Strange
-
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
ఈ వింతజీవి గురించి మేరెప్పుడైనా విన్నారా..!?
బల్లిలా కనిపించే ఈ వింతజీవి పేరు ‘ఆక్సలోటల్’. ఇది ఉభయచర జీవి. ఎక్కువగా మెక్సికోలో కనిపిస్తుంది. ఇవి పుట్టిన తర్వాత శైశవ దశలో నేల మీద ఉన్నా, పెరిగిన తర్వాత పూర్తిగా నీటిలోనే జీవిస్తాయి. పెద్ద తల, రెప్పలులేని కళ్లతో ఉండే ఈ జీవులు చూడటానికి చాలా వింతగా కనిపిస్తాయి.నీటిలోని చేపలు, చిన్న చిన్న కీటకాలను వేటాడి తింటాయి. వీటికి ఒక అరుదైన శక్తి ఉంది. గాయాల వల్ల వీటిలోని ఏ శరీరభాగం తెగిపోయినా, కొద్దికాలంలోనే వాటిని పూర్తిగా పునరుజ్జీవింప చేసుకోగలవు. బల్లుల వంటి జీవులకు ఈ శక్తి చాలా పరిమితంగా ఉంటుంది. బల్లులకు తోక తెగిపోతే, అది తిరిగి పెరుగుతుంది. ‘ఆక్సలోటల్’కు తోక ఒక్కటే కాదు, శరీరంలోని ఏ అవయవం తెగిపోయినా, కొద్దికాలంలోనే అది పూర్తిగా తిరిగి పెరుగుతుంది.ఇవి పాలిపోయిన తెలుపు, గులాబి, నలుపు, లేత బూడిద రంగు, ముదురు నీలి రంగుల్లో ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మెదడు వంటి అంతర్గత అవయవాలను కూడా ఇవి తిరిగి పెంచుకోగలవు. వీటికి గల పునరుజ్జీవ శక్తికి కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు జరుపుతున్నారు.ఇవి చదవండి: అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి? -
ఎన్నికల సీన్ ఎక్కడైనా సేమ్ టు సేమ్!
ఎన్నికలకు మించిన హడావుడి.. సందడి ఇంకొకటి ఉండదేమో! ఆకాశాన్ని అందించే వాగ్దానాలు.. తారలతో తోరణాలు కట్టే హామీలు.. సముద్రాన్ని లాక్కొచ్చే సాహసాలు.. నదులను పారించే నమ్మబలకడాలు.. లేమి లేని రాజ్యాల భరోసాలు.. అమృతాన్ని పంచిచ్చే ఆపేక్షలు.. ఓహ్.. ఆ ప్రచారాలు అరచేతిలో స్వర్గాలు! డిజిటల్ డాల్బీ శ్రవణానందాలు! సాధ్యాసాధ్యాల సంగతి తరువాత.. సంబరం మాత్రం అంబరమంత! చిన్నాపెద్దా.. ఆడామగా.. దొంగాదొరా .. కార్మికులు– వైట్కాలర్స్.. పౌరులు–వలసలు ఆసక్తిలేని వాళ్లెవరు! కుతూహలం కలగనిదెవరికి! ప్రపంచంలో ఎక్కడైనా ఇదే సీన్! తరాలు మారినా సేమ్ టు సేమ్! వింతలు విడ్డూరాలు.. చిత్రవిచిత్రాలు అన్నిచోట్లా కామనే! కామన్మన్కి కావలసినంత కాలక్షేపమే! అలాంటివి చరిత్రలో చాలా రికార్డ్ అయ్యాయి. వాటిలో కొన్ని ఇక్కడ.. ఫర్ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్!! రైనోసార్స్ పార్టీ కెనడాలో 1960ల్లో ఈ పార్టీ.. పొలిటికల్ పేరడీగా పేరొందింది. తాము అధికారంలోకి వస్తే అట్లాంటిక్ మహాసముద్రం మీద బ్రిడ్జ్ కట్టిస్తామంటూ.. గురుత్వాకర్షణ చట్టాన్ని రద్దు చేస్తామంటూ .. నాటి ప్రధాన రాజకీయ పక్షాల అసంభవ హామీలు, వాగ్దానాలపై పేరడీలు, ఛలోక్తులతో ప్రజల్లోకి వెళ్లేది. ఒకసారైతే తమను గెలిపిస్తే మాంట్రియల్ ఐలండ్‌ని జరిపి ఒంటారియో పక్కన పెడతామని.. గేదెల పాల ఉత్పత్తిని పెంచడానికి వాటికి హైహీల్స్‌ని అందజేస్తామని, నదులకు దారులు వేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని ప్రామిస్ చేసింది. అందుకే ఎన్నికల వ్యంగ్య ప్రచారాలకు ప్రసిద్ధిగాంచిందా పార్టీ. అలా ఆడుతూ.. పాడుతూ దేశ రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే రైనోసార్స్ పార్టీ ప్రధాన లక్ష్యం. లార్డ్ బకెట్‌హెడ్ నిజానికిది.. అమెరికన్ ఫిల్మ్ మేకర్ టాడ్ దుర్హమ్ తన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘హైపర్‌స్పేస్’ కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్. దీన్ని బ్రిటిష్ వీడియో డిస్ట్రిబ్యూటర్ మైక్ లీ అడాప్ట్ చేసుకున్నాడు.. 1987లో బ్రిటన్ జనరల్ ఎన్నికల్లో నిలబడ్డం కోసం. నల్లటి పొడుగాటి కోటు (బ్లాక్ కేప్) వేసుకుని తల మీద పెద్ద బకెట్ పెట్టుకుని ఎన్నికల ప్రచారంలోకి దిగాడు. హైపర్‌స్పేస్ ‘లార్డ్ బకెట్‌హెడ్’ ఎలాగైతే స్టార్ వార్ క్యారెక్టర్ డార్త్ వేడర్కి పేరడీయో.. అలాగే ఈ పొలిటికల్ లార్డ్ బకెట్‌హెడ్ కూడా బ్రిటిష్ రాజకీయ నేతలకు పేరడీ. అయితే ఈ పాత్రను రాజకీయాలకు ఒక్క మైక్ లీనే కాదు చాలా మంది అభ్యర్థులు అడాప్ట్ చేసుకున్నారు. మైక్ లీ మాత్రం రెండుసార్లు.. 1987 తర్వాత 1992లో కూడా లార్డ్ బకెట్హెడ్గా ఎన్నికల్లోకి దిగాడు. పెద్దల సభను రద్దు చేస్తా, దేశంలో అందరికీ ఉచితంగా సైకిళ్లను పంచిపెడతా, అత్యున్నతమైనవన్నీ జాతీయం చేస్తానంటూ చిత్రవిచిత్ర హామీలతో ఎన్నికల ప్రచారం చేసి ప్రజల దృష్టిలో పడడానికి ప్రయత్నించాడు. సీరియస్ రాజకీయాంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. హాస్యోక్తులు విసురుతూ ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ తరహాలోనే 2017లో లార్డ్ బకెట్హెడ్గా ఎన్నికలబరిలోకి దిగిన కమేడియన్ జొనాథన్ హార్వే.. రోబో రైట్స్, స్పేస్ ట్రావెల్ మొదలైనవాటిని సమర్థిస్తూ ప్రచారం చేశాడు. ఆ సమయంలోనే అప్పటి ప్రధాని థెరీసా మే పక్కన నిలబడిన ఆయన వీడియో వైరల్ అయి టాక్ ఆఫ్ ద వరల్డ్‌గా మారింది. పోలిష్ బీర్ – లవర్స్ పార్టీ ఇదే షార్ట్‌గా పీబీఎల్పీగా ఫేమస్ అయింది. బీర్‌ని ఎంజాయ్ చేసే హక్కును ఆస్వాదించడంలో.. సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో చాంపియన్‌గా పేరు తెచ్చుకుందీ పార్టీ. అలాగని దేశ సమస్యలను పట్టించుకోలేదని కాదు. బ్రహ్మాండంగా పట్టించుకుంది. వ్యంగ్యం, వెక్కిరింతలతో! అది కాస్తా హద్దు మీరి ప్రజల నిరసనకు గురైంది. సీరియస్ రాజకీయాలకు పనికిరాదనే విమర్శనూ ఎదుర్కొంది. నిజానికి సంప్రదాయ రాజకీయాలకు తల్లో నాలుకగా ఉండేందుకు ఏర్పాటైన పార్టీ ఇది.. 1990ల్లో. ద మాన్స్టర్ రేవింగ్ లూనీ పార్టీ వెర్రి జోకులు, అసంబద్ధ పాలసీలతో పాలిటిక్స్కున్న స్టీరియోటైప్ ఇమేజ్ను బ్రేక్ చేసిందీ పార్టీ. దీని స్వస్థలం యునైటెడ్ కింగ్డమ్. 1983లో ఏర్పడింది. ఈ పార్టీ ముఖ్యమైన ఎజెండా ఒకటే.. వీలయినంతగా జనాలను నవ్వించడమే! జోకర్స్లా డ్రెసప్ అయ్యి పార్టీ ఆఫీస్‌లో ప్రత్యక్షమయ్యేవాళ్లు. తాము గెలిస్తే దేశంలో అందరికీ ఫ్రీగా ఆముదపుగింజలు పంచుతామని, ముళ్లపంది స్వీట్‌ను ఇంట్రడ్యూస్ చేస్తామని, స్పేస్ నుంచి ఇల్లీగల్‌గా వచ్చిన ఏలియన్స్ కోసం పాస్‌పోర్ట్ ఆమ్నెస్టీ నిర్వహిస్తామనే హామీలతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది. చిత్రంగా తోస్తోంది కదా! కానీ ఇలాంటి విచిత్ర వాగ్దానాలతోనే బ్రిటిష్ సీరియస్ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిందీ పార్టీ. నిజానికి దాని లక్ష్యం కూడా అదే. నాటి ప్రధాన పక్షాలకు ప్రత్యామ్నాయంగా మారాలని! కొంత కృతకృత్యమైందనీ చెప్పొచ్చు స్థానిక ఎన్నికల్లో కొన్ని స్థానాలు సాధించి! ఇంతకీ ఆ ఎన్నికల్లో దీని స్లోగన్ ఏంటో తెలుసా? ‘వెర్రితనానికి ఓటేయండి’ అని! ద ప్రొహిబిషన్ పార్టీ 1869లో అమెరికాలో వెలసిన పార్టీ ఇది. సమాజంలోని ప్రధాన సమస్యలన్నిటికీ మద్యమే కారణమని నమ్మి.. దాన్ని నిషేధించాలనే ధ్యేయంతో ఏర్పడింది. ఆకట్టుకునే నినాదాలు, సంప్రదాయేతర వ్యూహాలతోనే ప్రజలకు దగ్గరవ్వొచ్చు అనుకుంది. మద్యం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దేశ సరిహద్దులను ఏనుగులతో కాపలా కాయించాలని సూచించింది. అంతేకాదు ప్రపంచ శాంతి కోసం దేశం పేరును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అర్త్గా మార్చాలనీ ప్రపోజ్ చేసింది. ఇలాంటి తిక్క సలహాలు, ఆలోచనలతో ప్రజలను తమవైపు తిప్పుకొని వాళ్ల మద్యపాన అలవాటును మాన్పించాలనేదే ద ప్రొహిబిషన్ పార్టీ ప్రయత్నం. ద నో (know) నథింగ్ పార్టీ దీన్నే నేటివ్ అమెరికన్ పార్టీ, అమెరికన్ పార్టీ అని కూడా పిలుస్తారు. 1850ల నాటిది. దీని పని పాలిటిక్స్ అయినా తీరుతెన్నులు మాత్రం గూఢచర్య సంస్థలా ఉండేవి. ఈ పార్టీ సభ్యులు కోడ్ లాంగ్వేజ్‌నే వాడేవారు. సీక్రెట్ పాస్వర్డ్స్ ఉండేవి. రహస్యంగా షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకునేవారు. వాళ్లను చూస్తే ఏదో స్పై మూవీ ఆడిషన్స్‌కి వచ్చినట్టు అనిపించేదట. దేనికైనా ఆ సభ్యులంతా ఒకటే జవాబు చెప్పేవారట ‘ఐ నో (know) నథింగ్’ అంటూ! ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం.. వలస ప్రజలకు అమెరికా పౌరసత్వం రాకుండా చూడ్డమే! స్థానికతను విపరీతంగా ప్రమోట్ చేసింది. వీళ్లు ఎన్నికల్లో గెలిచారు. కానీ వాళ్ల ఆలోచనలే కార్యరూపం దాల్చలేకపోయాయి. ఆబ్జెక్టివిస్ట్ పార్టీ ఆయన్ రాండ్ ‘వ్యక్తివాద’ సిద్ధాంత పునాదుల మీద ఏర్పడిన అమెరికన్ పార్టీ ఇది. వ్యక్తివాదాన్ని పీక్‌కి తీసుకెళ్లింది. పౌర జీవితాల్లో ప్రభుత్వాల జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని నమ్ముతుంది. అంటే వ్యక్తులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలనేది దీని వాదన. ఒక్కమాటలో చెప్పాలంటే ‘నేను.. నాది.. నాదే’ అనేది దీని ఎజెండా! ఈ పార్టీకి వెర్రి అభిమానగణం ఉంది. అయితే విమర్శకులు మాత్రం దీన్ని భ్రమల్లో బతికే పార్టీగానే చూశారు. ఫ్రీ సాయిల్ పార్టీ 1848లో.. అమెరికాలో వేళ్లూనుకుంది.. బానిసత్వ విముక్తి కోసం. ‘ఫ్రీ సాయిల్, ఫ్రీ స్పీచ్, ఫ్రీ లేబర్, ఫ్రీ మెన్’ దీని స్లోగన్స్. మార్టిన్ వ్యాన్ బ్యూరన్, సాల్మన్ పి. చేజ్ నేతృత్వంలో ఈ పార్టీ బాగానే హల్చల్ చేసింది. తూర్పు అమెరికా నుంచి పశ్చిమ అమెరికాకు మెల్లగా వ్యాపిస్తున్న బానిసత్వాన్ని గట్టిగానే అడ్డుకుంది. దేశాధ్యక్ష స్థానాన్ని గెలుచుకోలేకపోయినా ఆ పార్టీ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే రిపబ్లికన్ పార్టీకి విత్తులు నాటిందే ఫ్రీ సాయిల్ పార్టీ అంటారు. వెజిటేరియన్ పార్టీ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్ పాలిటిక్స్ వేదికగా శాకాహారాన్ని, జంతు హక్కులను ప్రమోట్ చేయడమే ఈ పార్టీ ఎజెండా. సుస్థిర జీవనమే దాని లక్ష్యం. జంతు పోషణ, వాతావరణ మార్పులు వంటి అంశాలకు సంబంధించి పాలసీలనూ రూపొందించింది. సంప్రదాయేతర రాజకీయ వ్యూహాల వల్ల ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరమైపోయి ప్రజలకు దగ్గర కాలేకపోయింది. ద కెనడియన్ ఎక్స్ట్రీమ్ రెజ్లింగ్ పార్టీ కెనడాలోని మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్స్, ఎంటర్టైనర్స్ కలసి ఏర్పాటు చేసిన పార్టీ ఇది. దేశంలో క్రీడారంగానికి నిధులు పెంచాలనే డిమాండ్, ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల అవగాహన కల్పించడం, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడం ఈ పార్టీ ప్రధాన ఉద్దేశాలు. సీరియస్ పొలిటికల్ లవర్స్, రాజకీయ విమర్శకులు ఈ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. యూత్ ఇంటర్నేషనల్ పార్టీ 1960ల్లో.. అమెరికాలో పురుడుపోసుకుంది. ఇందులోని సభ్యులను యిపీస్ అంటారు. దీన్నో రాడికల్ రెబల్ పార్టీగా అభివర్ణించొచ్చు. ఆబీ హాఫ్మన్, జెరీ రూబిన్ నేతృత్వంలో కొనసాగిన యిప్ (యూత్ ఇంటర్నేషనల్ పార్టీ) సెటైర్స్, నాటకాలతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టేది. దేన్నయినా సీరియస్‌గా తీసుకోకూడదు అనే విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు యిపీస్. పౌర హక్కులు, యాంటీ వార్ సెంటిమెంట్, పర్యావరణ పరిరక్షణ వీరి ఎజెండా. అమెరికాలో నేడు యిపీస్ ఫ్రంట్ పేజ్ స్టోరీ కాకపోయినా.. వారి వారసత్వం ఇంకా ఊపిరి తీసుకుంటోంది. ద పైరేట్ పార్టీ సముద్రపు దొంగల రాజకీయ ఆకాంక్ష అనుకునేరు ఈ పార్టీని! కాదు. ప్రైవసీ ప్రొటెక్షన్, డిజిటల్ రైట్స్, ఇంటర్నెట్ ఫ్రీడమ్ కోసం 2000లో స్వీడన్లో టెక్ సేవీ రెబల్స్ చేతుల్లో రూపుదిద్దుకుందీ పార్టీ. సంప్రదాయ రాజకీయలను పునరుద్ధరించాలను కుంది. కాపీరైట్ రీబూట్ చేయాలనే ప్రభుత్వ నిఘాను డిలీట్ చేయాలని డిమాండ్లను లేవదీశారు. మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలను సీరియస్‌గా తీసుకునే వాళ్లు ద పైరేట్ పార్టీని ట్రబుల్ మేకర్‌గా పరిగణించారు. కానీ సామాన్యుల అటెన్షన్‌ని బాగానే గ్రాబ్ చేసింది. అధికారం కోసం పోరాడేంత శక్తిమంతం కాలేదు కానీ స్థానిక సంస్థల్లో, పార్లమెంట్లో తన ప్రెజెన్స్‌ను మాత్రం చూపించుకుంది. గోళీలతో ఓటింగ్.. దక్షిణ ఆఫ్రికా దేశం గాంబియాలో అభ్యర్థుల ఎంపిక భలే ఆసక్తిగా ఉంటుంది. ఓటర్స్కి గోళీలను ఇస్తారు. ఎంతమంది అభ్యర్థులుంటే పోలింగ్ స్టేషన్లో అన్ని రంగుల డబ్బాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో డబ్బా మీద ఒక్కో అభ్యర్థి ఫొటోను అతికిస్తారు. ఆ డబ్బాకు గంటలను కడ్తారు. ఓటర్లు ఆ గోళీలను ఆ డబ్బాలోకి జారవిడవాలి. ఒక గోళీ వేయగానే డబ్బాకున్న గంట మోగుతుంది. ఒకవేళ ఓటరు ఒకటికి బదులు రెండు గోళీలు వేస్తే ఆ డబ్బా రెండుసార్లు మోగుతుంది. దీంతో దొంగ ఓటును పసిగడతారు. అయితే ఆ దేశం ఈ పాత సంప్రదాయం నుంచి పేపర్ బ్యాలెట్‌కి మారాలనుకుంటోందని ఇంటర్నెట్ సమాచారం. సోమ, మంగళ, గురువారాలు మాత్రమే అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో వారం, వర్జ్యం, తిథి, నక్షత్రం గట్రా అన్నీ కాకపోయినా వారం మాత్రం చూసుకుని పోలింగ్ రోజును నిర్ణయిస్తారట. ఎప్పుడైనా అమెరికాలో మంగళవారమే పోలింగ్ పెడ్తారు. పౌరుల దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా! కెనడాలో పోలింగ్ ఎప్పుడూ సోమవారం ఉంటుంది. యూకేలో గురువారం ఉంటుందట. ఆరోజు అక్కడ మార్కెట్ డే. ప్రత్యేకంగా పోలింగ్ కోసమే బయటకు వెళ్లాలా అని జనాలు బద్ధకించకుండా మార్కెట్ కోసం ఎలాగూ ఇల్లు కదులుతారు కాబట్టి.. పనిలో పనిగా ఓటేసి వెళతారని పోలింగ్ అధికారుల భావన. ఓటు వేయకపోతే ఫైన్ ప్రపంచంలో దాదాపు 22 దేశాలు.. ఓటు వేయని ఓటర్లకు ఫైన్ విధిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో అయితే 20 ఆస్ట్రేలియన్ డాలర్ల ఫైన్ ఉంటుంది. ఒకవేళ ఆ ఫైన్‌ను నిర్ణీత సమయంలో చెల్లించకపోతే పెరుగుతూపోతుందట. సామ్‌పియా..నో (Noh) థియేటర్ సామ్‌పియా అంటే మన నమస్కారం లాంటిదే. కంబోడియాలో ఇదొక పొలిటికల్ కల్చర్. వందనం. అక్కడ రాజకీయ నేతలను, ఉన్నత స్థాయి పౌరులను ‘సామ్‌పియా’తో గౌరవిస్తారు. క్షమాపణలు, మన్నింపులూ సామ్పియాతోనే! కంబోడియాలో సామ్పియాను..రాజకీయాలు, సంస్కృతీసంప్రదాయలు, గౌరవమర్యాదలకు మధ్య వారధిగా పరిగణిస్తారు. ఇలాంటిదే జపాన్‌లోనూ ఉంది. కాకపోతే కళారూపంలో. దాన్నే నో(Noh) థియేటర్ అంటారు. రాజకీయ సందేశాలు, నేతలకు గౌరవ వందనాలు తెలిపే ఒక నృత్య నాటకం. ఇది 12, 13 శతాబ్దాల్లో మొదలైందని చరిత్ర చెబుతోంది. పదహారేళ్లకే బ్రెజిల్, ఆస్ట్రియా, నికరాగువా, అర్జెంటీనాల్లో .. పదహారేళ్లు నిండిన వాళ్లంతా ఓటర్లే. ఇండోనేసియా, సుడాన్లలో పదిహేడేళ్లు నిండితే ఓటు హక్కు వస్తుంది. రీబూట్ చేస్తేకానీ.. 1988, మెక్సికో సాధారణ ఎన్నికల కౌంటింగ్‌లో.. కంప్యూటర్ క్రాష్ అయ్యి.. ఓట్లన్నీ ప్రతిపక్షం ఖాతాలో జమయ్యాయి. పరేషాన్ అయిన కౌంటింగ్ అభ్యర్థులు .. అది టెక్నికల్ ప్రాబ్లమ్ అని గ్రహించి.. కంప్యూటర్లను రీబూట్ చేశారు. అప్పుడు సెట్ అయ్యి కౌంటింగ్ సజావుగా సాగిందట. గెలుపు అధికారపక్షం వశమైందట. మూన్ కాలనీ 2012, అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన ప్రతినిధుల సభ స్పీకర్ న్యూట్ గింగ్రిచ్.. తనను గెలిపిస్తే 2020 కల్లా చంద్రుడి మీద అమెరికన్ కాలనీ నిర్మిస్తానని మాటిచ్చాడు. అదే ఎన్నికల్లో పోటీ చేసిన కళాకారుడు వర్మిన్ సుప్రీం.. తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కి ఒక గుర్రంపిల్లను బహూకరిస్తానని ప్రామిస్ చేశాడు. అంతేకాదు అమెరికాను పోనీ (గుర్రంపిల్ల) బేస్డ్ ఎకానమీగా మారుస్తాననీ చెప్పాడు. జంతువులు కూడా.. న్యూజిలాండ్‌లోని వాంగమోమోనా అనే టౌన్లో .. 1999లో బిలీ గమ్బూట్ అనే మేక ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. 1981లో.. అమెరికా లోనూ ఇలాంటిదే జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని సునో పట్టణంలో బాస్కో అనే లాబ్రడార్ జాతి కుక్క మేయరైంది. ఇంకా వెనక్కి వెళితే 1959లో బ్రెజిలియన్స్.. కకారెకో అనే రైనోసార్స్ని గెలిపించి సావ్‌పాలో కౌన్సిల్లో కూర్చోబెట్టారు దేనికైనా అదే అట్టహాసం.. ఇంగ్లండ్‌లోని రాజప్రాసాదాల్లో ఏ మార్పయినా అట్టహాసంగా జరగాల్సిందే. బకింగ్హమ్ ప్యాలెస్, సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లలో పాత గార్డ్ పోయి కొత్త గార్డ్ చార్జ్ తీసుకోవడానికీ తెగ హడావుడీ ఉంటుంది. బ్యాండ్ బాజా బారాత్‌తో కొత్త గార్డ్ రాగా.. ప్యాలెస్ ముందు ఠీవిగా నిలుచున్న పాత గార్డ్ ప్యాలెస్ కాపలా బాధ్యతలను కొత్త గార్డ్‌కి అప్పగిస్తాడట. టీ పార్టీ చైనాలో దౌత్య సంబంధాలను, సంధి ప్రయత్నాలను టీ పార్టీతో సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్నే ‘చా దేవ్’ అంటారు. 2013లో చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కాలిఫోర్నియాలో కలసినప్పుడు బరాక్ ఒబామాకు టీ పార్టీ ఇచ్చాడు. జిన్‌పింగే స్వయంగా అతనికి టీ కప్పును అందించాడు. అంటే రాజకీయ స్నేహాన్ని తాము గౌరవిస్తున్నామని, దానిపట్ల తమకు సానుకూల దృక్పథం ఉందని ఆ ‘చా దేవ్’ ద్వారా జిన్‌పింగ్ తెలియజేశాడన్నమాట. లా లే సెకా దీన్నే డ్రై లా అని కూడా అంటారు. ఏం లేదు.. మెక్సికోలో పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచి పోలింగ్ అయిపోయే వరకు మద్యపాన నిషేధం అమల్లో ఉంటుంది. తాగి.. గొడవలు పడి అది హింసకు దారితీయకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ బ్యాన్‌ను పెడతారు. ఇవండీ.. కొన్ని ప్రాపంచిక రాజకీయ విషయాలూ.. విశేషాలూ కొన్ని! అలరించి ఉంటాయి. (చదవండి: విదేశాల్లో కూడా వనభోజన సంప్రదాయం..! ఐతే ఎలా ఉంటాయంటే..) -
ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని..
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణంలో ముగ్గురు యువకులు బైక్‌పై మొహాలు కనబడకుండా న్యూస్ పేపర్లు చుట్టుకొని వేములవాడ వీధుల గుండా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ తిరగడంతో.. పట్టణ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు యువకులు వారిని వెంబడించి పట్టుకొని ప్రశ్నించగా తాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామని, ప్రమోషన్ కోసం వీడియో షూట్ చేశామని తెలిపారు. ఆ మాటలు విన్న పట్టణ వాసులు ఒక్కసారిగా అవాక్కై.. ఒకింత చిరాకు పడ్డారు. ఇదేం పిచ్చి రా బాబోయ్ అంటూ తలలు పట్టుకున్నారు. చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
వింత కేసు: ముప్పైలో గర్భం దాల్చగా.. 92 ఏళ్ల వయసులో ..
వైద్యులనే అవాకయ్యేలా చేసిన అత్యంత వింత కేసు ఇది. సాధరణంగా మనుషులు గర్భం దాల్చితే తొమ్మిది లేది పదో నెలలో డెలిరీ అవుతుంది. ఇది సహజం. కానీ ఏకంగా 60 ఏళ్లు గర్భాన్ని మోయడం, తొమ్మిది పదుల వయసులో ప్రసవించటమా!. ఇదేం విచిత్రం అనిపిస్తుంది కదూ. అన్నేళ్లు గర్భంలో ఎలా మోసింది. ఆ తల్లి బిడ్డలు బతికే ఉన్నారా? ఇది సాధ్యమేనా? ఎన్నో సందేహాలు వైద్యులను సైతం ఒకింత గందరగోళానికి గురిచేశాయి. ఆమె అన్నేళ్లు ఆ గర్భాన్ని మోస్తూ ఎలా బతికిందా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చైనాకు చెందిన మహిళ హువాంగ్ యిజున్(92) 1948లో 31 ఏళ్ల వయసులో ఉండగా గర్భం దాల్చింది. అయితే ఆ పిండం ఆమె గర్భాశయానికి వెలుపల పెరుగుతోందని, ఇది ఇరువురికి ప్రమాదమని చెప్పారు. వెంటనే ఆమెను వైద్యులు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆ పిండ ఎదగదని అబార్షన్ అవుతుందని చెప్పారు కూడా. ఐతే ఆర్థిక ఇబ్బందులు రీత్యా హువాంగ్ యిజున్ ఆ పిండాన్ని తీయించేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏదైతే అది అవుతుందని భావించి అలానే ఉండిపోవాలనుకుంది. విచిత్రంగా ఆమెకు ఎలాంటి నొప్పి గానీ గర్భ విచ్ఛతి అయినట్లుగా బ్లీడింగ్ అవ్వలేదు. ఇక ఆమె ఆ గర్భంతో అలానే మోస్తూ వచ్చింది. బతికే ఉంటుందన్న ఆశ, లేక బిడ్డ కడుపలోనే బతుకుతుందో అనుకుందో గానీ అలానే 61 ఏళ్లు గడిపింది. చివరికి తొమ్మిది పదుల వయసులో వైద్యులను ఆశ్రయించింది. వారు ఆమెను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె చెప్పింది నిజేనా అని అన్ని రకాలు పరీక్షలు నిర్వహించగా..వైద్యులంతా ఒక్కసారిగి ఆశ్చర్యపోయారు. ఇదసలు ఊహకే అందని వింత కేసు అన్నారు. ఆమె కడుపులోపల ఆ బిడ్డ చనిపోయి స్లోన్లా మారి అలా ఉండిపోయిందని చెప్పారు. ఇలా జరగడం అత్యంత అరుదని. ఎలాంటి ఇన్ఫెక్షన్ తలెత్తకుండా ఆమె చనిపోయిన పిండతో అలానే ఉండిపోవడం మాత్రం నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు. చివరికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ స్టోన్ బేబిని బయటకు తీశారు. వైద్య చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వింత కేసు ఇది అని అన్నారు. అందుకు సంబంధించన ఫోటోలు, హువాంగ్ యిజున్ కథ నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు 61 ఏళ్లు ప్రెగ్నెన్సీనా! అని ఆశ్చర్యపోతున్నారు. చైనాలో చాలామంది ప్రజలు వైద్య సదుపాయాన్ని పొందలేకపోతున్నురాని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. In 1948, Huang Yijun, a 31-year-old Chinese woman, discovered that she was pregnant. She went to the doctor, who informed her that the fetus was growing outside her uterus, specifically in her abdomen, a condition known as ectopic pregnancy. Huang needed to undergo surgery to… pic.twitter.com/ttu8ARl0jj — Historic Vids (@historyinmemes) August 17, 2023 (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
చెట్లు నరుకుతుండగా వింత ఘటన.. వీడియో వైరల్
ప్రకాశం జిల్లా: ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చెట్లు నరుకుతుండగా అకస్మాత్తుగా చెట్టులోంచి మంచినీళ్లు వచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో కొంతమంది చెట్లు నరుకుతుండగా, ఓ చెట్టులోంచి అకస్మాత్తుగా మంచినీళ్లు వచ్చాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను సైతం తాగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి.. -
ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం..
సాక్షి, ఖమ్మం జిల్లా: రెండేళ్ల క్రితం అదృశ్యమైన తల్లి చనిపోయిందనుకొని కర్మకాండలు పూర్తి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. తిరిగి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విచిత్ర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ-తిరపతయ్య దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుండి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పత్రికల్లోనూ, టీవీలోనూ ఆమె ఆచూకీ కోసం వెతక సాగారు. ఆమె వివరాల కోసం వెతికే సమయంలో సమీప ప్రాంతంలో కొండమీద ఒక మహిళను హత్య చేసిన సంఘటన జరిగింది. హత్యగావించబడ్డ మహిళ ఆధారాలు లభించకపోవడంతో మతిస్థిమితం లేక తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా భావించి ఆమె కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేసి గత్యంతరం లేని పరిస్థితిలో కర్మకాండలు కూడా పూర్తి చేశారు. తిరిగి రెండు సంవత్సరాల తర్వాత ఆమె కుమారుడు సోషల్ మీడియాలో కన్న తల్లిని గుర్తించిన కుమారుడు కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశాడు. ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ అనాథా శ్రమంలో ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా గుర్తుపట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు నాగేంద్రమ్మను అనాథాశ్రమంలో కలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మధిర పోలీసులను సంప్రదించారు. సరైన ఆధారాలు ఉండటంతో మహిళను వారి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మంత్రి ఎర్రబెల్లికి వింత అనుభూతి.. అసలేం జరిగిందంటే?
సాక్షి, వరంగల్: వెరైటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వింత అనుభూతి ఎదురైంది. దేవుడి పెళ్లికి పోతే మొబైల్ ఫోన్ మాయమయ్యింది. కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. కాసేపటికి భగవంతుడి మహిమతో దొరికిందని సంతోషపడ్డారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవుడి కల్యాణంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో మంత్రి మొబైల్ ఫోన్ పోయింది. ఫోన్ కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా మైక్ అందుకొని మంత్రి గారి ఫోన్ పోయింది.. ఎవరికైనా దొరికితే ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావుకు అప్పగించాలని కోరారు. ఆ నోటా ఈనోట అందరూ మంత్రి గారు ఫోన్ పోయిందట... ఏమైందో ఏమో అంటూ గుసగుసలు పెట్టారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆలయ అర్చకుడు రంగాచార్యులు మంత్రిగారి సెల్ ఫోన్ దొరికిందని సెలవిచ్చారు. మంత్రి సెల్ ఫోన్‌ను కారులోనే మరిచిపోయి వచ్చారట. అసలు విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. చదవండి: చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే? -
అత్యంత అరుదైన పుర్రె.. వేలంలో ఏకంగా రూ. 162 కోట్లు
వేల సంవత్సరాల క్రితం డైనోసర్ అనే పెద్ద రాక్షస బల్లులు ఉండేవి అని కథలు కథలుగా విన్నాం. టెరన్నోసారస్ రెక్స్ అనే మరో డైనోసర్ జాతి గురించి మనం ఇంతవరకు వినలేదు కదా!. ఇది డైనోసర్‌లో అతి పెద్ధ సరీసృపం. వీటిని టీ రెక్స్‌గా వ్యవహరిస్తారు కూడా. ఇవి ఒకప్పుడూ ఉత్తర అమెరికాలో ఉండేవట. ఐతే వీటీని టెరన్నోసారస్ రెక్స్ అని ఎందుకంటారంటే..లాటిన్లో టీ రెక్స్ అంటే రాజు అని అర్థం. అతిపెద్ద థెరోపాడ్ డైనోసార్ జాతి కాబట్టి దీనిని ఆ పేరుతో వ్యవహరించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ టీ రెక్స్ పుర్రె ఒకటి తవ్వకాల్లో లభించింది. దీన్ని వేలం వేస్తే దాదాపు రూ. 162 కోట్లు వరకు పలుకుతుందంటున్నారు. వివరాల్లోకెళ్తే.....యూఎస్‌లోని దక్షిణ డకోటాలో టీ రెక్స్ డైనోసర్ పుర్రెని కనుగొన్నారు పరిశోధకలు. ఇదోక విలక్షణమైన పుర్రె అని చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలతో దీన్ని సురక్షితంగా ఉంచకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ శిలాజం చెక్కు చెదరకుండా ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వెలికితీసిన పుర్రె ఆకారం ఉపరితలం చాలా వరకు పాడవ్వవకుండా ఉండేటేమే కాక, అతి సున్నితమైన ఎముకలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. ఈ పుర్రె సుమారు 6 నుంచి 7 అడుగులతో దాదాపు 200 పౌండ్లపైన బరువు ఉండచ్చని చెబుతున్నారు. ఇది సుమారు 76 మిలియన్ల ఏళ్ల పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ టైరన్నోసారస్ తన జాతిలో మరో టైరన్నోసారస్‌తో తలపడి ఉండవచ్చని, అందువల్లే దాని పుర్రెలో రెండు పంక్చర్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఇలాంటి జీవి పుర్రె తవ్వకాల్లో లభించడం అత్యంత అరుదని చెబుతున్నారు. ఐతే ఈ జీవి పుర్రె చెక్కు చెదరలేదుగానీ అస్తిపంజరం చాలావరకు కోతకు గురైందని అన్నారు. ఈ పుర్రెని మాక్సిమస్‌గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది వేలంలో సుమారు రూ.122 కోట్లు నుంచి రూ.162 కోట్లు వరకు పలుకుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: మహా సిగ్గరి కోసం అలుపెరగని ప్రయాణం.. చివరికి ఇలా ‘అద్భుతంగా’ చిక్కింది!) -
Strange Fish: రెక్కలతో నిలబడే చేప
బనశంకరి: శివమొగ్గ జిల్లా సాగర జలాశయంలో అపరూపమైన చేప కనబడింది. ఓ మత్స్య జీవశాస్త్రజ్ఞుడు ఎగిరే చేపను పసిగట్టి ఫోటోలు తీశాడు. వాటిని ట్విట్టర్లో పెట్టారు. ఎగిరే చేపలు అక్కడక్కడా సముద్రాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. సాగర చెరువులో రెక్కల చేప దర్శనమిచ్చినట్లు తెలిపారు. నేను 6 రకాల ఎగిరే చేపలను చూశా, కానీ ఇప్పుడు చూసిన చేప చాలా విచిత్రమైనది. ఇది ఎగరడమే కాదు, రెక్కలపై నిలబడుతుంది కూడా. ఇది కుతూహలంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. (చదవండి: కొట్టేశానోచ్! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!) -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో వింత ఘటన.. ఆశ్చర్యంలో భక్తులు
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిత్రమైన ఘటన మంగళవారంచోటు చేసుకుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమ్మవారి సన్నిధి సమీపంలో ఉన్న కాలభైరవ మూర్తికి మంగళవారం రాత్రి ఏకాంతసేవకు మునుపు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వరకు తీసుకెళ్లారు. చదవండి: త్వరలో ఐదు రూట్లలో టెంపుల్ టూరిజం అక్కడ భక్తులు, మోతగాళ్లు ఊరేగిస్తుండగా అమ్మవారి ధ్వజస్తంభం పక్కనే ఉన్న విజయస్తంభంలోని నాలుగు గంటల్లో ఓ గంట లయబద్ధంగా ఊగుతూ తిరగడం భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. ఆ సమయంలో గాలికేమైనా అలా ఊగుతూ మోగిందా అనుకోవడానికి పెద్దగా గాలి కూడా లేదు. ఒకవేళ గాలికే ఊగితే నాలుగు గంటలూ మోగాలి కదా!? పరమశివుడే అలా ఆనందపారవశ్యంతో నాట్యం చేస్తున్నాడన్నట్లుగా ఉందని భక్తులు ఎవరికి తోచినట్లు వారు భావించారు. దీనిని కొందరు వీడియో తీయడంతో బుధవారం సామాజిక మాధ్యమాల్లో బాగావైరల్ అయింది. -
విచిత్ర వ్రతం.. చెప్పులు తొడగరు.. బండ్లు నడపరు.. ఎందుకంటే?
యశవంతపుర(కర్ణాటక): ఆ గ్రామస్తులు చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు..ఎక్కడికెళ్లినా కాలి నడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇది వారు ఆచరిస్తున్న విచిత్ర వ్రతం. ఈ ఊరు పేరు కాలేబాగ్. విజయపుర పట్టణంలోని 30వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్‌లపై నుంచి పడి కొందరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. దీంతో గ్రామస్తులు రోజూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామానికి అరిష్టం పట్టుకుందని భావించిన గ్రామస్తులు పురోహితుడిని కలిసి తమను కాపాడాలని కోరారు. గ్రామ దేవతలైన జట్టింగేశ్వర, దుర్గాదేవిల పేరుతో వ్రతం ఆచారించాలని, ఈక్రమంలో ఐదు వారాల పాటు గ్రామస్తులు ఎవరూ పాదరక్షలు ధరించరాదని, ఎలాంటి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు కనీసం రెండు నెలలపాటు పాటిస్తే గ్రామానికి పట్టిన పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. పూజారి తెలిపిన మేరకు కఠిన నిబంధనలు పాటిస్తున్నట్లు కాలేబాగ్ గ్రామస్థుడు పరశురామ పూజారి తెలిపారు. -
వింతైన చట్టాలు...వింటే నవ్వాగదు!
ప్రపంచంలో ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు ఆయా దేశాల్లోని ప్రజలందరూ ఇబ్బందిపడకుండా అనుసరించే విధంగా చేసుకుంటారు. కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని అనే సందేహం కూడా కలుగుతుంది. ఆ చట్టాలేంటో? ఏమిటా కథ చూసేద్దామా! ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని వింత చట్టాలు, రూల్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో ఓ విచిత్రమైన చట్టం ఉంది. ఇక్కడ స్నానం చేయకుండా నిద్రపోతే జైల్లో పెట్టాస్తారట. స్నానం చేయకపోతే జైల్లో పెట్టడమేంటి రా బాబు అనుకోకండి. ఎందుకంటే ఆ దేశంలో దాన్ని చాలా తీవ్రంగా పరిగణించటమే కాదు చట్టవిరుద్ధంగా భావిస్తారట. చాలా ఫన్నీగా ఉంది కదూ. అలాగే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఎవరైనా కారును లోదుస్తులతో శుభ్రం చేయడం వంటివి చేస్తే జరిమానా విధిస్తారు. ఇటలీలోని మిలాన్ నగరంలో అయితే నవ్వు పైన నిషేధం. ఆ దేశంలో ఎవరైన నవ్వినట్టు కనిపిస్తే ఫైన్ వేస్తారట. ఈ చట్టాలను చూస్తే చాలా కామెడీగా ఉన్నాయి కదా. ఐతే ఆయా చట్టాల వల్ల ప్రయోజనం ఏంటో తెలయదు గానీ ఆయా దేశాల ప్రజలు మాత్రం ఈ వింత చట్టాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. (చదవండి: బనానా రికార్డు! అరటి పళ్ల ప్రదర్శన) -
పాలు ఇస్తున్న మేకపోతు
యశవంతపుర: మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రం హావేరి జిల్లా హనగల్ తాలూకా నరేగల్ గ్రామంలో జరిగింది. చమన్ షావలి అనే గ్రామస్తుడు ఒక మేక పోతును సాకుతున్నారు. ఏడాదిన్నర వయస్సు ఉన్న ఈ మేకపోతు కొద్దిరోజులుగా పాలు ఇస్తోందని చెప్పాడు. చుట్టుపక్కలవారు మొదట నమ్మలేదు. దీంతో వారి ముందే పాలు పితకడంతో చూసినవారు ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యాధికారులు చెప్పారు. (చదవండి: కొడుకు పుట్టాడన్న సంతోషం.. అదే రోజు రాత్రి స్వీట్లు తీసుకొని..) -
ఆకాశంలో వింత దృశ్యాలు.. నిమిషాల వ్యవధిలోనే
బత్తలపల్లి(అనంతపురం జిల్లా): సోమవారం తెల్లవారుజామున బత్తలపల్లి పరిసరాల్లో ఆకాశంలో వింత దృశ్యాలు గోచరించాయి. తూర్పున కాంతి వంతంగా కనిపించిన ఓ దృశ్యం కాసేపటికి రూపం మారి అదృశ్యమైంది. అలాగే దక్షిణాన శక్తివంతమైన వెలుగుతో మరో దృశ్యం గోచరించింది. తొలుత చిన్నదిగా కనిపించినా... నిమిషాల వ్యవధిలోనే పెద్దదిగా మారి మాయమైంది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే.. -
ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు..
సీతంపేట(శ్రీకాకుళం జిల్లా): గ్రామాన్ని చల్లగా చూడాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సీతంపేట మండలం జరడుకాలనీ గ్రామస్తులు గ్రామదేవత పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు గ్రామంలోకి ఇతరులు రాకను నిషేధించారు. చదవండి: సీఎం జగన్ ఆదేశాలు: పెద్దమ్మా.. ఇదిగో సెల్‌ఫోన్! మొదటి రోజున గ్రామ శివారున సందమ్మ, రెండో రోజున అమ్మవారికి, మూడో రోజున గ్రామ పితృదేవతలకు మొక్కులు తీర్చారు. దీనిలో భాగంగా బుధవారం యజ్జరోడు, దీసరోడు, జన్నోడులు వారి భాషలో ప్రత్యేక మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ పూజలు చేస్తున్నామని, అందరూ సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
భర్తపై ఎనలేని ప్రేమ.. అతని చితాభస్మానికి బానిసైన భార్య
బ్రిటన్: మద్యానికి, డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యే వాళ్లని చాలా మందిని చూసే ఉంటాం. ఇంకా చెప్పాలంటే... టీవి చూడటం, మొబైల్ ఫోన్ అధికంగా వాడటం, సోషల్ మీడియాలోనే గంటల తరబడి మునిగిపోయేవాళ్లు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ బ్రిటన్‌కి చెందిన ఒక మహిళ మాత్రం తన భర్త చితాభస్మానికి బానిస అయ్యాను దాన్ని ఆపడం తన వల్ల కాదంటూంది. చాలా వింతగా ఉందనిపిస్తుందా? అయితే అసలు విషయంలోకి వెళ్లితే బ్రిటన్‌కి చెందిన కాసీ 2009లో సీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. (చదవండి: ఏంటీ....స్నేక్ కేక్ ఆ!) అయితే అతను ఆస్తమా కారణంగా మరణించాడు. ఈ క్రమంలో ఆమె అప్పటి నుంచి తన భర్త చితాభస్మాన్ని తాను ఎక్కడకెళ్లితే అక్కడకి తనతోపాటే తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఈ మేరకు ఆమె తన భర్త చితాభస్మాన్ని కూడా తింటున్నానని దాన్ని ఆపలేనంటూ చెప్పుకొచ్చింది. పైగా ఆ బూడిద కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ చాలా ఇష్టంగా కొచెం కొంచెంగా తింటున్నానంటూ చెబుతోంది. ఆమె తన భర్తను ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టాయలని అనుకోవట్లేదని తనతోపాటు ఉన్నట్లుగా భావిస్తున్నందుకే ఇలా చేస్తున్నాను అంటోంది కాసీ. ఈ మేరకు బ్రిటన్ టీఎల్సీ ఛానెల్లోని 'మై స్ట్రేంజ్ అడిక్ట్' అనే కార్యక్రమంలో కాసీ తన వింత అలవాటు గురించి చెబుతూ నేను రోజు నా భర్త చితా భస్మాన్ని తింటున్నాను అంటూ పేర్కొంది. అంతే కాదండోయ్ అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురి అవ్వడంతోపాటు ఆమెపై ఒక కథనాన్ని కూడా ప్రచురితమైంది. దీంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: తలపాగే ప్రాణాలను కాపాడింది) -
హవ్వా.. ఇదేమి విచిత్ర ప్రచారం
ముత్తుకూరు(నెల్లూరు): మండలంలోని దొరువులపాళెంలో తిరుపతి ఉపఎన్నికల ప్రచారం విచిత్రంగా సాగుతోంది. బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి దారా విజయమ్మ పరిషత్ ఎన్నికలు ముగిసిన వెంటనే పచ్చ కండువా కప్పుకున్నారు. నిన్నటి వరకు కమలం కండువాతో ప్రచారం చేసిన ఆమె టీడీపీ కండువాతో తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతున్నారు. ఆమెను చూసిన స్థానికలు ఇదేం ప్రచారంరా బాబూ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. చదవండి: సినిమా తరహా పక్కా స్కెచ్: అనాథగా అవతారమెత్తి.. ‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’ -
కర్నూలులో వింత వైద్యం
-
పాలవలస గ్రామంలో వింత ఆచారం
-
తూర్పుగోదావరి జిల్లాలో వింత
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో శనివారం వింత చోటు చేసుకుంది. రుబ్బు రోలు నుంచి తెల్లని ద్రవం వస్తుండటంతో స్థానికులు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. రోలు నుంచి ఊరుతున్న తెల్లని ద్రవం పాలు అని స్థానికులు అంటున్నారు. పాలను తోడిన తర్వాత కూడా తిరిగి వస్తున్నాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టు పక్కల గ్రామాల వారికి తెలయడంతో ప్రజలు ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. అంతేకాకుండా రుబ్బురోలుకు పూజలు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. -
ఇక్కడ అంతా వింతే!
చదివింత భూటాన్ రాజకుమారుడు పుట్టినప్పుడు... ఆ దేశస్థులంతా మొక్కలు నాటి కొత్త తరహాలో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఆ రోజున వాళ్లు మొత్తం లక్షా ఎనిమిది వేల మొక్కలు నాటారట. పర్యావరణం పట్ల ఇంత శ్రద్ధ ఉండబట్టే భూటాన్ ప్రపంచంలోనే ‘మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ కంట్రీ’గా గుర్తింపు పొందింది! ఉక్రెయిన్‌లో కొందరు మహిళలు కలిసి అస్గర్దా అనే గ్రూప్‌గా ఏర్పడ్డారు. వీళ్ల లక్ష్యం ఒక్కటే... మగవాళ్లతో ఎటువంటి సంబంధం లేకుండా, వాళ్ల మీద ఆధార పడకుండా జీవించడం. అందుకే వీళ్లంతా ఒక కొండ ప్రాంతానికి వెళ్లి పోయి నివసిస్తున్నారు. తమ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటలీలో విగనెల్లా అనే ప్రదేశం ఉంది. దాని చుట్టూ ఉన్న కొండల కారణంగా చలికాలంలో 83 రోజుల పాటు సూర్యకాంతి లేక ఊరంతా చీకటిగా అయిపోతుంది. దాంతో అక్కడి ప్రజలంతా కలిసి కొండ అంచున ఓ పెద్ద అద్దాన్ని అమర్చి, సూర్యకాంతి దానిపై పడి ఊరి మీదికి రిఫ్లెక్ట్ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నారు. మెక్సికోలోని పల్మిటాస్ పట్టణానికి చెందిన యువత... తమ టౌన్‌ని అందంగా మార్చేందుకు అనుమతి ఇవ్వమంటూ వెళ్లి ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రెండు వందలకు పైగా ఇళ్లకు గ్రాఫిటీ ఆర్ట్‌తో కొత్త రంగులు అద్దింది. ఫలితంగా ఆ పట్టణం ఇప్పుడిలా ఉంది. అమెరికాకు చెందిన స్టీవ్ ఫ్యుగేట్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. ఒకరేమో ఆత్మహత్య చేసుకుంటే... మరొకరు మితిమీరి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మరణించారు. ఆ బాధ తట్టుకోలేని స్టీవ్, మరెవరి విషయంలోనూ అలా జరగకూడదన్న ఉద్దేశంతో ‘లవ్ లైఫ్’ (జీవితాన్ని ప్రేమించు) అన్న బోర్డు పట్టుకుని పన్నెండేళ్లుగా అమెరికా అంతటా సంచరిస్తూనే ఉన్నాడు. 1961లో అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ వాళ్లు నార్త్ కరొలినా ప్రాంతంలో పొరపాటున రెండు న్యూక్లియర్ బాంబుల్ని జారవిడిచారు. ఇవి ఒక్కోటీ హిరోషిమా బాంబు కంటే 250 రెట్ల విధ్వంసక శక్తి ఉన్నవి. అయితే అదృష్టవశాత్తూ అవి పేలలేదు. దాంతో పడినచోటే వాటిని భూస్థాపితం చేసేశారు. ఘోర ప్రమాదం తప్పింది కదా! అయామ్ సెమానీ అనేది అరుదైన కోడి జాతి. ఈ కోళ్లు అత్యంత నల్లగా ఉంటాయి. ఒంట్లో తెలుపన్నదే కనిపించదు. ఈకలు, చర్మం మాత్రమే కాదు... వాటి మాంసం, ఎముకలు, రక్తంతో పాటు అవి పెట్టే గుడ్లు కూడా నల్లగానే ఉంటాయి! మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌కి బ్లూ కలర్ ఎందుకు పెట్టాడో తెలుసా? అతనికి కలర్ బ్లైండ్నెస్ ఉంది. ఎరుపు, ఆకుపచ్చ అస్సలు కనబడవు. నీలిరంగు అయితే బాగా కనిపిస్తుంది. అందుకే కావాలని ఫేస్‌బుక్‌కి ఆ రంగు పెట్టాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టర్కీ కోడి తెలుసుగా? దీన్ని మనం టర్కీ కోడి అంటాం. టర్కీ వాళ్లేమో ‘హిందీ’ అంటారు. అరేబియాలో దీని పేరు గ్రీక్ చికెన్. గ్రీకులేమో దీన్ని ఫ్రెంచ్ చికెన్ అంటారు. ఫ్రెంచ్‌వాళ్లు ఇండియన్ చికెన్ అంటారు. దాంతో పాపమది ఏ ప్రాంతానికి చెందినదో ఎవరికీ తెలియకుండా పోయింది. 1986లో విడుదలైన ‘స్టాండ్ బై మి’ అనే ఆంగ్ల చిత్రంలో ఓ పిల్లాడు సిగరెట్ తాగే సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత నిజం తెలిసి చల్లబడ్డారు. ఆ నిజం ఏమిటంటే... ఇలాంటి వ్యతిరేకత ఎదురవుతుందని ముందే ఊహించిన దర్శకుడు క్యాబేజీ ఆకులతో సిగరెట్ తయారు చేయించి, దాన్ని కాల్పించాడట. -
చిన్నారి గర్భంలో పిండం
కలియుగ విచిత్రాల జాబితాలో మరొకటి చోటుచేసుకుంది. ఏడాది పాప గర్భంతో ఉన్న చిత్రమైన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో వెలుగు చూసింది. కోయంబత్తూరు జిల్లా పులియంపట్టికి చెందిన రాజు, సుమతి దంపతులకు నిశా అనే ఏడాది పాప ఉంది. ఇటీవల పాప పొట్ట విపరీతంగా పెరిగిపోవడం ప్రారంభించింది. దీంతో భయాందోళనలకు లోనైన తల్లిదండ్రులు చికిత్స కోసం మేట్టుపాళయంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పొట్టను స్కాన్ తీసి పరిశీలించిన వైద్యులు పాప కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్నట్లు గుర్తించి బిత్తరపోయారు. అలాగే లివర్, పిత్తాశయం వేర్వేరు చోట్ల ఉండడాన్ని గమనించారు. ఆలస్యం చేస్తే బిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని భావించిన వైద్యుల బృందం వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రెండుగంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. పాప కడుపులో నుంచి మూడు కిలోల పిండాన్ని తొలగించారు. ఆ పిండానికి అప్పటికే జుట్టు, కొన్ని ఎముకలు ఏర్పడి ఉన్నాయని డాక్టర్ విజయగిరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాప ఆరోగ్యంగా కోలుకుంటోందని తెలిపారు. పాప తల్లి గర్భవతిగా ఉన్నపుడు రెండు పిండాలు ఏర్పడి ఉంటాయని, వాటిల్లో ఒకటి ఈ పాపకాగా, మరో పిండం ఇదే పాప కడుపులోకి చేరి పెరగడం ప్రారంభించిందని తెలిపారు. పది లక్షల్లో ఒకటి ఇలాంటి కేసు ఉంటుందని చెప్పారు. -
నల్లగొండ జిల్లాలో వింత
నల్లగొండ జిల్లాలో ఓ వింత జరిగింది. ఆవు కడుపున నంది ఆకారంలో ఉన్న దూడ పుట్టింది. మహాశివరాత్రి రోజునే ఈ వింత చోటుచేసుకోవడంతో స్థానికులు శివలీలల్లో భాగంగానే ఇలా జరిగిందని అనుకుంటున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కోదాడ మండలం అనంతగిరి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. నంది ఆకారంలో ఉన్న దూడ జన్మించిందనే వార్త దావానంలా పాకడంతో ఈ వింతను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
వింతై వింతింతై
బ్యూటీ మీల్స్ పబ్లిసిటీ స్టంట్లు పలురకాలన్నట్లు ఉంది వాషింగ్టన్‌లోని ఓ హోటల్ తీరు. ఈ సౌత్ కొరియన్ హోటల్ కస్టమర్స్‌కి బంపర్ ఆఫర్ పెట్టింది. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేస్తే లంచ్ ఫ్రీ అనో.. ఓ రకం చైనీస్ బ్రేక్‌ఫాస్ట్ తింటే ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఉచితమనో.. బిల్లులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనో అనుకునేరు...ఇవేవీ కావు! హోటల్ తెరిచినప్పటి నుంచే వచ్చే మొదటి 50 మంది కస్టమర్లకు ఫ్రీ మీల్స్‌ని ఆఫర్ చేస్తోంది. అయితే...ఆ 50 మందీ అందంగా ఉంటేనే అని కండీషన్‌ను అప్లయ్ చేస్తోంది. కస్టమర్ల అందానికి వీళ్ల దగ్గరున్న కొలమానమేంటో అని పెదవి విరవకండి.. హోటల్ రిసెప్షన్లో ‘బ్యూటీ ఐడెంటిఫికేషన్ ఏరియా’ని ఏర్పాటు చేశారట. అక్కడ కను, ముక్కు తీరు, పెదువులు, ముఖాకృతిని పరిశీలించి టోకెన్ ఇస్తారట. ఎత్తు నుదురున్న వాళ్లకు అడ్వాంటేజ్ ఎక్కువట. వాళ్ల కనుముక్కుతీరు ఎలా ఉన్నా నుదురు ఎత్తుగా ఉంటే చాలు అందగత్తెలు, అందగాళ్ల కింద కన్సిడర్చేసి ఫ్రీ మీల్ ఆఫర్‌కి ప్రిఫర్ చేసేస్తున్నారట. ఈ ఆఫర్‌తో కస్టమర్ల తాకిడి పెరగడంతో ‘రెస్టారెంట్ ఫర్ గుడ్ లుకింగ్’ గా హోటల్ పేరునూ మార్చామని, ఫ్రీ మీల్ సౌకర్యాన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తామని అంటున్నాడు హోటల్ మేనేజర్ గ్జ్యూ హెగ్జిన్. పాండా ప్రెగ్నెన్సీ! నకరాలు, నటనలు నరులకే కాదు నాలుగు కాళ్ల జీవులకూ తెలుసు! భోగం సాగించుకోవడానికి రోగమున్నట్టు మనుషులు నటించినట్టే జంతువులూ నటిస్తాయి! ఈ విషయం రుజువైంది తైవాన్ రాజధాని తైపీలోని ఓ జూలో. రుజువు చేసింది ఓ పాండా. భోగం కోసం రోగమున్నట్టు కాదు కానీ గర్భం వచ్చినట్టు నటించింది. ఈ జూలోని ప్నెగ్నెంట్ పాండాలకు జూ సిబ్బంది ఇరవైనాలుగు గంటలు సేవలందించడం, రకరకాల పళ్లు ఇవ్వడం, సింగిల్ ఎయిర్‌కండీషన్డ్ గదిలో ఉంచడం వంటి సదుపాయాలు చూసి కన్నుకుట్టింది పదకొండేళ్ల ఆ పాండాకు. గర్భందాల్చినట్లు నటిస్తే తప్ప తనకు ఆ సౌకర్యాలు అందే ఛాన్స్లేదనుకుంది. ఇంకేముందు ఓ ఫైన్ మార్నింగ్ మొదలెట్టింది మార్నింగ్సిక్నెస్తో యాక్షన్. నీరసంగా ఉండి లేవలేనట్టుగా పడుకుండిపోయిందట. ఆకలి లేనట్టు, ఏదైనా తింటే వొమిట్ సెన్సేషన్ ఉన్నట్టు వాక్ వాక్ అనడం స్టార్ట్ చేసిందట. దీని ప్రవర్తనను చూసిన జూ సిబ్బంది అదీ ప్రెగ్నెంటేమో అనుకొని పాండాను సింగిల్ ఎయిర్ కండీషన్డ్ రూమ్‌లోకి మార్చారట. దానికిష్టమున్న తిండిని పెట్టారట. ఈలోపూ జూ లోని వెటర్నరీ డాక్టర్లకు పాండా విషయం చెప్పి టెస్ట్ చేయడం కోసం పిలిపించారట. టెస్టింగ్‌లో గుట్టు రట్టయింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో పాండాకు ప్రెగ్నెన్సీ లేదన్న నిజం బయటపడింది. ఏముందీ.. అప్పటికప్పుడే దాన్ని ఎయిర్‌కండీషన్డ్ గదిలోంచి మిగిలిన పాండాలున్న చోటకి చేర్చారు. తన నాటకం తెలిసిపోయినందుకు సిగ్గుతో ముడుచుకుపోయిందట పాండా! ఇదెందుకిలా నకరాలు చేసిందని ఆరా తీస్తే ప్రత్యేకమైన సౌకర్యాల కోసమే అలా చేసి ఉంటుందని ఓ అంచనాకొచ్చారట జూ సిబ్బంది. పాపం పాండా! 120 ఏళ్లనాటి పెళ్లిగౌను పెళ్లిలో పెళ్లి కూతురికి అన్నీ కొత్తవే కాకుండా నాన్నమ్మ నెక్లెసో.. అమ్మమ్మ గాజులో, అత్తయ్య చెవి దిద్దులో వంటి కొన్ని పాతవాటినీ ఆనవాయితీగా ఇస్తారు. ఈ సంప్రదాయం పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎబిగలి అనే పెళ్లికూతురుకీ అలాంటి వంశపారంపర్య కానుక ఒకటి వచ్చింది. ఏంటో కాదు వెడ్డింగ్ గౌనే! అదీ 120 ఏళ్ల కిందటిది. ఆ గౌన్ వేసుకున్న పదకొండో తరం పెళ్లికూతురుట ఆమె. వీళ్ల వంశంలో ఆ గౌను వేసుకున్న మొదటి వధువు మేరీ లోరీ వారెన్. 1895లో తన పెళ్లి సందర్భంగా ఈ గౌన్‌ను తనే డిజైన్ చేసుకుంది. అప్పటి నుంచి 120 ఏళ్లుగా చేతులు మారుతూ ఎబిగలి దగ్గరకు వచ్చేసరికి ముట్టుకుంటే చిరిగిపోయే స్థితిలో ఉందట ఈ పట్టుగౌను. పన్నెండు మంది డిజైనర్స్ 200 గంటలు కష్టపడి దీన్ని బాగుచేశారట. కేవలం కాక్టెయిల్ పార్టీ టైమ్‌లో అదీ పార్టీ ప్రారంభించేంత వరకు మాత్రమే ఈ డ్రెస్‌ను ధరించిందట ఎబిగలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. అందుకే అన్నేళ్లయినా దానికంత క్రేజ్ అంటుంది కొత్త పెళ్లికూతురు. ఓ మంచిదొంగ కథ యూరప్‌లోని క్రోయేషియా దేశం.. ఓ ఇంట్లో.. కాలింగ్ బెల్ మోగింది. డోర్ తెరిచాడు జెర్కోవిక్. చేతిలో పార్సిల్‌తో కొరియర్ బాయ్. అందులో ఏముందోనన్న ఉత్సుకతతో పార్సిల్ తెరిచాడు. అంతే! అతని ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. అందులో ఉన్నది 14ఏళ్ల కిందట పోగొట్టుకున్న పర్సు. అందులోని డబ్బును తన ఇంటి పైకప్పు రిపేరింగ్ కోసం బ్యాంకు నుంచి డ్రా చేశాడట. దాన్ని ఫంక్షన్లో పోగొట్టుకున్నాడో లేక తెలిసిన వారికి ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి వెళ్తుంటే పోగొట్టుకున్నాడో గుర్తులేదట. ఇన్నేళ్ల తర్వాత అతని పర్సు, అందులోని డబ్బును చూసి జెర్కోనిక్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు తను పోగొట్టుకున్న పర్సులో కేవలం 1000 యూరోలు (రూ.73,000) ఉన్నాయట. పార్సిల్లో తనకు అందిన పర్సులో 1440 యూరోలు (రూ.1,05,120) ఉన్నాయి. దాంతో మొదట జెర్కోవిక్ అనుమానంతో అవి దొంగ నోట్లోమోనని నిర్ధారణకు కూడా వెళ్లాడట. ‘‘ఆ రోజు నా పర్సును ఎవరో అవసరార్థం దొంగిలించి ఉంటారు. ఆ డబ్బు వారిని ఆపద నుంచి కాపాడి ఉంటుంది. అందుకే వారు కృతజ్ఞతతో ఎక్కువ డబ్బు పంపించారేమో’’నని జెర్కోవిక్ అందరికీ ఆనందంగా చెబుతున్నాడు. అయితే ఫ్రమ్ అడ్రస్ లేనందుకు మాత్రం బోలెడంత నిరుత్సాహపడిపోయాడు. చల్లని మంట! ఐస్‌క్రీమ్... పేరు వింటేనే ఎవరికైనా నోరూరుతుంది కదా! ఐస్‌క్రీమ్ అంటే స్వీట్ అండ్ కూల్... అనే భ్రమతో ఈ ఫొటోలో కనిపించే పదార్థాన్ని ఏమరపాటుతో నోటపెట్టుకున్నారో... ఇక అంతే సంగతులు! దాని మంటకు నవరంధ్రాల్లోంచి ఆవిర్లు రావాల్సిందే! ఎందుకంటారా..? దీని తయారీలో రుచి కోసం వాడేది పంచదార కాదు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఘాటైన ‘ఘోస్ట్ పెప్పర్’ అనే మిరపకాయలు మరి! ఈ ఐస్‌క్రీమ్ పైభాగంలో అలంకరణగా వాడే ఒక స్పూను మోతాదు భాగం మాత్రమే కాస్త తీపిగా ఉంటుంది. ఆ తర్వాత ఉండేదంతా... మంటే... మంట! ఇదెక్కడ దొరుకుతుందంటారా..? అమెరికాలోని డెలావేర్ రాష్ట్రంలో... అక్కడ రెహోబోత్ బీచ్‌లోని ‘ద ఐస్‌క్రీమ్ స్టోర్’ దీన్ని విక్రయిస్తోంది. బా.. బా.. యాక్ట్ షీప్... ‘జీవితమే ఒక నాటకరంగం... మనమంతా నటీ నటులం’ అన్నాడు షేక్స్పియర్. ‘మనమంతా’ అంటే ఎవరు? అనే ప్రశ్న ఉద్భవిస్తే, మోకాళ్లలో ఉన్న మెదళ్లతో ఆలోచించి ‘మనుషులం’ అనే సమాధానం ఇస్తాం. ఫొటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు మాత్రం కాస్త తాత్వికంగా ఆలోచించాడు. ‘మనమంతా’ అంటే మనుషులమే కాదు, గొర్రెలు కూడా అనే నిర్ధారణకు వచ్చాడు. అంతేనా..? ఈ విషయాన్ని రంగస్థలం సాక్షిగా నిరూపిస్తున్నాడు కూడా! మనుషుల్లో మెజారిటీ జనాభా గొర్రెల్లాంటి వాళ్లే అయినప్పుడు మనుషులకు, గొర్రెలకు తేడా ఏమిటనేది ఇతగాడి అభిప్రాయం కాబోలు! ఇతగాడి పేరు అలస్దైర్ సక్సేనా. భారత సంతతి వాడే గానీ, లండన్‌లో ఉంటాడితడు. రంగస్థలం అంటే వెర్రి మమకారం. పైగా, షేక్స్పియర్కు వీరాభిమాని. షేక్స్పియర్ నాటకాలను మానవమాత్రులు పాత్రధారులుగా చాలామంది చాలాసార్లు ప్రదర్శించారు. ఇందులో వెరైటీ ఏముంది..? అనుకుని, ఇతగాడు ఏకంగా గొర్రెలనే పాత్రధారులుగా తీర్చిదిద్ది, వాటి చేతే షేక్స్పియర్ నాటకాలను ప్రదర్శిస్తున్నాడు. నటించేవి గొర్రెలే అయినా, వ్యాఖ్యానం మాత్రం ఇతగాడే చెబుతాడు లెండి. గొర్రెలతో ఇటీవల ఇతగాడు ప్రదర్శించిన ‘కింగ్ లియర్’ నాటకాన్ని లండన్ ప్రేక్షకులు వేలం వెర్రిగా తిలకించారు.