
టీడీపీకి ప్రచారం చేస్తున్న బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయలక్ష్మి(మధ్యలో ఉన్న మహిళ)
నిన్నటి వరకు కమలం కండువాతో ప్రచారం చేసిన ఆమె టీడీపీ కండువాతో తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతున్నారు.
ముత్తుకూరు(నెల్లూరు): మండలంలోని దొరువులపాళెంలో తిరుపతి ఉపఎన్నికల ప్రచారం విచిత్రంగా సాగుతోంది. బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి దారా విజయమ్మ పరిషత్ ఎన్నికలు ముగిసిన వెంటనే పచ్చ కండువా కప్పుకున్నారు. నిన్నటి వరకు కమలం కండువాతో ప్రచారం చేసిన ఆమె టీడీపీ కండువాతో తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతున్నారు. ఆమెను చూసిన స్థానికలు ఇదేం ప్రచారంరా బాబూ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
చదవండి:
సినిమా తరహా పక్కా స్కెచ్: అనాథగా అవతారమెత్తి..
‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’