సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ క్యాడర్‌పై కూటమి దాడులు చేస్తున్నారని.. పరామర్శకు వెళ్లిన తనపై అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు.
అక్రమ కేసులు, అరెస్టులతో మా గొంతును నొక్కలేరు. టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తప్పవు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. నా పై మరిన్ని కేసులు పెట్టడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేసులు, అరెస్ట్‌లతో వైఎస్ జగన్ హార్డ్ కోర్ అభిమానులను ఆపలేరు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేదాకా పోరాడుతా’’ అని కాకాణి చెప్పారు.
ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు!
Comments
Please login to add a commentAdd a comment