సాక్షి, నెల్లూరు జిల్లా: రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు సీఎం చెక్ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘రైతన్నల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నాను. ఇప్పటికే గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేశాం. గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాం. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 2వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశాం. భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భూసర్వే చేస్తున్నాం. ఈ నెల 20న 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తాం. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందుబాటులోకి తెచ్చాం’’ అని సీఎం అన్నారు.
‘‘దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతులకు మేలు చేశాం. గతంలో ఎన్నడూ జరగని మంచి ఇప్పుడు రైతులకు జరుగుతుంది. నాలుగేళ్లుగా ప్రతి అడుగూ రైతన్నల కోసమే వేశాం రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు. వారికి తోడుగా రావణ సైన్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిలిచాయి. రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్తామని చెప్పి మోసం చేశారు. రైతులను మోసం చేసిన పెద్ద మనిషిని ఒక్క మాట అడగరు. ప్రశ్నిస్తామని చెప్పిన వారు ప్రశ్నించడమే మానేశారు’’ అంటూ సీఎం దుయ్యబట్టారు.
‘‘ఎన్నికలు దగ్గరపడుతున్నందున వీళ్లంతా రోడ్డెక్కారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను డైలాగ్‌లుగా మార్చిన ప్యాకేజీ స్టార్ ఒక వైపు.. బాబు, దత్తపుత్రుడి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లో మీడియా తానా తందానా. డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా జమ చేశాం. లంచాలు, వివక్షకు తావులేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రతి పేదవాడికి తోడుగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే. చంద్రబాబు ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి వీళ్ల విధానం డీపీటీ.. దోచుకో,పంచుకో, తినుకో’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.
చదవండి: పవన్ లొంగిపోయింది ఇందుకేనా?.. అర్థం అదేనా?.. పాపం వారి పరిస్థితేంటో!
‘‘జీవీరావు చార్టర్ అకౌంటెంట్ సర్వీస్ రద్దయింది. ఇలాంటి దానయ్యకు కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వద్దని, దివాలా తీస్తుందని చెప్పిస్తారు. రామోజీ పురుగులు పట్టిన బుర్రలోంచి ఇలాంటి వారు పుడతారు. చంద్రబాబు, ఎల్లో మీడియా మనసులో మాటలను వీళ్లతో చెప్పిస్తారు. చంద్రబాబు, ఎల్లో మీడియాది పెత్తందారీ మనస్తత్వం. వీళ్లు చేసే ప్రతి పని, ప్రతి మాట ప్రతి రాతలోనూ మోసం. పేదలందరికీ ఇళ్లు ఇస్తుంటే వీళ్లందరికీ కడుపుమంట’’ అని సీఎం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment