సాక్షి, తాడేపల్లి: రాజకీయ లబ్ధి కోసం కాకినాడ పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్రలు చేస్తూ.. పాత కేసులతో ప్రశ్నించేవారిని వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘చంద్రబాబు రాష్ట్రంలో కొత్త కుట్రలకు తెరతీశారు. పాత కేసులను తిరగతోడి తమ ప్రత్యర్థులను ఇరికిస్తున్నారు. కొత్త కేసులు తయారు చేయటం అనే దుష్ట పన్నాగానికి చంద్రబాబు తెర తీశారు. కాకినాడ పోర్టు గురించి కేసులు పెట్టటం కూడా ఇందులో భాగమే. మొదట రేషన్ బియ్యం స్మగ్లింగ్ పేరుతో డ్రామా మొదలు పెట్టారు. తర్వాత పోర్టునే లాక్కున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు వైఎస్సార్ కాకినాడ పోర్టును తెచ్చారు. దాన్ని చంద్రబాబు తన హయాంలో కేవి రావు అనే వ్యక్తికి కట్టబెట్టారు. ఇదే విషయాన్ని 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబుతో కలిశాక పవన్ మళ్లీ మాటలు మార్చారు’’ అని కాకాణి దుయ్యబట్టారు.
లాభాల బాటలో ఉన్న పోర్టును అన్యాయంగా కేవీ రావుకి చంద్రబాబు కట్టబెట్టారు. పైకి కేవీరావు కనిపించినా తెర వెనుక చంద్రబాబే ఉన్నారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. ఇప్పుడు అదే కేవీ రావును అడ్డం పెట్టుకుని అరబిందో సంస్థపై తప్పుడు కేసులు వేస్తున్నారు. 51 శాతం షేర్ ఉన్న కేవీ రావు తనను బెదిరించి పోర్టును లాక్కున్నారని తప్పుడు ఫిర్యాదు చేశారు. నిజంగా బెదిరిస్తే మొత్తం పోర్టునే తీసుకునే వారు కదా?. అలా కాకుండా 49 శాతం షేర్లనే ఎందుకు తీసుకుంటారు?. కావాలనే అరబిందో సంస్థపై కేసులు పెట్టాలని ప్లాన్ చేశారు.
..ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే తామే ఇతరులపై కేసులు పెడతామనీ, ఇతరులు మాత్రం తమపై కేసులు పెట్టటానికే వీల్లేదని చట్టం కూడా తెచ్చేలాగ ఉన్నారు. హెరిటేజ్ సంస్థను ప్యూచర్ సంస్థ కొనుగోలు చేయటంపై కేసులు వేస్తే చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు?. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పరిశ్రమలను టార్గెట్ చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పరిశ్రమలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అరబిందో సంస్థ రెడ్లది కాబట్టే తప్పుడు కేసులతో వేధించాలని చూస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పారిశ్రామిక వేత్తలను బెదిరించటం సిగ్గుచేటు. ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో పారిశ్రామిక వేత్తలు ఎవరూ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉండదు’’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment