సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులే(AP Police) నేరస్థులుగా మారుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘జిల్లాలో పోలీసులే నేరస్థులుగా మారి వెంకట శేషయ్యపై తప్పుడు కేసు పెట్టారు. తనకు సంబంధం లేనట్టు.. జిల్లాకి తాను ఎస్పీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు చేర్చారు. నేరస్థులను వదిలి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. దీనికి వెంకట శేషయ్య వ్యవహారమే ఉదాహరణ.
శేషయ్య అరెస్ట్ వ్యవహారంలో పోలీస్ వ్యవస్థ న్యాయవ్యవస్థను తప్పుదారిలోకి మళ్లించింది. శేషయ్య కేసులో ఎంత ఉప్పు తిన్నారో.. అన్ని నీళ్లు తాగిస్తా.. పోలీసులకు, కూటమి నాయకులకు ఇదే నా హెచ్చరిక. ఈ కేసులో జరిగిన తప్పిదాలను సమాజం ముందు ఉంచుతాం. జిల్లా అధికారులు ఈ కేసులో న్యాయం చేస్తారని మేము భావించడం లేదు. కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎస్పీ విచారణకు ఆదేశించాలి. నా కళ్ల ముందు జరిగిన వ్యవహారం ఇది. ఇందులో ఎవరినీ వదలం పెట్టేది లేదు. కోవూరులో కొత్త స్టాంపులకు పాత తేదీలు వేశారు. తప్పు చేసిన వారు ఎక్కడున్నా వదలిపెట్టం. శేషయ్య కేసులో జరిగిన లోపాలపై పూర్తి ఆధారాలతో హైకోర్టులోనూ ఫైల్ చేస్తాం. ఇక్కడ పోలీసులపై ప్రైవేట్ కేసు కూడా వేస్తాం అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment