గేమ్ ఛేంజర్ భామ బర్త్‌ డే.. భర్త స్పెషల్ పోస్ట్! | Sidharth Malhotra Wishes His Love Kiara Advani On Her 33rd Birthday | Sakshi
Sakshi News home page

Kiara Advani: గేమ్ ఛేంజర్ భామ బర్త్‌ డే.. భర్త స్పెషల్ పోస్ట్!

Published Wed, Jul 31 2024 8:32 PM | Last Updated on Wed, Jul 31 2024 8:32 PM

Sidharth Malhotra Wishes His Love Kiara Advani On Her 33rd Birthday

బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సరసన హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ కియారా బర్త్‌ డే కావడంతో పలువురు సినీతారలు, ఫ్యాన్స్‌ విషెస్ తెలిపారు.

తాజాగా ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భార్యకు స్పెషల్‌గా విష్ చేశారు. కియారా ఫోటోను షేర్ చేస్తూ రొమాంటిక్ నోట్ రాసుకొచ్చారు. హ్యాపీ బర్త్‌ డే మై లవ్.. యూ ఆర్‌ మై సోల్‌మేట్‌.. ఇక్కడ మరెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి." అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా.. కియారా, సిద్ధార్థ్‌ ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో వివాహం చేసుకున్నారు.

కాగా.. 2014లో 'ఫగ్లీ' అనే కామెడీ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన కియారా అద్వానీ.. ఆ తర్వాత స్పోర్ట్స్ బయోపిక్ 'ఎంఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోనూ కనిపించింది. అంతేకాకుండా భరత్ అనే నేను, వినయ విధేయ రామ, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూజ్, భూల్ భూలయ్యా 2, సత్యప్రేమ్ కి కథ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌తో పాటు వార్- 2 చిత్రంలోనూ నటిస్తోంది.

కియారా తదుపరి తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్', ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆమె కిట్టిలో 'వార్ 2' కూడా ఉంది. మరోవైపు సిద్ధార్థ్ చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ 'యోధ'లో కనిపించాడు. అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కూడా నటించాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement