tirupati by election
-
తిరుపతి ఉప ఎన్నిక: చెక్కు చెదరని వైఎస్సార్సీపీ ఓట్ షేర్
కుట్రలు కూలిపోయాయి.. అసత్య ప్రచారాలు అణిగిపోయాయి.. మొత్తంగా ప్రతిపక్షాలు దుర.. ‘ఆశలు’ ఆవిరయ్యాయి. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో ‘నవ’సంక్షేమానికి పట్టం గట్టిన ఓటర్లు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరోమారు గంపగుత్తుగా జైకొట్టి.. జగనన్న జైత్రయాత్రకు మద్దతుపలికారు. సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ, జనసేన కుట్ర భగ్నమైంది. వారి దుష్ప్రచారాలకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చెదరకపోగా.. తిరుపతి, శ్రీకాళహస్తిలో ఇంకా పెరిగాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు.. ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి భారీ మెజారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుత ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం అందుకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంకి డిపాజిట్ కూడా దక్కలేదు. జనసేనతో పొత్తు కారణంగా టీడీపీకి వెళ్లే ఓట్లను బీజేపీ లాక్కున్నట్లయ్యింది. మొత్తంగా ఈ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్సీపీకి అఖండ మెజారిటీని అందించి విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారు. ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందటంతో తిరుపతి పార్లమెంట్‌కు ఉప ఎన్నిక తప్పనిసరైంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో ఓటింగ్‌పై కొంత ప్రభావం చూపింది. మొదట్లో 50శాతం కూడా పోలింగ్ జరగదని భావించినా 64.28 శాతం మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుని శభాష్ అనిపించుకున్నారు. 17వ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. రెండు చోట్ల భారీగా పెరిగిన ఓట్ షేర్ తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీనే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కోసం కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేశారు. మూడు నెలలుగా తిష్టవేసి కుట్రలు, కుతంత్రాలకు పథకం రచించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా రాళ్లదాడి చేశారంటూ కొత్త డ్రామాకు తెరతీశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు.. రౌడీలు, గూండాలంటూ రెచ్చిపోయారు. సత్యవేడులో సాధారణంగా కరెంట్ కట్ అయితే.. అది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనే అని ఆరోపించారు. కుప్పంలో మతిస్థిమితం లేని మహిళ ఆలయంలో చేసిన పొరపాటునూ.. వైఎస్సార్సీపీకి ఆపాదించి విమర్శలు చేశారు. శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అయినా తిరుపతి, శ్రీకాళహస్తిలో ఓట్ షేరింగ్ గతంకంటే పెరగడం గమనార్హం. దీంతో విపక్షాలు పూర్తి ఆత్మరక్షణలో పడిపోయాయి. నవరత్నాలతోనే ప్రజల్లోకి.. విపక్ష పార్టీలు వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతుంటే.... ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో నవరత్నాలు, సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి వాణిరెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి ఊరూరా ప్రచారం చేశారు. అనుకున్నట్టే తిరుపతి, శ్రీకాళహస్తిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లకంటే అధికంగా వచ్చాయి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వీధి.. వీధి.. తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఫలితంగా 34 వేల ఓట్లు అధిక్యం వచ్చింది. దీంతో చేసేదిలేక.. టీడీపీ, బీజేపీ నాయకులు దొంగ ఓట్లు అంటూ.. దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వెయ్యికిపైగా వైఎస్సార్సీపీ అభ్యర్థికి అదనంగా రావడం విశేషం. చదవండి: Tirupati Election Results 2021: ‘ఫ్యాన్’ హ్యాట్రిక్ ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ -
ఎంపీగా గెలిపించిన తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు: డా.గురుమూర్తి
-
బాబుకు ఇక రాజకీయ సన్యాసమే
తాడికొండ: రాష్ట్రంలో బహుజనుల హక్కులను కాలరాసి వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వారిని అడుగడుగునా అణగదొక్కుతూ కులోన్మాదాన్ని ప్రోత్సహించి లాభపడాలని చూసిన చంద్రబాబుకు ఇక రాజకీయ సన్యాసమే మిగిలిందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 215వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తిరుపతి ఉప ఎన్నికలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబును అక్కడి ఓటర్లు, బహుజనులు ఏకమై బుద్ధి చెప్పారన్నారు. త్వరలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులు రావడం ఖాయమనేది స్పష్టమైందన్నారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇక మూడు రాజధానుల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాధం, నత్తా యోనారాజు, ఈపూరి ఆదాం పలువురు దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. చదవండి: నిన్ను నమ్మం బాబూ.. జననేత వైపే జనం -
పార్టీ శ్రేణులకు రుణపడి ఉంటా: గురుమూర్తి
-
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం
-
టీడీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీకే తిరుపతి ప్రజలు పట్టి.. టీడీపీ కుట్రలను తిప్పికొట్టారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ గెలుపు ఊహించినదేనన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు తిరుపతి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాగా, తిరుపతి ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం వెంటే తామున్నామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. చదవండి: తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు -
తిరుపతిలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఊహించినదే
-
2.10 లక్షలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ
-
తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత
సాక్షి అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 17న నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యంపై అధికరణ 329 కింద నిషేధం ఉందని తెలిపింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పిటిషనర్లు భావిస్తే అందుకు వారు చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. తిరుపతి ఉప ఎన్నికలో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ రత్న ప్రభ, పనబాక లక్ష్మి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ‘పరిషత్’ ఎన్నికలపై విచారణ 3కి వాయిదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ.. ఎన్నికల ప్రక్రియను ఆపేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సింగిల్ జడ్జిని కోరింది. శుక్రవారం ఈ పిటిషన్లు విచారణకు రాగా న్యాయమూర్తి సోమవారం విచారణ జరుపుతామని తెలిపారు. చదవండి: ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల ఆర్టీసీ 'డోర్ టు డోర్' పార్సిల్ సర్వీసు -
తిరుపతి ఉపఎన్నికపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత
-
పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ప్రారంభమౌతుంది:కలెక్టర్
-
స్వామి భక్తి చాటుకున్న వీఆర్వో
సైదాపురం: మండలంలోని మర్లపూడి వీఆర్వో ముని శనివారం జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సమయంలో టీడీపీకి ఓట్లేయంటూ ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రభావితం చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల వేళ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఉద్యోగి ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ముని టీడీపీ నేత లోకేష్‌తో దిగి ఉన్న ఫొటో ఆదివారం వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. శనివారం జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటింగ్ వేసేందుకు వస్తున్న ఓ వృద్ధ దంపతులను టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయాలంటూ వీఆర్వో ప్రలోభాలకు గురిస్తున్నారనే అనుమానంతో స్థానికులు నిలదీశారు. దీంతో కొంత సేపు పోలింగ్ కేంద్రం వద్దనే వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుబాటు చేసి వీఆర్వోను పోలింగ్ కేంద్రం వద్ద నుంచి తీసుకెళ్లారు. వీఆర్వో పనితీరు మొదటి నుంచి సక్రమంగా లేదంటూ ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారి ఓ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం ఏమిటని మర్లపూడి వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీఆర్వోను వెంటనే సస్పెండ్ చేయాలంటూ స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు వరదబండి ప్రభాకర్‌రెడ్డి, చీర్ల వెంకురెడ్డి, భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: టీడీపీలో సస్పెన్షన్ల కలకలం.. వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం? -
తివాచీలు.. బెలూన్లు: ఆహ్లాదకరంగా పోలింగ్ కేంద్రాలు
ముత్తుకూరు/వెంకటాచలం: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ బూత్‌లను శనివారం సర్వాంగ సుందరంగా అలంకరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రధాన పోలింగ్ బూత్‌లను రంగురంగుల బెలూన్లు, పూలదండలతో అలంకరించారు. ఓటర్లు నడిచే చోట తివాచీలు పరిచారు. అహ్లాదకర వాతావరణంలో ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకొందని అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులను బూత్‌ల వద్దకు తీసుకు వెళ్లేందుకు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు అమలు చేశారు. వెంకటాచలం పోలింగ్ కేంద్రాన్ని పూలు, బెలూన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన దృశ్యం.. చదవండి: పోలింగ్‌కు దూరంగా బీజీకేపాళెం రైతులకు భారం: నష్టాలు ‘కోకో’ల్లలు -
పోలింగ్‌కు దూరంగా బీజీకేపాళెం
చిట్టమూరు: మండలంలోని బురదగల్లి కొత్తపాళెం ప్రజలు శనివారం జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలను బహిష్కరించారు. కొన్నేళ్లుగా తమ గ్రామానికి శాశ్వత రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, తమకు రోడ్డు వేసే విషయంలో కచ్చితమైన హామీ ఇస్తే కానీ ఓట్లు వేయమని అధికారులకు తెగేసి చెప్పారు. గత ప్రభుత్వం కూడా తమ రోడ్డు పనులు చేపట్టలేదన్నారు. అదేమంటే తమ గ్రామం పక్షుల రక్షిత కేంద్రం (యూకోసెన్సిటివ్ జోన్)లో ఉందని అటవీ శాఖ అధికారులు తారు రోడ్డు వేసేందుకు అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారన్నారు. ఉదయం 10 గంటలైనా ఓటర్లు ఎవరూ పోలింగ్ కేంద్రానికి రాకపోవడంతో పోలింగ్ అధికారులు ఉన్నతాధికాల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, తహసీల్దార్ శ్రీరామకృష్ణ, ఎంపీడీఓ భాస్కర్‌రావు గ్రామానికి చేరుకుని పంచాయతీ సర్పంచ్ ఎర్రబోతు మణి, గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ రోడ్డు విషయమై గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రనసాద్‌రావు, కలెక్టర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారన్నారు. కేంద్ర ప్రభుత్వం, అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. వచ్చిన వెంటనే తారు రోడ్డు నిర్మాణం కచ్చితంగా చేపడుతారన్నారు. ప్రస్తుతానికి గుంతలుమయంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బీజీకేపాళెం ప్రజలతో చర్చలు జరుపుతున్న సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ.. తమకు కచ్చితమైన హామీ కావాలనడంతో ఫోన్ ద్వారా కలెక్టర్ చక్రధర్‌బాబుతో మాట్లాడించారు. అయినప్పటికీ ససేమిరా అని అనడంతో సబ్ కలెక్టర్ వెనుదిరిగారు. సాయంత్రం 4 గంటల సమయంలో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు, వైఎస్సార్సీపీ నాయకులు చెన్నారెడ్డి బాబురెడ్డి, వంకా రమణయ్య బురదగల్లి కొత్తపాళెంకు చేరుకుని ప్రజలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే మాటలు కూడా గ్రామస్తులు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు. పంచాయతీలో మొత్తం 1,705 మంది ఓటర్లు ఉన్నారు. బురదగల్లి, కొత్తపాళెం, కుమ్మరిపాళెం, పేరపాటి తిప్ప గ్రామాలకు సంబంధించి అధికారులు మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే 278 పోలింగ్ బూత్‌లో మాత్రం పంచాయతీ సర్పంచ్ ఎర్రబోతు మణి తన ఓటు వేశారు. ఆయనతో పాటు మరో వ్యక్తి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పంచాయతీలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వేచి ఉన్నారు. -
రాళ్లదాడి అంతా బూటకం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రబాబుపై రాళ్ల దాడి అవాస్తవమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఆరోపణలు అసత్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రాళ్లదాడి అంతా బూటకమని తేలింది. ఆ పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా ఆడారు. టీడీపీ మూతపడటం ఖాయం. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం జవాబు చెబుతారని’’ మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. తిరుపతి ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని.. మతాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. లబ్దిదారులే తమకు ఓట్లు వేయాలనుకుంటున్నారని.. వాలంటీర్లను ప్రభావితం చేయాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. చదవండి: టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్ ఆనందం.. అంతలోనే విషాదం -
టికెట్ల ధర పెంచాలనడం బ్లాక్‌మార్కెట్ కాదా?
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో లక్షల మెజార్టీతో వైఎస్సార్సీపీదే విజయమని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీకి దిక్కులేదని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీలు మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేసి 24 గంటలైనా టీడీపీ స్పందించలేదన్నారు. ‘‘సీఎం జగన్ సభ పెడితే లక్షలాది మంది జనం తరలి వస్తారు. ప్రజారోగ్యం దృష్ట్యా తిరుపతి సభను సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. వ్యక్తిగత సిబ్బందికి కరోనా వస్తేనే పవన్ లోపలకు వెళ్లిపోయారు. పవన్ చేసింది మాత్రం టీడీపీకి కరెక్ట్‌గా కనిపిస్తోందా?’’ అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. పెద్ద రెమ్యూనేషన్ తీసుకుని కూడా టికెట్ల ధర పెంచుకుని అభిమానులకు దోచుకోవడం కరెక్టా అంటూ మంత్రి దుయ్యబట్టారు. టికెట్ల ధర పెంచాలనడం బ్లాక్‌మార్కెట్ కాదా? అని ప్రశ్నించారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ విజయం ఎప్పుడో ఖాయమైంది. తిరుపతి వెంకన్న ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో మే 2న తెలుస్తుందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. చదవండి: టీడీపీ– జనసేన లోపాయికారి ఒప్పందం! తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండమే -
టీడీపీ– జనసేన లోపాయికారి ఒప్పందం!
చంద్రుడి వైపే పవనం సాగుతోందా..? టీడీపీ– జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా..? రెండు పార్టీల నడుమ గాఢానుబంధం కొనసాగుతోందా..? ఇరువురు నేతలూ స్వలాభం కోసం ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తారా..? వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలువలను గాలికి వదిలేస్తారా..? ఓట్ల కోసం రాష్ట్రాభివృద్ధినే తాకట్టుపెడతారా..? నాటి మాటలన్నీ నీటిమూటలేనా..? కమలనాథులకు తెలిసే తంతు జరుగుతోందా..? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎంతకైనా తెగిస్తారా..? శ్రీకాళహస్తిలో బాబు ప్రసంగం వింటే అవుననే అనిపిస్తుంది.. తిరుపతిలో పవన్‌కల్యాణ్ ఉపన్యాసాన్ని ఆలకిస్తే లోగుట్టు అర్థమవుతుంది. సాక్షి, తిరుపతి: టీడీపీ– జనసేన అధినేతల వ్యవహారశైలి అనుమానాస్పదంగా తయారైంది. మొన్న తిరుపతిలో పర్యటించిన పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. నిన్న శ్రీకాళహస్తిలో ప్రచారం చేసిన ‘నారా’ వారు జనసేన అధినేతపై నోరెత్తలేదు. ఇరువురు నేతలూ కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించేందుకే పరిమితమయ్యారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ– జనసేన పొత్తు కుదుర్చుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. లెక్కప్రకారమైతే వారికి వైఎస్సార్సీపీ ఎంతో టీడీపీ కూడా అంతే కావాలి. ఇందుకు విరుద్ధంగా కేవలం అధికార పార్టీపైనే విమర్శలు కురిపించడంపై ప్రజలు విస్తుబోతున్నారు. ముఖ్యంగా టీడీపీ– జనసేన లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు సార్వత్రిక ఎన్నికల నుంచి టీడీపీ, జనసేన ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదు. కుయుక్తులను ప్రజలు హర్షించరనే వాస్తవాన్ని గ్రహించలేదు. పాత పంథాలో కుట్ర రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా బాబు, పవన్ ప్రచార సభలే నిలుస్తాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ తిరుపతిలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పుడు ఈ ఇద్దరు పెద్దమనుషులు ఆ వేదికపైనే ఉన్నారని, కానీ, ప్రస్తుతం ఇరువురూ తమ ప్రసంగాల్లో ఆ ఊసే ఎత్తలేదని ఆరోపిస్తున్నారు. చీకటి ఒప్పందాలతో ముందుకు వస్తున్న విపక్ష పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నికలో ఘోర ఓటమి తప్పదని రాజకీయ పండితులు పేర్కొన్నారు. చదవండి: జనసేనకు షాక్! మాదాసు గంగాధరం రాజీనామా పాచిపోయిన లడ్డూలు పవన్‌కు రుచిగా ఉన్నాయా? -
టీడీపీ ప్రచారానికి జనం కరువు
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు విజయం చేకూర్చాలంటూ సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం ఉధృతం చేశారు. ఇప్పటికే ఒక్క అధికార వైఎస్సార్సీపీ అగ్రనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి మినహా మిగిలిన పార్టీల రాష్ట్ర, కేంద్ర స్థాయి అగ్రనేతలు ప్రచారం మమ్మురంగా చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు సాధ్యం కానీ హామీలతో జనాన్ని మాయ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ సభలను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకత్వం అష్టకష్టాలు పడుతోంది. ఓ వైపు మమ్మురంగా వరి కోతలు, వ్యవసాయ పనులు, ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు మండుటెండలు కాస్తున్నాయి. దీంతో పాటు ప్రధానంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభన చేస్తోంది. ఇన్ని రకాల కారణాల రాజకీయ సభలు, సమావేశాలకు జనం సమీకరించడం నియోజకవర్గ నేతలకు కష్టంగా మారుతోంది. జనాన్ని తోలినా.. నిలవని వైనం ఉప ఎన్నికల్లో జన సమీకరణ కోసం టీడీపీ నేతలు కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రజల్లో పరపతి కోల్పోయింది. పారీ్టకి జనాధారణ కరువైంది. ఆ పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు మాజీ మంత్రుల పర్యటనలు విజయం చేయాలంటే స్థానిక నాయకత్వానికి చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది. టీడీపీ నేతల సభలు, సమావేశాలకు జనం పెద్దగా రావడం లేదు. రోడ్ షోలు వెలవెలపోతున్నాయి. దీంతో ఎలాగైనా జన సమీకరణ చేసి అగ్రనేతల ముందు పరువు నిలబెట్టుకునేందుకు జిల్లా నాయకత్వంతో పాటు నియోజకవర్గ నేతలు కుస్తీ పడుతున్నారు. ఇటీవల చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంతో బరిలో నిలిచిన తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి జనాన్ని తీసుకుని రమ్మని నియోజకవర్గ నేతలు స్థానిక నేతలకు చెప్పడంతో ‘మా ఎన్నికలను బహిష్కరించిన చంద్రబాబు గొప్పల కోసం మేమెందుకు ఇంకా జెండాలు మోయాలని, మాకేం ఖర్మ’ అంటూ ముఖం చాటేశారు. రెండు రోజులుగా చంద్రబాబు పర్యటించిన సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో రోడ్‌షో విజయవంతానికి స్థానిక నాయకత్వం అరువు కూలీలను తెచ్చుకోవాల్సి వచ్చింది. అయినా కూడా సభలు ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయాయి. చంద్రబాబు సభలకు నియోజకవర్గంలోని స్థానిక నేతలు హాజరు పెద్దగా కనిపించలేదు. జిల్లా నలుమూలల నుంచి అరువు కూలీలను తరలించినట్లు తెలుస్తోంది. ఆ జనం ప్రసంగం పూర్తి కాకుండానే వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది. ఆ సభలకు హాజరైన జనానికి డబ్బులు పంచుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కూలీలను తెచ్చిన మేస్త్రీలకు ప్యాకేజీ ఇచ్చారంటా. ఇంతా చేసి చేతి చమురు వదిలించుకున్నా కూడా సభలు సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు స్థానిక నాయకత్వంపై గుర్రుమన్నట్లు సమాచారం. చదవండి: హవ్వా.. ఇదేమి విచిత్ర ప్రచారం ‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’ -
హవ్వా.. ఇదేమి విచిత్ర ప్రచారం
ముత్తుకూరు(నెల్లూరు): మండలంలోని దొరువులపాళెంలో తిరుపతి ఉపఎన్నికల ప్రచారం విచిత్రంగా సాగుతోంది. బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి దారా విజయమ్మ పరిషత్ ఎన్నికలు ముగిసిన వెంటనే పచ్చ కండువా కప్పుకున్నారు. నిన్నటి వరకు కమలం కండువాతో ప్రచారం చేసిన ఆమె టీడీపీ కండువాతో తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతున్నారు. ఆమెను చూసిన స్థానికలు ఇదేం ప్రచారంరా బాబూ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. చదవండి: సినిమా తరహా పక్కా స్కెచ్: అనాథగా అవతారమెత్తి.. ‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’ -
‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజాహిత కార్యక్రమాలే తమకు ఆయుధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోవిడ్ తీవ్రత వల్లే ఈనెల 14న సీఎం వైఎస్ జగన్ సభ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ‘‘తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాం. మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. బీజేపీకి ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు లేదని.. విభజన హామీలను నెరవేర్చకుండా ప్రజలను బీజేపీ నేతలు ఎలా ఓట్లు అడుగుతారంటూ మంత్రి ప్రశ్నించారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్మూధైర్యం ఎప్పుడూ లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్లో పోరాడలేదని ఆయన మండిపడ్డారు. ‘‘రైతు సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సీఎం జగన్ పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాల ఫలాలు చేరుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగుతోంది. రాయలసీమ కోసం వేలకోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం. యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు. ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే. వైఎస్సార్సీపీపై బీజేపీ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని’’ మంత్రి పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. చదవండి: కూన తీరు మారదు.. పరుగు ఆగదు! టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి.. -
మీ శ్రేయస్సు దృష్ట్యా సభకు రాలేకపోతున్నా: సీఎం జగన్
-
మీ శ్రేయస్సు దృష్ట్యా సభకు రాలేకపోతున్నా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ‘‘నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. తిరుపతి సభకు నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాలేకపోయినా.. 22 నెలల్లో మీకు చేసిన మంచి మీ అందరికి చేరిందన్న నమ్మకం నాకుంది.. గతంలో వచ్చిన 2.28 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలి. డా. గురుమూర్తికి ఓటు వేయాలని రాసిన ఉత్తరం మీకు చేరిందని భావిస్తున్నా. డా. గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నానని’’ లేఖలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చదవండి: తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం 32.70 లక్షల మందికి వ్యాక్సిన్ -
పవన్ కల్యాణ్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేకనే పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. సీఎం జగన్‌ని ఎదుర్కొలేకనే తెర వెనక రాజకీయాలు నడుపుతున్నారు. పవన్ కల్యాణ్‌కు సొంత అభిప్రాయం అంటూ ఏమి లేదు. ఆయన రాత్రి ఓ పార్టీతో.. పగలు ఓపార్టీతో తిరుగుతుంటారు’’ అని సజ్జల విమర్శించారు. ‘‘ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు సీఎం జగన్‌కు అండగా నిలిచారు. ఓట్ల రూపంలో తమ ఆశీర్వాదాన్ని తెలుపుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను మెచ్చి జనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం కట్టబెట్టారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పోయారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చినా హామీలన్నింటిని అమలు చేశాం’’ అని సజ్జల తెలిపారు. చదవండి: పూలింగ్.. ప్రపంచంలోనే పెద్ద స్కామ్ -
బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం..
సాక్షి, నెల్లూరు: బీజేపీ-జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం నెలకొంది. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు కనిపించలేదు. కేవలం బీజేపీ నేతలు, కార్యకర్తలతోనే రత్నప్రభ నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ ముందు నుంచే హడావుడి చేసినా.. ప్రస్తుత పరిణామాలతో అనేక అనుమానాలు తలెత్తున్నాయి. నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకొని దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీఆర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గురుమూర్తి నివాళులు అర్పించారు. తర్వాత వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ర్యాలీగా గురుమూర్తి కలెక్టరేట్‌కు చేరుకొని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ‘ఫ్యాను’దే హవా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్? -
దుబ్బాక.. ఇక్కడ చెప్పబాక!
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసినట్టుంది బీజేపీ పరిస్థితి. దుబ్బాక ఫలితాన్ని బలంగా భావించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అది బలుపు కాదు వాపని తెలిసొచ్చింది. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటుతామంటూ అతివిశ్వాసం వ్యక్తం చేస్తోంది. దుష్పచారాలు చేస్తూ లబ్ధిపొందాలనే ఎత్తుగడ వేస్తోంది. తోక పార్టీని వెంటబెట్టుకుని పేట్రేగిపోతోంది. ప్రజానాడిని పక్కనబెట్టి వైఎస్సార్సీపీపై కుట్రలకు తెరదీయడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘మా బలం పెరిగింది. తెలంగాణలోని దుబ్బాక విజయమే దీనికి నిదర్శనంగా నిలిచింది. ఆంధ్రాలోనూ తమ పార్టీ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉంది’ అంటూ బీజేపీ నేతలు ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టారు. ఒకింత ఇది నిజమేననే భ్రమలోకి నెట్టారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవడంతో నోటికి తాళం వేశారు. మళ్లీ ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తమదే విజయం.. అంటూ కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, పొత్తులకు తెరదీస్తున్నారు. దీనిపై విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పట్టు.. ప్రజాదరణ ఏదీ? తిరుపతి పార్లమెంటు పరిధిలో బీజేపీ–జనసేన బలం చాలా స్వల్పం. ఈ రెండు పార్టీలకు కలిపి 2014 ఎన్నికల్లో 24 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లు ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 8 డివిజన్లలో మాత్రమే బీజేపీ పోటీ చేయగలిగింది. అంటే తక్కిన 21 డివిజన్లలో బీజేపీకి అభ్యర్థులు కూడా లేరన్నమాట. పోటీచేసిన 8 డివిజన్లలో బీజేపీ సాధించిన మొత్తం ఓట్లు 2,546 మాత్రమే. జనసేన 2 డివిజన్లకు పరిమితమైంది. ఆ రెండుచోట్లా కలిపి ఆ పార్టీకి లభించిన ఓట్లు 231 మాత్రమే. క్షేత్ర స్థాయిలో అటు బీజేపీ, ఇటు జనసేన పట్టు, ప్రజాదరణ ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది. అలాంటి చోట సత్తా చాటుతాం.. దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుంది.. అంటూ అదరగొట్టే స్పీచ్‌లు, స్టేట్మెంట్లు తిరుపతి పార్లమెంటు వాసులకు నవ్వు తెప్పిస్తున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ మరీ అధ్వానమైన స్థితిలో ఓట్లు సాధించింది. మూడు చోట్లా కలిపి వెయ్యికి లోపే ఓట్లు దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో బీజేపీది బలుపు కాదు, వాపు మాత్రమేనని స్పష్టంగా తెలుస్తోంది. అదే ధీమా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తమదేనని వైఎస్సార్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మునుపటి ఫలితాలకంటే అధిక మెజారిటీ లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలను కూడా వివరిస్తున్నారు. సంక్షేమ పాలన, ఇటీవల వరుసగా ఎన్నికల ఫలితాలు అందుకు నిరద్శనమని చెబుతున్నారు. పైగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తిరుపతి వాసులుకు సుపరిచితుడు కావడం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గెలుపు అతి సునాయసమన్న ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పైగా దేశవ్యాప్తంగా అందరి చూపు తిరుపతి ఫలితం వైపు ఉండేలా మెజారిటీ సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయడంతో మరింత ఉత్సాహంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పనిచేస్తాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ బుజ్జగింపుల పర్వం తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలు ఒక్కో పార్టీకి ఒక్కో విపత్కర పరిస్థితి తెచ్చిపెట్టింది. బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఇప్పటికీ వెల్లడించకపోగా, మూన్నెళ్లకు ముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ భంగపాటుకు గురవుతోంది. మాజీ ఎంపీ పనబాకలక్ష్మి పేరును అభ్యర్థిగా ప్రకటించింది. ఇష్టం లేకపోయినా అభ్యరి్థత్వానికి ఎంపిక చేయడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నా, టీడీపీ నేతలు బుజ్జగింపు చర్యల్లో నిమగ్నమైనట్టు ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ప్రకటించిన అభ్యర్థి పోటీ నుంచి విరమిస్తే, పార్టీ పరువు పోతుందని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఆమె ఎదుట ఆవేదన చెందినట్లు సమాచారం. చదవండి: స్టేలు తెచ్చుకోవడంలో బాబుది గిన్నిస్ రికార్డ్ నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చి..