Sidharth Malhotra and Kiara Advani New Mumbai Home Goes Viral - Sakshi
Sakshi News home page

Sidharth Malhotra and Kiara Advani: కియారా- సిద్ధార్థ్ కొత్త ఇంటిని చూశారా.. ఎన్ని కోట్లంటే?

Feb 12 2023 4:49 PM | Updated on Feb 12 2023 5:22 PM

Sidharth Malhotra and Kiara Advani new Mumbai home goes viral  - Sakshi

బాలీవుడ్‌ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి7న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌ ప్యాలెస్‌లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. బాలీవుడ్‌లో ఇప్పటికి వరకు జరిగిన పెళ్లిల్లలో ఖరీదైన వాటిలో ఒకటిగా నిలిచింది.  కాగా.. షేర్షా మూవీలో తొలిసారి కలిసి నటించిన సిద్‌-కియారాలు ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమ రిలేషన్‌పై ఎక్కడా నోరు విప్పని ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు.

అయితే రాజస్థాన్, దిల్లీ పర్యటన తర్వాత ప్రస్తుతం ముంబయికి చేరుకుంది కొత్త జంట. తాజాగా వీరి ఇంటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఇంటి విలువ దాదాపు రూ.70 కోట్లు అని బీ టౌన్‌లో చ‍ర్చ నుడుస్తోంది. త్వరలోనే నూతన వధూవరులు ఆ ఇంటిలోకి మారనున్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని పాలి హిల్‌ ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఈ భవనం.. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే సిద్ధార్థ్ తన భార్య కియారా కోసం ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం.  జైసల్మీర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత శనివారం ముంబయికి తిరిగి వచ్చింది జంట. ఆదివారం సాయంత్రం బాలీవుడ్ నటులు, స్నేహితుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.  ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement