సాక్షి, నెల్లూరు: చంద్రబాబు చేసిందంతా డ్రామా అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సానుభూతి పొందేందుకే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
చదవండి: ‘సభలో చంద్రబాబు నటనా చాతుర్యం’
‘‘సీఎంపై టీడీపీ నేతల వ్యాఖ్యలను చంద్రబాబు మరిచిపోయినట్లున్నాడు. చంద్రబాబు తన కుటుంబంపై తానే బురద జల్లుకుంటున్నాడు. చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరు. చంద్రబాబు పని అయిపోయింది. అసెంబ్లీకి రానని చంద్రబాబే స్వయంగా చెప్పాడని’’ మంత్రి అనిల్ అన్నారు.
ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. అసెంబ్లీ నుంచి నేరుగా నెల్లూరు చేరుకున్నారు. ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నీట మునిగిన కాలనీలను పరిశీలించారు. పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తోందని.. ఈ రాత్రికి వరద ఉధృతి మరింత పెరగనుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని.. అందరినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి వరద వస్తోందని మంత్రి అనిల్ అన్నారు.
చదవండి: విధి ఎవర్నీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది: ఆర్కే రోజా
Comments
Please login to add a commentAdd a comment