
'తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు'
తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికపై పోటీకి అభ్యర్థిని నిలపవద్దని టీడీపీ తమను కోరినట్లు వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగానే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరిన నేపథ్యంలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు భూమన స్పష్టం చేశారు.