హీరోయిన్‌ కియారా వేసుకున్న శాండిల్స్‌ ఇంత కాస్ట్‌లీనా? | Kiara Advani Wears Alaia Heels Do You Know The Price | Sakshi
Sakshi News home page

Kiara Advani: చెప్పుల కోసం ఇంత తగలేస్తారా? ధర తెలిసి షాక్‌ అవుతున్న నెటిజన్లు

Published Fri, Dec 29 2023 1:14 PM | Last Updated on Fri, Dec 29 2023 1:28 PM

Kiara Advani Wears Alaia Heels Do You Know The Price - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ.. ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో ఉంది. ముఖ్యంగా ఈ అమ్మడి పెళ్లి, సినిమాల గురించి తెగ వెతికేశారు. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా కియారా సుపరిచితమే. భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది కియారా. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో నటిస్తుంది.

వెండితెరపై గ్లామర్‌ వడ్డించడంలో ఏమాత్రం వెనక్కు తగ్గని ఈ భామ తన నటనతో కుర్ర హృదయాల మనసు దోచుకుంది. అందుకే కియారాకు నార్త్, సౌత్‌లో సూపర్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కియారా రీసెంట్‌గా తన భర్త సిద్దార్థ్‌ మల్హొత్రతో దిగిన ఫోటోలను పంచుకుంది.

ఇందులో కియారా వేసుకున్న చెప్పుల ధర తెలుసుకొని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ శాండిల్స్‌ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 88వేలు. ఇది తెలిసి ఇంత సింపుల్‌ హీల్స్‌ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అంటూ అవాక్కవుతున్నారు. మరి సెలబ్రిటీలు వాడే వస్తువులకు ఆ మాత్రం రేంజ్‌ ఉంటుందిగా.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement