Actress Kiara Advani Buys Luxurious Audi A8 Car, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Kiara Advani New Car: లగ్జరీ కారు కొన్న కియారా అద్వానీ.. ధర ఎంతంటే?

Published Thu, Dec 16 2021 11:43 AM | Last Updated on Thu, Dec 16 2021 12:03 PM

Kiara Advani Buys Audi A8L - Sakshi

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న నటి కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్‌ ధోనీ, కబీర్‌ సింగ్‌, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్‌ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇటీవలే ఈ బ్యూటీ శంకర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో రామ్‌ చరణ్‌కు జోడీగా నటించే చాన్స్‌ కొట్టేసింది. కియారా, చెర్రీ జంటగా వస్తున్న రెండో చిత్రం ఇది.

ఇలా కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న కియారా.. వ్యక్తిగత జీవితాన్ని కూడా రిచ్‌గానే ఎంజాయ్‌ చేస్తుంది. ఈ అమ్మడుకి కార్లు అంటే చాలా ఇష్టం.  ఇప్పటికే ఆమె దగ్గర బీఎండబ్ల్యూ ఎక్స్‌5, మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈ-క్లాస్‌, బీఎండబ్ల్యూ 530డీ వంటి విలావంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా వీటి జాబితాలో ఆడి ఏ8 ఎల్‌ కూడా చేరింది. ఆడి ఈ మోడల్‌ను గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.1.56 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement