Footwear
-
చర్మకారులకు పాద‘రక్ష’!
రాయదుర్గం: పురాతన పద్ధతుల్లో చెప్పులు కుడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా బతుకుతున్న చర్మకారుల జీవితాలకు కొత్త ‘కళ’ను అద్దుతోంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ). ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)తో కలిసి చర్మకారులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇచ్చి సొంతంగా తయారీ యూనిట్లు నెలకొల్పుకునేందుకు చేయూతనందిస్తోంది. ఆధునిక డిజైనింగ్‌పై శిక్షణ చర్మకార వృత్తిని కొనసాగిస్తున్నవారితోపాటు వృత్తిని వదిలేసినా దానిపై ఆసక్తిగల వారిని కొందరిని ఎంపిక చేసి గత డిసెంబర్ 9 నుంచి ఈ జనవరి 3వ తేదీ వరకు మూడు విడతలలో 25 రోజుల పాటు రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐలో శిక్షణ ఇచ్చారు. ఆధునిక కాలానికి తగినట్లుగా చెప్పులు, షూల డిజైనింగ్.. వాటిని నాణ్యతతో తయారు చేయటంపై మెళకువలు నేర్పారు. ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరసింహుగారి తేజ్‌లోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ అబ్దుల్ రహమాన్, చంద్రమణి, కన్వర్‌సింగ్, ఇళయరాజా పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగింది. షూ తయారీలో శుద్ధి చేసిన చర్మాన్ని కటింగ్ చేసే ప్యాటర్న్, బాటమ్ ఫిట్టింగ్, అప్పర్ మేకింగ్, స్టిచ్చింగ్ వంటి అంశాలలో అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. లిడ్‌క్యాప్‌కు పూర్వవైభవం తేవాలి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తూ చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ శిక్షణ పొందినవారు కోరుతున్నారు. శిక్షణ పొందినవారు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణ సౌకర్యం, ఆధునిక యంత్రాలు అందించాలని విన్నవించారు. అలాగే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్)కు పూర్వవైభవం తీసుకొస్తే చర్మకారులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రత్యేక కోర్సులతో శిక్షణఎఫ్డీడీఐ హైదరాబాద్ క్యాంపస్‌లో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో చర్మకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రత్యేక కోర్సులను నిర్వహించి వీరికి శిక్షణ అందించాం. భవిష్యత్తులో కూడా మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు ఫ్యాకల్టీ సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ నరసింహుగారి తేజ్ లోహిత్‌రెడ్డి, ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను టూరిజమ్‌లో పీజీ చేసి పర్యాటక శాఖలో గైడ్‌గా పనిచేసే లైసెన్స్ పొందాను. అయితే వంశపారంపర్యంగా వచ్చిన చర్మకార వృత్తిలో కొనసాగాలనుకున్న నాకు.. ఎఫ్‌డీడీఐలో శిక్షణ తీసుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వం రుణసౌకర్యం కల్పిస్తే సొంతంగా యూనిట్ పెట్టి నేను ఎదగటంతోపాటు కొంతమందికి ఉపాధి కల్పిoచాలన్నదే నా లక్ష్యం. –క్రాంతి, శిక్షణ తీసుకున్న చర్మకార కళాకారుడు, సికింద్రాబాద్మాదాపూర్లో పాత చెప్పులు కుడుతూ, చెప్పులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాణ్ణి. ఎఫ్‌డీడీఐ శిక్షణతో షూ కూడా తయారు చేయడం నేర్చుకున్నాను. అంతేకాదు ఏదో సాధించాలనే పట్టుదల వచ్చింది. ఇక్కడ శిక్షణ పొందిన మరికొందరితో కలిసి ఒక తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పిoచాలని ఉంది. –పవన్‌కుమార్, చర్మకారుడు, మాదాపూర్20 ఏళ్లుగా చర్మకార పనిచేస్తున్నా. సాధారణ చెప్పుల తయారీ, మరమ్మతులు, పాలిష్ వంటివి మాత్రమే చేయగలిగేవాణ్ణి. ఎఫ్‌డీడీఐలో శిక్షణ పొందాక రకరకాల డిజైన్లలో షూస్ తయారీతో పాటు కటింగ్, స్టిచ్చింగ్ చేసే స్థాయికి ఎదిగాను. ఇప్పటి తరంవారికి కూడా నచ్చేలా షూలు తయారు చేయగలననే నమ్మకం వచి్చంది. ప్రభుత్వం రుణం, యంత్రాలు అందిస్తే సొంతంగా యూనిట్ ఏర్పాటు చేసుకుంటా. ఇలాంటి శిక్షణ అందరికీ ఇస్తే మా కులవృత్తి కనుమరుగు కాకుండా ఉంటుంది. –తుకారామ్, చర్మకారుడు, ఈసీఐఎల్ -
బీఐఎస్ కీలక ప్రకటన: పెరగనున్న చెప్పుల ధరలు
2024 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్' కొత్త నాణ్యతా ప్రమాణాల కారణంగా పాదరక్షలు (చెప్పులు, షూస్) ఖరీదైనవిగా మారుతాయి. పాదరక్షల తయారీదారులు ఐఎస్ 6721 & ఐఎస్ 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ వెల్లడించింది.పాదరక్షల క్వాలిటీ పెరిగితే ధర పెరుగుతుంది. అయితే రూ. 50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన తయారీదారులకు బీఐఎస్ ఈ నియమం నుండి మినహాయింపు కల్పించింది. ఇప్పటికే తయారు చేసిన పాత స్టాక్‌కు కూడా ఈ నియమం వర్తించదు. అయితే విక్రయదారులు బీఐఎస్ వెబ్సైట్లో పాత స్టాక్ వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఆగస్టు 1 నుంచి 46 అంశాలు సవరించిన బీఐఎస్ నిబంధనల పరిధిలోకి వస్తాయి. కంపెనీలకు అవగాహన కల్పించడం కోసం తమ అధికారిక వెబ్సైట్లో ఈ సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లు బీఐఎస్ తెలిపింది. ప్రధానంగా రెక్సిన్, ఇన్సోల్, లైనింగ్ వంటి పాదరక్షలలో ఉపయోగించే ముడి పదార్థాలు రసాయన లక్షణాలను కంపెనీలు పరీక్షించాల్సి ఉంటుంది.త్వరలో అమలులోకి రానున్న కొత్త రూల్స్ చెప్పులను బలంగా, మన్నికైనవిగా చేస్తాయి. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధరల పెరుగుదల ఎంత వరకు ఉంటుందనేది.. ఆగష్టు 1 తరువాత తెలుస్తుంది. -
ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
ఈ రోజుల్లో కాళ్లకు చెప్పులు లేకుండా ఎవ్వరు కనిపించరు. ఆఖరికి బిచ్చగాడి దగ్గర నుంచి ధనికులు వరకు వాళ్లకు తగ్గ రేంజ్లో చెప్పులు ధరించడం జరుగుతుంది. పొరపాటున చెప్పు తెగితే ఉత్త కాళ్లతో నడిచే వాళ్లు కనిపిస్తారేమో గానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్లు ఎవరుండరనే చెప్పొచ్చు. ఇప్పుడున్న కాలుష్యం రోడ్ల మీద ఉండే చెత్త చెదారాల రీత్యా చెప్పులు లేకుండా నడవటం అంత ఈజీ కాదు. కానీ ఆస్ట్రేలియాలో ఏమయ్యిందో గానీ ప్రజలంతా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు.ఏంటంటే..అక్కడున్న వాళ్లంతా చెప్పులు లేకుండానే రోడ్లపై తిరుగుతూ కనిపించారు. బ్రాండెడ్ షూస్, రకరకాల డిజైనర్ చెప్పులు ధరించే వాళ్లు కాస్త ఒక్కసారిగా ఇలా పాదరక్షలు లేకుండా కనిపించారు. అయితే అక్కడ రోడ్లన్ని నీటిగా ఉంటాయి కాబట్టి వాళ్లు ఈజీగా నడుచుకుంటూ పోగలరు. ఇలా మన భారత్‌లో మాత్రం సాధ్యం కాదు. ధూళి, ఇతర గాజులాంటివి రోడ్ల మీద దర్శనమిస్తాయి కాబట్టి అలా నడిచే సాహసం చేయడం కాస్త కష్టమే.అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఔను! అలా పాదరక్షలు లేకుండా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిదే అని కొందరూ కామెంట్ చేయగా, మరికొందరూ మాత్రం మన దేశంలో కూడా ఇలా హాయిగా చెప్పులు లేకుండా నడిచేలా రహదారులు ఉంటే బాగుండును అని పోస్టులు పెట్టారు. Many Australians have realised that the best footwear is no footwear. We can’t do this here in India due to dirt and glass and other stuff on street, barefoot footwear is the future. pic.twitter.com/INgq1VBR02— Ganesh Sonawane (@ganeshunwired) May 14, 2024 (చదవండి: సూపర్ మామ్స్! రికార్డుల సృష్టించిన తల్లులు) -
అప్నా నంబర్ ఆయేగా
మీ షూ సైజు ఎంత? యూకే సైజులో అయితే ఈ నంబర్.. యూఎస్ సైజులో అయితే ఈ నంబర్ అని చెబుతాం.. చాలా చెప్పుల షాపుల్లో ఈ నంబర్లే నడుస్తున్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా? మన పాదాల సైజు గురించి చెప్పేందుకు.. వేరే దేశాల నంబర్లపై ఎందుకు ఆధారపడుతున్నామో.. మన దేశానికి సొంత ఫుట్‌వేర్ సైజుల నంబర్ ఎందుకు లేదో? ఇకపై ఆ సీన్ మారనుంది. ఎందుకంటే.. త్వరలోనే అప్నా నంబర్ బీ అయేగా.. అప్పుడెప్పుడో బ్రిటిష్‌వాళ్లు.. దేశానికి స్వాతంత్య్రం ముందు బ్రిటిష్ వాళ్లు వారి ఫుట్‌వేర్ సైజుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సగటు భారత మహిళ 4 నుంచి 6 సైజుల మధ్య ఉండే పాదరక్షలను ధరిస్తోంది. అలాగే సగటు పురుషుడు 5 నుంచి 11 సైజుల మధ్య ఉండే ఫుట్‌వేర్‌ను వేసుకుంటున్నాడు. అయితే భారతీయుల అవసరాలకు అనుగుణంగా పాద రక్ష ల కొలతల వివరాలు లేవు.. దీంతో ఇప్పటివరకు మనకంటూ ప్రత్యేక విధానం లేకుండాపోయింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల భారత్‌లో ఏటా సగటు భారతీ యుడు 1.5 జతల పాదరక్షలను కొనుగోలు చేస్తున్నాడు. అంటే ఎన్ని కోట్ల జతలో చూడండి. అలాగే షూ తయారీపరంగా కూ డా భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. కానీ ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా వచ్చే పాదరక్షల్లో 50 శాతం తమకు సరిపో వట్లేదని వినియోగదారులు తిరస్క రిస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో భారత ఫుట్‌వేర్ సైజుల విధానాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశవ్యా ప్తంగా ఇటీవల భారతీ యుల పాదాల సైజులపై ఓ సర్వే జరి గింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ ఐఆర్) పరిధిలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) ఈ అధ్యయనం చేపట్టింది. ఈ సైజుల విధానానికి ‘భా’(భారత్) అనే పేరు పెట్టాలని భావిస్తు న్నారు. దేశంలో ఫుట్‌వేర్ తయారీకి ఇకపై ఈ సైజులే కొల మానం కానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న యూకే/ యూరో పియన్, యూఎస్ సైజులను ‘భా’ భర్తీ చేయనుంది. సర్వేలో ఏం తేలింది? భారత్‌లో వివిధ జాతుల ప్రజలు ఉండటం.. పైగా.. ఈశాన్య భారతానికి చెందిన ప్రజల పాదాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల పాదాలకన్నా కాస్త చిన్నవిగా ఉంటాయి కాబట్టి.. దేశంలో కనీసం 5 రకాల ఫుట్‌వేర్ సైజుల పద్ధతి అవసరమ వుతుందని ఈ సర్వేకు ముందు భావించారు. తర్వాత అందరికీ ఒకే ఫుట్‌వేర్ సైజు సరిపోతుందని తేల్చారు. 2021 డిసెంబర్ నుంచి 2022 మార్చి మధ్య దేశవ్యాప్తంగా లక్ష మంది ప్రజల షూ కొలత లకు సంబంధించి సర్వే నిర్వహించారు. పాదాల సైజు, వాటి నిర్మాణ తీరు, సగటు భారతీ యుల పాదాల ఆకారం గురించి మరింత మెరుగ్గా అర్థం చేసు కొనేందుకు 3డీ ఫుట్ స్కానింగ్ మెషీన్లను సర్వే కోసం ఉపయోగించారు. దీని ప్రకారం సగటు భారతీయ మహిళ పాదం 11 ఏళ్ల వయసులోనే గరిష్ట సైజుకు చేరుకుంటుందని తేలింది. అలాగే సగటు పురుషుడి పాదం 15 లేదా 16 ఏళ్లకు గరిష్ట సైజుకు చేరుకుంటోందని వెల్లడైంది. అలాగే భారతీయుల పాదాలు యూరోపియన్లు లేదా అమెరికన్ల పాదాలకన్నా వెడల్పుగా ఉంటాయని సర్వే నిర్ధారించింది. ఇన్నేళ్లుగా యూకే, యూరోప్, యూఎస్ పాదాల సైజుల ప్రకారం వెడల్పు తక్కువగా ఉండే ఫుట్‌వేర్ తయార వుతుండటంతో భారతీయు లంతా ఇప్పటివరకు బిగుతుగా ఉన్న పాదరక్షలు ధరిస్తున్నారని.. బిగుతుగా ఉండటంతో కొందరు తమ పాదాల కన్నా పొడవైన పాదరక్షలు కొనుక్కుంటున్నారని తేలింది. ముఖ్యంగా హై హీల్స్ వాడే మహిళలు వారి పాదాల సైజుకన్నా పెద్దవైన హైహీల్స్నే వాడుతు న్నారని.. ఇవి అసౌకర్యంగా, గాయాలకు దారితీసేలా ఉన్నాయని కూడా సర్వేలో వెల్లడైంది. ఇక మగవారైతే షూ వదులుగా ఉండకుండా చూసుకొనేందుకు లేస్‌లను మరింత గట్టిగా కడుతున్నారు. ఇది షూ ధరించే వారిలో సాధారణ రక్త ప్రసరణను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, షుగర్ వ్యాధితో బాధపడేవారు ఇలా తమ సైజులకు నప్పని పాదరక్షలు ధరిస్తూ గాయాల ముప్పును ఎదుర్కొంటున్నారని తేలింది. ఈ నేపథ్యంలో ‘భా’ అందుబాటులోకి వస్తే అది వినియోగదారులకు, పాదరక్షల తయారీదారులకు లాభం చేకూర్చనుంది. ఈ సర్వే ఆధారంగా చేసిన సిఫార్సులను కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)కి సమర్పించింది. ఆ విభాగం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)కు ఈ సిఫార్సులను పంపింది. దేశంలో సైజుల విధానానికి అనుమతి తెలపడంతోపాటు దాన్ని అమలు చేసే అధికారం బీఐఎస్కే ఉంది. ప్రస్తుతం యూకే కొలతల ప్రకారం 10 సైజుల విధానం అమల్లో ఉండగా ‘భా’ వల్ల వాటి సంఖ్య 8కి తగ్గనుంది. దీనివల్ల ఇకపై అర సైజుల అవసరం కూడా తప్పనుంది. వచ్చే ఏడాదిలో ‘భా’ విధానం అమల్లోకి వస్తుందని అంచనా. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
హీరోయిన్ కియారా వేసుకున్న శాండిల్స్ ఇంత కాస్ట్లీనా?
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ఉంది. ముఖ్యంగా ఈ అమ్మడి పెళ్లి, సినిమాల గురించి తెగ వెతికేశారు. బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కియారా సుపరిచితమే. భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది కియారా. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుంది. వెండితెరపై గ్లామర్ వడ్డించడంలో ఏమాత్రం వెనక్కు తగ్గని ఈ భామ తన నటనతో కుర్ర హృదయాల మనసు దోచుకుంది. అందుకే కియారాకు నార్త్, సౌత్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కియారా రీసెంట్గా తన భర్త సిద్దార్థ్ మల్హొత్రతో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో కియారా వేసుకున్న చెప్పుల ధర తెలుసుకొని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ శాండిల్స్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 88వేలు. ఇది తెలిసి ఇంత సింపుల్ హీల్స్ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అంటూ అవాక్కవుతున్నారు. మరి సెలబ్రిటీలు వాడే వస్తువులకు ఆ మాత్రం రేంజ్ ఉంటుందిగా. -
2023లో మగువలు మెచ్చిన చెప్పులు.. ‘బ్లాక్ కలర్ వావ్’
మగువలు అందంగా, స్టైలిష్‌గా కనిపించేందుకు తాము ధరించే దుస్తులతో పాటు పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. మనం ధరించే పాదరక్షలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెబుతుంటారు. మరి 2023లో మగువలు మెచ్చిన పాదరక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ హీల్స్ ఈ సంవత్సరం బ్లాక్ హీల్స్ .. పాదరక్షల ఫ్యాషన్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. బ్లాక్ హీల్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి తేలికగా ఉంటూ, అస్సలు ఇబ్బంది కలిగించవు. చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ సంవత్సరం బ్లాక్ కలర్ హీల్స్‌ను చూసిన మగువలు ‘బ్లాక్ కలర్ వావ్’ అంటూ తెగ మురిసిపోయారు. బూట్లు మగువల కోసం రూపొందించిన బూట్లు ట్రెండ్‌లో ఉన్నాయి. పాదాలు మొదలుకొని మోకాలి వరకు లేదా తొడల వరకూ ఉండే ఈ బూట్లు ఫ్యాషన్ మార్క్‌గా నిలిచాయి. శీతాకాలంలో ఈ బూట్లు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. చలి నుంచి రక్షణ కల్పిస్తాయి. డ్రెస్‌లు, జీన్స్, స్కర్ట్‌లపై బూట్లు చక్కగా అమరిపోతాయి.ఈ ఏడాది షైనీ బూట్స్ ట్రెండ్‌లో ఉన్నాయి. లోఫర్స్ లోఫర్స్ అన్ని సీజన్లలోనూ సూటవుతాయి. ఈ ఏడాది లోఫర్స్ ఎంతో ఆదరణ పొందాయి. లోఫర్స్.. జీన్స్, డ్రెస్‌లపై స్మార్ట్ లుక్‌ను ఇస్తాయి. లోఫర్స్తో పొడవు సాక్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. చాలామంది మగువల షూ రాక్‌లో తప్పనిసరిగా ఒక జత లోఫర్స్ కనిపిస్తాయి. కిటన్ హైహీల్స్ ధరించకుండా స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే అందుకు కిటన్ హీల్ మంచి ఎంపిక అని చెబుతుంటారు. కిటన్ హీల్స్ ఈ సంవత్సరం మగువలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చాలామంది చెబుతుంటారు. గ్లాస్ హీల్స్ పారదర్శక పాదరక్షలు అంటే గ్లాస్ హీల్స్ ఈ సంవత్సరం ఫ్యాషన్‌లో నిలిచాయి. పైన పారదర్శక బెల్టులు కలిగిన ఈ పాదరక్షలు ఈ సంవత్సరం హై హీల్స్‌లో ఉత్తమమైనవిగా పేరొందాయి. ఇవి ధరించినవారు స్టైలిష్‌గా కనిపిస్తారని చాలామంది చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరివైపే.. -
పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులొచ్చాయ్..
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 12 ఏళ్ల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి పన్నెండేళ్లుగా పసుపు ఉద్యమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతినబూనిన ఆయన 2011 నవంబర్ 4 నుంచి చెప్పులు వేసుకోవడం లేదు. 2013లో పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ కాలికి చెప్పుల్లేకుండానే తిరుపతికి పాదయాత్ర చేశారు. పసుపు బోర్డు సాధన పోరాటంలో భాగంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అనేక సార్లు రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని ప్రకటించడంతో మనోహర్‌రెడ్డి ఆదివారం చెప్పులు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పసుపు రైతులు ఆయనను ఘనంగా సన్మానించారు. రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 9 సంవత్సరాల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్‌లో పుసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. బోర్డు కోసం పలుమార్లు ఉద్యమాలు కూడా జరిగాయి. తాజాగా మహబూబ్‌నగర్‌లో పర్యటించిన మోదీ పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. -
స్టార్ హీరోయిన్.. అయినా కూడా చెప్పులు మోసింది!
బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరైంది. ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తోంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే రణ్‌బీర్‌సింగ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ గతేడాది నవంబర్‌లో ఓ పాపకు జన్మనిచ్చింది. తన ముద్దుల కూతురికి రాహా అని నామకరణం కూడా చేసింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆలియా భట్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!) ఓ ఈవెంట్‌కు హాజరైన ఆలియా భట్ తిరిగి వెళ్తుండగా కారు వద్ద ఆమెకు ఓ వ్యక్తి చెప్పు కనిపించింది. అయితే కారు వద్దకు వెళ్తున్న ఆలియా భట్ ఎవరిదని ఆరా తీసింది. అంతే కాకుండా స్వయంగా తానే చేతితో పట్టుకుని అతనికి అందించింది. ఇది చూసిన నెటిజన్స్ ఆలియా సింప్లిసిటీ మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తి పాదరక్షలను చేతితో పట్టుకుని ఇవ్వడం గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా ఆలియా భట్ నటిస్తోన్న 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!) Alia Respect 🙌🏻 Might have seen a few celebs lifting their own footwears but Never seen someone lifting a pap's sleeper lying roadside & people troll her for her attitude#AliaBhatt pic.twitter.com/cNV6e4vTqA — Nikki Tamboli Fam 💅🏻 (@FamNikki) July 13, 2023 -
పాదరక్షలకు నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: పాదరక్షలకు నూతన నాణ్యతా ప్రమాణాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 24 పాదరక్షల ఉత్పత్తులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలను పెద్ద, మధ్యస్థాయి కంపెనీలు, దిగుమతిదారులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. చైనా తదితర దేశాల నుంచి చౌకగా దేశంలోకి దిగుమతి అవుతున్న నాసిరకం పాదరక్షల ఉత్పత్తులకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కారు నూతన నిబంధనలను తీసుకొచి్చంది. ఇక చిన్న స్థాయి ఫుట్‌వేర్ తయారీ సంస్థలకు కొంత సమయాన్ని ఇచి్చంది. ఇవి నూతన నాణ్యత ప్రమాణాలను 2024 జనవరి 1 నుంచి అనుసరించాల్సి ఉంటుంది. సూక్ష్మ సంస్థలు 2024 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంటుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. గడువును మరింత పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. నూతన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు దేశీయంగా నాణ్యమైన పాదరక్షల తయారీకి వీలు కలి్పంచడంతోపాటు, నాణ్యత లేమి ఉత్పత్తుల దిగుమతులకు చెక్ పెడతాయని చెప్పారు. నిజానికి ఈ నూతన నాణ్యతా ప్రమాణాలను కేంద్ర సర్కారు 2020 అక్టోబర్‌లోనే నోటిఫై చేయడం గమనార్హం. కరోనా కారణంగా ఏర్పడిన అవరోధాల నేపథ్యంలో మూడు పర్యాయాలుగా గడువు పొడిగిస్తూ వచ్చారు. జాబితాలో ఉన్నవి.. తోలు, పీవీసీ, రబ్బర్‌లో ఎలాంటి మెటీరియల్ వినియోగించాలి? సోల్స్, హీల్స్ కోసం ఏవి వినియోగించాలనేది ప్రమాణాల్లో పేర్కొన్నారు. రబ్బర్ గమ్ బూట్స్, పీవీసీ శాండల్స్, రబ్బర్ హవాయి చెప్పల్స్, స్లిప్పర్స్, మౌల్డెడ్ ప్లాస్టిక్ ఫుట్‌వేర్, స్కావెంజింగ్ పనుల కోసం వినియోగించే పాదరక్షలు, క్రీడా పాదరక్షలు, డెర్బీ బూట్లు, అల్లర్ల నిరోధక బూట్లు, మౌల్డెడ్ సాలిడ్ రబ్బర్ సోల్స్, హీల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 54 పాదరక్షల ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాల పరిధిలోకి 27 ఉత్పత్తులు, మెటీరియల్‌ను తీసుకొచ్చారు. -
ఆటబొమ్మలకు త్వరలో పీఎల్ఐ
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద తోలు, పాదరక్షలు, ఆటబొమ్మలు, నూతన తరం సైకిళ్ల విడిభాగాలకు ప్రోత్సాహకాల ప్రతిపాదన పురోగతి దశలో ఉందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వివిధ శాఖలు తమ పరిధిలో పీఎల్ఐ కింద ఆశించిన మేర పురోగతి లేకపోతే దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాల్లో ఉత్పత్తిని పెంచేందుకు, భారత్‌లో తయారీకి ఊతమిచ్చేందుకు పీఎల్ఐ కింద రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. కానీ 2023 మార్చి నాటికి రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా, కేవలం రూ. 2,900 కోట్ల ప్రోత్సాహక నిధులనే కేంద్రం మంజూరు చేసిన నేపథ్యంలో రాజేష్ కుమార్ స్పందించారు. ఐటీ రంగం మాదిరే కొన్ని సవరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇతర రంగాలకూ ఏర్పడొచ్చన్నారు. ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులకు సంబంధించి గత నెలలో కేంద్ర సర్కారు పీఎల్ఐ 2.0ని ప్రకటించడం గమనార్హం. ‘‘పీఎల్ఐ కింద రూ.1.97 లక్షల కోట్లు వినియోగం అవుతాయనే నమ్మకం ఉంది. కాకపోతే విడిగా ఒక్కో పథకంలో అవసరమైతే దిద్దుబాటు, సవరణలు ఉంటాయి’’అని రాజేష్‌కుమార్ సింగ్ వెల్లడించారు. మొబైల్స్ తయారీలో కావాల్సిన విడిభాగాల తయారీ దేశీయంగా 20 శాతమే ఉండగా, దాన్ని 50 శాతానికి తీసుకెళతామని రాజేష్ కుమార్ తెలిపారు. చైనాలో ఇది 49 శాతం, వియత్నాంలో 18 శాతమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ!
Satyajith Mittal: చిన్న పిల్లల బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు మిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ సత్యజిత్ మిట్టల్. చిన్నప్పుడు తాను పడిన ఇబ్బంది వేరే పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో వినూత్న షూ రూపొందించి విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న పిల్లల పాదాలకు అనుగుణంగా విస్తరించగలిగే వినూత్న బూట్ల శ్రేణి మ్యాజిక్ షూను అభివృద్ధి చేసింది ఆయన స్థాపించిన షూ కంపెనీ అరెట్టో (Aretto). ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! చిన్నప్పుడు పడిన ఇబ్బందే.. మ్యాజిక్ షూ ఆవిష్కరణ కోసం సత్యజిత్‌కు తన చిన్ననాటి అనుభవం ప్రేరణనిచ్చింది. చిన్నప్పుడు తన అన్నయ వాడిన బూట్లను సత్యజిత్‌కు ఇచ్చేవారు. అయితే ఆ బూట్లు సత్యజిత్‌కు చాలా వదులు అయ్యేవి. దాంతో నడవడానికి ఆయన చాలా ఇబ్బంది పడేవారు. అప్పటి నుంచి మంచి నాణ్యత గల బూట్లు ధరించాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ఆ సమయంలో భారతదేశంలో అవి చాలా తక్కువగా ఉండేవి. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ చిన్నతనంలో ఏదో ఒక సమయంలో తమకు సరిపోని సైజు షూ ధరించి ఇబ్బందులు పడినవాళ్లు ఉంటారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి పాదాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని రోజులకే ఎక్కువ జతల బూట్లు కొనాల్సి వస్తోంది. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు సత్యజిత్. పెరుగుతున్న పాదాల సైజ్‌కు అనుగుణంగా విస్తరించే మ్యాజిక్ షూను రూపొందించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు తల్లిదండ్రులకు మేలు కలిగిస్తోంది. ఇవి కొంటే పదే పదే కొత్త బూట్లు కొనాల్సిన అవసరం ఉండదు. నిరంతర పరిశోధనలు, పోడియాట్రిస్ట్ (పాదాలకు సంబంధించిన వైద్య నిపుణులు)లతో సంప్రదింపుల ద్వారా సత్యజిత్ పిల్లల పాదాల అనాటమీ గురించి లోతైన అవగాహన పొందాడు. వారి పాదాలు పెద్దలకు భిన్నంగా ఉంటాయని, వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బూట్లు అవసరమని గ్రహించాడు. ఈ జ్ఞానంతో రెండేళ్ల పాటు కష్టపడి మ్యాజిక్ షూను రూపొందించాడు. ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్రాండ్ అరెట్టో. దీనికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ను పొందింది ఆ కంపెనీ. అలాగే యూకే, యూఎస్ఏ, జపాన్‌తో సహా 20 కంటే ఎక్కువ దేశాల్లోనూ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఎనిమిది నెలల్లో రూ.80 లక్షలకుపైగా గతేడాది ఆయన ప్రారంభించిన ఫుట్‌వేర్ బ్రాండ్ అరెట్టో కేవలం ఎనిమిది నెలల్లోనే 6,000 యూనిట్లకు పైగా విక్రయించి రూ.80 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. తమ బ్రాండ్ షూ తయారీకి థర్మోప్లాస్టిక్ రబ్బర్ రీసైకిల్ మెటీరియల్, స్థానికంగా లభించే త్రీడీ అల్లికల మెటీరియల్‌ని ఉపయోగిస్తున్నారు. సత్యజిత్ పుణెలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు, క్లాస్మేట్ అయిన కృతిక లాల్‌ను సహ వ్యవస్థాపకురాలిగా చేర్చుకున్నారు. అరెట్టో 0-2, 5-7, 5-9 సంవత్సరాల వయసు పిల్లలకు బూట్లను అందిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పటికీ, త్వరలో ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రారంభించాడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ బ్రాండ్ షూలు తొమ్మిది స్టైల్స్, ఐదు సైజులు, నాలుగు కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు రూ.1,699 నుంచి రూ.2,899 వరకు ఉంటాయి. ఈ బ్రాండ్ బూట్లు 18 మిల్లీ మీటర్ల వరకు విస్తరించవచ్చు. వారి అమ్మకాలలో ఎక్కువ భాగం వారి వెబ్సైట్ ద్వారా వస్తాయి. వారు ఇటీవల నైకాలో కూడా అమ్మడం ప్రారంభించారు. ఇవికాక పిల్లల కార్నివాల్‌లు, పిల్లల షూ ప్రదర్శనలు, పాఠశాల, ఇతర పాప్-అప్ ఈవెంట్లలో పాల్గొంటారు. అరెట్టో కంటే ముందు, సత్యజిత్ స్క్వాట్ ఈజ్ అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఇది భారతీయ టాయిలెట్లను సులభంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ వెంచర్ అతనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
పాత చెప్పులు, షూస్ పారేస్తున్నారా? ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే..
డ్రెస్‌కు తగిన షూ, చెప్పల్స్ వాడటం ఈ రోజుల్లో ఫ్యాషన్. రోజూ సాధారణంగా ధరించేవైనా ఒక్కొక్కరికి రెండు మూడు జతల షూస్ ఉంటాయి. పాతగా అయినా, పిల్లలకు బిగుతుగా అనిపించినవాటినైనా పక్కన పడేయడం చాలా సాధారణంగా చేసే పని. అయితే బెంగళూరు విద్యార్థి సియా మాత్రం కొత్తగా ఆలోచించింది. కాలనీలు తిరిగి పాత చెప్పులను సేకరించి, వాటిని బాగు చేసి, మరీ పేదవారికి పంచుతుంది. ఇలా ఇప్పటి వరకు వేలమందికి సహాయం చేసింది. బెంగళూరులోని కోరమంగళలో ఉంటున్న సియా ఇంటి చుట్టూ భవన నిర్మాణ పనులు జరుగుతుండేవి. అక్కడ పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, వారి పిల్లలు చెప్పులు లేకుండా పరిగెత్తడం సియాను బాధించేది. ఓ రోజు ఇంటికి వచ్చే దారిలో పిల్లల పాదాలను చూసింది, వారి పాదాలకు పగుళ్లు ఉన్నాయని గమనించిన ఆమె, వారికి చెప్పులను తెచ్చివ్వడానికి తన ఇంటికి పరిగెత్తింది. సోల్ వారియర్... అక్కణ్ణుంచి ఇరుగింటి వారిని, పొరుగింటి వారిని అడిగింది. చాలా చెప్పులనే సేకరించింది. ఆ తర్వాత కూతురి తపన చూసిన ఆమె తల్లిదండ్రులు కూడా తమకు తెలిసిన వారిని అడిగి చెప్పులను సేకరించేవారు. అక్కణ్ణుంచి వాలంటీర్లు వచ్చి జత కలిశారు. ఫలితంగా కొన్ని వేల జతల చెప్పులు వచ్చి చేరాయి. ఆ విధంగా 2019లో ‘సోల్ వారియర్’ పేరుతో ఒక ఎన్జీవోను ప్రారంభించింది. పునరుద్ధరణ... పాదరక్షలను సేకరించడం, వాటిని స్వచ్ఛందంగా పునరుద్ధరించడం ఒక ఉద్యమంలా మొదలుపెట్టింది సియా. బాగు చేసిన చెప్పులను పేదవారికి అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 15,000 జతల చెప్పులను బాగు చేసి, పేదలకు పంచింది. ‘అధిక జనాభాను ప్రభావితం చేసే పరిష్కారం కనుక్కోవడం చాలా ముఖ్యం. సోల్ వారియర్స్‌తో నేను అదే పనిచేశాను’ అంటుంది సియా. గ్రూపులుగా సేకరణ... సొంతంగా పోస్టర్లను తయారు చేయం, వాట్సప్ గ్రూప్‌లలో వాలంటటీర్లతో సమన్వయం చేసుకోవడం వరకు అన్నీ పర్యవేక్షిస్తుంది సియా. ఒక నెలలో దాదాపు 500 జతల పాదరక్షలను సేకరించగలిగింది. ఈ వార్త వేగంగా వ్యాప్తి చెందడంతో ఎక్కువ మంది వ్యక్తులు విరాళం ఇవ్వడానికి వచ్చేవారు. ఈ విషయంలో సహాయం చేయడానికి వాలంటీర్లు ముందుకు వచ్చారు. విస్తరణ... బెంగళూరులో ఈ మిషన్ విజయవంతమైన తర్వాత ఇప్పుడు ముంబై, చెన్నై నగరాలకూ పాత పాదరక్షల సేకరణ విస్తరించింది. దీంతో చెప్పుల సేకరణ వేగం పెరిగి, వేల జతలు వచ్చి చేరుతున్నాయి. అవార్డులు... సియా చేస్తున్న ఈ పనిని ప్రిన్సెస్ డయానా అవార్డునూ, డయానా లెగసీ అవార్డును వెంట వెంటనే పొందింది. దీని తర్వాత ఆమె తన పనిని అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలకూ విస్తరించనుంది. ‘ఒకరు మరొకరికి ఇలా సహాయం చే స్తే పేద పిల్లలు ఎవరూ చెప్పులు లేకుండా స్కూల్‌కు వెళ్లరు. పాదాలకు వచ్చే సమస్యలు దరిచేరవు’ అని చెబుతోంది సియా. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమెను సంప్రదించవచ్చు. చదవండి: Natural Beauty Tips: నిమ్మరసం, కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్‌తో ఇలా చేస్తే.. స్త్రీ శక్తి: సూపర్ ఫైటర్ View this post on Instagram A post shared by Sia Godika (@sia_godika) -
Fashion: ఈవెనింగ్ శాండల్స్.. నడకలో రాజసం.. పార్టీవేర్ ఫుట్‌వేర్!
చూపులను ఇట్టే చుట్టేసుకునే పాదరక్షల్లో బోలెడన్ని డిజైన్లు ఇప్పుడు మన మదిని పట్టేస్తున్నాయి. పాము కుబుసంలాంటి స్ట్రాప్స్‌తో పువ్వులు, సీతాకోకచిలుకలు అల్లుకునే తీరుతో లెదర్, ఫైబర్, ఫ్యాబ్రిక్ మెటీరియల్ లెక్కింపు లేకుండా క్రిస్టల్స్, స్వరోస్కి, కుందన్స్, మువ్వలు.. పాదం నుంచి మోకాలి వరకు డ్రెస్ డిజైన్‌ను మరింత పెంచేలా నడకలో రాజసం కదిలేలా పార్టీవేర్ ఫుట్‌వేర్ కొత్తగా మెరిసిపోతుంది. నడకలోనే కాదు కాలికి ధరించే పాదరక్షల్లోనూ అందం ఉండాలనుకుంటారు. స్టైలిష్‌గా కనిపించడంతో పాటు నడక కూడా అంతే దీటుగా ఉండాలనుకునేవారికి సరైన సమాధానంలా ఉంటున్నాయి ఈ ఈవెనింగ్ శాండల్స్. స్ప్రింగ్‌లా ఉండే స్ట్రాప్స్ కాలిని చుట్టుకుపోతూ, చివరి భాగం పాము తలను పోలిన డిజైన్‌తో ఉంటుంది. ఈవెనింగ్ శాండల్స్ అని పేరున్న ఇవి పార్టీవేర్‌గా వెలిగిపోతున్నాయి. లాంగ్ ఫ్రాక్స్ లేదా జీన్స్ ధరించినప్పుడు ప్లెయిన్ స్పైరల్ స్ట్రాప్స్ శాండల్స్ క్యాజువల్ వేర్‌గా నప్పుతాయి. రిసెప్షన్ వంటి సాయంకాలపు వేడుకలలో ధరించే డ్రెస్సులకు షాండ్లియర్ రోప్ స్ట్రాప్ ఫుట్‌వేర్ స్టైలిష్ లుక్‌ని పెంచుతుంది. వీటిలో స్టోన్స్‌తో తీర్చిన పువ్వులు, లతలు ఉన్న డిజైన్స్‌ని ఎంచుకోవచ్చు. చదవండి: Fashion: ఈ హీరోయిన్ ధరించిన చీర ధరెంతో తెలుసా? Fashion: కేప్ స్టైల్.. వేడుక ఏదైనా వెలిగిపోవచ్చు! -
టో బాలెట్ ఫ్లాట్స్ .. ప్లాస్టిక్ శాండల్స్.. వానాకాలంలో ఏ చెప్పులు బెస్ట్!
పాదాలకు అనువుగా ఉండాలి. పారుతున్న నీళ్లలో జారకుండా ఉండాలి. తడిసినా పాడవకుండా ఉండాలి. పాదాలకు వేసే చెప్పులే అయినా కాలానుగుణంగా ఉండాలి. ఎటు తిరిగినా అందంగానూ ఉండాలి. ఆ ఎంపిక ఎప్పుడూ బెస్ట్ అనిపించాలి. వర్షాకాలంలో రెయిన్కోట్లు, గొడుగు ఎంత ముఖ్యమో ఈ కాలం వేసుకోదగిన చెప్పులు కూడా అంతే ముఖ్యం. ఏవి ఈ సీజన్‌కి సరైనవో ఎంపిక చేసుకోవడం మరీ ముఖ్యం. రబ్బర్ షూస్, పీవీసీ షూస్ ఈ కాలానికి అనువుగానే కాదు ఫ్యాషనబుల్‌గా పర్ఫెక్ట్గా అమరుతున్నాయి. వాటిలో .. ఫ్లిప్ ఫ్లాప్స్, స్లిప్–ఆన్ క్రాస్లైట్ శాండల్స్ వర్షాకాలానికి అనువైనవి. స్లిప్–ఆన్‌లో హీల్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈ సీజన్లో స్టైలిష్ కన్నా సౌకర్యవంతంగా అమరేవే చూడాలి. పాదాలను పట్టినట్టుగా ఉంటూనే వదలడానికి అనువుగా, ప్లాట్ నమూనాతో ఉండటం వీటి ప్రత్యేకత. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. టో బాలెట్ ఫ్లాట్స్ కాలి మునివేళ్లను దగ్గరగా ఉంచుతూ పాదాలను రక్షణ కలిగిస్తాయి. రంధ్రాలు ఉండే ఈ ఫ్లాట్స్ స్టైలిష్‌గానూ ఉంటాయి. ఇండియన్, వెస్ట్రన్.. ఏ స్టైల్ దుస్తులకైనా బాగా నప్పుతాయి. కాలేజీ, ఆఫీస్ వేర్, క్యాజువల్ వేర్.. అన్నివేళలా ధరించడానికి అనువైనవి. బురద అంటినా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. రబ్బరు లేదా ప్లాస్టిక్ శాండల్స్ లెదర్ వాటిలా కనిపించే షూస్, శాండల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇవి రబ్బరు లేదా ప్లాస్టిక్‌తో తయారుచేసినవి. హై టాప్ రెయిన్ షూస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, ట్రావెలర్స్‌కు సూట్ అవుతాయి. స్ట్రాప్ శాండల్స్ పాదాలు తడిగా ఉన్నప్పుడు చెప్పలు, ఫ్లిప్–ఫ్లాప్స్ జారిపోతాయి అనుకునేవారు స్ట్రాప్ ఉన్న శాండల్స్ లేదా స్ట్రాప్ చెప్పులు ఎంచుకోవచ్చు. బాలెరినా షూస్ రబ్బరు లేదా లైక్రా బాలెరినా బూట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే పాదాలను బురద నుంచి కాపాడతాయి. హీల్స్ లేనివే ఎంపిక నీళ్లు, బురదతో నిండిన రోడ్ల మీద నడిచేటప్పుడు జారకుండా ఉండాలంటే పట్టీలు ఉన్నప్పటికీ హీల్స్‌ని మాత్రం ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం. పేస్టెల్, నియాన్ షేడ్స్ గల శాండల్స్ ఈ సీజన్‌కి మరింత అందాన్ని తీసుకువస్తాయి. చదవండి: Cyber Crime Prevention Tips: రుణం కోసం అడ్వాన్స్.. చెల్లిస్తున్నారా?! అయితే ప్రమాదంలో పడ్డట్లే! ఈ జాగ్రత్తలు పాటించండి! C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా? -
విచిత్ర వ్రతం.. చెప్పులు తొడగరు.. బండ్లు నడపరు.. ఎందుకంటే?
యశవంతపుర(కర్ణాటక): ఆ గ్రామస్తులు చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు..ఎక్కడికెళ్లినా కాలి నడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇది వారు ఆచరిస్తున్న విచిత్ర వ్రతం. ఈ ఊరు పేరు కాలేబాగ్. విజయపుర పట్టణంలోని 30వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్‌లపై నుంచి పడి కొందరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. దీంతో గ్రామస్తులు రోజూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామానికి అరిష్టం పట్టుకుందని భావించిన గ్రామస్తులు పురోహితుడిని కలిసి తమను కాపాడాలని కోరారు. గ్రామ దేవతలైన జట్టింగేశ్వర, దుర్గాదేవిల పేరుతో వ్రతం ఆచారించాలని, ఈక్రమంలో ఐదు వారాల పాటు గ్రామస్తులు ఎవరూ పాదరక్షలు ధరించరాదని, ఎలాంటి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు కనీసం రెండు నెలలపాటు పాటిస్తే గ్రామానికి పట్టిన పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. పూజారి తెలిపిన మేరకు కఠిన నిబంధనలు పాటిస్తున్నట్లు కాలేబాగ్ గ్రామస్థుడు పరశురామ పూజారి తెలిపారు. -
పాదరక్షలు పదిలంగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటించండి..!
కాలమేదైనా పాదరక్షలు ధరించాల్సిందే. రోజూ కురుస్తోన్న వర్షాలకు చెప్పులు, బూట్లకు బురద, మురికి పట్టి దుర్వాసన వస్తుంటాయి. వీటికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రెండోరోజు వేసుకోవడం కూడా కష్టమే. ఈ కింది చిన్నపాటి చిట్కాలు పాటించారంటే మీ పాదరక్షలు భద్రంగా ఉంటాయి. అవేంటో చూద్దాం... వర్షంలో బయటకు వెళ్లివచ్చిన తరువాత తడిసిపోయిన షూస్ సరిగా ఆరవు. షూ లోపల ఉన్న తేమ శిలీంధ్రాలు పెరగడానికి దోహద పడుతుంది. దీంతో షూస్ త్వరగా పాడవ్వడమేగాక, దుర్వాసన వస్తుంటుంది. తడిసిన బూట్లను గాలి తగిలే ప్రదేశంలో ఆరబెట్టడంతోపాటు, షూస్ లోపల టిష్యూ పేపర్లను ఉంచాలి. టిష్యూ పేపర్లు లోపలి తేమను పీల్చి షూ ను పొడిగా మారుస్తాయి. ఒకోసారి ఎంత శుభ్రంగా కడిగినప్పటికీ చెప్పులపైన పేరుకుపోయిన బురద ఒకపట్టాన వదలదు. ఇలాంటప్పుడు పాత టూత్‌బ్రష్‌కు కొద్దిగా టూత్ పేస్టు రాసి పది నిమిషాలపాటు రుద్దితే మురికి అంతా పోతుంది. తరువాత బట్ట లేదా టిష్యూ పేపర్‌తో తుడిచి ఆరబెడితే కొత్తవాటిలా తళతళ మెరుస్తాయి. పాదరక్షల దుర్వాసన పోవాలంటే షూస్‌లో టీబ్యాగ్స్‌ను పెట్టి రాత్రంతా ఉంచాలి. ఈ బ్యాగ్‌లు లోపలి దుర్వాసనను లాగేస్తాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల చెప్పులు, షూలేగాక మీ పాదాలు కూడా పదిలంగా ఉంటాయి. -
మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్ చెప్పులు
బెంగళూరు: మధుమేహ(డయాబెటిస్) బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) డిపార్టుమెంట్ ఆఫ్‌మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. ఇందుకు కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్(కేఐఈఆర్) తగిన సహకారం అందించింది. డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు పుండ్లు పడితే త్వరగా మానవు. దాంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఒక్కోసారి కాలు తొలగించే పరిస్థితి కూడా రావొచ్చు. ఇలాంటి వారి కోసం ఐఐఎస్సీ పరిశోధకులు రూపొందించిన 3డీ ప్రింటెడ్ చెప్పులు చక్కగా పనిచేస్తాయి. కాలు ఎలాంటి ఆకృతిలో ఉన్న దానికి అనుగుణంగా మారిపోవడం వీటి ప్రత్యేకత. నడకను బట్టి చెప్పులు వాటంతట అవే సరిచేసుకుంటాయని పరిశోధకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ చెప్పులు ధరిస్తే కాళ్లకు గాయాలయ్యే అవకాశాలు చాలా స్వల్పమేనని అన్నారు. ఒకవేళ అప్పటికే గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి ఈ చెప్పులు ఉపయోగపడతాయని వివరించారు. -
వుమెన్ సేఫ్టీ.. గొప్పగా ‘చెప్పు’కోవచ్చు!
తాడులా కనిపించేది ఎప్పుడు పామై కాటేస్తుందో తెలియదు. వెలుగులా గోచరించేది ఎప్పుడు చీకటై ముంచేస్తుందో తెలియదు... అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. ఇందుకు ప్రత్యేకంగా వనరులు సమకూర్చుకోకపోయినా నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులతోనే ‘మహిళల భద్రత’ కు అవసరమైన సాంకేతిక దన్ను అందిస్తుంది శాస్త్రీయజ్ఞానం. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి, తమిళనాడు)కు చెందిన పరిశోధకులు మహిళలకు రక్షణ ఇచ్చే పాదరక్షలకు రూపకల్పన చేశారు. ‘మహిళా భద్రతకు ఎన్నో చట్టాలు ఉన్నా, ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము రూపొందించే పాదరక్షలు ఎంతో భద్రతను ఇస్తాయి’ అంటున్నారు ప్రాజెక్ట్ మేకర్స్. తమకు తాముగా జాగ్రత్తపడేలా, విపత్కరమైన పరిస్థితులలో రక్షణ పొందేలా చేసే ఈ స్మార్ట్ పాదరక్షలు ఆత్మరక్షణ ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఎటాకర్స్పై ప్రతిదాడి చేసే అవకాశం వీటిలో ఉంది. జీపిఎస్, జీఎస్ఎం మాడ్యూల్‌ను ఉపయోగించి ఈ పాదరక్షలను డిజైన్ చేశారు. ‘షూ’లలో జీపిఎస్, జీఎస్ఎం మాడ్యుల్ మినియేచర్ వెర్షన్ చిప్‌లను అమర్చుతారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ–కాంటాక్ట్‌ల కోసం ‘షూ’ను గట్టిగా నొక్కితే సరిపోతుంది. ఎటాకర్‌కు షాక్ ఇవ్వవచ్చు. ‘ఎటాకర్’ను గుర్తించే వీడియో లైవ్ స్ట్రీమింగ్ సాంకేతికత కూడా వీటికి ఉండడం మరో విశేషం. తాజా విషయానికి వస్తే... హిమాచల్‌ప్రదేశ్, సొలాన్ జిల్లాలోని జైపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (జెయుఐటీ)కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సరన్ష్ రోహిల్లా, సాంధిత్య యాదవ్‌లు మహిళలకు రక్షణ ఇచ్చే ‘స్మార్ట్’ షూస్‌ను అభివృద్ధిపరిచారు. ఇవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘కాంటాక్ట్స్’ను అప్రమత్తం చేస్తాయి. లొకేషన్ గురించి తెలియజేస్తాయి. ‘డిజైన్ అండ్ ఎనాలసిస్ ఆఫ్ స్మార్ట్షూ ఫర్ వుమెన్ సేఫ్టీ’ పేరుతో పేపర్ సమర్పించారు. ‘మహిళల భద్రతకు సాంకేతిక జ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల్సిన సమయం ఇది. ఇందులో మాది ఒక అడుగు’ అంటున్నారు సరన్ష్,సాంధిత్య. -
మెట్రో బ్రాండ్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైల్ చైన్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ నికర లాభం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 55 శాతం జంప్‌చేసి రూ. 101 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 65 కోట్లు మాత్రమే ఆర్జించింది. మెట్రో షూస్ బ్రాండుగల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 59 శాతం దూసుకెళ్లి దాదాపు రూ. 484 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 304 కోట్ల టర్నోవర్ నమోదైంది. మొత్తం వ్యయాలు 47 శాతం పెరిగి రూ. 363 కోట్లయ్యాయి. త్రైమాసిక ప్రాతిపదికన ఇవి అత్యుత్తమ గణాంకాలని కంపెనీ సీఈవో నిస్సన్ జోసఫ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌కల్లా కంపెనీ 140 పట్టణాలలో 629 స్టోర్లను నిర్వహిస్తోంది. వారాంతాన బీఎస్ఈలో మెట్రో బ్రాండ్స్ షేరు 1.5 శాతం బలపడి రూ. 508 వద్ద ముగిసింది -
కొత్త సంవత్సరంలో జీఎస్టీ మోత, వేటి మీద ఎంతంటే..
న్యూయర్ ప్రారంభం నుంచి కస్టమర్లకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ షాకిచ్చాయి. నేటి నుంచి (జనవరి1) నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టే ప్రతి కస్టమర్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ 5శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. దీంతో ఫుడ్ ఆర్డర్ పెట్టే కస్టమర్లకు ఫుడ్ డెలివరీ యాప్స్ విధిస్తున్న జీఎస్టీ మరింత భారం కానుంది. గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు రెస్టారెంట్లు 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు వినియోగదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యలో జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లకే అప్పజెప్పాలని, డెలివరీలపై 5 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఓలా,ఊబర్ వంటి రైడ్ షేరింగ్ సర్వీసుల్లో సైతం జీఎస్టీని విధించాయి. జనవరి 1నుంచి బైక్, ఆటో బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రతి రైడ్ పై అదనంగా మరో 5శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్, ఇతర ఆటోలు కాకుండా కేవలం రైడ్ షేరింగ్ కంపెనీలైన ఓలా, ఊబర్ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు జనవరి అమల్లోకి వచ్చాయి. కాగా, ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. ఇక వీటితో పాటు ధరలతో సంబంధం లేకుండా ఫుట్ వేర్ పై నేటి నుండి 12 శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. చదవండి: కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే.. -
చేనేత రంగాన్ని ఆదుకోవాలి: బుగ్గన
సాక్షి, ఢిల్లీ: చేనేత వస్త్రాలపై 12శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 12శాతం పన్నును అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి వివరాలు లేకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని తెలిపారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలవరంపై సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, ప్రీ బడ్జెట్ మీటింగ్‌లో విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు పెరిగిందని, వచ్చే బడ్జెట్లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని,నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. -
వస్త్ర పరిశ్రమపై GST పిడుగు...
-
జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లో చేసిన పలు మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ల రవాణా .. రెస్టారెంటు సర్వీసులు మొదలైన వాటిని అందించే ఈ–కామర్స్ కంపెనీలు ఈ సేవలపై పన్నులు చెల్లించాల్సి రానుంది. ఇక పాదరక్షలు, టెక్స్టైల్ రంగాలకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలకు 12 శాతం, కాటన్ మినహా అన్ని రకాల టెక్స్టైల్ ఉత్పత్తులకు (రెడీమేడ్ గార్మెంట్స్ సహా) 12 శాతం జీఎస్టీ వర్తించనుంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలు గానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉంటుంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆహార డెలివరీ సేవలు అందించే ఈ–కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి .. ఆయా హోటల్స్ నుంచి జీఎస్టీ వసూలు చేసి, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇన్వాయిస్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు జీఎస్టీ వసూలు చేస్తున్న నేపథ్యంలో అంతిమంగా కస్టమరుపై అదనపు భారం పడదు. జీఎస్టీ డిపాజిట్ బాధ్యతలను మాత్రమే ఫుడ్ డెలివరీ సంస్థలకు బదలాయించినట్లవుతుంది. -
సామాన్యులకు కేంద్రం షాక్..! భారీగా పెరగనున్న దుస్తులు, చెప్పుల ధరలు
Central Government Increased GST on Apparel and Textiles & Footwear: సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుండి 12శాతం వరకు జీఎస్స్టీ(వస్తువులు మరియు సేవల పన్ను)ని వసూలు చేయనుంది. కొత్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుండి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పుత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నవంబర్ 18న గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ గార్మెంట్‌పై జీఎస్టీ విధిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే, నోటిఫికేషన్ ప్రకారం కొన్ని సింథటిక్ ఫైబర్లు, నూలుపై జీఎస్టీ రేట్లను 18శాతం నుండి 12శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అదే మసయంలో ఫ్యాబ్రిక్స్‌పై జీఎస్టీ రేటు 5శాతం నుండి 12శాతానికి పెంచి సమం చేసింది. జీఎస్టీ బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ 12శాతానికి వసూలు చేయనుంది. నేసిన వస్త్రాలు, సింథటిక్ నూలు, పైల్ ఫ్యాబ్రిక్స్, దుప్పట్లు, టెంట్లు, టేబుల్క్లాత్లు, సర్వియెట్‌లు, రగ్గులు, టేప్‌స్ట్రీస్ వంటి ఉపకరణాలతో కూడిన వస్త్రాలు, వాటి రేట్లు 5% నుండి 12% వరకు పెరిగాయి. బ్రాండెండ్ చెప్పులు 5శాతం నుండి 12శాతం వరకు పెరిగాయి. సీఎంఎఐ అసంతృప్తి జనవరి1,2022 నుండి దుస్తులపై జీఎస్టీ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భారత దుస్తుల తయారీదారుల సంఘం (సీఎంఎఐ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ముడిసరుకు ధరలు, ముఖ్యంగా నూలు, ప్యాకింగ్ మెటీరియల్, సరకు రవాణా పెరగడంతో పరిశ్రమ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున ఖర్చుల పెంపు ప్రధాన ప్రభావాన్ని చూపుతుందని పరిశ్రమ సంఘం పేర్కొంది. చదవండి: GST: ఐస్‌క్రీమ్ పార్లర్లు, స్టోర్ల నిర్వాహకులకు షాక్ -
నలుగురు అరెస్ట్: పాదరక్షలు తీయకుండ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం
బెంగళూరు: దక్షిణ కర్ణాటకలోని కరింజ ఆలయ ప్రాంగణంలోకి పాదరక్షలు తీయకుండా ప్రవేశించినందుకు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కరింజ ఆలయ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు వినయ్ కుమార్ ఫిర్యాదుతో పుంజల్‌కట్టె పోలీసులు నలుగరుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితులు మస్తికట్టె ఉల్లాల్‌కు చెందిన బుషర్ రెహ్మాన్ (20), ఉల్లాల్ ముక్కచెరి హౌస్‌కు చెందిన ఇస్మాయిల్ అర్హమాజ్ (22), హళేకోట్ హౌస్ ఉల్లాల్‌కు చెందిన మహమ్మద్ తనీష్(19), బబ్బుకట్టె పెర్మన్నూరుకు చెందిన మహ్మద్ రషాద్(19)గా పోలీసులు గుర్తించారు. చదవండి: రెండున్నర లక్షలు మాయం.. డబ్బుకోసం వెతుకుతుండగా బాత్రూంలోకి వెళ్లి.. అయితే నిందితులు పాదరక్షలు తీయకుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు ఓ వైరల్ వీడియో వైరల్ కావటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అరెస్టు చేసిన వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన తమ మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందని భక్తులు ఖండించారు. ఆలయాల పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, ఆలయాలకు రక్షణ కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
Life Style: మీకు తరచూ కాళ్ల వాపు వస్తుందా.. ఐతే ఈ చిక్కులు తప్పవు!!
మనం ధరించే దుస్తుల నుంచి చెప్పుల వరకు అన్నీ సరైన కొలతలలో ఉండకపోతే చూడ్డానికి ఎబ్బెట్టుగానే కాదు... అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. దుస్తులు మాత్రం ఇంచుమించు అందరూ సరయిన కొలతల్లోనే ఉండేలా చూసుకుంటారు కానీ, చెప్పుల విషయంలో అంతగా పట్టించుకోరు. నిజానికి దుస్తులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేవరకు మన పాదాలను అంటిపెట్టుకుని ఉండి, జాగ్రత్తగా కాపాడేది పాదరక్షలే కాబట్టి ఎలాంటి పాదరక్షలను, ఎప్పుడు ఎంచుకోవాలి అనే విషయాలపై అవగాహన కోసం... చెప్పుల విషయంలో అలక్ష్యంగా వ్యవహరిస్తే చిక్కులు తప్పవు. ముఖ్యంగా పాదరక్షలు కొనేటప్పుడు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడమే కాదు, సరైన సైజును ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్, డయాబెటిస్ రోగులు, వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వాళ్లు సరైన పాదరక్షలను ఎంచుకోకపోతే ఇబ్బందులే. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! చిన్నసైజు వద్దు... పాదం పరిమాణం కంటే చిన్నగానూ, బిగుతుగానూ ఉండే చెప్పులు ధరిస్తే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. సరైన చెప్పులు వేసుకోకపోతే పాదాలకు పగుళ్లు, ఇన్ఫెక్షన్లూ తప్పవు. బిగుతైన బూట్లు ధరించడం వల్ల గోళ్ల పెరుగుదల నిలిచిపోవడమే కాక గోటి చివర్లు వేళ్లలోనికి గుచ్చుకుని ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. షుగర్ రోగులకు ఇలాంటివి తీవ్రం గా మారే ప్రమాదం ఉంది. అలాగని పెద్ద సైజు చెప్పులు, బూట్లు వేసుకోవడమూ ఏమంత మంచిది కాదు. మడమల సమస్యలు ఎదురవుతాయి. వీటిమూలంగా కాళ్లు బెణకడం, నడకలో తేడా రావడం తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెప్పుల షాపింగ్‌కి మధ్యాహ్నాలు లేదా సాయంత్రాలే ఉత్తమం గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, డయాబెటిస్ వంటి లైఫ్‌స్టైల్ సంబంధిత రోగులకు సహజంగానే కాళ్ల వాపులుంటాయి. అలాగే ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పనిచేసే వాళ్లకు సైతం పాదాల వాపు సర్వసాధారణం. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలల్లో కదలికలు నిలిచిపోయి పాదాలలో వాపు వస్తుంది. ఇది ఎక్కువగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వాపు ఉంటుంది. ఈ సమయంలో చెప్పులు కొనుగోలు చేస్తే సాధారణ సైజు కంటే కొంచెం పెద్దవి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పులు కొనడానికి మధ్యాహ్నం లేదా సాయంత్రాలే మంచిది. సరైన సైజ్ చెప్పులు, బూట్లు వేసుకోవడం వల్ల సౌకర్యంగా ఉండటంతోపాటు పాదాలు కూడా పదిలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఒక కాలితో ట్రయల్ వద్దే వద్దు... పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక కాలికి మాత్రమే ట్రయల్ వేసి సరిపోయిందని సంతృప్తి పడవద్దు. రెండు కాళ్లకూ వేసుకుని నాలుగడుగులు అటూ ఇటూ నడిచి, అవి సౌకర్యంగా అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా బూట్లు కొనేటప్పుడు సాక్స్ తొడుక్కోకుండా ట్రయల్ చేయడం సరి కాదు. బూట్లకు ముందు కనీసం అర అంగుళం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కాలిగోర్ల పెరుగుదల నిలిచిపోవడం, తద్ద్వారా ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాదరక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో అవసరం. ఒక్కోసారి చెప్పుల నుంచి వాటిని తయారు చేసిన మెటీరియల్ మూలాన ఘాటైన వాసనలు వస్తుంటాయి. మంచి నాణ్యత గల చెప్పులు ఈ ఘాటైన వాసనను విడుదల చేయవు, చెప్పుల వాసన ఘాటుగా ఉంటే, మైకం, కళ్లు తిరగడం, కడుపులో తిప్పడం వంటి అసౌకర్యాలు కలుగుతాయి. రంగు కూడా ముఖ్యమే! చెప్పుల రంగు మామూలుగా ఉందో లేదో గమనించండి. సాధారణంగా మంచి నాణ్యత గల చెప్పుల రంగు ముదురుగా ఉండదు. అదే చవక రకం చెప్పుల రంగు చాలా బ్రైట్‌గా ఉంటుంది, ఈ రంగులలో ఎక్కువగా కాడ్మియం, సీసం, ఇతర హెవీ మెటల్ అంశాలు ఉంటాయి, ఇది పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి లేత రంగులే మంచిది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద చెప్పులు వేసుకుంటే బ్యాలన్స్ చేసుకోలేక పడిపోతారని, మెత్తటి చెప్పులయితే నడక సరిగా ఉండదనే అపోహతో బిగుతుగా ఉండే గట్టి చెప్పులు కొంటారు. నిజానికి, బిగుతైన చెప్పులు ధరించిన పిల్లలు పాదాల, కాలి వేళ్ల పెరుగుదలకు ఆటంకం కలిగించినట్లే. స్లిప్పర్ లోపల ఉన్న పొడవు పిల్లల పాదం కంటే కనీసం ఒక సెం.మీ అయినా ఎక్కువుండాలని నిపుణుల సలహా. బరువైన చెప్పులు వద్దు... మీరు కొనాలనుకుంటున్న చెప్పులను ఒకసారి చేతితో పట్టుకుని చూడండి. బరువు తక్కువగా ఉండి, చేతుల్లో భారమైన అనుభూతి లేనట్లయితే, అది కొత్త మెటీరియల్‌తో తయారయిందని చెప్పవచ్చు. బరువుగా అనిపిస్తే వాటిని కొనుగోలు చేయవద్దు. చివరగా ఒక మాట... చెప్పులే కదా అని తేలిగ్గా తీసేయద్దు. వీటి గురించి చెప్పుకోవాలంటే ఇంకా బోలెడన్ని సంగతులున్నాయి. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! -
బతుకు చిత్రం :పాదరక్షల తయారీ పరిశ్రమల్లో వేలాదిమందికి ఉపాధి
-
మెట్రో బ్రాండ్స్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైలర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు 2.19 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. మెట్రో, మోచీ, వాక్‌వే తదితర బ్రాండ్ల ఫుట్‌వేర్ కంపెనీ ప్రీఐపీవో ప్లేస్‌మెంట్‌కింద రూ. 10 కోట్లను సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధులను కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు వెల్లడించింది. 1955లో మెట్రో బ్రాండుతో తొలిసారి ముంబైలో స్టోర్‌ను ప్రారంభించిన కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు సైతం పెట్టుబడులున్నాయి. 2021 మార్చికల్లా కంపెనీ దేశవ్యాప్తంగా 134 పట్టణాలలో 586 స్టోర్లను నిర్వహిస్తోంది. -
జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు
సాక్షి, నంద్యాల : అసలే ఎండాకాలం.. గతంలో ఎప్పుడూ లేనంతగా భానుడు భగభగా మండిపోతున్నాడు.. బయటికి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్న తరుణంలో ఓ వ్యక్తి చెప్పుల్లేకుండానే నడుచుకుంటూ కూలి పనులకెళుతున్నాడు.. పైగా తారు రోడ్డు మీద. గమనించిన ‘సాక్షి’ అతడిని పలుకరించింది. సాక్షిని చూడగానే సంతోషంతో అతను ఇలా చెప్పాడు.. ‘నా పేరు దూదేకుల ఖాశీం. మాది కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామం. ఓదార్పు యాత్రలో భాగంగా 2010లో కర్నూలు జిల్లాకు వచ్చిన జగనన్నను కలిశాను. వైఎస్సార్ బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలని.. ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ అన్నను కలిసేంత వరకూ కాళ్లకు చెప్పులు ధరించనని స్నేహితులు, గ్రామస్తులందరి సమక్షంలో శపథం చేశాను. 11 ఏళ్లుగా పాదరక్షలు లేకుండానే నడుస్తున్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డిని కలిశాను.. సీఎం దగ్గరకు తీసుకెళతానన్నారు’ అని చెప్పాడు. అంతలో గ్రామస్తులు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిందాకా ఖాశీం చెప్పులు వేసుకునేలా లేడు.. ఆయనను త్వరగా సీఎం దగ్గరకు తీసుకెళ్లండయ్యా.. అంటూ విజ్ఞప్తి చేశారు. చదవండి: సచివాలయాలు యూనిట్‌గా వ్యాక్సినేషన్: సీఎం జగన్ -
చెప్పులు మధ్యాహ్నమే ఎందుకు కొనాలి?
సుష్మ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తోంది. ఎప్పుడూ పాదాల పగుళ్లు, కాలి గోర్ల చివరన ఇన్ఫెక్షన్తో బాధపడేది. ఆయింట్మెంట్లు, ఇతర మందులు వాడినా ఫలితం లేదు. ఇటీవల ఓ డాక్టర్‌ను సంప్రదించి తన సమస్యను వివరించగా.. ఆయన అది మీరు వేసుకునే చెప్పుల లోపంగా చెప్పడంతో సుష్మ విస్తుపోయింది. ఆయన సలహా మేరకు పాదరక్షలు వినియోగించడంతో ఆర్నెల్లలోనే ఆమె సమస్య నుంచి బయట పడింది. సాక్షి, హైదరాబాద్: దుస్తుల విషయంలో ప్రతి ఒక్కరూ చాలా వరకు నిక్కచ్చిగానే వ్యవహరిస్తుంటారు. అంటే కొలతలు కరెక్టుగా ఉండాలని భావిస్తుంటారు. వాటి ప్రాధాన్యత అలాంటిది మరి. వినడానికి కాస్త వింతగా అని్పంచవచ్చు కానీ మనం వేసుకునే పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు మన పాదాలకు అతుక్కుని ఉండి, వాటిని కాపాడేది పాదరక్షలే. ఈ పాదరక్షల విషయంలో ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవు. దీర్ఘకాలిక సమస్యగా కూడా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదరక్షలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సరైన సైజును ఎంచుకోవాలని చెబుతున్నారు. మరి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, డయాబెటిస్ రోగులు, సర్జరీలు చేయించుకున్న వాళ్లు తప్పకుండా మధ్యాహ్నం, సాయంత్రం మధ్య వేళలో (లేట్ ఆఫ్టర్నూన్) చెప్పులైనా, బూట్లైనా కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు. మధ్యాహ్నమే ఎందుకు...? గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, డయాబెటిస్ పేషంట్లకు సహజంగా కాళ్ల వాపులుంటాయి. అదే విధంగా ఎక్కువ సమయం కుర్చీలో కూర్చొని పనిచేసే వాళ్లకు సైతం విధినిర్వహణలో ఉన్నంత సేపు కాళ్లు కాస్త వాచి కనిపిస్తుంటాయి. ఎక్కువసేపు కూర్చోవడంతో కండరాల్లో ఎక్కువ సేపు కదలికలు నిలిచిపోవడంతో వాపు వస్తుంది. ఈ కేటగిరీలోనివారికి ఎక్కువగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వాపు స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో చెప్పులు కొనుగోలు చేస్తే సాధారణ సైజు కంటే కొంచెం పెద్దది తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగని బాగా పెద్ద సైజు తీసుకుంటే మామూలు సమయంలో వదులవుతాయనుకోండి. అయితే పనివేళలో సరైన సైజ్ చెప్పులు, బూట్లు వేసుకోవడం సౌకర్యంగా ఉంటుందని, ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు. బిగుతు చెప్పులతో తిప్పలు... కాలి సైజు కంటే చిన్నగా, బిగుతుగా ఉండేవి ధరిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాదాలకు పగుళ్లు వస్తాయి. అవి దీర్ఘకాలికంగా తగ్గవు. కాళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు సైతం ఎదురవుతాయి. బిగుతైన బూట్లు వేసుకుంటే గోర్లు పెరుగుదల మందగిస్తుంది. అంతేకాకుండా గోటి చివర్లు వేళ్లలోనికి గుచ్చుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లకు గురై తీవ్రం గా మారే ప్రమాదం ఉంది. పెద్ద సైజు చెప్పులు, బూట్లు వేసుకోవడంతో మడమల సమస్యలు ఎదురవుతాయి. అలాగే తరుచూ కాళ్లు బెణకడంతో పాటు నడకలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రెండు కాళ్లకూ వేసుకుని చూడాలి పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక కాలికి మాత్రమే ట్రయల్ వేసి ఖరారు చేసుకోవద్దు. రెండు కాళ్లకు వేసుకుని కాస్త ముందు, వెనక్కి నడిచిన తర్వాత సౌకర్యవంతంగా అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. బూట్లు కొనుగోలు చేసేటప్పుడు సాక్స్ ధరించి ట్రయల్ వేయాలి. బూట్లకు ముందు కనీసం అర అంగుళం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కాలిగోర్ల పెరుగుదల నిలిచిపోవడం, ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాదరక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ కుమార్ కృష్ణమోహన్, సీనియర్ జనరల్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ -
చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, చెన్నై : ఖరీదైన పది జతల చెప్పులు పోయాయంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన ఘటన తమిళనాడులోని చెన్నైలో గతవారం చోటుచేసుకుంది. పాదరక్షల మాయంపై ఫిర్యాదుపై పోలీసులు విస్తుపోయినప్పటికీ, చివరికి కేసు నమోదు చేసి చెప్పుల దొంగ కోసం దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే... కీల్పాకం సెక్రటేరియేట్ కాలనీ దివాన్ బహుదూర్ షణ్ముగం రోడ్డుకు చెందిన అబ్దుల్ రఫిక్(46) నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. తన ఇంటి ముందు ఉన్న ర్యాక్‌లో ఉంచిన రూ. 80 వేలు విలువైన 12 జతల షూలు, ఏడు జతల పాదరక్షలు మాయమైనట్టుగా సెక్రటేరియేట్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రాండెడ్ పాదరక్షలను అపహరించుకు వెళ్లారని ఆయన ఇచ్చిన ఫిర్యాదును చూసి పోలీసులు విస్తుపోయారు. కాగా చెప్పులు మాయంపై అబ్దుల్ రఫిక్ ....పొరుగున ఉండే బ్యాచ్‌లర్స్‌తో పాటు తన ఇంట్లో పని చేసే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల చివరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని ఆధారాల కోసం సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రఫిక్ పొరుగున ఉండే వాళ్లను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన మహిళా ఉద్యోగి
సాక్షి, జనగామ: తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉన్నతాధికారికి ఓ మహిళా అధికారి చెప్పుతో బుద్ధి చెప్పారు. ప్రభుత్వ అధికారి లైంగిక వేధింపులు భరించలేక సహ మహిళా ఉద్యోగి చెప్పు తో కొట్టిన సంఘటన జనగామలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా అల్పసంఖ్యకుల సంక్షేమ శాఖలో (జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్) శ్రీనివాస్ అధికారిగా పని చేస్తున్నారు. అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌గా ఓ మహిళ ఉద్యోగి పనిచేస్తున్నారు. అయితే శ్రీనివాస్ ఆ మహిళా ఉద్యోగితో కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాను చెప్పినట్టు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి నిత్యం లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. శ్రీనివాస్ తీరుతో విసుగు చెందిన ఆ మహిళా ఉద్యోగి విషయాన్ని స్థానిక నాయకుడి దృష్టికి తీసుకెళ్లింది. అతను ఆఫీసుకెళ్లి నిలదీసి డీసీపీకి చెప్పుతానని బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా అతను తన తీరును మార్చుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ ఉద్యోగి కార్యాలయంలోనే శ్రీనివాస్‌ను చెప్పుతో కొట్టింది. అందరిముందు కొట్టడంతో చేసేది ఏమిలేక ఆమె కాళ్లపై పడి తాను తప్పుచేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే విషయం బయటకు రావడంతో అధికారి కీచక పర్వంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. -
పాదుకలకే పట్టం
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు. ఓరోజు వైకుంఠవాసుడి శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది. కించపరిచింది.‘‘నేను విష్ణుమూర్తి శిరస్సుపై దర్జాగా ఉన్నాను. నువ్వేమో స్వామివారి పాదాల దగ్గరున్నావు... అంతెందుకు మనుషులు కూడా నిన్ను తొడుక్కుని ఊరంతా తిరుగుతారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతేసుమా. కానీ నా విషయానికి వస్తాను... నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు’’ అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం. అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకూ దిగలేదు. కానీ విష్ణుమూర్తి ఏదో పనిమీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి స్వామివారికి. కన్నీళ్ళు పెట్టుకున్నాయి.పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు ‘‘పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధ పడుతున్నారు... మిమ్మల్ని నేనెప్పుడూ తక్కువ చేయలేదుగా... కిరీటం చెప్పిన మాటలకా బాధపడుతున్నారు...’’ అని అడిగాడు. వెంటనే పాదరక్షలు తన గోడునంతా మళ్ళీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు ‘‘ఇందుకా బాధ పడుతున్నారు... దాన్ని మరచిపొండి... కిరీటం మాటలు పట్టించుకోకండి... నేనురామావతారంలో మిమ్మల్ని పద్నాలుగేళ్ళపాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను. సరేనా...’’ అని హామీ ఇచ్చాడు.ఆ మేరకే రాముడుగా అవతారమెత్తినప్పుడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు ప్రతిరోజూ సింహాసనం ముందు కూర్చుని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచి తన తప్పుకు, పాదుకలను కించపరచి మాటాడినందుకు మానసికంగా బాధపడింది. ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. అదేవిధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు. – వై. సాత్యకి -
చిన్నసాయం.. పెద్దమనసు
కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో వేలాది జీవితాలు కొట్టుకుపోయాయి. బతికి బట్టకట్టిన వారికి జీవనం ప్రశ్నార్థకమైంది. ఆ భీకర ప్రకృతి విలయం.. దైనందిన జీవితాల్లో కల్లోలం రేపింది. దేశానికి దక్షిణంలో వచ్చిన ఆ వరదల తాకిడి తూర్పున ఉన్న జార్ఖండ్ మహిళలను కదిలించింది! దేశవ్యాప్తంగా.. చేతినిండా డబ్బున్న వాళ్లు ఆర్థిక సాయం చేస్తున్నారు. రోజు కూలితో జీవించే తమకు అంతంత డబ్బు జమ చేయడం సాధ్యమైన పని కాదు. ఆ డబ్బును బాధితులకు పంపించడం ఎలాగో కూడా చేతకాదు. అయినా సరే.. తాము చేయగలిగిన ఉడుత సాయమైనా చేయాలనుకున్నారు జార్ఖండ్ మహిళలు. తాము తయారు చేస్తున్న చెప్పులతోనే కేరళ వరద బాధితుల కాళ్లకు రక్షణ కల్పించినా చాలనుకున్నారు. అంతే. వెయ్యి జతల రబ్బరు స్లిప్పర్స్‌తో ఓ లారీ జార్ఖండ్ నుంచి బయలుదేరింది. దాయాలన్నా దాగని సాయం! జార్ఖండ్ రాష్ట్రం, దుమ్కా జిల్లాలో బాలిజోర్ గ్రామం. ఆ గ్రామంలో మూడు వందల మంది మహిళలు బాలి ఫుట్‌వేర్ కంపెనీలో పని చేస్తారు. వారికి రోజు కూలి 250 రూపాయలు. ఒక రోజు వేతనాన్ని వరద బాధితులకు సహాయంగా ఇవ్వాలనుకున్నారు. ఆ వేతనానికి వచ్చినన్ని చెప్పుల జతలను సహాయార్థం సమకూర్చారు. వాళ్లు తయారు చేస్తున్న ఫుట్‌వేర్ కంపెనీలో ఒక చెప్పుల జత ఖర్చు 70 రూపాయలవుతుంది. శ్రామికుల వేతనం కాకుండా కేవలం మెటీరియల్ ఇతర ఖర్చులు మాత్రమే. మొత్తం 75 వేల రూపాయల డబ్బుతో వెయ్యి జతల చెప్పులను కేరళకు పంపించారు. నిజానికి ఈ మహిళలు పేరు కోసం తాపత్రయపడకుండా నిస్వార్థంగా సహాయం చేశారు. కానీ సహాయం పొందిన వాళ్లకు తమకు సహాయం చేసిన వాళ్ల ఊరి పేరును చెప్పులే చెబుతున్నాయి. బాలిజోర్ పేరు మీదనే బాలి ఫుట్‌వేర్ కంపెనీకి ఆ పేరు పెట్టారు. ఉన్నదాంట్లోనే కొంత ‘రిలీఫ్’ ‘‘కేరళలో ఇలా జరిగిందని వార్తల్లో చూసి తెలుసుకున్నాం. ‘ఎంత ఘోరం, వాళ్ల పరిస్థితి ఏమిటి, తిరిగి వాళ్ల బతుకులు తేరుకునేదెలా’ అని పనిచేస్తూ మాట్లాడుకునే వాళ్లం. పెద్దవాళ్లు ఎవరెవరు ఎంత సహాయం చేస్తున్నారో కూడా మా కబుర్లలో తెలుస్తుండేది. రిలీఫ్ ఫండ్‌కి డబ్బు ఇచ్చేటంత పెద్ద ఉద్యోగులం కాదు. రోజుకు 250 రూపాయలు వస్తే... అందులోనే ఇంట్లో తిండి గడవాలి, కొంత దాచుకోవాలి. మేమే పేదవాళ్లం, మాదే పేదరికం అనుకుంటుంటే, వరదల్లో సర్వం కోల్పోయిన వాళ్ల పరిస్థితి ఇంకా దారుణం కదా. వాళ్లు మా కంటే దయనీయమైన స్థితిలో ఉన్నారు. అందుకే మనం తయారు చేస్తున్న చెప్పులనే వారికిద్దామని అందరం ఒక్కమాట మీదకు వచ్చాం. మా కంపెనీకి మెటీరియల్ ఇచ్చే అధికారులతో ఇదే మాట చెప్పాం. చెప్పులను వరద బాధితులకు పంపే ఏర్పాట్లు జిల్లా అధికారులే చేశారు’’ అని చెప్పింది బాలి చెప్పుల కంపెనీలో పనిచేస్తున్న మిథియా తాదు. ఆ కార్మికుల్లో చురుకైన మిథియా, మంజుదేవి, మోనికా తాదుతోపాటు మిగిలిన వాళ్లంతా ముందుకొచ్చారు. దాంతో కేరళకు సాయం అందింది. సమాజం స్వార్థపూరితంగా మారిపోయింది, మనుషుల్లో మానవత్వం లోపించింది, కాఠిన్యం రాజ్యమేలుతోంది... ఇలా ఎన్నో మాటలు వింటుంటాం. ఇన్నింటి మధ్య కూడా ఎదుటి వారికి కష్టం వస్తే అది తమ కష్టంగా స్పందించే సున్నితమైన మనసులు, చలించే స్నేహపూరిత హృదయాలు ఉన్నాయి. మరేం ఫర్వాలేదు.. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది అనే భరోసానిస్తున్నారు ఈ మహిళలు. – మంజీర -
పాదరక్షల్లో బంగారం తరలింపు
టీ.నగర్(చెన్నై): చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.33 లక్షల విలువగల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన అస్మద్‌ఖాన్ (34) తాను ధరించిన పాదరక్షల అడుగు భాగంలో బంగారాన్ని దాచి తీసుకువస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేరళకు చెందిన ప్రకాశ్ (32) సూట్‌కేసులో దాచి తీసుకువస్తుండగా పట్టుకున్నారు. కాగా, సింగపూర్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన చెన్నైకి చెందిన మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తి దగ్గర కస్టమ్స్ అధికారులు రూ.5 లక్షల విలువైన అబుదాబి దేశ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అతను తన లోదుస్తుల్లో ఆ కరెన్సీని దాచుకుని వచ్చి తనిఖీల్లో పట్టుబడ్డాడు. -
పాదరక్షలతోనే పూజలు
యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శివాలయం పనుల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వార తోరణ పూజలను కొందరు వైటీడీఏ, దేవస్థానం అధికారులు పాదరక్షలు ధరించి పూజ లను నిర్వహించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారులు ఇలా తప్పుడు పనులు చేస్తూ యాదాద్రి ప్రతిష్టను మంటగలుపుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పవిత్రంగా నిర్వహించాల్సిన ఈ శిలాన్యాస పూజలను అధికారులు అపవిత్రంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులతో శిలాన్యాస పూజల్లో పాల్గొంటున్నా.. పక్కన ఉన్న ఇతర అధికారులు వారించకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. -
4శాతం డిస్కౌంట్‌తో ఖాదిమ్ లిస్టింగ్
సాక్షి,ముంబై: పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) లో ఒకే అనిపించుకున్న దేశీయ ఫుట్‌వేర్ సంస్థ ఖాదిమ్ ఇండియా లిస్టింగ్‌లో నిరుత్సాహపర్చింది. ఈ నెల తొలి వారంలో పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న ఖాదిమ్ ఇండియా స్టాక్ ఎక్స్ఛేంజీలలో నష్టాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 750కాగా.. ఎన్ఎస్ఈలో 3.6 శాతం నష్టంతో రూ. 723వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 543 కోట్లను సమీకరించింది.ఇష్యూలో భాగంగా ఖాదిమ్ ఇండియా ప్రమోటర్ సిద్దార్థ రాయ్ బర్మన్ 7.22 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించగా.. ఫెయిర్‌విండ్స్ ట్రస్టీస్ 58.52 లక్షలకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచింది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 157.5 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 750 ధరలో 13 యాంకర్ సంస్థలకు షేర్లను కేటాయించింది. కాగా దక్షిణ భారతదేశంలో మూడవ అతిపెద్ద ఫుట్ వేర్ సంస్థగా ఉన్న ఖాదిమ్ ఇప్పుడు పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ఖాదిమ్ ఇండియా ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 1981లో ఏర్పాటైన కంపెనీ ఖాదిమ్ బ్రాండ్‌తో ప్రధానంగా ఫుట్‌వేర్ తయారీ, విక్రయాలను నిర్వహిస్తోంది. -
పాకిస్తాన్లో పాదరక్షలపై ‘ఓం’
కరాచీ: హిందువులు పవిత్రంగా భావించే ‘ఓం’ గుర్తును పాకిస్తాన్లో పాదరక్షలపై ముద్రించి విక్రయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది చాలా దురదృష్టకరమని, ఇలా చేయడం అపవిత్రమని అక్కడి మైనారిటీలైన హిందువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. టాండో ఆదం ఖాన్ పట్టణంలో వీటిని విక్రయిస్తున్నారని, దీనిపై సింధ్ ప్రభుత్వం వద్ద నిరసన తెలిపామని పాకిస్తాన్ హిందూ సమాఖ్య అధినేత రమేశ్ కుమార్ చెప్పారు. వీటిని దుకాణాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమంలోనూ ఈ పాదరక్షల చిత్రాలు కనిపించాయి. -
ఇలియానా.. చిట్టి బెల్లియానా..
ప్రముఖ సినీ నటి ఇలియానా చాలా కాలం తర్వాత సిటీలో తళుక్కుమంది. అమెరికాకు చెందిన లైఫ్‌స్టైల్, ఫుట్‌వేర్ బ్రాండ్ సంస్థ ‘స్కెచర్స్’ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో ఏర్పాటు చేసిన షోరూంను ఆమె బుధవారం ప్రారంభించింది. ‘నేను కావాలని తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం కాలేదు. మంచి పాత్రలు రాకపోవడంతోనే సినిమాలు చేయడం లేదు. మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం హిందీలో అక్షయ్‌కుమార్‌తో ‘రుస్తూమ్’ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంద’ని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో రాహుల్ వీరా తదితరులు పాల్గొన్నారు. - బంజారాహిల్స్ -
పాదరక్షలు పాత ఫ్యాషనే!
ఫ్లాష్‌బ్యాక్ తోలుతో తయారు చేసిన షూస్ చాలా ఆధునికమైనవని అనుకుంటాం గానీ, ఇవి చాలా పాత ఫ్యాషనే! క్రీస్తుపూర్వం ఏడువేల సంవత్సరాల నాడే మనుషులు తోలు పాదరక్షలను వాడటం నేర్చుకున్నారు. అప్పట్లో తయారు చేసుకున్న షూస్‌కు తోలు పీలికలనే లేసుల మాదిరిగా వాడేవారు. కలపతో తయారు చేసిన పాదరక్షలను కూడా వాడేవారు. మధ్యయుగాల నాటికి పాదరక్షల తయారీలో నైపుణ్యం, కళాత్మకత పెరిగింది. క్రీస్తుశకం పదిహేనో శతాబ్ది నాటికి యూరోప్‌లో హైహీల్స్ షూస్ వాడుకలోకి వచ్చాయి. వీటి మడమలు ఏడెనిమిది అంగుళాల ఎత్తు వరకు ఉండేవి. స్త్రీ పురుష భేదం లేకుండా అప్పటి సంపన్న వర్గాల్లో అందరికీ ఆ రకం పాదరక్షలే ఫ్యాషన్‌గా ఉండేవి. పద్దెనిమిదో శతాబ్ది నాటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో పాదరక్షల తయారీ కుటీర పరిశ్రమగా ఉండేది. పారిశ్రామిక విప్లవం తర్వాత, యంత్రాలతో పాదరక్షల తయారీ మొదలైన తర్వాత విప్లవాత్మక మార్పులే వచ్చాయి. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పాదరక్షలను తయారు చేయడం మొదలైంది. ముఖ్యంగా సైనికుల కోసం ప్రత్యేకమైన షూస్ తయారు చేసేవారు. చాలాకాలం పాటు తోలు పాదరక్షలే ఎక్కువగా అందుబాటులో ఉండేవి. అయితే, ఇరవయ్యో శతాబ్దిలో రబ్బర్, ప్లాస్టిక్, సింథటిక్ వస్త్రం, కేన్వాస్ వంటి వాటితో కూడా పాదరక్షలను తయారు చేయడం ప్రారంభమైంది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు పాదరక్షల తయారీరంగంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా బ్రాండెడ్ షూస్‌కు గిరాకీ పెరిగింది. క్రీ.పూ. 7 వేల సంవత్సరం నాటి తోలు షూ -
చెప్పు కొనలేని బాధ
♦ కాళ్లకు పాదరక్షలు లేకుండానే సర్కారు బడికి.. ♦ సగం మందికి పైగా విద్యార్థులు ఉట్టికాళ్లతోనే.. ♦ జిల్లాలో లక్ష మందికి పైగా చెప్పులు లేని దయనీయం.. ♦ పేదరిక మే కారణం.. ప్రభుత్వమే చెప్పులు ఇవ్వాలి.. ♦ స్వచ్ఛంద సంస్థలూ స్పందించాలి... సర్కారు స్కూళ్లలో చదివేవారు అందరూ నిరుపేదలే.. పిల్లలను బడికి పంపించడం కూడా తల్లిదండ్రులకు భారమే.. తల్లిదండ్రులు భారంగా భావించకుండా ఉండటానికి బడికి వచ్చే పిల్లలకు భోజనం, దుస్తులు, చెప్పులు, పుస్తకాలు, ఇతర సామగ్రి సర్కారు సమకూరుస్తోంది.. అనేక వసతులు కూడా కల్పిస్తోంది.. ఇందులో చెప్పులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎక్కడా ఇది అమలు కాలేదు. దీంతో సగం మందికి పైగా విద్యార్థులు చెప్పులు లేకుండానే బడికి వస్తున్నారు. ‘చెప్పు’కోలేని బాధను అనుభవిస్తున్న విద్యార్థుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్.. - కామారెడ్డి కాళ్లకు షూస్, నడుముకు బెల్ట్, మెడలో టైతోపాటు ఐడెంటిటీ కార్డు.. ఏకరూప దుస్తులు ధరించి, బండెడు పుస్తకాలుగల బ్యాగును మోస్తూ విద్యార్థులు వెళుతుంటే.. ప్రైవేట్ పాఠశాల గుర్తుకు వస్తుంది. కాన్వెంట్ చదువుల దర్జా కనిపిస్తుంది. మరి సర్కారు బడిలో.. ప్రభుత్వం ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా అమలు సరిగా లేదు. యూనిఫామ్స్ సంగతి పాలకులెరుగు.. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని పిల్లలెందరో ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తారు. పిల్లలను బడికి పంపడమూ భారమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్న పేద తల్లిదండ్రులు.. తమ పిల్లలకు చెప్పులు కొనివ్వలేకపోతున్నారు. ‘చెప్పు’కొనలేని పేద విద్యార్థుల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్... ‘‘సదాశివనగర్ మండలం కన్నాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 138 విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం 115 మంది హాజరయ్యారు. ఇందులో 80 మందికి చెప్పులు లేవు. కేవలం 35 మంది మాత్రమే పాదరక్షలు ధరించి బడికి వచ్చారు. ఇందులో మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న కన్నాపూర్ తండా నుంచి నిత్యం 35 మంది విద్యార్థులు కాలినడకన బడికి వస్తారు.’’ ‘మాచారెడ్డి మండలం అక్కాపూర్ ఉన ్నత పాఠశాలలో 119 మంది విద్యార్థులు ఉండగా 72 మందికి మాత్రమే చెప్పులు ఉన్నాయి. మిగతా 47 మందికి చెపులు లేకుండానే బడికి వస్తున్నారు.’’ ‘‘కామారెడ్డి పట్టణంలో ని ఆర్బీ నగర్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 71 మంది చ దువుకుంటున్నారు. మంగళవారం 55 మంది హాజరయ్యారు. ఇందులో 37 మందికి చెప్పులు లేవు. కేవలం 18 మంది మాత్రమే చెప్పులు ధరించి పాఠశాలకు వచ్చారు.’’ కామారెడ్డి : జిల్లాలో 465 ఉన్నత పాఠశాలలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,586 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో సగం మంది విద్యార్థులకు చెప్పులు లేవని తెలుస్తోంది. కామారెడ్డి డివిజన్లోని మాచారెడ్డి మండలం అక్కాపూర్ ఉన్నత పాఠశాల, సదాశివనగర్ మండలం కన్నాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ ప్రాథమిక పాఠశాలలను ‘సాక్షి’ పరిశీలించింది. ఇందులో సగం మందికిపైగా విద్యార్థులు చెప్పులు లేకుండానే బడికి వస్తున్నట్టు వెల్లడైంది. సర్కారు దృష్టి సారించాలి సర్కారు పాఠశాలలో ఎక్కువ మంది పేద విద్యార్థులే చదువుతున్నారన్నది కాదనలేని వాస్తవం. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు స్థోమత ఉన్నవారంతా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించి చదివిస్తున్నారు. వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేని వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. సర్కారు బడుల్లో చదివేది పేద విద్యార్థులే కాబట్టి వారికి ఏకరూప దుస్తులతో పాటు చె ప్పులను కూడా ప్రభుత్వమే అందించాల్సిన అవసరం ఉంది. స్వచ్చంద సంస్థలు స్పందించాలి... సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థుల చెప్పుకొనలేని బాధపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్కారు బడిలోని పిల్లలకు చెప్పులు పంపిణీ చేస్తే విద్యను ప్రోత్సహించినవారవుతారు. ‘శ్రీమంతులు’ సర్కారు బడులను దత్తత తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
పాఠకదేవుళ్లకు పాదసేవ
దాదాపు పది లక్షల ఏళ్ల క్రితం మనిషి తన రెండుకాళ్ల మీద నిలబడి, తన చేతులను పనులు చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టగానే నాగరికత ఆవిర్భవించడం మొదలైంది. ఇలా నడక ప్రారంభమయ్యాక పాదాలను వేడి, చలి, గాయాలనుంచి రక్షించుకునేందుకు పాదరక్షలు మొదలయ్యాయి. పాదరక్షలు వాడటం మొదలయ్యాక అందులోనూ నాగరకత చూపించుకునేందుకు హైహీల్స్ వాడకంతో 80 శాతం జనాభాలో పాదాల సమస్యలు మహిళల్లోనే ఎక్కువ. అలాగని పురుషుల పాదాల ఆరోగ్యం బాగుందా అంటే అదీ లేదు. కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాక స్థూలకాయం రావడం, శరీరం బరువంతటినీ పాదాలే మోయాల్సి రావడంతో సమస్యలు పెరిగాయి. మన బరువును జీవితాంతం మోసేటి మీ పాదాలకు వచ్చే సమస్యలేమిటి, వాటి నుంచి రక్షణ పొందడం ఎలా అన్న అంశాలను తెలుసుకుందాం. పాదాలకు వచ్చే సమస్యల్లో కొన్ని... మడమ బెణకడం ఆర్థరైటిస్ అథ్లెట్స్ ఫుట్ (పాదాలకు రింగ్వార్మ్స్ అనే సూక్ష్మక్రిములు సోకడం వల్ల వచ్చే దురదల, పగుళ్లతో కూడిన ఒక రకం సమస్య) పాదాల మంట డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టుకోకపోవడం వల్ల వచ్చే డయాబెటిక్ ఫుట్ పాదాలు పొడిబారిపోయి పగుళ్లు రావడం ఫ్లాట్ ఫీట్ పాదాల నుంచి దుర్వాసన రావడం పాదాలపై పుండ్లు రావడం పాదాలకు ఫంగస్ సోకడం గౌట్ (యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ చేరడం వల్ల పాదం బొటనవేలు ఎర్రగా మారి వాపు, నొప్పి రావడం) న్యూరోపతి (పాదాలకు వచ్చే నరాల సమస్య వల్ల స్పర్శజ్ఞానం తగ్గి, తిమ్మిరి రావడంతో పాటు పాదం నుంచి చెప్పు జారిపోయినా తెలియని పరిస్థితి) ఆర్థోటిక్స్ (పాదంలో ఒంపు ఉండే చోటు సక్రమంగా ఉండేలా చూడటం) షిన్ స్ల్పింట్ (మోకాలి కింది భాగంలో నొప్పి) స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అగ్లీ నెయిల్ సిండ్రోమ్ వార్ట్స్ (పాదాలకు పులిపిరులు రావడం) ఎవరెవరిలో రిస్క్ ఎక్కువ... పాదాల సమస్య వచ్చే అవకాశాలు సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొందరిలో మరింత ఎక్కువ. వారెవరంటే... పాదాలకు రక్తసరఫరా ఒకింత తక్కువగా ఉన్నవారిలో ఏవైనా గాయాలు, పగుళ్లు వస్తే అవి తగ్గడానికి చాలాకాలం పడుతుంటుంది పాదాల నరాలు దెబ్బతినడం వల్ల వాటికి గాయాలైనా నొప్పితెలియదు. దాంతో సమస్య ముదిరాక గానీ అది తెలియరాదు. ఈలోపు జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది డయాబెటిస్ ఉన్నవారికి పాదాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉన్నవారికి సూచనలు... డయాబెటిస్ సమస్య ఉన్నవారు తమ పాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా ‘పోడియాట్రిస్ట్’ (పాదాల స్పెషలిస్ట్ డాక్టర్)కు చూపిస్తూ ఉండాలి. తమ పాదానికి ఏదైనా దెబ్బతగిలినా, పగుళ్లు వచ్చినా గాయాలైనా జాగ్రత్తగా చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా గాయాలు తగిలినప్పుడు పాదాల్లో నొప్పి ఉందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. నొప్పి తెలియకపోవడం ప్రమాదకరమైన సంకేతం. ఇక ఇలాంటి ఏదైనా సమస్యతో పాటు గోరు లోపలికి తిరిగి పెరుగుతూ ఉంటే పోడియాట్రిస్ట్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మీ రక్తంలోని చక్కెరపాళ్లు ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారి పాదాలకు ఏదైనా గాయం అయితే ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వృద్ధులలో పాద సమస్యలు... చాలామంది వృద్ధులు తమ వయసు రీత్యా చూపు తగ్గడం వల్ల తమ పాదాలకు జరిగిన నష్టాన్ని గుర్తించలేరు. వారి పాదాల చర్మానికి సమస్యలు రావచ్చు. గోళ్లు సరైన ఆకృతిని కోల్పోవడం వంటి సమస్యలతో పాటు సాఫ్ట్ టిష్యూ డిజార్డర్స్, ఆర్థరైటిస్ వంటి పాద సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఆటలాడే వారిలో... ఆటలాడే స్పోర్ట్స్ పర్సన్స్‌లో కాళ్లకు, పాదాలకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ. వారికి స్ట్రెస్ ఫ్రాక్చర్స్, ఆర్చ్ పెయిన్ (ప్లాంటార్ ఫేసైటిస్), మడమ వద్ద మంటలు (అచిలిస్ టెండనోపతి), పాదం బొటన వేలి వద్ద నొప్పి (సెసామోడైటిస్) వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లల్లో వచ్చే పాదాల సమస్యలు... పాదాలకు వచ్చే సమస్యలు చిన్నపిల్లల్లోనే ఎక్కువ. వాళ్లు విస్తృతంగా ఆటలాడుతుంటారు. దాంతో బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు మొదలు, చురుగ్గా ఆటలాడే పెద్దపిల్లల వరకూ అన్ని వయసుల పిల్లల్లోనూ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే చిన్న పిల్లల పాదాలకు అయ్యే గాయాలను విస్మరించకూడదు. మంచి షూను ఎంచుకోవడం ఎలా... ఈ విషయంలో పోడియాట్రిస్ట్ మీకు మంచి సలహా ఇవ్వగలరు. అయితే ఆరోగ్యకరమైన పాదాలకోసం... మంచి, సౌకర్యవంతమైన పాదరక్షల ఎంపిక చాలా ముఖ్యం. మంచి షూస్ ఎంపికలో పాటించాల్సిన జాగ్రత్తలివి... మరీ ఎక్కువ హీల్ లేకుండా మీ మడమకు మంచి రక్షణ కల్పించేలాంటి షూను ఎంపిక చేసుకోవాలి నడిచే సమయంలో పాదం జారకుండా, మడతపడకుండా, స్లిప్ కాకుండా ఉండేలా మీ షూ ఉండాలి మీ పాదం బొటన వేలి తర్వాత కూడా కొంత ఖాళీ స్థలం ఉండేలా మీరు మీ షూ ఎంపిక సమయంలో జాగ్రత్త తీసుకోవాలి మీ పాదాల వేళ్లు అన్నీ సౌకర్యవంతంగా పట్టేంత స్థలం ఉండాలి. మీ వేళ్లకు షూ ఇరుకుగా ఉండకూడదు మీ పాదాలు కూడా శ్వాసించేలాంటి మెటీరియల్‌ను షూ కోసం వాడాలి. అంతేగానీ పాదాలు ఉక్కపోతకు గురయ్యేలాంటి మెటీరియల్ మీ పాదం ఆరోగ్యానికి సరికాదని గుర్తుంచుకోండి. అందుకే ప్లాస్టిక్ వంటి మెటీరియల్ కంటే ఎల్లప్పుడూ లెదర్ షూ వాడటమే మేలు షూ కింద ఉపయోగించే సోల్ ఎప్పుడూ రబ్బర్‌తో చేసిన ఒకింత మెత్తటి మెటీరియల్‌తో చేసినదై ఉండాలి. మీరు నడిచేప్పుడు కలిగే బంప్‌ను ఆ సోల్‌కు ఉపయోగించిన మెటీరియల్ తీసుకొని పాదానికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేయాలి. ఆరోగ్యవంతమైన పాదాల కోసం కొన్ని సూచనలు... ఏడాదికి ఒకసారి మీ పాదాలను నిపుణులైన ‘పోడియాట్రిస్ట్’కు చూపించుకోండి. ఒకవేళ మీకు దగ్గర్లో ఆ అర్హత గలిగిన వైద్య నిపుణులు లేకపోతే కనీసం ఆర్థోపెడిక్ నిపుణుడినైనా సంప్రదించండి మీరు ధరించే షూస్, సాక్స్ ఈ రెండూ సౌకర్యవంతంగా ఉండాలి. అవి ధరించాక అసౌకర్యం ఉంటే దాన్ని భరిస్తూ అలాగే ఉండకండి. దాని వల్ల పాదానికి జరిగే నష్టం ఎక్కువ ప్రతిరోజూ పాదాలను పరీక్షించుకుంటూ ఉండండి. పాదాలు ఎక్కడైనా ఎర్రబడ్డాయా, నొప్పి ఉందా, పాదంపైన ఎక్కడైనా చర్మం మందంగా మారిందా అనే విషయాలను పరీక్షించుకోండి పాదానికి ఏదైనా దెబ్బతగిలినప్పుడు, దాని నొప్పి తెలియకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. నొప్పి తెలియని సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు మీ కాళ్ల గోళ్లను పరిశీలించుకుంటూ ఉండండి. ఏదైనా గోరు లోపలివైపునకు పెరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి మీ పాదాల వద్ద పులిపిరుల్లాంటివి ఏవైనా పెరుగుతుంటే వాటిని బ్లేడ్‌తో కోసివేయకండి. డాక్టర్‌ను సంప్రదించండి మీరు షూ ధరించేముందు ప్రతిసారీ లోపల అంతా బాగుందేమో చూడండి. పదునైన వస్తువులుగానీ, రాళ్లవంటివిగానీ షూలో లేకుండా చూసుకోండి అంచుల గుర్తులు చర్మంపై ముద్రించుకుపోయేలా ఉన్న సాక్స్ వాడకండి మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. ఈ అలవాటు మీ పాదాలకు రక్తసరఫరాను తగ్గించి అనేక తీవ్రమైన సమస్యలు వచ్చేలా చేస్తుంది. ఈ సమస్యల తీవ్రత ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి మీరు పాదాన్ని కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. పాదాల పరిశుభ్రత ఇలా... ప్రతిరోజూ మీ పాదాలను శుభ్రంగా కడు క్కోండి. ముఖ్యంగా కాలివేళ్ల మధ్య శుభ్రమయ్యేలా సబ్బుతో నురగ వచ్చేంతవరకు కడుక్కోండి ఆ తర్వాత పాదాన్ని పొడిగా తుడుడుచు కోండి. తడిగా ఉన్నప్పుడే సాక్స్, షూ ధరించకండి గోళ్లను తొలగించే సమయంలో మూలలు లోపలికి కట్ అయ్యేంత లోతుగా కట్ చేసుకోకండి. గోళ్లను కూడా మరీ చర్మం కనిపించేంత లోపలికి కట్ చేసుకోకండి. కాస్త అంచుకనిపించేంత వేలి గోరును చివరన ఉంచుకోండి పాదాలపై పులిపిరి కాయలు ఉంటే వాటిని కోయవద్దు. వాటిని కరిగించేలాంటి గాఢమైన ద్రవాలను (యాసిడ్స్ వంటివాటిని) పులిపిరికాయలపై పోయకండి మీరు ధరించే సాక్స్ ప్రతిరోజూ మారుస్తూ, శుభ్రమైన వాటినే వాడండి. మరీ పొట్టివి, చాలా బిగుతుగా ఉండేవి వాకండి కొందరి పాదాలకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. ఇలాంటివారు సింథటిక్ మెటీరియల్‌తో చేసిన షూ కంటే గాలి తగులుతూ ఉండేలా శాండిల్స్ వాడటం మేలు. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
హైహెల్!
నాగరకతకు ప్రతీకగా భావించి అనుసరించే తప్పుడు వేషధారణలో ముఖ్యమైనది హైహీల్స్. అందం కోసం, పదిమందిలో ప్రత్యేకత కోసం ధరించే ఈ పాదరక్షలు... పాదాన్ని రక్షించడానికి బదులు, సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల పూర్తి శరీరానికే హాని చేస్తున్నాయి. హైహీల్స్‌ను ఎలా ధరించాలి, ఎంతవరకు ధరించాలో తెలుసుకుందాం. హైహీల్స్‌ను ఎందుకు తొడుగుతారు? నిటారుగా కనిపించేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. హైహీల్స్ తొడిగిన వారిలో మడమలు మరింత ఎత్తుకు వెళ్లేసరికి పృష్టభాగం కాస్త వెనక్కువస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మరింత నిటారుగా నిలబడతారు. ఇలా నిటారుగా ఉండటం వల్ల అందం ఇనుమడించినట్టయ్యి, ఎదుటివారికి ఆత్మవిశ్వాసంతోనూ కనిపిస్తున్నట్లుగా అవుతుంది. అందుకే ఈ హైహీల్. కానీ పరిమితికి మించిన హీల్ వల్ల దీర్ఘకాలంలో పాదాలకూ, పాదాల్లోని కండరాలకూ, వెన్నుకూ జరిగే నష్టాలే ఎక్కవ. చాలాకాలం పాటు హీల్స్ వేస్తే...? హైహీల్స్ వాడటం వల్ల కండరాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేం. దాంతో కాలి కండరాలు తేలిగ్గా అలసిపోతాయి. కొద్ది శ్రమకే ఎక్కువ అలసిపోయే ఫలితం హైహీల్స్ వల్ల కనిపిస్తుంది. ఇదే ప్రక్రియ దీర్ఘకాలం సాగితే కండరాల్లో స్ట్రెయిన్ ఇంజరీస్ అనే గాయాలు అవుతాయి. కండరం అదేపనిగా గాయపడటం వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కటొక్కటిగా అనేక అనర్థాలు... : ఈ సృష్టిలో ప్రతి ప్రాణీ నడిచే సమయంలో ఒక క్రమత్వాన్ని పాటిస్తుంటుంది. దాన్నే గెయిట్ అంటారు. మనుషులకూ ఈ గెయిట్ ఉంటుంది. హీల్ వల్ల మడమ పైకి లేచి ఉంటుంది కాబట్టి మహిళలు మునివేళ్లతోనే ఎక్కువ పుష్ చేయాల్సి ఉంటుంది. అలా పుష్ చేస్తున్నకొద్దీ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి తుంటి భాగంలో ఉండే ‘హిప్ ఫ్లెక్సార్ కండరాలు’ అవసరమైనదానిక కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో హిప్ ఫ్లెక్సార్ కండరాలపై చాలా బరువు పడుతుంది. బ్యాలెన్స్: పాయింటెడ్ హీల్పై నిలబడటాన్ని ఎంతగా ప్రాక్టీస్ చేస్తే వారు అంత నాగరికులని లెక్క. కానీ జరగబోయే అనర్థాన్ని మహిళలు గుర్తించడం లేదు. ఇలా చేయడం వల్ల మన పాదం, చీలమండ బయటివైపునకు (స్యూపినేటెడ్) కదులుతాయి. ఫలితంగా బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు మరింత పెరుగుతాయి. బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు పెరిగినకొద్దీ పడటం, గాయపడటం వంటి ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. వెన్ను సున్నమవ్వడం ఖాయం: మన వీపు ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’ ఆకృతిలో ఉంటుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగం (లంబార్) ప్రాంతం తన ఒంపును కోల్పోయి నిటారుగా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఛాతీకి వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ తమ స్వాభావికమైన ఒంపును కోల్పోయి సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా ఒక కర్రలా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్మెంట్లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది. హిప్ (తుంటి భాగం)లో: మన తుంటి భాగంలో ఉండే హిప్ ఫ్లెక్సార్ కండరాలు తొడల పై భాగంలో వెనకవైపున ఉంటాయి. మనను ముందుకు నడిచేలా చేసే కండరాలు ఇవే. హైహీల్స్ కారణంగా వీటిలో ఉండాల్సినంత బలం లోపించడంతో సమర్థంగా నడిపించలేవు. పైగా హైహీల్స్ వల్ల అవి పొట్టిగా మారడమే కాకుండా... కంట్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంది. (మనకు ఏదైనా కండరం కాలినప్పుడు లోపల కదుము కట్టినట్లుగా బిగుతుగా మారి చర్మం నుంచి బయటకు కనిపించే భాగాన్ని కంట్రాక్చర్స్ అంటారు. కాలడం అన్నమాటను ఉదాహరణకు చెప్పినదే. కాలకపోయినా సరే కంట్రాక్చర్స్ వస్తాయి). మోకాళ్లు (నీస్): హైహీల్స్ వల్ల మహిళల్లో మోకాళ్లకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువ. హైహీల్స్ తొడిగినప్పుడు మోకాళ్లు ఒంగాల్సి (ఫ్లెక్స్‌డ్) వస్తుంది. ఇది మోకాళ్లలో లోపలివైపునకు ఒత్తిడిని (ఇన్వర్డ్ ఫోర్స్) వృద్ధి చేస్తుంది. దాంతో మోకాలిలోపలి భాగంలో అరుగుదల కనిపించి ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణమవుతుంది. చీలమండ (యాంకిల్): హైహీల్స్ వల్ల చీలమండ భాగంలోని యాంకిల్ జాయింట్ కదలికలు చాలా తగ్గిపోతాయి. దాంతో పిక్క కండరాలు (కాఫ్ మజిల్స్) పొట్టిగా మారతాయి. మడమ ఎముక (క్యాల్కేనియస్)పై ఒత్తిడి పడుతుంది. ఈ మొత్తం ప్రయత్నం వల్ల ‘ఇన్సెర్షనల్ ఎకిలిస్ టెండనైటిస్’ అనే ఒక రుగ్మత రావచ్చు. పాదం (ఫీట్): మామూలుగా పాదం నేలకు ఆనించి ఉన్నప్పటి కంటే... హీల్ పెరుగుతున్న కొద్దీ కాలి ముందు భాగంలో ఉండే ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కాలి నొప్పి, పాదం నిర్మాణంలో మార్పులు, హ్యామర్ టో, బునియోనెటీస్ వంటి కాలి వ్యాధులు, న్యూరోమా వంటి కండిషన్స్ అభివృద్ధి చెందవచ్చు. హైహీల్స్ వాడేవారికి టిప్స్: హైహీల్స్ వేసుకునే ముందు మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్ మసాజ్‌లా చేయండి. వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ కోసం అటూ ఇటూ పరుగెత్తి ఆ తర్వాత హైహీల్స్ వేసుకోండి. రోజంతా హైహీల్స్ వేసుకోకండి. మధ్యాహ్నం లేదా సాయంత్రాలే ధరించడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మీ పాదల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. హై హీల్స్ ధరించడానికి అనుకూలం మీ హైహీల్ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. అలాగని పూర్తిగా ఫ్లాట్‌గా ఉండే పాదరక్షలూ వద్దు. కాస్తంత మాత్రమే హీల్ ఉండే (లో హీల్) పాదరక్షలను ఎంచుకోండి. మీ మడమ వెడల్పు ఎంతో చూడండి. దానితో పోలిస్తే మీ మడమ ఎత్తు అందులో సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్ అని గుర్తుంచుకోండి. మీ హైహీల్స్ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి. మీరు హైహీల్స్ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థితి కూడా రావచ్చని గుర్తుంచుకోండి. హైహీల్స్ తొడిగాలనే కోరిక ఉంటే కొద్దికొద్దిగా హీల్‌ను పెంచుకోండి తప్ప... ఒకేసారి ఎక్కువ ఎత్తున్న హైహీల్స్ వేసుకోవద్దు. మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకుంటే అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ను చేయండి. హైహీల్స్ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి. డాక్టర్ కె. సుధీర్ రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
అయ్యప్ప దీక్ష.. ఆరోగ్య రక్ష
చన్నీటి స్నానం భక్తులు దీక్ష కాలమంతా తెల్లవారుజామునే లేచి శిరస్నానం చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. చల్లటి నీళ్లతో శిరస్నానం చేయడం వల్ల మనసుకు హాయినిస్తుంది. ఏకాగ్రత ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే.. శిరోభాగం(మెదడు) ఆలోచనలకు కేంద్ర బిందువు. నిత్యం ఆలోచనలతో రాపిడి ఏర్పడి తల వేడెక్కుతుంది. ఇది ఆరోగ్యానికి ఓ రకంగా హాని కలిగిస్తుంది. ప్రతి రోజూ చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల ఉష్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. మితాహారం.. దీక్షాపరులు ప్రతిరోజూ మితాహారం మాత్రమే తీసుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నాం భోజనం, రాత్రి తిరిగి అల్పాహారం తింటారు. దీనివల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండడంతోపాటు వ్యాధులు దూరమవుతాయి. దీక్షాధారులు తీసుకునే ఆహారం పూర్తిగా సాత్వికంగా ఉంటుంది. ఈ వంటల్లో వెల్లుల్లి, ఉల్లి, అల్లం వంటి మసాల దినుసులను ఉపయోగించరు. దీనివల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. పాదరక్షలు లేకుండా.. దీక్షా కాలమంతా భక్తులు పాద రక్షలు ధరించరు. శబరిమల, ఇతర యాత్రలకు వెళ్లేటప్పుడు యాత్ర అంతా పాదరక్షలు లేకుండానే చేయాల్సి వస్తుంది. దీని వల్ల యాత్రకు ఇబ్బందులు రావు. భూమికి ఉష్ణోగ్రత, అయస్కాంత తత్వం ఉంటాయి. పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల భూస్థితికి తగిన రీతిలో రక్తప్రసరణలు, హృదయ స్పందనలు సమకూరుతాయి. భూతలశయనం.. దీక్ష చేపట్టే భక్తులు నిత్యం కఠిన నేలపై నిద్రిస్తుంటారు. భూశయనం సుఖాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. భూమి మీద కాసేపు పడుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్యోపరంగా కూడా మేలు చేస్తుంది. భూమిలో శక్తి మార్పిడి శరీరానికి శక్తి అందిస్తుంది. చల్లని చందనం రెండు కనుబొమ్మల మధ్య నుదిటి భాగం యోగా రీత్యా విశిష్టమైనది. పాలభాగంగా పిలిచే ఈప్రాంతంలో ఇతరుల దృష్టి కేంద్రీకృతమవుతుంది. కుంకుమ, విభూది, గంధం, చందనాల్లో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల దృష్టి కేంద్రీకృతం కాదు. నాడీ మండలానికి కేంద్రమైన నుదుటి భాగంపై సున్నితమైన ఒత్తిడి ఆరోగ్యదాయకంగా చెబుతారు. నల్లని దుస్తులు అయప్ప స్వాములు నల్లని దుస్తులు ధరించాలన్న నియమం ఉంది. దీక్షలు చలికాలంలో చేయాల్సి ఉంటుంది. ఈ దీక్షా కాలంలో ఎండ వేడిమిని వెంటనే గ్రహించి రక్షణ కల్పించడంలో నలుపు రంగు ఉపయోగంగా ఉంటుంది. అంతే కాకుండా దీక్షా కాలం ముగిసిన పిదప శబరీశుడి దర్శన కోసం వనయాత్ర చేయాల్సి ఉంటుంది. అక్కడ వన్యమృగాల బారి నుంచి తప్పించుకునేందుకు నలుపు రంగు రక్షణగా ఉంటుంది. పూర్వజన్మ సుకృతం.. అయ్యప్పస్వామి మాలాధారణ పూర్వజన్మ సుకృతం. ఇప్పటి వరకు 16 సార్లు అయ్యప్ప మాల వేశాను. అన్ని విధాలా బాగుంటుంది. మండల కాలం పాటు కఠిన నియమాలతో దీక్షనాచరించి నారికేళమనే దేహంలోన పవిత్ర మైన నెయ్యి అనే ఆత్మతో నింపి ఇరుముడిలో తీసుకుని వెళ్లి ఆయ్యప్పస్వామి అభిషేకం చేయించి ఆత్మార్పణం చేసుకునే విధానం ఏదీక్షలో లేదు. ఇది చాలా పరమ పవిత్రం. ఉదయం లేచి చల్లటి నీటిస్నానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. - కృష్ణ, గురుస్వామి, బోర్గాం, నిజామాబాద్ స్వామి దర్శనం.. అద్భుతం శబరిగిరీశుడి దర్శనం.. అద్భుతం. ఆ అనుభూతిని పొందాలంటే మాలను ధరించి, దీక్షను ఆచరించాలి. నాలుగోసారి మాల వేశాను. అయ్యప్పస్వామి కరుణతో అన్నిపనులు అనుకున్నట్లుగా పూర్తవుతున్నాయి. మాల ధరించినప్పటి నుంచి పాటించే నియమాల వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి జరుగుతోంది. దీక్షలో ఉన్నవారికి స్వామి కటాక్షంగా సంపూర్ణంగా ఉంటుందని నమ్ముతున్నాను. అయ్యప్పదీక్షతో ఆధ్మాతిక భావం పెంపొందుతుంది. - సంజీవరెడ్డి, ఆర్యనగర్, నిజామాబాద్ ఏ రోజు.. ఏ సమయానికి... ఇందుకు మీరు htt://www.sabarimala.com సైట్లోకి వెళ్లాలి. ఇక్కడ మీకు స్క్రీన్‌పై సెర్చ్ ఎవైలబిలిటీ ఆప్షన్ వస్తుంది. ఎంతమంది భక్తులు ఉన్నారు, ఏ రోజు దర్శనం కావాలో ఇక్కడ మీరు తెలపాల్సి ఉంటుంది. కచ్చితమైన సమయం, ఎప్పుడు అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ‘స్పెసిఫిక్’ ఆప్షన్ అయితే సమయం ఎంచుకోవచ్చు. వివరాలు పూరించిన తరువాత సెర్చ్ క్లిక్ చేస్తే, ఎవైలబిలిటీ క్యాలండర్, ఎవైలబిలిటీ గుర్తులు వస్తాయి. గ్రీన్ కలర్ గుర్తు స్లాట్ ఉందని, లైట్ గ్రీన్ గుర్తు ఉంటే కచ్చితమైన సమయం లేదు కానీ స్లాట్ ఉందని, రెడ్ కలర్ గుర్తు ఉంటే స్లాట్ అందుబాటులో లేదని అర్థం. ఇక మీరు క్యాలండర్లో ఉన్న గ్రీన్ గుర్తుపై క్లిక్ చేస్తే విండో లెఫ్ట్‌లో సమయం ఎంచుకునేందుకు ఆప్షన్లు వస్తాయి. మీకు అనుకూలమైనసమయం వద్ద బుక్ నౌ క్లిక్ చేయాలి. {పత్యక్షమైన కన్ఫర్మ్ బుకింగ్ విండోలో సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి మరోసారి కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మీకు గెస్ట్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇది స్లాట్ బుకింగ్ పేజ్. కేవలం మూడు నిమిషాల్లో మీరు వివరాలు అందించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ అవసరమైన వివరాలు అందించి, 30 కేబీ పరిమాణం మించని సైజ్‌లో గల ఫొటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. తరువాత మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. {పింట్ తీసి దాన్ని దర్శన సమయంలో చిన్నపాదం దారిలో అందిస్తే మీకు దర్శనం సులభతరం అవుతుంది. నోట్ : ఈ విధానానికి ఇరుముడి కట్టుకున్న భక్తులే అర్హులు. వారినే విర్చ్యువల్ క్యూలైన్లో ఉంచుతారు. మీరు ఎంచుకున్న దర్శనం సమయానికి కనీసం 30 నిమిషాలు ముందుగా సంబంధిత క్యూలైన్ వద్దకు చేరుకోవాలి. ఫొటో ఐడీ కచ్చితంగా చూపించాలి. మరో విధంగా.. htt://www.sabarimala.com సైట్లోకి వెళ్లి విండోలో ఎడమ వైపున పైన రిజిష్టర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆప్షన్ వద్ద మీ ఈ-మొయిల్ లేదా ఫోన్ నంబరు ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంచుకోండి. యాక్టివేషన్ కోడ్ మీ మొబైల్‌కు వస్తుంది. దాన్ని లాగిన్ వద్ద ఎంటర్ చేయాలి. కనిపిస్తున్న విండోలో మీ వివరాలు, ఫొటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడి నుంచి మీరు కేవలం సమయం, తేదీ ఎంచుకుంటే సరిపోతుంది. మీ స్లాట్ వివరాలు మీ మొబైల్‌కు వస్తాయి. ఒకసారి రిజిష్టర్ అయితే ఎప్పుడైనా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. గమనిక : రిజిస్ట్రేషన్ సమయంలో మొబైల్, ఈ-మొయిల్‌కు వచ్చిన యాక్టివేషన్ కోడ్ కేవలం రెండు రోజుల వరకు మాత్రమే వాడుకలో ఉంటుంది.