సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో లక్షల మెజార్టీతో వైఎస్సార్‌సీపీదే విజయమని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీకి దిక్కులేదని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీలు మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేసి 24 గంటలైనా టీడీపీ స్పందించలేదన్నారు.
‘‘సీఎం జగన్ సభ పెడితే లక్షలాది మంది జనం తరలి వస్తారు. ప్రజారోగ్యం దృష్ట్యా తిరుపతి సభను సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. వ్యక్తిగత సిబ్బందికి కరోనా వస్తేనే పవన్ లోపలకు వెళ్లిపోయారు. పవన్ చేసింది మాత్రం టీడీపీకి కరెక్ట్‌గా కనిపిస్తోందా?’’ అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. పెద్ద రెమ్యూనేషన్ తీసుకుని కూడా టికెట్ల ధర పెంచుకుని అభిమానులకు దోచుకోవడం కరెక్టా అంటూ మంత్రి దుయ్యబట్టారు. టికెట్ల ధర పెంచాలనడం బ్లాక్‌మార్కెట్ కాదా? అని ప్రశ్నించారు.
తిరుపతిలో వైఎస్ఆర్‌సీపీ విజయం ఎప్పుడో ఖాయమైంది. తిరుపతి వెంకన్న ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో మే 2న తెలుస్తుందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు.
చదవండి:
టీడీపీ– జనసేన లోపాయికారి ఒప్పందం!
తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండమే
Comments
Please login to add a commentAdd a comment