సాక్షి, నెల్లూరు జిల్లా: హత్యలు, అనైతిక కార్యకలాపాలలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా నెరవేర్చడం కుదరదని కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు నిర్వహించిన కాన్ఫ్‌రెన్స్‌లో పరోక్షంగా చెప్పారు. కలెక్టర్ల సమావేశం మొక్కుబడిగా జరిగింది.. రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారింది’ అని కాకాణి దుయ్యబట్టారు.
ఉచిత ఇసుకలో ‘ఉచితం’ అనే పదం మాయం అయింది.. టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. 14 లక్షల కోట్లు అప్పున్నా సరే.. హామీలన్నిటిని అమలు చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. చివరికి 7 లక్షల 48 వేల కోట్లు అప్పు ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యేలు చెప్పినట్టే కలెక్టర్లు వినాలని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.
‘‘వైఎస్ జగన్ బొమ్మ ఉందని విద్యాదీవెన కిట్స్ కూడా పంపిణీ చేయలేదు. సంపద సృష్టిస్తానని.. ప్రజల సంపదను దోచుకుంటున్నాడు.. ప్రైవేటికరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. జగన్ని విమర్శించడం.. సొంత డబ్బా కొట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. ఎమ్మెల్యేలు కూడా శిలఫలాకాన్ని కూల్చడం ఏపీలో ఇదే తొలిసారి.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన వాటిని వారి చేతే కట్టిస్తాం. దుందుడుకు చర్యలకు పాల్పడిన వారిని వదలం.. ప్రభుత్వం రాగానే వారిపై చర్యలు ఉంటాయి’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment