, ఎంజీ రోడ్డు, ఇందిరానగర హోటల్స్, పబ్‌లను పరిశీలించాలని నిర్ణయించారు. కరుణాసాగర్ మిత్రబృందం ఎక్కడెక్కడ తిరిగిందో పసిగట్టేందుకు అక్కడి సీసీ కెమెరాల చిత్రాలను తనిఖీ చేయనున్నారు. యాక్సిడెంట్ జరిగినచోట రోడ్డు కుడివైపునకు వంపు ఉండగా, కారు ఎడమవైపునకు నేరుగా దూసుకుపోయింది. అక్కడ కారును అదుపు చేయలేకపోయారు. 3 మొబైళ్లు లభ్యం కారు శిథిలాల్లో మూడు మొబైల్‌పోన్లు లభించాయి. అన్ని ఫోన్ల తెరలు ముక్కలై ఉన్నాయి. వారి కాల్ డేటా, టవర్ లొకేషన్ ఆధారంగా ఎక్కడ విందు చేసుకున్నారో కూపీ లాగుతున్నారు. సుమారు 30 మంది పోలీసులను ఇందుకు నియమించారు. మద్యం సేవించారా, లేదా అనేది కచ్చితంగా తెలుసుకునేందుకు మృతుల రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఒకటిరెండురోజుల్లో పరీక్షల నివేదిక అందే అవకాశం ఉంది. కారు నడిపిన కరుణాసాగర్ పోస్టుమార్టం నివేదిక కేసులో ముఖ్యమైనదని పోలీసులు తెలిపారు. అత్యంత వేగంగా డ్రైవింగ్ చేశారని కనబడుతున్నప్పటికీ అందుకు కారణాలేమిటీ అనేది ఈ నివేదికల ద్వారా తెలిసే అవకాశముంది. కరుణాసాగర్ ఎమ్మెల్యే పుత్రుడు కావడంతో ఇది ప్రాముఖ్యమైన కేసుగా మారింది. ప్రమాదస్థలికి ముందు సోనీ వరల్డ్ సిగ్నల్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్ ఈ ఆడి కారునుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. దీనిని గమనించిన పోలీసులు కారును అడ్డగించడానికి వెళ్లగా వేగంగా వెళ్లిపోయిందని సమాచారం. మద్యం కొనుగోళ్లు? ►కారులోనివారు మద్యం సేవించి ఉంటారన్న పోలీసుల అనుమానానికి సాక్ష్యాలు లభిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ ప్రారంభానికి ముందు ఇషితా, మరొక యువతి కోరమంగలలో ఓ వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేశారు. సీసాలను బ్యాగ్‌లో పెట్టుకుని బయలుదేరిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ►సోమవారం రాత్రి 8.19 నిమిషాలకు కోరమంగలలో ఉన్న జోలో పీజీ నుంచి ఇషితా, బిందు బయలుదేరారు. 8.39 నిమిషాలకు పీజీ నుంచి సోనీ వరల్డ్‌కు వెళ్లే రోడ్డుకు చేరారు. పీజీ నుంచి సుమారు 200 మీటర్ల దూరం వరకు నడుచుకుని వెళ్లిన దశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ►5 వ క్రాస్ రోడ్డు నుంచి ఎడమవైపునకు తిరిగి అక్కడ నుంచి హైఫై మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. రాత్రి.8.30 నుంచి 8.44 వరకు మద్యం దుకాణంలో కొనుగోలు చేశారు. ►అక్కడే పక్కనున్న పబ్‌లోకి వెళ్లగా మరమ్మత్తులు చేస్తుండటంతో వెనక్కి వచ్చేశారు. ఇషికా, బిందు అక్కడి నుంచి సోనీ వరల్డ్ మార్గంగా బయలుదేరారు. దుకాణాల వద్ద గల సీసీ టీవీలో దృశ్యాలు నమోదు కాబడ్డాయి. అక్కడికి ఆడి కారు రాగా, కారులో వెళ్లిపోయారు. ఇవీ చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసులు సీరియస్ చార్జింగ్కు పెట్టి ఫోన్లో మాట్లాడిన యువతి, అక్కడికక్కడే.. -
ఆడి కారు యాక్సిడెంట్ కేసులో కొత్త మలుపు
సాక్షి, గచ్చిబౌలి: తప్పతాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మాదాపూర్‌లో తెల్లవారు జామున ఆడి కారు ఆటోను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంతో ప్రమాదానికి కారణమైన వారితో పాటు తండ్రి కటకటాలపాలయ్యారు. మల్లాపూర్‌లో నివాసం ఉంటూ గోవాలో ఎంఎస్ చదువుతున్న వాకిటి సుజిత్ రెడ్డి(24) స్నేహితుడు ఆశిష్‌తో పాటు మరో ముగ్గురు కలిసి గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ సమీపంలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకొని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఈ నెల 27 ఉదయం 5.30 గంటల సమయంలో ఆశిష్‌తో కలిసి ఆడి కారులో కృష్ణానగర్ బయలు దేరారు. అతి వేగంగా వెళుతూ ముందు వెళుతున్న ఆటోను ఢీ కొట్టడంతో వెనక సీట్లో కూర్చున్న వై.ఉమేష్ కుమార్ (37, పబ్‌లో వర్కర్) ఎగిరి ఫుట్‌పాత్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కారులో ఉన్నవారు ఆగకుండా ముందుకు వెళ్లి కారు నెంబర్ ప్లేట్లు తీసేసీ ఇనార్బిట్ మాల్ వైపు పరిగెత్తారు. అక్కడి నుంచి సుజిత్‌రెడ్డి తండ్రి రఘునందన్ రెడ్డికి ఫోన్ చేశారు. అక్కడి నుంచి ఆటోలో రావాలని చెప్పాడు. కొడుకును డీడీ కాలనీలో దాచిపెట్టారు. ఈ నెల 28న డ్రైవర్ ప్రభాకర్ (52) కారు నడిపాడని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. సీసీ పుటేజీలో యువకులు పరిగెత్తినట్లు కనిపించడంతో పోలీసులు తమ స్టయిల్లో విచారించారు. డైవర్‌ను మార్చే ప్రయత్నం చేశామని ఒప్పుకోవడంతో రఘునందన్ రెడ్డిపై ఐపీసీ 202, 203, 205,212,419,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నెంబర్ ప్లేట్లు తీస్తుండగా చూసిన ఇద్దరు వ్యక్తులను బెదిరించారు. కారు నడిపిన సుజీత్ రెడ్డితోపాటు, అశిష్‌పై 304(2), 201,506, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: హైటెక్ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో ఎగిరి కింద పడి మృతి చెందిన ఉమేష్ కుమార్ నుజ్జునుజ్జయిన ఆటో -
హైటెక్ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ రహేజా మైండ్‌స్పేస్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులు రాష్ డ్రైవింగ్ చేస్తూ తమ ఆడి కారుతో ముందున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో ఫుట్‌పాత్ మీదకు ఎగిరిపడి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ప్రమాదానికి కారణమైన యువకులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఉమేశ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా ఉమేశ్ కుమార్ మృతికి కారణమైన వారిని విడిచిపెట్టొద్దని అతని బందువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు వారికి వివరించారు. చదవండి: అరాచకం.. స్కూటర్‌ను ఢీకొట్టాడని చితకబాదారు; వీడియో వైరల్ -
8 లక్షలు పెట్టి ఆడీ కారు.. పార్కు చేసిన చోటే మాయం
సాక్షి, చిలకలగూడ : పార్కింగ్ చేసిన ఆడీ కారు మాయమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్ లెజెండ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న రోమిత్‌పటేల్ తన స్వస్థలమైన గుజరాత్లో ఆడీ కారును సెకండ్స్లో రూ.8 లక్షలకు కొనుగోలు చేసి రెండు రోజుల క్రితం నగరానికి తీసుకువచ్చాడు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కు చేశాడు. మ.1.30 గంట సమయంలో చూడగా కారు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఐ సంజయ్‌కుమార్ తెలిపారు. చదవండి: నిన్న రోడ్డెక్కిన తండ్రి.. నేడు చెట్టెక్కిన కొడుకు -
కొత్త ఆడి A4.. జనవరి 5న విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో లగ్జరీ కార్ల విభాగం మరింత వేడెక్కనుంది. ఈ విభాగంలో ఆడి A4 సెడాన్ మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే రూ. 2 లక్షల టోకెన్ అడ్వాన్స్‌తో దేశీయంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆడి డీలర్లు, అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 5న ఆడి కొత్త A4 సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తో్ంది. 2 లీటర్ల పెట్రోల్ టీఎఫ్ఎస్ఐ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు వేరియంట్స్ రూ. 42-48 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరలలో లభించనున్నట్లు ఆటో వర్గాలు తెలియజేశాయి. నిజానికి ఈ ఏడాది(2020)లో ఆడి పలు మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. A8 L, Q2, Q8, Q8 సెలబ్రేషన్, ఆర్ఎస్ Q8, ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్ కార్లతో సందడి చేసింది. చదవండి: (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) ఎడ్జస్టబుల్ సీట్స్ కొత్త ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్లలో A4 రూపొందింది. లెడ్ హెడ్‌ల్యాంప్స్, లెడ్ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు బంపర్‌ను సైతం అప్డేట్ చేసింది. కేబిన్‌లో 10.1 అంగుళాల ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునేందుకు వీలయ్యే సీట్లు, 3 జోన్ క్లయిమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, యాంబియెంట్ లైటింగ్, వైర్లెస్ చార్జింగ్, సన్‌రూఫ్‌తోపాటు 8 ఎయిర్‌బ్యాగ్స్‌తో A4 సెడాన్ వెలువడనున్నట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. గరిష్టంగా 190 బీహెచ్పీ పవర్‌ను అందుకోగల, 7స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమాటిక్ ఫీచర్స్‌తో వెలువడనుంది. 7.3 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్నిఅందుకోగలదని అంచనా. కాగా.. లగ్జరీ సెడాన్ విభాగంలో మెర్సిడీస్ బెంజ్ C-క్లాస్, బీఎండబ్ల్యూ 3 సిరీస్, జాగ్వార్ ఎక్స్ఈలతో A4 పోటీ పడగలదని ఆటో నిపుణులు పేర్కొన్నారు. కొత్తగా విడుదలకానున్న వోల్వో S60కు సైతం పోటీగా నిలిచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
విరాట్ కోహ్లి తొలి ఆడికారు.. పోలీస్ స్టేషన్లో
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లను వాడేశాడు. స్పోర్ట్స్ పర్సన్‌గా, అందులోనూ లీడింగ్ క్రికెటర్‌గా ఉన్న కోహ్లి.. లగ్జరీ కార్లను వాడటం పెద్ద విషయం కాకపోవచ్చు. ఇప్పటికే ఇలా ఎన్నో లగ్జరీ కార్లు కోహ్లి ఖాతాలోకి వచ్చి.. పోయాయి కూడా. కాగా, అలా కోహ్లి ఖాతాలోకి వచ్చిన ఒక కారు చాలాకాలంగా పోలీస్ స్టేషన్లోనే ఉంది. అది కూడా కోహ్లి వాడిన తొలి ఆడి కారు కావడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే.. ఎప్పుట్నుంచో ఆడి ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కోహ్లికి ‘ఆడి ఆర్8 వీ10 కానుకగా వచ్చింది. దాన్ని 2016లో ఒక బ్రోకర్ ద్వారా సాగర్ థక్కర్ అనే వ్యక్తికి అమ్మేశాడు. అది కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వడం కోసం సాగర్ థక్కర్.. కోహ్లి వద్ద ఆడి కారును కొనుగోలు చేశాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా అతనికి నేర చరిత్ర ఉంది. (అంపైర్ చీటింగ్.. అసలు అది ఔట్ కాదు) ఒక స్కామ్‌లో భారీగా మోసం చేసి పోలీసులకు పట్టుబట్టాడు. దాదాపు రూ. 12 కోట్ల వరకూ స్కామ్ చేసి దొరికిపోయాడు. దాంతో అతన్ని అరెస్టు చేసిన ముంబై పోలీసులు, ఆడి కారును కూడా సీజ్ చేశారు. దాంతో ఆ కారు అప్పట్నుంచి థానే పోలీస్ స్టేషన్లోనే పడి ఉంది. ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ము పట్టేసి ఉన్న కారును ఆటోమొబైల్ రంగం నిపుణుడొకరు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ కోహ్లి వాడిన ‘ఆడి ఆర్8 వీ10 కారు’ పోలీస్ గ్రౌండ్‌లోనే ఉంది. ఒకరు వద్ద నుంచి మరొకరి వద్దకు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో మగ్గుతుంది. దాదాపు ఏడాది కాలంగా కారు ఇక్కడే చూస్తున్నా. ఇప్పుడు ఆ కారు ఖరీదు ఎంత ఉంటుందో కూడా తెలీదు’ అని పేర్కొన్నారు. ఇలా కోహ్లి వాడిన తొలి ఆడి కారు పోలీస్ స్టేషన్లో ఉండటం ఫ్యాన్స్‌కు కాస్త బాధ కల్గించే అంశమే. ఒకవేళ ఈ విషయం కోహ్లి వరకూ చేరితే దాని కోసం ఏమైనా చేస్తాడేమో చూడాలి. -
జైపూర్‌లో ఆడి కారు బీభత్సం
జైపూర్ : రాజస్తాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం ఉదయం ఆడి కారు బీభత్సం సృష్టించింది.రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు వేగంగా ఢీకొట్టడంతో ఫ్లైఓవర్‌పై నుంచి కింద ఉన్న ఒక బిల్డింగ్ టాప్రూఫ్పై ఎగిరిపడ్డాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారు వేగంగా నడిపి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'రాజస్తాన్‌లోని పాలి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మాదా రామ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేరవుతున్నాడు. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం మాదా రామ్ జైపూర్ వచ్చాడు. ఉదయం 8గంటల ప్రాంతంలో మాదా రామ్ జైపూర్‌లోని సోడాలా ప్రాంతంలో ఉన్న ఫ్లైఓవర్ రోడ్డును దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఫ్లైఓవర్‌పై వేగంగా వస్తున్న ఆడి కారు అదుపు తప్పి మాదారామ్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో మాదా రామ్ ఫ్లైఓవర్‌పై నుంచి పక్కన ఉన్న బిల్డింగ్ రూఫ్‌టాప్ మీదకు ఎగిరిపడ్డాడు. గాయాలు బలంగా తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడని' తెలిపారు. కారును వేగంగా నడిపిన నేహా సోని అనే మహిళతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా మాదారామ్ కుటుంబసభ్యులు జైపూర్‌కు చేరుకున్న తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. #Rajasthan | A man was killed after being hit by a speeding Audi car in #Jaipur on Friday. According to the details, the accident was reported today morning in Jaipur's Sodala area, where the deceased suffered serious wounds and succumbed to his injuries. (Disturbing Visual) pic.twitter.com/vZvKd5rgT7 — First India (@thefirstindia) November 6, 2020 -
రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!
మినెస్క్: ఆడి కారులో తిరగాలన్న కోరికను ఓ పశువుల కాపరి వినూత్న ఆలోచనతో తీర్చుకున్నారు. జీవితంలో ఏనాటికైనా ఆడి కారు కొనాలని, అందులో తిరగాలనుకున్నది యూరప్‌లోని బెలారస్‌కు చెందిన అలెక్సీ చిరకాల వాంఛ. అయితే, ఆడి కారు కొనే స్థోమత లేకపోవడం, ఒకవేళ అప్పోసప్పో చేసి దానిని కొనుగోలు చేసినా గొర్రెలు, ఆవులకు కాపరిగా దాన్ని తీసుకుని వెళ్ళలేడు. దాంతో ఆయనకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. పనిచేయని ఓ ఆడి కారును కొనుగోలు చేసి, దాని ఇంజిన్ భాగాన్ని తొలగించి గుర్రపు బండిగా మార్చేశాడు అలెక్సీ. గుర్రం కారును లాగుతుంటే ఆయన ఎంచక్కా అందులో గొర్రెలు, ఆవులు కాసేందుకు వెళ్తున్నాడు. పెట్రోల్ ఖర్చు భారం కూడా లేదు. పశువుల కాపరిగా పనులు చేసుకోవడంతోపాటు, ఆడి కారు కమ్ గుర్రపు బక్కీలో ఆయన షికార్లకు సైతం వెళుతూ మురిసిపోతున్నాడు. అలెక్సీ ఆడికారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఆడి కారు కోసం... ఇంట్లోనే డబ్బులు ప్రింట్ చేసి..
బెర్లిన్: ప్రతి ఒక్కరు తమ జీవితంలో సొంత ఇల్లు, కారు, పొలాలు ఇలా ఏదో ఒకటి సంపాదించాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతో కష్టపడి, రూపాయి.. రూపాయి కూడబెట్టి వాటిని సంపాదించుకుంటారు. మరికొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. అది వేరే విషయం. కానీ ఇంకో రకం మనుషులు ఉంటారు.. వారిని చూస్తే అమాయకులా.. అతి తెలివి తేటలు ఉన్నవారా అనే విషయం అంత సులువుగా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఒకటి జర్మనీలో చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువతి తనకు ఎంతో ఇష్టమైన ఆడి కారును కొనాలని భావించింది. దాని కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15వేల యూరోలు(రూ. 11లక్షల 57వేలు) ఫేక్ కరెన్సీ ముద్రించింది. నకిలీ నోట్లను గుర్తుపట్టిన షోరూం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానికంగా ఉండే కైసర్స్లేటర్న్ కారు షోరూంకు వెళ్లిన యువతి అక్కడి సిబ్బందితో మాట్లాడి తనకు కావాల్సిన ఆడి ఏ3 2013 మోడల్‌ను ఎంచుకుంది. అనంతరం కారు తాలూకు డబ్బులు చెల్లించేందుకు బిల్ కౌంటర్‌కు వెళ్లిందామె. అక్కడ 15వేల యూరోల ఫేక్ కరెన్సీ తీసి చెల్లించబోయింది. చూడగానే నకిలీ నోట్లు అని గుర్తు పట్టేలా ఉన్న ఆ కరెన్సీని చూసిన కౌంటర్ సిబ్బందికి నోటమాట రాలేదు. తేరకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది. షోరూం వద్దకు వచ్చిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారించగా కరెన్సీని తన ఇంట్లోనే ముద్రించినట్లు తెలిపింది. దాంతో ఆమె ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఇంక్జెట్ ప్రింటర్ దొరికింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు. -
ప్రజలపైకి దూసుకెళ్లిన కారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఓ లగ్జరీ కారు అదుపు తప్పి జనాలపై దూసుకెళ్లడంతో ఏడుగురు చనిపోగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. కోయంబత్తూరులోని సుందరపురం పెరియార్ విగ్రహం దగ్గర్లోని అయ్యర్ ఆస్పత్రి బస్టాండ్ బుధవారం ఉదయం 10.45 గంటలకు రద్దీగా ఉంది. ఈ సమయంలో పొల్లాచ్చి నుంచి కోయంబత్తూరు వైపు అతివేగంతో వచ్చిన ఓ ఆడీ కారు బస్టాండ్‌లోని ప్రజలపైకి దూసుకెళ్లింది. వాళ్లను తొక్కించుకుంటూ పక్కనే ఉన్న ఆటోను, పూలు అమ్ముకుంటున్న మరో వృద్ధురాలిని ఢీకొంది. తర్వాత ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగింది. కారు బలంగా తగలడంతో బస్టాండ్‌లోని పలువురు గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కారును వేగంగా నడిపి ఏడుగురిని బలికొన్న డ్రైవర్ జగదీశన్(36) గాయాలతో ఘటనాస్థలం నుంచి పరారయ్యేందుకు యత్నించగా..స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఆయువు తీసిన ఆడి కారు.. ఆరుగురు మృతి
చెన్నై : అతివేగం కారణంగా అదుపుతప్పిన ఆడి కారు ఆటోను ఢీకొట్టి.. పక్కనే ఉన్న బస్టాప్‌లోకి దూసుకుపోయిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రత్నమ్ కాలేజీ యాజమాని మధన్ కే సెంథిల్‌కు చెందిన ఆడి కారు పొల్లాచి నుంచి కోయంబత్తూరుకు బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ అతివేగం కారణంగా అదుపుతప్పిన కారు సుందరాపురం వద్ద ఓ ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న బస్టాప్‌లోని ప్రయాణికులపైకి దూసుకుపోయింది. దీంతో నారాయణసామి(70), హంసవేణి(34), సుభాషిణి(18), కుప్పమ్మాల్(70), శ్రీరంగదాస్(69) సోను.. అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డవారిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా? అన్న అనుమానంతో అతని రక్త నమూనాలను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ సంఘటనపై కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.