సాక్షి, నెల్లూరు: నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యదవ్ అన్నారు. శనివారం ఆయన నెల్లూరులో బీసీ భవన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో రాజీలేదని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 25 నాటికి రాష్ట్రంలో తొలి విడతగా సుమారు 15 లక్షల స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే టిడ్కో 300 చదరపు అడుగుల ఇళ్లు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప మనసుతో 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబోతున్నారని వెల్లడించారు. (చదవండి: ఏ నిర్వాసితులకైనా ఒక్క పైసా ఇచ్చావా బాబూ!)
గత టీడీపీ హయాంలో ఇవే ఇళ్లను రూ.3 లక్షల చొప్పున ప్రజల నుంచి వసూలు చేసి ఇద్దామనుకున్నారని.. చంద్రబాబు మీద ప్రేమ ఉన్న టీడీపీ నేతలు అవే ఇళ్లను 3 లక్షలు కట్టి తీసుకుంటామంటే అభ్యంతరం లేదని ఆయన ఎద్దేవా చేశారు. మనసున్న సీఎం వైఎస్ జగన్ స్కీమ్ కావాలో.. జనం సొమ్ము తినే బాబు స్కీమ్ కావాలో టీడీపీ వారు ఎంచుకోవచ్చని మంత్రి అన్నారు. ఏపీలో ప్రతిపక్షం హైదరాబాద్ జూమ్ టీవీలో మాత్రమే ఉందని, చంద్రబాబు చుట్టం చూపు చూసినట్లుగా వచ్చిపోతున్నారని ఆయన వ్యగ్యాస్త్రాలు సంధించారు.(చదవండి: వివాహితపై టీడీపీ నేత లైంగిక వేధింపులు)
దేశం అంతా గర్వించదగ్గ సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. జనవరి నెలాఖరు లోపు నెల్లూరు జిల్లాలో రెండు బ్యారేజీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. కోవూరు లో తిరుగులేని నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కంచుకోట మెదటిది కడప అయితే.. తర్వాత కోవూరు నియోజకవర్గం అని అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment