Audi India head Dhillon Handover e-Tron electric Car to Super Star Mahesh Babu - Sakshi
Sakshi News home page

ఈవీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌

Published Sat, Apr 16 2022 3:31 PM | Last Updated on Sat, Apr 16 2022 4:05 PM

Audi India Head Dhillon Handover E Tron Car to Super Star Mahesh Babu - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా ఆయన ఆడి సంస్థకు చెందిన ఎలక్ట్రిక్‌ కారు ఈ ట్రోన్‌ను కొనుగోలు చేశారు. గతేడాది ఈ ట్రోన్‌ కారుని ఆడి సంస్థ లాంఛ్‌ చేసింది. ఆ తర్వాత మహేశ్‌ బాబు ఈ కారుని బుక్‌ చేసుకున్నారు. కాగా 2022 ఏప్రిల్‌ 16న మహేశ్‌బాబుకి కారుని హ్యాండోవర్‌ చేశారు ఆడి ఇండియా ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌.

ఆడి ఈ ట్రోన్‌ కారు ఎక్స్‌షోరూం ధర రూ 1.01 కోట్ల నుంచి 1.19 కోట్ల వరకు ఉంది,. ఈ ట్రాన్‌ కారు బ్యాటరీ సామర్థ్యం 71 కిలోవాట్స్‌, 308 హార్స్‌ పవర్స్‌తో 540 ఎన్‌ఎం టార్క్‌ని అందిస్తుంది. కేవలం 6.8 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్ల స్పీడు అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు.

చదవండి: వారెవ్వా ఆడి..గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement