‘బాబూ.. గంటకి రూ.కోటి తీసుకునే లాయర్‌ ఎలా వచ్చాడు?’ | Ex Minister Anil Kumar Yadav Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబూ.. గంటకి రూ.కోటి తీసుకునే లాయర్‌ ఎలా వచ్చాడు?’

Published Sun, Sep 10 2023 11:17 AM | Last Updated on Sun, Sep 10 2023 12:01 PM

Ex Minister Anil Kumar Yadav Comments On Chandrababu - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: వాచ్ కూడా లేదని చెప్పే చంద్రబాబు.. గంటకి రూ.కోటి రూపాయలు తీసుకునే లాయర్ ఎలా వచ్చాడంటూ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరిదిని కాపాడుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. బంధు ప్రీతి పక్కన పెట్టి ఆమె మాట్లాడాలి.. పక్కా సాక్ష్యాలు ఉన్నా కూడా అక్రమ కేసు అని ఎలా చెబుతారు అంటూ అనిల్‌ దుయ్యబట్టారు.

‘‘తన పార్టీ నేతను అరెస్ట్ చేసినట్లు పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేశారు. నానా హంగామా చేశాడు.. సుపుత్రుడు సైలెంట్ అయితే.. దత్త పుత్రుడు మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు అరెస్‌తో టీడీపీ కూసాలు కదులుతున్నాయి.. చంద్రబాబుకు మద్దతుగా జనాలు రోడ్ల మీదకు రావడం లేదని అచ్చం నాయుడు మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అవినీతి అనకొండగా ఉన్న చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో ముద్దాయి అయ్యాడు.’’ అని అనిల్‌ ధ్వజమెత్తారు.

‘‘చంద్రబాబు అరెస్ట్‌లో సీఎం జగన్ నిజాయితీగా వ్యవహరించారు. ఎవరు తప్పు చేసినా వదలం అనే మెసేజ్‌ను ప్రజలకు పంపాం. బాబు మరో ఆరు జన్మలు ఎత్తినా సీఎం అయ్యే అవకాశం లేదు. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ మూతపడటం ఖాయం’’ అని అనిల్‌ పేర్కొన్నారు.
చదవండి: స్కిల్‌ స్కామ్‌: సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement