యశవంతపుర(కర్ణాటక): ఆ గ్రామస్తులు చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు..ఎక్కడికెళ్లినా కాలి నడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇది వారు ఆచరిస్తున్న విచిత్ర వ్రతం. ఈ ఊరు పేరు కాలేబాగ్. విజయపుర పట్టణంలోని 30వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్‌లపై నుంచి పడి కొందరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.
చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ..
దీంతో గ్రామస్తులు రోజూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామానికి అరిష్టం పట్టుకుందని భావించిన గ్రామస్తులు పురోహితుడిని కలిసి తమను కాపాడాలని కోరారు. గ్రామ దేవతలైన జట్టింగేశ్వర, దుర్గాదేవిల పేరుతో వ్రతం ఆచారించాలని, ఈక్రమంలో ఐదు వారాల పాటు గ్రామస్తులు ఎవరూ పాదరక్షలు ధరించరాదని, ఎలాంటి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు కనీసం రెండు నెలలపాటు పాటిస్తే గ్రామానికి పట్టిన పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. పూజారి తెలిపిన మేరకు కఠిన నిబంధనలు పాటిస్తున్నట్లు కాలేబాగ్ గ్రామస్థుడు పరశురామ పూజారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment